
భారత్-యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) రెండు దేశాల ఆర్థిక సంబంధాల్లో మైలురాయిగా నిలుస్తుంది. 2025 జులై 24న ఈ ఒప్పందం కుదిరింది. యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తాజాగా భారత్ పర్యటన సందర్భంగా దీని అమలును త్వరగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి ఎంతో తోడ్పడుతుందని చెప్పారు.
ఈ ఒప్పందం వల్ల భారత్‌లో అద్భుతమైన అవకాశాలు వస్తాయని నిపుణులు నమ్ముతున్నారు. 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలన్న సంకల్పానికి ఇది శక్తివంతమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని సుమారు 34 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు.
ఎగుమతులు, దిగుమతులు
ఎఫ్‌టీఏ ప్రధాన ఆకర్షణల్లో ఎగుమతులు ముందంజలో ఉన్నాయి. ఈ ఒప్పందం 90% టారిఫ్ లైన్లపై తగ్గింపులు అందిస్తుంది. యూకే నుంచి భారత్‌కు విమాన భాగాలు, శాస్త్రీయ సాధనాలు, చాక్లెట్, జింజర్‌బ్రెడ్, మెడికల్ డివైసెస్ వంటివి టారిఫ్‌రహితంగా ఉంటాయి. విస్కీ, జిన్‌పై 150% నుంచి 75%కి సుంకాలు తగ్గింపు ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత ఇది 40%కు చేరుతుంది.
ప్రొఫెషనల్ మొబిలిటీ
ప్రొఫెషనల్ మొబిలిటీలో ఈ ఒప్పందం యూకే పాయింట్స్-బేస్డ్ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ఉల్లంఘించకుండా తాత్కాలిక ప్రయాణాలను సులభతరం చేస్తుంది. ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, అకౌంటెన్సీ, మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ వంటి రంగాల్లో ప్రొఫెషనల్స్ కాన్ఫరెన్సులు, ఇంట్రా-కంపెనీ ట్రాన్స్‌ఫర్లు, కాంట్రాక్ట్ సర్వీసెస్ కోసం వీసా ప్రక్రియలు సమానంగా ఉంటాయి. అకౌంటెంట్స్, ఆడిటర్స్, ఆర్కిటెక్ట్స్, లాయర్స్, ఇంజినీర్లకు మ్యూచువల్ రికగ్నిషన్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ప్రోత్సహిస్తుంది. ఇది అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులను తగ్గిస్తుంది. దాంతో భారత IT, ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొఫెషనల్స్‌కు యూకే మార్కెట్‌లో అవకాశాలు పెరుగుతాయి.
వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులు
వ్యవసాయ రంగంలో యూకే నుంచి భారత్‌కు ఫ్రెష్/ఫ్రోజెన్ సాల్మన్, లాంబ్ మీట్ వంటి ఉత్పత్తులపై టారిఫ్‌లుండవు. 10 సంవత్సరాల తర్వాత చాక్లెట్, బిస్కట్స్, సాఫ్ట్ డ్రింక్స్ వంటివి ఇందులో చేరుతాయి. షుగర్, రైస్, పోర్క్, చికెన్, ఎగ్స్ వంటి సున్నిత రంగాలను ఇందులో నుంచి మినహాయించారు.
ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహం
ఎంఎస్‌ఎంఈలకు ఇన్ఫర్మేషన్ షేరింగ్, పారదర్శకత పెంచుతూ అడ్డంకులను తగ్గించడం ద్వారా చేయూతని అందిస్తారు. కాంటాక్ట్ పాయింట్లు, మార్కెట్ ఎంట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్, ఆన్‌లైన్ ట్రేడ్ ఇన్ఫో, ఫైనాన్స్ యాక్సెస్‌పై సహకారం అందుతుంది. డిజిటల్ ట్రేడ్ ద్వారా ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్ ఎంఎస్‌ఎంఈలకు సహాయపడుతుంది.
విద్య, పరిశోధన
విద్యా రంగంలో నేరుగా కమిట్‌మెంట్స్ లేకపోయినా సర్వీసెస్ సెక్టార్ ద్వారా యూకే యూనివర్సిటీలు (అక్స్‌ఫర్డ్, కేమ్‌బ్రిడ్జ్) భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయి. ఇది భారత విద్యార్థులకు (ప్రతి సంవత్సరం 1.5 లక్షల మంది యూకే వెళ్తారు) మరింత సౌలభ్యం అందిస్తుంది. ఇన్నోవేషన్ విభాగంలో యూకే-భారత్ పరిశోధన, అభివృద్ధి సహకారాన్ని పెంచుతుంది. ఇన్నోవేషన్ వర్కింగ్ గ్రూప్ రెగ్యులేటరీ అప్రోచెస్, టెక్నాలజీ కమర్షలైజేషన్‌పై పనిచేస్తుంది.
పారిశ్రామికీకరణ
పారిశ్రామికీకరణలో ఆటోమోటివ్స్ (కారు టారిఫ్‌లు 10%), ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, మెడికల్ డివైసెస్, ఎయిర్‌క్రాఫ్ట్ పార్ట్స్‌పై టారిఫ్‌లు ఉండవు. భారత మాన్యుఫాక్చరింగ్ జీడీపీలో 21% (2031 నాటికి) పెరగడానికి యూకే ఇన్వెస్ట్‌మెంట్స్ (లైఫ్ సైన్సెస్, క్లీన్ ఎనర్జీ) సహాయపడతాయి. ఎన్విరాన్‌మెంట్ పరంగా గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొక్యూర్‌మెంట్‌ను ప్రోత్సహిస్తుంది.
ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు..