రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం | Heavy rain forecast for coastal districts Send feedback | Sakshi
Sakshi News home page

రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం

Published Tue, Jun 25 2024 5:25 AM | Last Updated on Tue, Jun 25 2024 5:26 AM

 Heavy rain forecast for coastal districts Send feedback

ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్, యానాంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగాళాఖాతంలో ఈ నెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతా­వరణ నిపుణులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం నెమ్మదిగా బలపడుతూ ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.

అదే రోజున అల్పపీడనం ఏపీ తీరాన్ని తాకనుంది. దీని ప్రభావంతో 26వ తేదీ సాయంత్రం నుంచి రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ముసురు వాతావరణం ఏర్పడనుంది. బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాలోలతో పాటు కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. 27, 28 తేదీల్లో అనేక చోట్ల విస్తారంగా వానలు కురుస్తాయని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement