అలర్ట్‌.. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి | Low Temperatures And Coldwave Grips In Telangana And AP, Single-Digit Temperatures Recorded In Many Areas | Sakshi
Sakshi News home page

Coldwave In Telugu States: అలర్ట్‌.. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి

Nov 13 2025 8:52 AM | Updated on Nov 13 2025 10:51 AM

Low temperatures And COLDWAVE GRIPS TELANGANA ANd AP

సాక్షి, విశాఖ/హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు గజగజా వణికిపోతున్నారు. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక, తెలంగాణలో పలు ప్రాంతాల్లో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

అల్లూరి జిల్లాలోని అరకులోయలో  భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గురువారం ఉదయం ఆరు గంటలకు  8 డిగ్రీలు, లంబసింగిలో 10, చింతపల్లిలో 12.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. పలు ప్రాంతాల్లో పొగ మంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శీతల గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. వీటి ప్రభావంతో కొమురం భీం- ఆసిఫాబాద్‌ జిల్లాలోని లింగాపూర్‌లో 6.8 డిగ్రీలు, సిర్పూర్‌లో 7.1 డిగ్రీలు, తిర్యానీలో 8.2 డిగ్రీల కనిష్ట​ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, హైదరాబాద్ శేరిలింగంపల్లి హెచ్‌సీయూ ప్రాంతంలో 11.8 డిగ్రీలు, ఇబ్రహీంపట్నంలో 11.5, రాజేంద్రనగర్‌లో 12.9, మారేడుపల్లిలో 13.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఉదయం పొగమంచు, చలిగాలులు, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ నెలలో సగటు ఉష్ణోగ్రతలు 13 నుంచి 17 డిగ్రీల మధ్య కొనసాగే అవకాశం ఉందన్నారు. రాబోయే వారం రోజులు ఇదే తరహా చలి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం- ఆసిఫాబాద్, నల్గొండ, భద్రాచలం, రామగుండం, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, పటాన్‌చెరు, నిజామాబాద్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ శివారు హయత్‌నగర్‌ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 26 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నా.. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రం అత్యల్పానికి పడిపోతాయన్నారు. చాలా ప్రాంతాల్లో 16 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement