సాక్షి,తాడేపల్లి: ముస్లిం మత పెద్ద ముఫ్తీ అబ్దుల్ వహాబ్ మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అ ట్వీట్‌లో ‘60 ఏళ్లకు పైగా ఇస్లాం ధర్మ ప్రచారానికి, విద్యకు అంకితమైన నెల్లూరుకు చెందిన ముఫ్తీ అబ్దుల్ వహాబ్ గారి మరణం ముస్లిం సమాజానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు.
60 ఏళ్లకు పైగా ఇస్లాం ధర్మ ప్రచారానికి, విద్యకు అంకితమైన నెల్లూరుకు చెందిన ముఫ్తీ అబ్దుల్ వహాబ్ గారి మరణం ముస్లిం సమాజానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/LMV96K43Bl
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 28, 2025


