పాముల్లో ఉండే గుణం.. కాటు వేయడం. అన్ని పాముల్లో విషం లేకపోయినా, విషపూరిత పాములతోనే అత్యంత ప్రమాదం. అది మనం పెంచుకునే విషపూరిత పాము అయినప్పటికీ దానితో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. లేకపోతే మన ప్రాణం మీదకు తెచ్చుకోవాలి. అదే జరిగింది ఇక్కడ. ఓ వ్యక్తి విషపూరిత పామును ముచ్చటగా పెంచుకుంటున్నాడు. కానీ ఆ పాము కాటుతో తన చేతి వేలిని కోల్పోయాడు సదరు వ్యక్తి. చైనా దేశంలోని బీజింగ్‌లో జరిగిన ఈ ఘటన వైరల్‌గా మారింది.
అతనికి చిన్నప్పటినుండి పాములంటే ఆసక్తి. ఆ క్రమంలోనే ఓ విషపూరిత పామును పెంచుకోవడం మొదలుపెట్టాడు. అయితే ఆ పాముకు జబ్బు చేసి ఆహారం తినలేకపోతోంది. దానికి బలవంతంగా చేతితో ఆహారాన్ని పెడుతూ వస్తున్నాడు. అయితే ఒకానొక సందర్భంలో ఆ పాము కోరల్లో అతని చేయి ఇరుక్కుంది. దాంతో పాము కాటుకు బారిన పడ్డ ఆ వ్యక్తి ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి కరిచిన వేలిని తీసేయాలన్నారు. వేలిలో విషం ఉందని, అది తొలగించకపోతే ప్రాణానికే ప్రమాదమని చెప్పడంతో చేసేదిలేక వేలిని తీయించుకున్నాడు. ఇది ఆ వ్యక్తికి నేర్పిన జీవిత పాఠంగా గుర్తిండిపోవడం ఖాయం. విషపూరితమైన వాటికి దూరంగా ఉండటం ఎంత మంచిదో ఈ ఘటన ద్వారా తేటతెల్లమైంది.
అదొక ఫైవ్ స్టెప్ స్నేక్
చైనీస్ కథల్లో ఈ పామును "ఫైవ్ స్టెప్ స్నేక్" అని పిలుస్తారు. ఇది అంతటి విషపూరితమైందని నమ్మకం ఉంది, ఒకవేళ ఇది ఎవరినైనా కరిస్తే వారు ఐదు అడుగులు కూడా వేయకముందే మరణిస్తారని చెబుతారు. ఇటీవలి సంవత్సరాల్లో చైనాలో విచిత్రమైన మరియు తరచుగా ప్రమాదకరమైన జంతువులను పెంపుడు జంతువులుగా పెట్టుకునే ధోరణి పెరుగుతోంది.
ఈ పాము విషం.. అత్యంత వేగంగా ప్రభావం
‘ఫైవ్ స్టెప్ స్నేక్"అనేది అత్యంత విషపూరిత పాముకు సంబంధించినది.
ఈ పాము కాటు వేస్తే, విషం చాలా వేగంగా ప్రభావం చూపుతుంది.
ప్రజల్లో ఒక నమ్మకం ఉంది: కాటు పడిన వ్యక్తి ఐదు అడుగులు కూడా వేయలేడు, వెంటనే కుప్పకూలిపోతాడు.
అందుకే దీనిని "ఫైవ్ స్టెప్ స్నేక్" అని పిలుస్తారు.
శాస్త్రీయ పేరు- రస్సెల్ వైపర్
శరీరంపై గోధుమ రంగు, పెద్ద పెద్ద వృత్తాకార మచ్చలు ఉంటాయి.
పొడవు సాధారణంగా 1–1.5 మీటర్లు.
రాత్రివేళ ఎక్కువగా చురుకుగా ఉంటుంది.
విష ప్రభావం
రక్తం గడ్డకట్టే విధానాన్ని (blood clotting) దెబ్బతీస్తుంది.
తీవ్రమైన నొప్పి, వాపు, అంతర్గత రక్తస్రావం కలుగుతుంది.
తక్షణ వైద్య సహాయం లేకపోతే ప్రాణాపాయం.


