బెంగళూరు: భారత తొలి సౌర అబ్జర్వేటరీ ఆదిత్య–ఎల్1 మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2024లో భూమిని వణికించిన అత్యంత భయానకమైన, శక్తిమంతమైన సౌర తుపాను అంత అసాధారణంగా ఎందుకు ప్రవర్తించిందో శాస్త్రవేత్తలు అర్థం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించింది. అత్యంత కచ్చితత్వంతో కూడిన తన అయస్కాంత క్షేత్ర కొలతల ద్వారా ఈ అరుదైన సౌర దృగి్వషయాన్ని అంతరిక్షంలో పలు నిర్ధారిత ప్రాంతాల నుంచి అధ్యయనం చేయడంలో దోహదపడింది.
భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) మంగళవారం ఈ మేరకు వెల్లడించింది. ‘గానన్స్ స్టార్మ్ గా పిలుచుకుంటున్న ఆ సౌర తుపాను కరోనల్ మాస్ ఎజెక్షన్స్(సీఎంఈ) గా పిలిచే అతి భారీ సౌర పేలుళ్ల సమాహారం. సీఎంఈలు అత్యంత వేడిమితో కూడిన వాయు సమూహాలు. ఇవి చండ ప్రచండంగా భూమిని తాకినప్పుడు భూ అయస్కాంత క్షేత్రాన్ని కుదిపేస్తాయి. ఉపగ్రహాలు, జీపీఎస్‌తో పాటు పవర్ గ్రిడ్‌లను నష్టపరుస్తాయి.
2024 నాటి సౌర తుపాను తీవ్రత, అందుకు దారితీసిన పరిస్థితులపై భారత సైంటిస్టు బృందం కీలక పరిశోధన చేసింది. ఆ తుపాను మధ్యంలో మెలిదిరిగిన తాళ్లను పోలి ఉండే సౌర అయస్కాంత క్షేత్రం అక్కడక్కడ విరుగుతూ, తిరిగి కలిసిపోతూ సాగింది. ఈ అసాధారణతను మన బృందమే వెలుగులోకి తెచి్చంది. దీన్ని ప్రతిష్టాత్మక ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్ ప్రముఖంగా ప్రచురించింది. ఆదిత్య–ఎల్1 అనేది సౌర అధ్యయనం నిమిత్తం 2023లో భారత్ ప్రయోగించిన తొలి అంతరిక్ష మిషన్.


