breaking news
India-UK ties
-
భారత్-యూకే ఎఫ్‌టీఏ.. ఆర్థిక వృద్ధికి కొత్త ఆశలు
భారత్-యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) రెండు దేశాల ఆర్థిక సంబంధాల్లో మైలురాయిగా నిలుస్తుంది. 2025 జులై 24న ఈ ఒప్పందం కుదిరింది. యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తాజాగా భారత్ పర్యటన సందర్భంగా దీని అమలును త్వరగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి ఎంతో తోడ్పడుతుందని చెప్పారు.ఈ ఒప్పందం వల్ల భారత్‌లో అద్భుతమైన అవకాశాలు వస్తాయని నిపుణులు నమ్ముతున్నారు. 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలన్న సంకల్పానికి ఇది శక్తివంతమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని సుమారు 34 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు.ఎగుమతులు, దిగుమతులుఎఫ్టీఏ ప్రధాన ఆకర్షణల్లో ఎగుమతులు ముందంజలో ఉన్నాయి. ఈ ఒప్పందం 90% టారిఫ్ లైన్లపై తగ్గింపులు అందిస్తుంది. యూకే నుంచి భారత్‌కు విమాన భాగాలు, శాస్త్రీయ సాధనాలు, చాక్లెట్, జింజర్‌బ్రెడ్, మెడికల్ డివైసెస్ వంటివి టారిఫ్రహితంగా ఉంటాయి. విస్కీ, జిన్‌పై 150% నుంచి 75%కి సుంకాలు తగ్గింపు ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత ఇది 40%కు చేరుతుంది.ప్రొఫెషనల్ మొబిలిటీప్రొఫెషనల్ మొబిలిటీలో ఈ ఒప్పందం యూకే పాయింట్స్-బేస్డ్ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ఉల్లంఘించకుండా తాత్కాలిక ప్రయాణాలను సులభతరం చేస్తుంది. ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ వంటి రంగాల్లో ప్రొఫెషనల్స్ కాన్ఫరెన్సులు, ఇంట్రా-కంపెనీ ట్రాన్స్ఫర్లు, కాంట్రాక్ట్ సర్వీసెస్ కోసం వీసా ప్రక్రియలు సమానంగా ఉంటాయి. అకౌంటెంట్స్, ఆడిటర్స్, ఆర్కిటెక్ట్స్, లాయర్స్, ఇంజినీర్లకు మ్యూచువల్ రికగ్నిషన్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ప్రోత్సహిస్తుంది. ఇది అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులను తగ్గిస్తుంది. దాంతో భారత IT, ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొఫెషనల్స్‌కు యూకే మార్కెట్లో అవకాశాలు పెరుగుతాయి.వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులువ్యవసాయ రంగంలో యూకే నుంచి భారత్‌కు ఫ్రెష్/ఫ్రోజెన్ సాల్మన్, లాంబ్ మీట్ వంటి ఉత్పత్తులపై టారిఫ్లుండవు. 10 సంవత్సరాల తర్వాత చాక్లెట్, బిస్కట్స్, సాఫ్ట్ డ్రింక్స్ వంటివి ఇందులో చేరుతాయి. షుగర్, రైస్, పోర్క్, చికెన్, ఎగ్స్ వంటి సున్నిత రంగాలను ఇందులో నుంచి మినహాయించారు.ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహంఎంఎస్ఎంఈలకు ఇన్ఫర్మేషన్ షేరింగ్, పారదర్శకత పెంచుతూ అడ్డంకులను తగ్గించడం ద్వారా చేయూతని అందిస్తారు. కాంటాక్ట్ పాయింట్లు, మార్కెట్ ఎంట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్, ఆన్లైన్ ట్రేడ్ ఇన్ఫో, ఫైనాన్స్ యాక్సెస్‌పై సహకారం అందుతుంది. డిజిటల్ ట్రేడ్ ద్వారా ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్ ఎంఎస్ఎంఈలకు సహాయపడుతుంది.విద్య, పరిశోధనవిద్యా రంగంలో నేరుగా కమిట్మెంట్స్ లేకపోయినా సర్వీసెస్ సెక్టార్ ద్వారా యూకే యూనివర్సిటీలు (అక్స్‌ఫర్డ్, కేమ్బ్రిడ్జ్) భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయి. ఇది భారత విద్యార్థులకు (ప్రతి సంవత్సరం 1.5 లక్షల మంది యూకే వెళ్తారు) మరింత సౌలభ్యం అందిస్తుంది. ఇన్నోవేషన్ విభాగంలో యూకే-భారత్ పరిశోధన, అభివృద్ధి సహకారాన్ని పెంచుతుంది. ఇన్నోవేషన్ వర్కింగ్ గ్రూప్ రెగ్యులేటరీ అప్రోచెస్, టెక్నాలజీ కమర్షలైజేషన్పై పనిచేస్తుంది.