cars collided
-
వామ్మో ఇంత స్పీడ్ ఏంట్రా బాబు.. చిన్నారికి మరో జన్మే అనుకోవాలి!
కొన్ని రోడ్డు ప్రమాద వీడియోలు చూస్తే ఒక్కసారిగా షాక్‌కు గురవుతాము. అలాంటి రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన వారిని చూస్తే ఒక్కోసారి నిద్ర కూడా పట్టదు. తాజాగా ఇదే తరహా రోడ్డు ప్రమాదం ఒకటి రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని రాజస్మడ్ ప్రాంతంలో బైరూలాల్కు ఓ కిరాణం ఉంది. కాగా, కిరాణా షాపు ముందే తన ఆల్టో కారును పార్క్ చేసి ఉంచాడు. ఈ క్రమంలో అధిక వేగంతో ఉన్న ఓ స్వీఫ్ట్ కారు ఒక్కసారిగా వచ్చి ఆల్టో కారును ఢీకొట్టింది. కారు హైస్పీడ్‌లో ఉండటంలో ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కిందపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రమాద ఘటనపై లాల్ స్పందించాడు. తాను తన షాపు ముందు కారు నిలిపివేసినప్పుడే హైస్పీడ్‌లో ఉన్న స్వీఫ్ట్ కారు వచ్చి ఢీకొట్టిందని తెలిపాడు. అయితే, అప్పటి వరకు తన కూతురు ఆ కారులోనే ఆడుకుందని అన్నాడు. దేవుడి దయ వల్ల కొన్ని సెకన్ల వ్యవధిలో తన నాలుగేళ్ల పాప ప్రాణాలతో బయటపడిందని చెప్పుకొచ్చాడు. #Watch: कहावत है 'जाको राखे साइयां मार सके ना कोय'... एकबार फिर यह सच साबित हुई है। राजस्थान में चार साल की बच्ची कार में खेल रही थी। उसके उतरने के महज 7 सेकंड बाद ही एक तेज रफ्तार वाहन ने कार को टक्कर मार दी। पूरी घटना का सीसीटीवी वीडियो सामने आया है।#Rajasthan #Accident pic.twitter.com/RmeLM2pnFQ — Hindustan (@Live_Hindustan) December 1, 2022 -
రెండు కార్లు ఢీ
► నలుగురికి గాయాలు ► రోడ్డు మరమ్మతు పనుల అలసత్వంతోనే ప్రమాదం మొయినాబాద్: ఎదురురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొనడంతో నలుగురు యువకులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై గండిపేట చౌరస్తా వద్ద గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని కనకమామిడి గ్రామానికి చెందిన యువకులు చాకలి సురేష్, ఆలూరు సంతోష్, ఆలూరు వెంకటేష్, మల్రెడ్డిగారి విష్ణువర్ధన్ రెడ్డి నలుగురు స్నేహితులు. గురువారం రాత్రి పనినిమిత్తం గండిపేట మండలం సన్ సిటీకి కారులో వెళ్లారు. అర్ధరాత్రి 12గంటల సమయంలో తిరిగి ఇంటికి వస్తుండగా గండిపేట చౌరస్తా సమీపంలో ఎదురుగా రాంగ్రూట్లో వచ్చిన స్కార్పియోకారు వేగంగా వచ్చి వీరి కారును ఢీకొట్టింది. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జై నలుగురికి గాయాలయ్యాయి. గాయాలైనవారిని వెంటనే స్థానిక భాస్కర ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు మరమ్మతు పనుల అలసత్వం వల్లే... ఈ ప్రమాదానికి రోడ్డు మరమ్మతుల పనుల అలసత్వమే కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్–బీజాపూర్ రహదారి మరమ్మతుపనుల్లో భాగంగా అజీజ్‌నగర్ చౌరస్తాలో ఒకవైపు రోడ్డు పూర్తిగా తవ్వేశారు. దీంతో ఎనికేపల్లి చౌరస్తా నుంచి అజీజ్‌నగర్ చౌరస్తా వరకు నగరంవైపు వెళ్లే వాహనాలను కుడివైపు రోడ్డులో వెళ్లే విధంగా దారి మళ్లించారు. పదిహేను రోజులుగా ఇలా వాహనాలను దారిమళి్లంచడంతో ఒకవైపు రోడ్డులోనే వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే గురువారం అర్ధరాత్రి నగరం వైపు వెళ్తున్న స్కార్పియో వాహనం కుడివైపు రోడ్డులో వెళ్లింది. అజీజ్గనర్ చౌరస్తా వద్దకు వెళ్లగానే ఎడమ వైపు రోడ్డులో వెళ్లాల్సి ఉన్నా స్కార్పియో వాహనం కుడి వైపు రోడ్డులోనే వెళ్లడంతో గండిపేట చౌరస్తా వద్ద ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టింది. రోడ్డు మరమ్మతు పనులు చేపడుతున్న అధికారులు సరైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. -
