ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. మూడు రోజుల నుంచి ఉదయం నుంచే ఎండ ప్రభావం చూపిస్తోంది
నడినెత్తిన సూర్యుడు భగభగ మంటుండడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు
రోహిణీ కార్తెలో రోళ్లు పగులు తాయని పెద్దలు చెప్పిన మాట వాస్తవమన్నట్లుగా నిప్పుల కుంపటిలా ఎండ వేడి వేధిస్తోంది.
ఒక్కసారిగా 40 డిగ్రీలకు చేరుకుంది
కొద్దిసేపు ఫ్యాను తిరగకపోతే చెమటలతో దేహమంతా తడిసిపోతోంది
ఉదయం 6 గంటల నుంచే ఎండ వేడి మొదలవుతోంది. 10 గంటల కల్లా తీవ్రరూపం దాలుస్తోంది.
ఇదే పరిస్థితి మరి కొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందంటున్నారు