పారిశ్రామికీకరణపారిశ్రామికీకరణలో ఆటోమోటివ్స్ (కారు టారిఫ్‌లు 10%), ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, మెడికల్ డివైసెస్, ఎయిర్‌క్రాఫ్ట్ పార్ట్స్‌పై టారిఫ్‌లు ఉండవు. భారత మాన్యుఫాక్చరింగ్ జీడీపీలో 21% (2031 నాటికి) పెరగడానికి యూకే ఇన్వెస్ట్మెంట్స్ (లైఫ్ సైన్సెస్, క్లీన్ ఎనర్జీ) సహాయపడతాయి. ఎన్విరాన్మెంట్ పరంగా గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొక్యూర్మెంట్ను ప్రోత్సహిస్తుంది.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు.. -
బలమైన వాణిజ్య భాగస్వామ్యాలు అవసరం
ముంబై: బలమైన వాణిజ్య భాగస్వామ్యాలు భారత్‌కు వ్యూహాత్మక అవకాశాలను తీసుకొస్తాయని.. అంతర్జాతీయంగా విలువ ఆధారిత సరఫరా వ్యవస్థతో అనుసంధానతను పెంచుకోవచ్చని ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. వాణిజ్య విధానపరమైన అనిశ్చితులు నెలకొన్నప్పటికీ జూన్–జూలై నెలల్లో ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగినట్టు తెలిపింది. సమగ్ర ఆర్థిక, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్–యూకే గురువారం సంతకం చేయనుండడం గమనార్హం. అమెరికాతోనూ ఈ దిశగా చర్చలు నిర్వహిస్తుండడం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితిపై బుధవారం ఆర్బీఐ బులెటిన్ విడుదలైంది. వాణిజ్య విధానపరమైన అనిశ్చితుల కారణంగా జూన్ నుంచి జూలైలో ఇప్పటి వరకు అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక వాతావరణం అస్థిరంగా ఉన్నట్టు తెలిపింది. ‘‘ఈ కాలంలో దేశీ ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగాయి. ఖరీఫ్ సాగు పరిస్థితులు మెరుగుపడడం, సేవల రంగంలో బలమైన పనితీరు, పారిశ్రామిక పనితీరులో మోస్తరు వృద్ధి మద్దతుగా నిలిచాయి’’అని బులెటిన్ వివరించింది. అమెరికాతో ఆగస్ట్ 1కి ముందుగానే వాణిజ్య ఒప్పందం కోసం తీవ్రమైన చర్చలు నడుస్తున్నాయంటూ.. అమెరికా వాణిజ్య విధానాలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావాలను పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. సగటు వాణిజ్య టారిఫ్‌లు 1930ల తర్వాత ఎన్నడూలేని స్థాయిలకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ఇతర రంగాలపైనా అదనంగా కొత్త టారిఫ్‌లు విధించే రిస్క్ లేకపోలేదని తెలిపింది. ఈ అనిశ్చితులు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధికి విఘాతం కలిగించొచ్చని అభిప్రాయపడింది. వ్యవస్థలో తగినంత లిక్విడిటీ ఉండడం రేట్ల కోత బదిలీకి వీలు కల్పిస్తుందని.. విదేశీ మారకం నిల్వలు సమృద్ధిగా ఉండడం, విదేశీ మారకం రుణభారం మోస్తరుగా ఉండడాన్ని సానుకూలతలుగా పేర్కొంది. చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణానికి ఆజ్యం చమురు ధరలు 10% పెరిగితే రిటైల్ ద్రవ్యోల్బణం 0.20% అధికమవుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. ప్ర త్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం ద్వారా దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు విధానపరమైన చర్యలకు ఆర్బీఐ ఉద్యోగులు విడుదల చేసిన అధ్యయన పత్రం పిలుపునిచ్చింది. ఈ భారం వినియోగదారులపై అధికంగా పడకుండా ఎక్సైజ్ సుంకాలను తగ్గించే వెసులుబా టు ప్రభుత్వానికి ఉన్నట్టు తెలిపింది. -
India-UK Free Trade Agreement: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సిద్ధం
