చైనాకు పాక్‌ ఉప ప్రధాని.. కారణం ఇదే.. | Pakistan Deputy PM Ishaq dar Will Visit China | Sakshi
Sakshi News home page

చైనాకు పాక్‌ ఉప ప్రధాని.. కారణం ఇదే..

Jan 1 2026 7:11 AM | Updated on Jan 1 2026 7:11 AM

Pakistan Deputy PM Ishaq dar Will Visit China

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్‌దార్‌ చైనాలో పర్యటించనున్నారు. ఈ వారం చివర్లో చైనాను సందర్శించనున్న ఆయన చైనా విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కాగా, ఏడో దశ ద్వైపాక్షిక చర్చలు జనవరి 4న బీజింగ్‌లో జరుగుతాయని పాక్‌ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి ఆహ్వానం మేరకు దార్‌ ఈ పర్యటన చేస్తున్నారని వెల్లడించింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఇరు దేశాలు స్మారక కార్యకలాపాలను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకార భాగస్వామ్యం, ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, అభివృద్ధిని ఈ పర్యటన బలోపేతం చేస్తుందని ప్రకటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement