breaking news
Solar Storm
-
మార్స్ కొంప ముంచిన సౌర గాలులు
భూమికి సమీపంలో ఉన్న అంగారక గ్రహం(మార్స్)పై విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. అక్కడికి వ్యోమగాములను పంపించే ప్రయత్నాలు సైతం మొదలయ్యాయి. ఈ అరుణ గ్రహంపై కోట్లాది సంవత్సరాల క్రితం నీరు, వాతావరణం ఉండేవి. అవి క్రమేపి అంతరించిపోయాయి. మొత్తం శూన్యం ఆవరించింది. జీవుల మనుగడపై ఆస్కారమే లేకుండాపోయింది. మార్స్‌పై నీరు, వాతవరణం కనుమరుగైపోవడానికి కారణం ఏమిటన్నది ఎట్టకేలకు గుర్తించగలిగారు. బలమైన సౌర గాలులు, సౌర తుఫాన్ల కారణంగా అంగారక గ్రహం ఆయస్కాంత శక్తిని కోల్పోయినట్లు తేలింది. ఆయస్కాంత శక్తిని కోల్పోయిన తర్వాత అక్కడున్న ద్రవ రూపంలోని నీరు అంతరిక్షంలోకి ఆవిరైపోయింది. వాతావరణం సైతం నెమ్మదిగా అంతరించింది. దాంతో మార్స్ ఉపరితలంపై ఎర్రమట్టి దిబ్బలు, దుమ్ము, రాళ్లు మాత్రమే మిగిలాయి. మార్స్ అటా్మస్పియర్ వోలటైల్ ఎవల్యూషన్(మావెన్) మిషన్‌లో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ఈ విషయం కనిపెట్టింది. చాలా ఏళ్లుగా పరిశోధకుల మదిని తొలిచేస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికినట్లయ్యింది. సౌర గాలుల్లోని శక్తి కణాలు అంగారకుడి వాతావరణంలోకి చొచ్చుకెళ్లాయని, దాంతో నీరు ఆవిరైందని, తటస్థ కణాలు, అణువులు వాతావరణం నుంచి బయటకు వెళ్లిపోయాయని నిర్ణయానికొచ్చారు. ఈ పరిశోధన కోసం సోలార్ విండ్ అయాన్ అనలైజర్, న్యూట్రల్ గ్యాస్, ఐయాన్ మాస్ స్పెక్ట్రోమీటర్ ఉపయోగించారు. మార్స్‌పై ఒక భాగం పూర్తిగా వెలుతురు, మరో భాగం పూర్తిగా చీకటి ఉంటుంది. ఈ రెండు భాగాల సమగ్ర డేటా సేకరించారు. సౌర గాలులు, తుఫాన్లు అరుణ గ్రహం స్థితిగతులను పూర్తిగా మార్చేసినట్లు స్పష్టమయ్యింది. ఈ మొత్తం పరిశోధన వివరాలను సైన్స్ అడ్వాన్సెస్ పత్రికలో ప్రచురించారు. అంగారకుడిపై మరింత అవగాహన పెంచుకోడానికి, భవిష్యత్తులో చేపట్టే పరిశోధనలకు ఈ వివరాలు దోహదపడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఒకవేళ మార్స్‌పై నీరు, వాతావరణం యధాతథంగా ఉంటే అది మరో భూగోళంగా మనుషుల మనుగడకు తోడ్పడేదని మనం భావించవచ్చు. సౌర గాలులు, తుఫాన్లు అంగారకుడి కొంప ముంచడమే కాదు.. మన ఆశలనూ నీరుగార్చేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మే 2న సూర్యుడిపై అత్యంత శక్తివంతమైన విస్ఫోటనం
-
సౌర తుపాను నేడు భూమిని తాకే అవకాశం
వాషింగ్టన్: అంతరిక్షం నుంచి భారీ సౌర తుపాను నేడు భూమిని తాకే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రభావంతో జీపీఎస్, మొబైల్, రేడియో సిగ్నళ్లకు అంతరాయం కలగొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సైతం ఈ విషయాన్ని ధృవీకరించింది. సౌర తుపాను ప్రభావం భూకక్ష్యలోని ఉపగ్రహాలపై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతరిక్షంలో సంభవించే సౌర తుపానులు అప్పుడప్పుడు భూమిని తాకే సందర్భాలు ఉన్నాయి. గతంలో ఆయా సమయాల్లో శాటిలైట్ సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది కూడా. The long snake-like filament cartwheeled its way off the #Sun in a stunning ballet. The magnetic orientation of this Earth-directed #solarstorm is going to tough to predict. G2-level (possibly G3) conditions may occur if the magnetic field of this storm is oriented southward! pic.twitter.com/SNAZGMmqzi — Dr. Tamitha Skov (@TamithaSkov) July 16, 2022 శక్తివంతమైనదే! జులై 