సాక్షి హైదరాబాద్: సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆల్పైన్ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టుప్రక్కల వారు భయాందోళనలకు గురై అక్కడి నుండి పరుగులు తీశారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మంటలు తీవ్రంగా ఉండడంతో చుట్టుప్రక్కల ప్రాంతాల వారిని అధికారులు ఖాళీ చేయించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


