హాంకాంగ్ వాంగ్ హాక్ కోర్ట్ టవర్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 55కు చేరుకుంది. 70 మంది తీవ్రగాయాలపాలవగా , 237 మంది ఆచూకీ లభించడంలేదు. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులు అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు. ఇంత తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.
బుధవారం హాంకాంగ్ లోని వాంగ్ పుక్ కోర్ట్ టవర్స్ లో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 55 మంది దుర్మరణం చెందగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ప్రమాద ఘటనపై ఆదేశ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొత్తగా నిర్మిస్తున్న భవనాలలో ఇంత పెద్దఎత్తున మంటలు చెలరేగడానికి ఆ భవన మరమ్మత్తులో ఉపయోగిస్తున్న సామాగ్రి కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు.
భవన నిర్మాణం ప్రతి కిటికీలలో స్టైరోఫామ్ తో తయారు చేయబడిన వస్తువులను ఉపయోగించారని దాని కారణంగానే మంటలు ఇంత పెద్దఎత్తున వ్యాపించాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్టైరోఫామ్ అనేది పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్. దీనిని నిర్మాణరంగంలో, ఫుడ్ ప్యాకేజింగ్ లలో అధికంగా ఉపయోగిస్తారు. అయితే స్టైరోఫామ్ కు మండే స్వభావం అధికంగా ఉంటుంది. దీనికి మంటలు అంటుకుంటే అంత తేలికగా ఆర్పలేము.
ఉష్ణోగ్రత తక్కువ ఉన్న ప్రదేశాలలో కూడా ఇది అధికంగా మండుతుంది. అంతేకాకుండా ఇది మండుతున్నప్పుడు అధిక మోతాదులో కార్బన్ డై యాక్సైడ్ విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో భవన మరమ్మత్తులో ఇంత హానీకర వస్తువులను ఎందుకు ఉపయోగించారు అని పోలీసులు విచారణ చేపడుతున్నారు.
కాగా హాంకాంగ్ లోని అసోసియేయేట్ ప్రెస్ ప్రచురించిన నివేదిక ప్రకారం మరమ్మత్తులు చేపడుతున్న ఇంజినీరింగ్ కంపెనీ ఎటువంటి భద్రత ప్రమాణాలు పాటించలేదని నివేదించింది. హాంకాంగ్ లో నిన్న ప్రమాదం జరిగిన భవంతి 1980లో నిర్మించారు. ఆ టవర్స్ లో 2వేలకు పైగా అపార్ట్ మెంట్స్ ఉండగా 4వేలకు మందికి పైగా నివసిస్తున్నారు. ఇటీవల ఆ భవనాలకు మరమ్మత్తులు చేస్తుండగా ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.


