
వాషింగ్టన్:అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక కాలమానం ప్రకారం న్యూయార్క్ నగరంలో ఆదివారం ఉదయం 3.30గంటల సమయంలో జరిగిన కాల్పుల మోతతో న్యూయార్క్ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
స్థానికులు తెలిపిన వివరాల మేరకు న్యూయార్క్ సిటీ బ్రూక్లిన్ ప్రాంతంలోని క్రౌన్ హైట్స్‌లో ఉన్న ‘టేస్ట్ ఆఫ్ ది సిటీ లాంజ్’ అనే రెస్టారెంట్‌లోకి చొరబడ్డ అగంతకుడు కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఎనిమిదిమంది గాయపడ్డారు.
కాల్పులపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
కాల్పుల ఘటనపై న్యూయార్క్ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ జెస్సికా టిష్ స్పందించారు. కాల్పులకు తెగబడ్డ నిందితుల్ని అరెస్ట్ చేయలేదని తెలిపారు. ఘటన స్థలంలో కనీసం 36 బుల్లెట్ కేసింగ్స్‌ను సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా,ఈ కాల్పులు న్యూయార్క్ నగరంలో జరిగిన తీవ్రమైన కాల్పుల ఘటనల్లో ఒకటిగా భావిస్తున్నారు.