breaking news
Cloudburst
-
ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో క్లౌడ్ బరస్ట్
-
ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్.. రెడ్ అలర్ట్ జారీ
ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. సోమవారం అర్ధరాత్రి దాటాక నుంచి కురుస్తున్న కుంభవృష్టితో తమ్సా నది మహోగ్రరూపంతో ప్రవహిస్తోంది. దీంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. వరదల ధాటికి ఇద్దరు గల్లంతు కాగా.. వాళ్ల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. పలు నివాసాలు.. దుకాణ సముదాయాలు నీట మునిగి నాశనం అయ్యాయి. కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి.రాత్రి కురిసిన వానకు భారీగా వరద చేరడంతో తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం దగ్గర తమ్సా నది మహోగ్రరూపంతో ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో.. నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (DM) కుంకుమ్ జోషి పర్యవేక్షణలో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పీడబ్ల్యూడీ సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంతో ఇవాళ అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు సీఎం పుష్కర్ సింగ్ ధామీ అధికార యంత్రాంగం ద్వారా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 📍Uttarakhand | #Watch: Torrential rains cause the Tamsa River to overflow, submerging the Tapkeshwar Mahadev Temple in Dehradun📹: ANI/X pic.twitter.com/RPCN37x2k2— Ranveer Singh (@Ranveer6829) September 16, 2025మరోవైపు.. డెహ్రాడూన్ క్లౌడ్‌బరస్ట్‌తో రిషికేష్‌లోని చంద్రభాగా నది ప్రవాహం కూడా పెరుగుతోంది. దీంతో తీర ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. నదిలో చిక్కుకుపోయిన ముగ్గురిని రక్షించే ఎన్డీఆర్ఎఫ్ సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఇంకోవైపు.. పితోరాఘడ్ జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉత్తరకాశీ, చమోలీ, రుద్రప్రయాగ, పౌరీ, భాగగేశ్వర్, నైనిటాల్ జిల్లాల్లో ఈ వర్షాకాలం సీజన్లో క్లౌడ్ బరస్ట్‌లు సంభవించాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా ప్రకృతి విపత్తులతో 85 మంది మరణించగా.. 128 మంది గాయపడ్డారు. మరో 94 మంది ఆచూకీ లేకుండా పోయారు. సెప్టెంబర్ 11వ తేదీన ప్రధాని మోదీ డెహ్రాడూన్‌ను సందర్శించి.. సహాయక చర్యలను సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు 1,200 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. -
AP, TS: సెప్టెంబర్ నెలలోనూ దేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు
-
ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా చమోలి, రుద్రప్రయాగ్ జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. వాతావరణశాఖ నుంచి సమాచారం అందుకోగానే ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని ‘ఎక్స్’లో తెలియజేస్తూ, బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించామని తెలిపారు.భారీ వర్షాల నేపధ్యంలో స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించేలా విపత్తు కార్యదర్శి, జిల్లా మేజిస్ట్రేట్లకు అవసరమైన సూచనలు జారీ చేసినట్లు సీఎం ధామి తెలిపారు. రుద్రప్రయాగ్ జిల్లాలోని బుస్కేదార్ తహసీల్ పరిధిలోని బరేత్ దుంగర్ టోక్ ప్రాంతంలో, చమోలీ జిల్లాలోని దేవల్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా కొన్ని కుటుంబాలు ప్రమాదంలో చిక్కుకున్నాయని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు జరుగుతున్నాయన్నారు. जनपद रुद्रप्रयाग के तहसील बसुकेदार क्षेत्र के अंतर्गत बड़ेथ डुंगर तोक और जनपद चमोली के देवाल क्षेत्र में बादल फटने के कारण मलबा आने से कुछ परिवारों के फंसे होने का दुःखद समाचार प्राप्त हुआ है। स्थानीय प्रशासन द्वारा राहत और बचाव कार्य युद्धस्तर पर जारी है, इस संबंध में निरंतर…— Pushkar Singh Dhami (@pushkardhami) August 29, 2025మరోవైపు దేవాల్లో ఆకస్మిక వరదల్లో ఇద్దరు గల్లంతయ్యారని, పలు జంతువులు జల సమాధి అయ్యాయని చమోలీ జిల్లా మేజిస్ట్రేట్ సందీప్ తివారీ తెలిపారు. భారీ వర్షాల కారణంగా రోడ్లు మూసుకుపోయాయని, ఫలితంగా సహాయ చర్యలకు ఆలస్యమవుతున్నదన్నారు. బుధవారం సీఎం ధామి ఉత్తరకాశిలోని ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. రాష్ట్రంలో విపత్తు ప్రభావిత ప్రజలకు సహాయ ప్యాకేజీని ప్రకటించారు. ఇంతలో, భారత వాతావరణ శాఖ ఉత్తరాఖండ్‌లోని చమోలి, పిథోరగఢ్, బాగేశ్వర్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్లలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఒక నిర్దిష్ట ప్రదేశంలో చాలా తక్కువ సమయంలో అకస్మాత్తుగా భారీ స్థాయిలో వర్షం కురవడాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. Uttarakhand cloud burst: Rescue operation underway to find those missing after a cloudburst near Paligad-Silai Band in Tehsil Barkot of Uttarkashi district at around 2:12 am last night. #Uttarakhand #cloudburst #weather #Monsoon # #Uttarkashi pic.twitter.com/ur76OEVcbo— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) June 29, 2025 -
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. పలువురు గల్లంతు
చమోలీ: ఉత్తరాఖండ్‌ను మళ్లీ భారీ వరదలు చుట్టుముట్టాయి. తాజాగా చమోలీ జిల్లాలో థరలీలో కురిసిన భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. ఫలితంగా అనేక నివాస ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. లెక్కలేనన్ని వాహనాలు బురదలో కూరుకుపోయాయి. విద్యాసంస్థలను మూసివేశారు. వరదలు కారణంగా పలువురు గల్లంతైనట్లు సమాచారం. #WATCH | Uttarakhand: There is a possibility of a lot of damage due to the cloud burst in Tharali tehsil of Chamoli last night. A lot of debris has come due to the cloudburst, due to which many houses, including the SDM residence, have been completely damaged: Chamoli DM, Sandeep… pic.twitter.com/3kGNYRSMdG— ANI (@ANI) August 23, 2025ఈ విపత్తుపై సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తక్షణం వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని సహాయక చర్యలు మొదలుపెట్టాయి. వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘చమోలీ జిల్లాలోని థరాలి ప్రాంతంలో క్లౌడ్బరస్డ్ సంభవించింది. జిల్లా యంత్రాంగం, ఎస్డిఆర్ఎఫ్, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపడుతున్నారు. తాను స్థానిక పరిపాలన అధికారులతో నిరంతరం సంప్రదిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని’ అన్నారు#WATCH | Uttarakhand: There is a possibility of a lot of damage due to the cloud burst in Tharali tehsil of Chamoli last night. A lot of debris has come due to the cloudburst, due to which many houses, including the SDM residence, have been completely damaged: Chamoli DM, Sandeep… pic.twitter.com/3kGNYRSMdG— ANI (@ANI) August 23, 2025ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వర్షాల కారణంగా సంభవించిన విపత్తుకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక అనుసంధాన రహదారులు మూసుకుపోవడంతో ప్రజలు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంతలో ఆగస్టు 22 నుంచి 25 వరకు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పిథోరగఢ్, బాగేశ్వర్ జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. భారత వాతావరణ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం అతి స్వల్ప సమయంలో భారీ వర్షాలకు దారి తీయడాన్నే క్లౌడ్ బరస్ట్ అని అంటారు. -
జమ్మూకశ్మీర్ కిష్టవర్ లో భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య
-
Uttarakhand: క్లౌడ్ బరస్ట్.. షాకింగ్ వీడియో వైరల్
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ధరాలి గ్రామంపై ఒక్కసారిగా జల ప్రవాహం విరుచుకుపడటంతో ఊరంతా అతలాకుతలమైంది. హోటళ్లు, నివాస భవనాలు కొట్టుకుపోయాయి. ఆ గ్రామాన్ని ఒక్కసారిగా ముంచేసిన వరదలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు అద్భుతమైన రీతిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది."భాగ్ భాయ్ భాగ్, అరే భాగ్ భాగ్! (పరిగెత్తు.. పరిగెత్తు) అంటూ దూరం నుంచి అరుస్తున్నవారి మాటలు వీడియోలో వినిపిస్తాయి.. ఒక వ్యక్తి బురద నీటిలో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తుంది. కాగా, ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. 60 మంది గల్లంతయినట్లు చెబుతున్నారు.हर्षिल से झकझोर देने वाला दृश्य-मलबे में दबे जीवन की आखिरी कोशिश।एक व्यक्ति रेंगते हुए खुद को बचाने की जद्दोजहद में,तो दूसरा भागकर ऊपर चढ़ता दिखा।ऊपर से आवाज आई “उसे भी खींच लो!”लेकिन जब जान पर बनी हो,तो दूसरों की फिक्र बहुत पीछे छूट जाती है।#cloudburst #DisasterRelief pic.twitter.com/chvrssd1Fy— Adarsh Katiyar official (@Adarshkatiya) August 5, 2025ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. 150 మంది సైనికులను ఘటనాస్థలానికి పంపినట్లు ఆర్మీ తన అధికారిక ‘ఎక్స్’లో తెలిపింది. మరో వైపు స్థానిక పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. గ్రామం మొత్తం బురద నీటితో నిండిపోవడంతో సహాయక చర్యలకు అటంకం కలుగుతోంది. బురదను తొలగించి.. బాధితులను బయటకు తీసుకురాడానికి తీవ్రంగా శ్రమించవలసి వస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టి వర్షాలు కారణంగానే ఒక్కసారిగా వరద ప్రవాహం ముంచుకొచ్చినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. -
Himachal: వరదలతో అతలాకుతలం.. 18 మంది మృతి, 37 మంది గల్లంతు
ముంచెత్తుతున్న వరదలతో హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి దారుణంగా తయారయ్యింది. వరదల కారణంగా 18 మంది మృతిచెందగా, 37 మంది గల్లంతయ్యారు. తాజాగా రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంటూ వరద హెచ్చరికలు జారీ చేసింది.రాష్ట్రంలోని బిలాస్పూర్, హమీర్పూర్, కులు, కాంగ్రా, మండీ, సోలన్, సిమ్లా, సిర్మౌర్ జిల్లాలలో ఆగస్టు 7 నుండి 10 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో ఉనాలో 40.2, బిలాస్పూర్లో 25.8, సిమ్లాలో 19, కుఫ్రీలో 13.4, పాంటా సాహిబ్‌లో 12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో తలెత్తిన ప్రతికూల పరిస్థితుల కారణంగా 53 రహదారులలో రాకపోకలను నిలిపివేశారు.సిమ్లా, కులు, మండి జిల్లాల్లోని ఏడు చోట్ల వరదల కారణంగా పలువురు గల్లంతుకాగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. అలాగే రాంపూర్‌లోని సమేజ్ నుండి సట్లెజ్ కాలువలోకి కొట్టుకుపోయిన ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. సిమ్లాలోని రాజ్‌భవన్ నుంచి కులు జిల్లాకు రెండు సహాయ సామగ్రి వాహనాలు తరలివెళ్లాయి. -
కాశ్మీర్‌లోయలో కుండపోత.. అమర్నాథ్ యాత్ర నిలిపివేత
