ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ | Uttarakhand Cloudburst Rescue Operations Initiated In Affected Areas, More Details Inside | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్

Aug 29 2025 9:23 AM | Updated on Aug 29 2025 10:45 AM

Uttarakhand Cloudburst Rescue Operation Monsoon Weather

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా చమోలి, రుద్రప్రయాగ్ జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. వాతావరణశాఖ నుంచి సమాచారం అందుకోగానే ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని ‘ఎక్స్‌’లో తెలియజేస్తూ, బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించామని తెలిపారు.

భారీ వర్షాల నేపధ్యంలో స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించేలా విపత్తు కార్యదర్శి, జిల్లా మేజిస్ట్రేట్‌లకు అవసరమైన సూచనలు జారీ చేసినట్లు సీఎం ధామి తెలిపారు. రుద్రప్రయాగ్ జిల్లాలోని బుస్కేదార్ తహసీల్ పరిధిలోని బరేత్ దుంగర్ టోక్ ప్రాంతంలో, చమోలీ జిల్లాలోని దేవల్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా కొన్ని కుటుంబాలు ప్రమాదంలో చిక్కుకున్నాయని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు జరుగుతున్నాయన్నారు.
 

మరోవైపు దేవాల్‌లో  ఆకస్మిక వరదల్లో ఇద్దరు గల్లంతయ్యారని, పలు జంతువులు జల సమాధి అయ్యాయని చమోలీ జిల్లా మేజిస్ట్రేట్ సందీప్ తివారీ తెలిపారు. భారీ వర్షాల కారణంగా రోడ్లు మూసుకుపోయాయని, ఫలితంగా సహాయ చర్యలకు ఆలస్యమవుతున్నదన్నారు. బుధవారం సీఎం ధామి ఉత్తరకాశిలోని ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. రాష్ట్రంలో విపత్తు ప్రభావిత ప్రజలకు సహాయ ప్యాకేజీని  ప్రకటించారు. ఇంతలో, భారత వాతావరణ శాఖ ఉత్తరాఖండ్‌లోని చమోలి, పిథోరగఢ్, బాగేశ్వర్, చంపావత్,  ఉధమ్ సింగ్ నగర్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.  ఒక నిర్దిష్ట ప్రదేశంలో చాలా తక్కువ సమయంలో అకస్మాత్తుగా భారీ స్థాయిలో వర్షం కురవడాన్ని క్లౌడ్ బరస్ట్  అంటారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement