మోదీకి సియోల్ శాంతి బ‌హుమ‌తి ప్రదానం

Narendra Modi awarded with Seoul Peace Prize - Sakshi

సియోల్: దక్షిణా కొరియా ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక సియోల్ శాంతి బహుమతిని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శుక్రవారం అందుకున్నారు. అంతర్జాతీయ సహకారం, ప్రపంచ అభివృద్ధి, మానవ అభివృద్ధికి చేసిన సేవలకుగానూ దక్షిణకొరియా ప్రభుత్వం సియోల్ శాంతి బహుమతిని మోదీకి ప్రదానం చేసింది. ఈ అవార్డు త‌న‌కు ద‌క్కిన వ్య‌క్తిగ‌త‌మైన గౌర‌వం కాద‌ని, ఇది దేశ ప్ర‌జ‌ల‌కు చెందుతుంద‌ని మోదీ అన్నారు. గ‌త అయిదేళ్ల‌లో భార‌త్ సాధించిన ప్ర‌గ‌తికి ఈ అవార్డు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. 130 కోట్ల మంది భార‌తీయుల స‌త్తాకు ఈ అవార్డు ద‌క్కుతుంద‌న్నారు.

మ‌హాత్మా గాంధీ150వ జ‌యంతి జ‌రుగుతున్న సంవ‌త్స‌రంలో ఈ అవార్డును అందుకోవడం గ‌ర్వంగా ఉందని మోదీ చెప్పారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పెనుసవాళ్లని పేర్కొన్నారు. 1988లో సియోల్‌లో ఒలింపిక్స్ క్రీడ‌లు జ‌ర‌గ‌డానికి కొన్ని వారాల ముందే ఆల్ ఖైదా అనే ఉగ్ర‌వాద సంస్థ ఏర్ప‌డింద‌ని, ఇప్పుడు తీవ్ర‌వాదం, ఉగ్ర‌వాదం .. ప్రపంచ‌దేశాల‌కు స‌మ‌స్య‌గా మారింద‌న్నారు. సియోల్ శాంతి బ‌హుమ‌తి గతంలో అందుకున్న ప్రముఖుల్లో ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ కోఫీ అన్నన్‌, జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజిలా మోర్కెల్‌లు ఉన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top