
ఫ్రెంచ్ సైక్లిస్ట్, టిక్‌టాక్ స్టార్ అరోలియాన్ ఫాంట్‌నోయ్ అరుదైన వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. మెట్ల మార్గం గుండా సైకిల్‌పై ఈఫిల్ టవర్‌ను 12 నిమిషాల్లో ఎక్కి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 686 మెట్లు ఉన్న ఈఫిల్ టవర్‌ను 12 నిమిషాల 30 సెకన్లలో సైకిల్‌పై ఎక్కారు, అది కూడా ఎక్కడా కాలు కిందపెట్టకుండా ఈఫిల్ టవర్‌ను ఇలా ఎక్కడంతో వరల్డ్ రికార్డు సృష్టించాడు.
దాంతో 2002లో హ్యూగ్స్ రిచర్డ్ నెలకొల్పిన రికార్డు తెరమరుగైంది. గతంలో రిచర్డ్ 19 నిమిషాల వ్యవధిలో ఈఫిల్ టవర్‌ను సైకిల్‌పై ఎక్కితే.. ఇప్పుడు దాన్ని ఏడు నిమిషాలు ముందుగాను ఫాంట్‌నోయ్ చేరుకుని నూతన అధ్యాయాన్ని లిఖించాడు. తన తదుపరి లక్ష్యం దుబాయ్‌లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బూర్జ్ ఖలీఫాను ఎక్కి రికార్డు నెలకొల్పడేనని పేర్కొన్నాడు.
అయితే ఈఫిల్ టవర్‌ను ఎక్కి రికార్డు నెలకొల్పడంపై ఫాంట్‌నోయ్ మాట్లాడుతూ.. ‘ ఇది మూడు-నాలుగేళ్ల క్రితమే చేయాలనుకున్నానని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వేచి చూడక తప్పలేదన్నాడు. ఒకవైపు కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కలవర పెట్టడం, మరొకవైపు ఈఫిల్ టవర్ పనులు జరుగుతూ ఉండటం, మరొకవైపు ఒలింపిక్స్ గేమ్స్ వీటన్ని కారణంగా సుదీర్ఘ నిరీక్షణ తప్పలేదన్నాడు.