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని గండేర్బల్ జిల్లాలో ఆదివారం(ఆగస్టు4) కుండపోత(క్లౌడ్‌బర్స్ట్) వర్షం కురిసింది. దీంతో శ్రీనగర్-లేహ్ జాతీయరహదారికి దారి తీసే ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ రోడ్డును తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. శ్రీనగర్- లేహ్ జాతీయరహదారిపైనా ట్రాఫిక్‌ను రద్దు చేయడంతో బల్టాల్ వద్ద అమర్నాథ్ యాత్రికులు చిక్కుకుపోయారు. దీంతో యాత్ర మధ్యలోనే నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన ఆకస్మిక వరదల కారణంగా పలు ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. -
హిమాచల్: వరద బాధితులకు తక్షణ సాయం రూ. 50 వేలు
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు ఎనిమిదిమంది మృతిచెందారు. 50 మంది గల్లంతయ్యారు. తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.సిమ్లా జిల్లాలోని సమేజ్, రాంపూర్, కులులోని బాఘిపుల్, మండిలోని పద్దర్లలో భారీ వర్షాలు కురిసి విధ్వంసం సృష్టించాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శి డీసీ రాణా తెలిపారు. భారీ వర్షాలకు 53 మంది గల్లంతయ్యారని తెలిపారు. ఆరు మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. 60కి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్లు సిమ్లా, కులు జిల్లాల్లో పర్యటించి వరద బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బాధితులకు తక్షణ సాయంగా రూ.50వేలు ఇస్తామని ప్రకటించారు. అలాగే వచ్చే మూడు నెలల పాటు నెలకు రూ.5వేలు చొప్పున ఇస్తామని, వంటగ్యాస్, ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులను కూడా అందజేస్తామని తెలిపారు. #WATCH | Shimla: On Himachal Pradesh disaster, Special Secretary, Disaster Management DC Rana says, "A cloudburst in the Samej area of Shimla district, Rampur region, Baghipul area of Kullu, and Paddar area of Mandi has led to widespread destruction. 53 people are missing and six… pic.twitter.com/s0CAl1Me4e— ANI (@ANI) August 3, 2024 -
సిక్కిం వరదలు..18కి చేరిన మరణాలు
గ్యాంగ్‌టక్: సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 14కు చేరుకుంది. అదేవిధంగా, 22 మంది ఆర్మీ అధికారులు సహా గల్లంతైన వారి సంఖ్య 98కు పెరిగింది. ఉత్తర సిక్కింలో తీస్తా నదీ పరీవాహక ప్రాంతంలోని ఎల్‌హొనాక్ సరస్సు ఉప్పొంగి సంభవించిన వరదల్లో గల్లంతైన మరో ఆరుగురి మృతదేహాలు లభ్యం కావడంతో మరణాల సంఖ్య 18కు చేరుకుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎస్‌ఎస్‌డీఎంఏ) గురువారం బులెటిన్‌లో తెలిపింది. ఇప్పటివరకు 2,011 మందిని కాపాడినట్లు పేర్కొంది. గల్లంతైన 22 మంది జవాన్ల ఆచూకీ కోసం దిగువ ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని వివరించింది. ఇలా ఉండగా, వరదల్లో కొట్టుకువచ్చిన 18 మృతదేహాల్లో నాలుగు జవాన్లవని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. ఇవి సిక్కింలో గల్లంతైన జవాన్ల మృతదేహాలా కాదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలతో చుంగ్థంగ్ డ్యామ్ ధ్వంసం కావడం.. విద్యుత్ మౌలిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతినడంతోపాటు నాలుగు జిల్లాల్లోని పలు గ్రామాలు, పట్టణాలు జల దిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. మంగన్ జిల్లాలోని 8 వంతెనలు సహా మొత్తం 11 బ్రిడ్జీలు వరదల్లో కొట్టుకుపోయాయి. రాష్ట్రానికి గుండెకాయ వంటి పదో నంబర్ రహదారి పలుచోట్ల ధ్వంసమైంది. చుంగ్థంగ్ పట్టణం తీవ్రంగా దెబ్బతింది. తీస్తా నదికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలున్నందున, పరీవాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని ఎస్‌ఎస్‌డీఎంఏ కోరింది. సిక్కింలోని వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకుపోయిన వేల మంది పర్యాటకుల్లో విదేశీయులూ ఉన్నారు. -
