నూతన సంవత్సర వేడుకల సమయంలో నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లోని చారిత్రక చర్చి భారీ అగ్నిప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించడంతో చర్చి భవనానికి తీవ్ర నష్టం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు.19వ శతాబ్దపు ఈ చర్చికి సంబంధించి 50 మీటర్ల (164 అడుగుల) టవర్ కూలిపోయింది. పైకప్పు తీవ్రంగా దెబ్బతింది
గురువారం తెల్లవారుజామున చారిత్రాత్మక వోండెల్కెర్క్ (వోండెల్ చర్చి)లో సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో ఉవ్వెత్తున అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. కొన్ని గంటల్లోనే, 154 సంవత్సరాల పురాతన స్మారక చిహ్నంలో భాగమైన చర్చి టవర్ పూర్తిగా కూలిపోవడం తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. మొత్తం నిర్మాణం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అగ్నిమాపక సిబ్బందికి మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. న్యూ ఇయర్ సంబరాల్లో మునిగితేలుతున్న నగరం అంతటా తీవ్ర గందర గోళం ఏర్పడింది. అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు లేదు. అయితే ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనేదిఇంకా తెలియరాలేదు.
వోండెల్కెర్క్ చర్చిని ఎపుడు నిర్మించారు?
1872లో వోండెల్కెర్క్ చర్చ్ నిర్మితమైంది. దీనిని ప్రసిద్ధ డచ్ ఆర్కిటెక్ట్ పియరీ క్యూపర్స్ రూపొందించారు. 1970లలో పునరుద్ధరించారు. 1977 వరకు రోమన్ కాథలిక్ చర్చిగా పనిచేసింది.
De 150 jaar oude monumentale #Vondelkerk vormde het hart van de door Cuypers, architect van oa het Rijksmuseum, ontworpen Vondelbuurt. 😥 pic.twitter.com/z8KmitkUji
— MaaikeDx 🖌 (@RembrandtsRoom) January 1, 2026


