Hazara Express: 10 Coaches Of Passenger Train Derails In Pakistan - Sakshi
Sakshi News home page

దారుణం: ఘోర రైలు ప్రమాదం..33 మంది మృతి..

Aug 6 2023 3:49 PM | Updated on Aug 6 2023 6:44 PM

10 Coaches Of Passenger Train Derails In Pakistan - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హజారా ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పిన ఘటనలో దాదాపు 33 మంది మరణించారు. సుమారు 80 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఎక్స్‌ప్రెస్ రైలు రావల్పిండికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ప్రారంభించామని అధికారులు తెలిపారు. 

హజరా ఎక్స్‌ప్రెస్ రావల్పిండికి వెళ్తుండగా.. షాజాద్‌పూర్, నవాబ్‌షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్ సమీపంలో దాదాపు 10 బోగీలు పట్టాలు తప్పిపోయాయి. దీంతో 15 మంది అక్కకిడక్కడే మృతి చెందారు. కరాచీ నుంచి పంజాబ్‌కు వెళ్లే ప్రయాణంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.  

ఇదీ చదవండి: అవయవ మార్పిడికి దేశంలో 56 వేల మంది వెయిటింగ్‌

1
1/1

Advertisement
 
Advertisement
Advertisement