15న సూర్యుడి ఉపరితలంపై శక్తివంతమైన సౌర జ్వాల మొదలైంది. బలమైన ఫొటాన్ల నుంచి వెలువడే రేడియేషన్ విస్పోటనం వల్ల ఇది ఏర్పాడుతుంది. గంటకు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది ఇది. అయితే జులై 20-21 తేదీల మధ్య భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకవచ్చని ముందు నుంచి పరిశోధకులు చెప్తూ వస్తున్నారు. ఎఫెక్ట్.. గతంలో భూమి మీద సౌర తుపానుల ప్రభావం పడింది. సౌర తుపాను కారణంగా ఉత్తర, దక్షిణ ధ్రువాల్లో ఖగోళ కాంతి ప్రకాశంగా కనిపిస్తుంది. అదే సమయంలో భూ వాతావరణం కూడా వేడక్కే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా జీపీఎస్, మొబైల్ సిగ్నళ్లు, శాటిలైట్ టీవీ సేవలకు అంతరాయం ఏర్పడొచ్చు కూడా. -
సౌర తుపాను!.. జీపీఎస్, రేడియో సిగ్నళ్లకు అంతరాయం
న్యూయార్క్: సౌర తుపాను మంగళవారం భూమిని తాకనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే జీపీఎస్, రేడియో సిగ్నళ్ల ప్రసారంలో అంతరాయం తప్పదు. ఈ నెల 19న సూర్యగోళం నుంచి విడుదలయ్యే పాము ఆకారంలోని ఫిలమెంట్ (సౌర తుపాను) ప్రభావం నేరుగా భూమికి ఢీకొట్టే ఆస్కారముందని డాక్టర్ తమిథా స్కోవ్ చెప్పారు. దీనివల్ల భూమిపై పలు ప్రాంతాల నుంచి ఆకాశంలో ధ్రువకాంతి (అరోరా) వీక్షించవచ్చని అన్నారు. అనంతరం మరికొన్ని చిన్నపాటి సౌర తుపాన్లు విరుచుకుపడే ప్రమాదముందన్నారు. ఈ నెల 20, 21న జి1–క్లాస్ తుపాను రావచ్చని స్పేస్‌వెదర్ సంస్థ ప్రకటించింది. సౌర తుపాను సమయంలో సూర్యుడి నుంచి వెలువడే శక్తి భూమిపై అన్ని విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏడాదిపాటు ఉత్పత్తి చేసే కరెంటు కంటే లక్ష రెట్లు అధికం. -
కూలిపోతున్న స్పేస్ ఎక్స్ శాటిలైట్లు
కేప్ కన్నవెరల్: సౌర తుఫాన్ల కారణంగా తమ కొత్త శాటిలైట్లలో కనీసం 49 దాకా తమ కక్ష్యల నుంచి జారి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోయినట్టు స్పేస్ ఎక్స్ ప్రకటించింది. ‘‘గత వారం ప్రయోగించిన వీటిలో చాలావరకు తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోయాయి. మిగతావీ కూడా అదే బాటలో ఉన్నాయి’’ అని చెప్పింది. గత శుక్రవారం నాటి జియోమాగ్నటిక్ తుఫాన్ల దెబ్బకు వాతావరణ సాంద్రత పెరగడం తమ శాటిలైట్ల పుట్టి ముంచిందని వివరించింది. ఒక్కోటీ కేవలం 260 కిలోలుండే ఈ బుల్లి శాటిలైట్లను కాపాడేందుకు గ్రౌండ్ కంట్రోలర్లు ఎంతగా ప్రయత్నించినా లాభం లేకపోయిందని వాపోయింది. అయితే స్పేస్ ఎక్స్‌కు చెందిన కనీసం 2,000 స్టార్ లింక్ శాటిలైట్లు దాదాపు 550 కిలోమీటర్ల ఎత్తులో భూమికి చుట్టూ తిరుగుతూ ప్రపంచంలోని మారుమూలలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ సమకూరుస్తున్నాయి. -
భూమివైపుగా ముంచుకొస్తున్న పెను ఉపద్రవం! నాసా హెచ్చరిక
సూర్యుడి నుంచి భూమివైపుగా మరో పెను ఉప ద్రవం ముంచుకొచ్చే అవకాశం ఉందని నాసా హెచ్చరించింది. సూర్యుడిపై నెలకొన్న పరిస్థితుల కారణంగా మరోసారి సౌర తుఫాన్స్ ఏర్పడే అవకాశం ఉందని నాసా పేర్కొంది. ఇప్పటికే నాసా శాస్త్రవేత్తలు సౌర తుఫాను హెచ్చరికలను జారీ చేశారు. అయితే ఈ సారి రెండు "పెద్ద సౌర తుఫానులు" త్వరలో సూర్యుడి నుంచి విడుదల కావచ్చని అంతరిక్ష వాతావరణ భౌతిక శాస్త్రవేత్త డా.