సిక్కిం కుంభవృష్టి.. 102 మంది మిస్సింగ్
గాంగ్టక్: భారీ వర్షాలు, వరదలతో సిక్కిం రాష్ట్రం వణికిపోతోంది. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు పరివాహాక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా తీస్తా నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో తీర ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాలు, వరదల ధాటికి ఇప్పటి వరకు 14 మంది పౌరులు మరణించారు. 22 మంది ఆర్మీ సిబ్బందితో సహా మొత్తం 102 మంది గల్లంతయ్యారని అధికార వర్గాలు వెల్లడించాయి. వారి ఆచూకీ కనిపెట్టేంందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. మరో 25 మంది క్షతగాత్రులు సహా వరదల్లో చిక్కుకున్న 45 మందిని రక్షించామని తెలిపాయి. ⚡️⚠️ 𝐄𝐍𝐃 𝐓𝐈𝐌𝐄 𝐒𝐂𝐄𝐍𝐀𝐑𝐈𝐎⚠️⚡️ 𝐃𝐞𝐯𝐚𝐬𝐭𝐚𝐭𝐢𝐧𝐠 𝐟𝐥𝐨𝐨𝐝 𝐢𝐧 𝐒𝐢𝐤𝐤𝐢𝐦,𝐈𝐧𝐝𝐢𝐚 As many as 10 civilians have died and 82 people, including 22 Army personnel, are missing after a cloudburst over the Lhonak Lake in north Sikkim caused it to overflow,… pic.twitter.com/rBOrPhUjkK — {Matt} $XRPatriot (@matttttt187) October 5, 2023 కూలిన 14 వంతెనలు సింగ్తామ్ వద్ద వరద ప్రవాహంలో మొత్తం 23 మంది ఆర్మీ జవాన్లు కొట్టుకుపోగా బుధవారం సాయంత్రం నాటికి ఓ సైనికుడిని సహాయక బృందాలు రక్షించాయి. రాష్ట్రంలో 14 వంతెనలు కూలిపోయాయి. వివిధ ప్రాంతాల్లో దాదాపు 3000 మంది పర్యాటకులు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత వరద బీభత్సం ప్రారంభమైంది. బుధవారం చుంగ్‌థాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో పరిస్థితి మరింత భీతావహంగా మారిందని తెలియజేశాయి. सिक्किम में सेना के 23 जवान लापता। उत्तरी सिक्किम में अचानक बादल फटने से तीस्ता नदी में बाढ़ आ गई। अचानक आई इस बाढ़ के कारण सेना के 23 जवान लापता हो गए हैं। खोज एवं बचाव अभियान जारी है। ईश्वर से सभी की कुशलता के लिए प्रार्थना 🙏🏽#sikkimflood#IndianArmy#TeestaRiver#Sikkim pic.twitter.com/Gy7Nv1ooZP — JAGDISH PALIWAL (@JAGDISH_BAP) October 5, 2023 లోతట్టు ప్రాంతాలు జలమయం రాజధాని గాంగ్టక్కు 30 కిలోమీటర్ల దూరంలోని సింగ్తామ్ ఉక్కు వంతెన బుధవారం తెల్లవారుజామున పూర్తిగా కొట్టుకుపోయిందంటే వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు నీట మునిగాయి. రహదారులపై రాకపోకలు స్తంభించాయి. సిక్కిం రాష్ట్రాన్ని దేశంలోని ఇతర భూభాగంతో అనుసంధానించే పదో నెంబర్ జాతీయ రహదారి పలుచోట్ల పూర్తిగా ధ్వంసమైంది. People being rescued and taken to a safe shelter. They didn’t have any say in large infrastructure project, but pay the price of the disaster. #Sikkim pic.twitter.com/KdKu3yIOdT — Aparna (@chhuti_is) October 4, 2023 జనం అప్రమత్తంగా ఉండాలని సూచన వర్షాలు, వరద విలయాన్ని సిక్కిం ప్రభుత్వం ప్రకృతి విపత్తుగా ప్రకటించింది. మాంగాన్, గాంగ్టక్, పాక్యోంగ్, నామ్చీ జిల్లాల్లో పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 8 దాకా సెలవు ప్రకటించింది. ఉత్తర బెంగాల్‌కు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. తీస్తా నది ప్రవాహ ప్రాంతాల్లో జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చుంగ్తాంగ్లోని తీస్తా స్టేజ్ 3 డ్యామ్ వద్ద పనిచేస్తున్న దాదాపు 14 మంది కార్మికులు ఇప్పటికీ టన్నెల్లో చిక్కుకొని ఉన్నారు. చుంగ్‌తాగ్, ఉత్తర సిక్కింలో చాలా వరకు మొబైల్ నెట్‌వర్క్‌లు, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లకు అంతరాయం ఏర్పడింది.. చుంగ్తాంగ్లోని పోలీస్ స్టేషన్ కూడా ధ్వంసం అయ్యింది. #earthquake #GayatriJoshi #SikkimCloudburst #SanjaySinghArrested #ElvishYadav #AishwaryaRai #ChampionsLeague 14 Dead, 102 Missing In Sikkim Flash Flood, Missing Armyman Rescued Over 3,000 tourists are feared stranded, said a government official. The Army said it has rescued… pic.twitter.com/AleFmJgiL3 — shakir Berawala (@shakirBerawala) October 5, 2023 -