రెండు కార్లు ఢీ : ముగ్గురి మృతి
-
రెండు కార్లు ఢీ : ముగ్గురి మృతి
– రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి –నలుగురికి గాయాలు – ఒకరి పరిస్థితి విషమం – రాక్‌గార్డెన్ సమీపాన ఘటన –ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ఆకె రవికృష్ణ ఓర్వకల్లు : ఆదివారం సెలవుదినం.. దైవదర్శనానికి వెళ్లిన రెండు కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. తిరుగు ప్రయాణంలో కారు టైరు పేలి..మరో కారును ఢీకొనడంతో భార్యాభర్తలతో పాటు డ్రై వర్ మృత్యువాత పడ్డారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన ఓర్వకల్లు సమీపంలో చోటు చేసుకొంది. కర్నూలు నగరం గణేశ్ నగర్లో నివాసముంటున్న మహేశ్వరరావు (50), భార్య ఉన్నూరమ్మ (45), వీరి బంధువులు బాలాజీనగర్‌కు చెందిన అశోక్‌కుమార్, భార్య సౌమ్య, చిన్న కుమారుడు సన్ని, పార్థులు పాణ్యం మండలంలోని కొత్తూరు సుబ్బరాయుడు (సుబ్రమణేశ్వర స్వామి)ని దర్శించుకునేందుకు వెళ్లాలనుకున్నారు. ఇందుకు ఏపీ 21 జీ 9459 నంబరు గల అద్దె కారును మాట్లాడుకున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి.. స్వామిని దర్శించుకొని మధ్యాహ్నం 12 గంటలకు కర్నూలుకు తిరుగు ప్రయాణమయ్యారు. రాక్‌గార్డెన్‌కు పూడిచెర్ల బస్సు స్టేజికి మధ్య వీరు ప్రయాణిస్తున్న కారు ముందు టైరు పగలడంతో అదుపుతప్పింది. ఎదురుగా వస్తున్న ఏపీ 21 బీసీ 0854 నంబరు గల కారును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రై వర్ రాంప్రసాద్‌రెడ్డి(45), మహేశ్వరరావు (50), ఉన్నూరమ్మ (45) అక్కడికక్కడే మృతి చెందారు. అశోక్‌కుమార్, ఆయన భార్య సౌమ్య, వీరి కుమారుడు సన్నికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. వీరితో పాటు ఎదుటి వాహనం యజమాని ఎస్జే హాస్పిటల్ అధినేత జావిద్ హుసేన్‌కు రెండు కాళ్లు విరిగాయి. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ చంద్రబాబు నాయుడు పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి క్షత్రగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో సౌమ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలియగానే జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, డీఎస్పీ రమణమూర్తి, సీఐ నాగరాజు యాదవ్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. మృతుడు పెయింటర్.. మృతుడు మహేశ్వరరావు ఆర్ట్ అండ్ పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగించే వారు. వీరికి అరున్రావు, నిరంజన్‌కుమార్ సంతానం ఉన్నారు. గాయపడిన అశోక్‌కుమార్ నగరంలోని బంగారుపేట సమీపంలో గల బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్రాంచి మేనేజర్‌గా పని చేస్తున్నట్లు బాధితుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్ఐ చంద్రబాబు నాయుడు కేసు నమోదు చేసుకొని మతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద మూలంగా అరగంట పాటు రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.