వాషింగ్టన్: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. విస్కాన్సిన్ రాష్ట్రంలోని విస్కాన్సిన్ డెల్స్ సమీపంలో ఓ చిన్న విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో చిన్నారి సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక, విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. తాజా సమాచారం ప్రకారం.. విమానం రెక్కలపై మంచు పేరుకుపోవడం, ప్రతికూల వాతావరణం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
అధికారుల వివరాల ప్రకారం.. ఆరుగురు ప్రయాణించే సామర్థ్యమున్న సింగిల్ ఇంజిన్ పైపర్ పీఏ-46 మాలిబు విమానం కెన్షా నుంచి మెనోమోనీకి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. మంగళవారం రాత్రి(అమెరికా కాలమానం ప్రకారం) సుమారు 9.30 గంటల సమయంలో విమానం కూలిపోయినట్లు అత్యవసర సేవలకు సమాచారం అందింది. మిర్రర్ లేక్ స్టేట్ పార్క్ సమీపంలోని డెల్లోనా ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో విమానం కూలినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో వర్షం కురుస్తుండటంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తుపాను కొనసాగుతోంది.
రెక్కలపై మంచు.. పైలట్ హెచ్చరిక!
విమాన ప్రమాదానికి సంబంధించి కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. విమానం సుమారు 24,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో రెక్కలపై మంచు పేరుకుపోతున్నట్లు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు సమాచారం ఇచ్చినట్లు అమెరికా జాతీయ రవాణా భద్రతా మండలి (NTSB) వెల్లడించింది. ఎత్తు తగ్గించేందుకు అనుమతి కోరగా.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంగీకరించింది. ఆ తర్వాత విమానం వేగంగా కిందికి దిగుతూ కుడివైపు మలుపు తిరిగినట్లు ప్రాథమిక సమాచారం సూచిస్తోంది. కొద్దిసేపటికే విమానంతో సంబంధాలు, రాడార్ ట్రాకింగ్ నిలిచిపోయాయి. రెక్కలపై మంచు పేరుకుపోవడం విమానం గాలిలో స్థిరంగా ప్రయాణించే సామర్థ్యాన్ని దెబ్బతీయగలదని నిపుణులు చెబుతున్నారు.
Fatal plane crash in Sauk County, WI (near Wisconsin Dells) Piper PA-46-350P Malibu Mirage N931TT (2008, owned by Compass Pro LLC) went down ~9:30 p.m. CDT Oct 13 in the Town of Dellona. All 6 aboard (5 adults, 1 child) killed. No injuries on the ground. Departed Kenosha (KENW) for Menomonie. Pilot reported icing at 24,000 ft, requested descent. Entered a right descending turn that increased in rate until contact/ADS-B lost. FR24 data showed extreme vertical speeds of ~9,500–10,100 fpm. Just before tracking ended, it increased to 19,000 fpm with a spiral-like path over the area. FAA & NTSB investigating. #Aviation #PlaneCrash #Wisconsin #N931TT
— SLCScanner (@SLCScanner) October 14, 2026
ఇదీ చదవండి: పాక్ డబుల్ గేమ్.. దాయాది పిల్లిమొగ్గలు!


