
ఫీజు రాయితీ వస్తుందని వన్ ఇయర్ సబ్‌స్క్రిప్షన్, టూ ఇయర్స్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం కామన్. కానీ ఒక వ్యక్తి 300 ఏళ్ల సభ్యత్వం అంటూ కోటి రూపాయలు చెల్లించాడు. ఆనక లబోదిబో మన్నాడు. కమీషన్లకు కక్కుర్తి పడి ఏకంగా 300 ఏళ్లకు సభ్యత్వాన్ని తీసుకోవడం వింతగా నిలిచింది. విషయం ఏమిటంటే..
తూర్పు చైనాలోని ఒక వ్యక్తి జిమ్ కోసం 300 సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యేలా సభ్యత్వం తీసుకున్నాడు. ఈ కోచింగ్ సెషన్‌ల కోసం 870,000 యువాన్లు (సుమారు రూ. 1 కోటి) వెచ్చించాడు. వన్ ఫైన్ మార్నింగ్ జిమ్ తెరిచి ఉంది ఓనర్ మాత్రం పరార్. అయితే రిసెప్షనిస్టులు, ఇతర సిబ్బంది మాత్రమే ఉన్నారని జెజియాంగ్ టీవీ నివేదించింది. దీంతో జిమ్ యజమాని తన డబ్బుతో అదృశ్యమయ్యాడని గ్రహించిన జిన్ పోలీసులను ఆశ్రయించాడు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) నివేదిక ప్రకారం హాంగ్‌జౌలోని బింజియాంగ్ జిల్లాలోని రాంయన్ జిమ్‌లో మూడు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వెళ్లేవాడు. దీంతో మే నెలలో, ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ అతనికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు: 8,888 యువాన్లకు (సుమారు రూ. 1 లక్ష) ఒక సంవత్సరం సభ్యత్వాన్ని కొనుగోలు చేసి, దానిని దాదాపు రెట్టింపు ధరకు కొత్త కస్టమర్లకు తిరిగి అమ్ముకోవాలని డీల్ సెట్ చేశాడు. ఒక వేళ రెండు నెలల్లోపు కార్డులు అమ్మకపోతే మార్కప్‌లో 90 శాతం వాటా, పూర్తి వాపసు ఇస్తానని జిన్‌కు హామీ కూడా ఇచ్చాడు.
ఇదీ చదవండి: ఒత్తైన మెరిసే జుట్టు కోసం ఈ ఆయిల్ ట్రై చేశారా?
మొదట్లో ఒకటీ రెండు డీల్స్‌కు బాగానే వర్కౌట్ అయింది. ఈ కమిషన్ ఆశతో మే 10-జూలై 9 మధ్య మొత్తం 300 ఏళ్లకు చెల్లుబాటు అయ్యేలా కోటి రూపాయల విలువ చేసే కాంట్రాక్ట్స్‌పై సంతకాలు చేశాడు. ఒప్పందం ప్రకారం జూలై 15 నాటికి కొంత భాగాన్ని తిరిగి ఇవ్వాల్సిన సమయానికి ఏవేవో కుంటి సాకులు చెప్పడం మొదలు పెట్టారు. అలా జూలై చివరి నాటికి జిమ్ ఓనరే అదృశ్యమయ్యాడు. జిమ్ నిర్వహణ, అమ్మకాల బృందం అదృశ్యం కావడంతో జిన్‌కు జ్ఞానోదయమైంది. క్షణాల్లో డబ్బు వస్తుందని నమ్మి మోసపోయాను అంటూ స్థానిక మీడియాతో వాపోయాడు జిన్. జిన్ తన నష్టాన్ని భర్తీ చేసుకోవడంతోపాటు, ఇతరులను హెచ్చరించే ఉద్దేశంతో కోర్టులు, మీడియాను ఆశ్రయించాడు. ఈ కేసు చైనా ఫిట్‌నెస్ పరిశ్రమలో దూకుడు, వినియోగదారుల రక్షణ లేకపోవడంపై బహిరంగ చర్చకు దారితీసింది.
చదవండి: అమితాబ్ పరువు తీస్తోంది.. సిగ్గులేని మనిషి : జయపై కంగన ఫైర్