చైనాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై ట్రైన్ దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో 11మంది రైల్వే సిబ్బంది అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరికి గాయాలయినట్లు ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం చైనాలోని యున్నాన్ ప్రావిన్స్ కున్మింగ్ నగరంలో ఘోరరైలు ప్రమాదం జరిగింది. భూకంపాల గుర్తింపును పరీక్షిస్తున్న ఒక టెస్ట్ ట్రైన్, రైలు ట్రాక్ పై విధులు నిర్వహిస్తున్న రైల్వే సిబ్బందిపై పట్టాలు తప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారని, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ మీడియా సంస్థలు తెలిపాయి. దీంతో ఈ ప్రమాద ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.
ఈ రైలు ప్రమాదం దశాబ్ద కాలంగా చైనాలో జరిగిన రైలు ప్రమాదాలలో అతి పెద్దదని ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 2011లో చివరిసారిగా ఒక భారీ ట్రైన్ ప్రమాదం జరిగిందని ఆ ఘటనలో 40 మంది మృతిచెందగా 200 మందికి పైగా ప్రజలు గాయపడ్డట్లు అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి.
Train Crash in China Kills 11 After Test Engine Ploughs Into Maintenance Crew
The deadly incident occurred along a curved section of track at Luoyangzhen station in Kunming, the capital of Yunnan province, early on Thursday morning.
Two other workers were injured in the crash.… pic.twitter.com/gKNDQtNJFt— RT_India (@RT_India_news) November 27, 2025