తమిత స్కోవ్ పేర్కొన్నారు. అతి త్వరలోనే ఈ రెండు సౌర తుఫానుల భూమిని తాకే అవకాశం ఉందని డాక్టర్ తమిత అభిప్రాయపడ్డారు. ఈ ఏడాదిలో సుమారు ఐదారు సౌర తుఫానులు భూమిని తాకయని తెలిపింది. కాగా ప్రస్తుతం సూర్యుడి నుంచి వెలువడనున్న సౌర తుఫానుల తీవ్రతను ఇంకా నిర్దారించలేదు. గతంలో జీ2, జీ3 మాగ్నెటిక్ సౌర తుఫానులు వచ్చాయని తమిత పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ త్వరలోనే రానున్న సౌర తుఫానులు "హై అలర్ట్‌లో" ఉన్నాయని ఆమె తెలిపారు. ఇలా ఎందుకు జరుగుతుదంటే..! ప్రతి పదకొండు సంవత్సరాలకొకసారి సూర్యుడి మాగ్నెటిక్ సైకిల్ ఓవర్‌డ్రైవ్ అవుతూ ఉంటుంది. ఈ సైకిల్ జరిగే సమయంలో సూర్యుడి అయస్కాంత ద్రువాలు మారుతూ ఉంటాయి. దీనినే సోలార్ మాగ్జిమమ్‌గా పిలుస్తారు. సూర్యుని అయస్కాంత క్షేత్రంలోని మార్పులు ఎక్కువ సంఖ్యలో సన్ స్పాట్స్, భారీ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అయస్కాంత క్షేత్రంలోని హెచ్చుతగ్గుల వల్ల సోలార్ ప్లేర్స్ ఏర్పడతాయి. సౌర తుఫాన్ భూమిని తాకితే...! రేడియో కమ్యూనికేషన్లు బాగా ప్రభావితమయ్యాయి. జీపీఎస్ ఆధారిత వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. ఇంటర్నెట్కు విఘాతం కల్గవచ్చును. ఆర్కిటిక్ దృవాల వద్ద ఏర్పడే అరోరా బొరియాలిస్ ఇతర ప్రాంతాల్లో కూడా కన్పిస్తాయి. ముఖ్యంగా న్యూయర్క్ లాంటి ప్రాంతాల్లో అరోరా బోరియాలిస్ కాంతులను చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పవర్గ్రిడ్లలో విద్యుత్ హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. చదవండి: భగభగమండే సూర్యుడి వాతావరణాన్ని చూశారా..! అందులో ఎన్నో అద్బుతాలు..! -
ముంచుకొస్తున్న సౌర తుఫాన్..! అదే జరిగితే అంధకారమే...!
గతంలో 16 లక్షల కిలోమీటర్ల వేగంతో సౌర తుఫాను భూమిని తాకే ఛాన్స్ ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆ సౌర తుఫాను ముప్పు పోయిందని ఆనందించే లోపే మరో సౌర తుఫాను వేగంగా వస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ సౌర తుఫాను అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 12 వరకు భూమిని తాకే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా అంధకారంలోకి వెళ్తోందని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు తరచుగా అంతరాయం కూడా కల్గుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: వారెవ్వా ! వైన్‌తో నడిచే కారు.. యువరాజు కారంటే అంతేమరి!! భారీగా ప్రభావం..! సౌర తుఫాను నేపథ్యంలో జీ2 జియోమాగ్నెటిక్ తుఫాను భూమిపై భారీగా ప్రభావం చూపుతోందని నేషనల్ ఓషియానిక్ అండ్ ఆట్మాస్పియర్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ), స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ పేర్కొంది. జియో మాగ్నెటిక్ తుఫానులు ఎక్కువగా కోరనల్ మాస్ ఎజక్షన్ వల్ల ఏర్పడుతాయి. అంటే సూర్యుడి కోరనల్ (ఉపరితలం)పై జరిగే భారీ విస్పోటనాలతో ఈ తుఫానులు ఏర్పడుతాయి. సూర్యుడి నుంచి వచ్చే కోరనల్ మాస్ ఎజక్షన్స్ భూమిని కేవలం 15 నుంచి 18 గంటల్లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సౌర తుఫాన్ భూమిని తాకితే...! రేడియో కమ్యూనికేషన్లు బాగా ప్రభావితమయ్యాయి. జీపీఎస్ ఆధారిత వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. ఇంటర్నెట్కు విఘాతం కల్గవచ్చును. ఆర్కిటిక్ దృవాల వద్ద ఏర్పడే అరోరా బొరియాలిస్ ఇతర ప్రాంతాల్లో కూడా కన్పిస్తాయి. ముఖ్యంగా న్యూయర్క్ లాంటి ప్రాంతాల్లో అరోరా బోరియాలిస్ కాంతులను చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పవర్గ్రిడ్లలో విద్యుత్ హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. చదవండి: కాసుల కోసం కక్కుర్తి..! వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్..!