సాక్షి, తిరుపతి: నగరి తడుకు పేట వద్ద రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులు, మరో తమిళనాడు వ్యక్తి మృతి చెందారు. మరో ముగ్గురు తమిళనాడు వాసులకు తీవ్రమైన గాయాలు జరిగినట్టు సమాచారం.
నగరి తడుకు పేట వద్ద అతివేగంగా కారు నడపడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మరణించిన వారిలో ఇద్దరు పద్మావతి అమ్మవారి ఆలయం పోటు కార్మికులు శంకర, సంతానంగా గుర్తింపు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు.