లండన్: భారత్– బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) ఆచరణలోకి తెచ్చేందుకు సిద్ధమని బ్రిటన్ నూతన ప్రధాని కియర్ స్టార్మర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో శనివారం ఆయన ఈ మేరకు ఫోన్లో చర్చలు జరిపినట్టు బ్రిటన్ ప్రకటించింది. ఆర్థిక బంధాన్ని బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజల వికాసానికి కట్టుబడి ఉన్నామని మోదీ ట్వీట్ చేశారు. వాతావరణ మార్పులు, ఆర్థికాభివృద్ధి అంశాల్లో మోదీ నాయకత్వాన్ని స్టార్మర్ స్వాగతించారని ప్రధాని కార్యాలయం తెలిపింది. 2030 రోడ్‌మ్యాప్‌పై ప్రధానులు చర్చించారని, పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి అంగీకరించారని వెల్లడించింది. త్వరలో భేటీ అవాలని నేతలిద్దరూ నిర్ణయించారు. 38.1 బిలియన్ పౌండ్ల ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యంపై భారత్, బ్రిటన్ 2022 నుంచి సంప్రదింపులు జరుపుతున్నాయి. -
గిఫ్ట్ సిటీ, ఎల్ఎస్ఈలలో లిస్టింగ్
న్యూఢిల్లీ: రుణ సెక్యూరిటీలు, షేర్లను ఐఎఫ్ఎస్సీ–గిఫ్ట్ సిటీతోపాటు.. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎల్ఎస్ఈ)లలో లిస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇందుకు యూకేతో కలసి అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలియజేశారు. గిఫ్ట్ సిటీలో కార్యకలాపాల విస్తరణకు యూకే సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వేగవంత, విస్తార ఫిన్‌టెక్ భాగస్వామ్యానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలియజేశారు. ఇండియా– యూకే 12వ ఎకనమిక్, ఫైనాన్షియల్ సదస్సు ముగింపు సందర్భంగా సీతారామన్ పలు అంశాలను వెల్లడించారు. ఐఎఫ్ఎస్సీ లిస్టింగ్‌తో ప్రారంభించి తదుపరి లండన్ లిస్టింగ్‌వైపు దృష్టిపెట్టనున్నట్లు గతంలోనే పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. వెరసి తొలుత ఐఎఫ్ఎస్సీ లిస్టింగ్‌నకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విదేశీ పెట్టుబడులను సమకూర్చుకునేందుకు మసాలా, గ్రీన్ బాండ్లను సైతం రుణ సెక్యూరిటీల లిస్టింగ్ జాబితాలో చేర్చనున్నట్లు పేర్కొన్నారు. ఇక ఎల్ఎస్ఈలో భారత కంపెనీల ప్రత్యక్ష లిస్టింగ్ ప్రణాళికలను యూకే ఆర్థిక మంత్రి జెరెమీ హంట్ ఈ సందర్భంగా ప్రశంసించారు. -
యూకేపై భారత్ తీవ్ర వ్యాఖ్యలు
లండన్: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు బ్రిటన్ ఆశ్రయం కల్పిస్తుండటంపై భారత్ తీవ్రంగా స్పందించింది. నేరస్తుల పాలిట స్వర్గంలా బ్రిటన్ తయారైందని ఆ దేశంలో భారత రాయబారి వైకే సిన్హా వ్యాఖ్యానించారు. మంగళవారం లండన్‌లో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సిన్హా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ మేరకు పరోక్ష ఆరోపణలు చేశారు. ఇండియా వ్యతిరేకులకు, నేరస్తులకు వేదికగా యూకే మారిందని తెలిపారు. ‘మాది కూడా ప్రజాస్వామ్య దేశమే. అయితే, మేం మాత్రం ఇక్కడి మాదిరిగా స్నేహితులకు, సన్నిహితులకు ఇబ్బందులు కలిగే చర్యలను తలపెట్టలేం.. బ్రిటన్ ప్రభుత్వ తీరుపై మా దేశ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని’ అన్నారు. అలాగే, బ్రిటన్ పార్లమెంట్లో కూడా ఇండియా వ్యతిరేక చర్చలు జరగటాన్ని ఆయన ప్రస్తావించారు. ఇండియా- యూకే సంబంధాలపై ఇలాంటి చర్యలు ప్రభావితం కలిగిస్తాయన్నారు. బ్రిటన్ మీడియా ఈ విషయంలో మరింత స్పష్టత తెచ్చుకోవాల్సి ఉందని, ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో ఇండియాకు ఉన్న ప్రముఖ స్థానాన్ని గుర్తించాలన్నారు. ఇండియాలోని బ్యాంకులను రూ.9వేల కోట్ల మేర మోసం చేసి పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాకు బ్రిటన్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని ఆయన పరోక్షంగా ప్రస్తావించినట్లయిందని పరిశీలకులు భావిస్తున్నారు.


