
వాషింగ్టన్: ఎండ తగిలితే ఒళ్లు వేడెక్కుతుంది. రాత్రిళ్లు ఒళ్లు చల్లబడుతుంది. కానీ రాత్రి పగలు అని తేడా లేకుండా ఎప్పుడైనా సరే మన రక్తపోటును సూరీడు ప్రభావితం చేస్తాడనే కొత్త విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆరు సంవత్సరాలపాటు చైనాలోని క్వింగ్‌డావో, వేహాయ్ నగరాల్లోని 5,00,000 మంది ప్రజల రక్తపోటు స్థాయిలను పర్యవేక్షించి శాస్త్రవేత్తలు ఈ కొత్త విషయాన్ని కనుగొన్నారు.
సౌరతుపాన్ల కారణంగా భూమి మీదకు దూసుకొచ్చే ఉష్ణగాలులు మన భూ అయాస్కాంతావరణాన్ని ప్రభావితంచేసి చివరకు మన బీపీని పెంచేస్తాయని స్పష్టమైంది. సౌరతుపాన్ల కారణంగా భూ అయాస్కాంతావరణంలో సంభవించే మార్పులు మానవ ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపతాయనే దానిపై అధ్యయనం సాగింది. ముఖ్యంగా మహిళల బీపీని సౌరతుపాను ప్రభావితం చేస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఈ సౌరతుపాను దృగి్వషయం మన బీపీని ప్రమాదకరస్థాయిలో పెంచేస్తుందా? దీని ఇతర దుష్ప్రభావాలు ఏంటనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సౌర గాలులకు మానవ ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉందని తెల్చే ఈ పరిశోధనా తాలూకు వివరాలు తాజాగా కమ్యూనికేషన్స్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. పరిశోధనలో భాగంగా మధ్యస్థాయి అయస్కాంతావరణం ఉండే చైనాలోని రెండు నగరాలను ఎంచుకున్నారు. అక్కడి 5లక్షలకుపైగా ప్రజల రక్తపోటు స్థాయిల రికార్డ్‌లను సౌరతుపాన్ల కాలంతో పోల్చిచూశారు. భూ అయస్కాంతావరణం(జీఎంఏ)లో మార్పులకు తగ్గట్లు అక్కడి ప్రజల బీపీలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా మహిళల బీపీ అనేది జీఎంఏకు అనుగుణంగా స్పందిస్తున్నట్లు స్పష్టమైంది.
ఇప్పటికే రక్తపోటుతో బాధపడుతున్న వారికి సౌరశక్తి అనేది ప్రతికూలకంగా మారుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు మరింత సమర్థవంతంగా తీసుకునేందుకు ఇలాంటి పరిశోధనలు దోహదపడతాయిన వారు చెప్పారు. సౌరతుపాన్లు ఇప్పటికే ఉపగ్రహాలు, కమ్యూనికేషన వ్యవస్థలు, విద్యుత్ గ్రిడ్‌లపై పెను ప్రభావం చూపుతున్న విషయం తెల్సిందే. ఇప్పుడీ జాబితాలోకి మానవ ఆరోగ్యం వచ్చిచేరింది. భూగోళం మీది వాతావరణంతోపాటు అంతరిక్ష అంశాలు సైతం మనిíÙపై ప్రభావం చూపుస్తాయని తాజా అధ్యయనం చాటుతోంది.