సిక్కింలో ఆకస్మిక వరదలు.. గల్లంతైన జవాన్లలో ముగ్గురి మృతదేహాలు లభ్యం
Update: ఆకస్మిక వరదలు సిక్కిం రాష్ట్రాన్ని అల్లాడించాయి. కుండపోత వాన, వరదతో రెండు జిల్లాలు అల్లకల్లోలంగా మారాయి. గల్లంతైన 23 మంది జవాన్లలో ముగ్గురి మృతదేహాలను సహాయక సిబ్బది గుర్తించింది. మిగిలిన వారికోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది, ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఒక్కసారిగా భారీ వరదలు ముంచెత్తాయి. లాచెన్లోయలో మంగళవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి తీస్తానదిలో అకస్మాత్తుగా వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో అక్కడి ఆర్మీ శిబిరాలపై వరదల ప్రభావం పడింది. ఊహించని రీతిలో వరదలు పోటెత్తడంతో 23 మంది భారత జవాన్లు గల్లంతైనట్లు రక్షణశాఖ వెల్లడించింది. ఆర్మీ అధికారుల వాహనాలు కూడా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు పేర్కొంది. ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సు పరివాహాక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ వల్ల తీస్తా నది నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో ఈ వరద ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమైనదిగా మారింది. దీనివల్ల దిగువకు 15 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు నీటి మట్టం పెరిగింది. దీంతో అర్ధరాత్రి సమయంలోఈ అకస్మిక వరదలు సంభవించాయి. ఆకస్మిక వరద లాచెన్ లోయలో ఉన్న ఆర్మీపోస్టులకు కూడా నష్టం కలిగించింది. సింగ్తమ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వరద తీవ్రతకు 23 మంది సిబ్బంది గల్లంతైనట్లు ఈస్ట్రన్ కమాండ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. Shocking News A sudden #cloudburst over #Lhonak Lake in North #Sikkim led to flooding in Teesta river. In which 23 army soldiers went missing. Search and rescue operations are underway. Praying to God for everyone's well being 🙏🏽 #earthquake #teesta #Elvisha #TejRan pic.twitter.com/k9YdYMtXeh — Rocky Yadav (@YadavYadavrocky) October 4, 2023 తీస్తా నది పొంగి ప్రవహించడంతో సింగ్తమ్ ఫుట్ బ్రిడ్జి కూలిపోయింది. పశ్చిమ బెంగాల్‌ను సిక్కింను కలిపే 10వ నెంబర్ జాతీయ రహదారి పలు చోట్లకొట్టుకుపోయింది. ఆకస్మిక వరదల నేపథ్యంలో చాలా రోడ్లు, రహదారులు దెబ్బతిన్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. #WATCH | Sikkim: A flood-like situation arose in Singtam after a cloud burst. (Video source: Central Water Commission) pic.twitter.com/00xJ0QX3ye — ANI (@ANI) October 4, 2023 -
'కుంభవృష్టికి కారణం.. జంతు హింసే..'
డెహ్రాడూన్: మాంసం కోసం జంతువులను చంపడం వల్లే హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడుతున్నాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మండి డైరెక్టర్ లక్ష్మీధర్ బెహెరా అన్నారు. ఈ కారణంగానే కుంభవృష్టి వంటి విపత్తులు సంభవిస్తున్నాయని ఆయన చెప్పారు. జంతువులను చంపడం వల్లే పర్యావరణ అసమతుల్యత ఏర్పడుతుందని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మాంసం కోసం జంతువులను చంపడం వల్ల పర్యావరణం ఎలా ప్రభావితమౌతుందో ప్రస్తుతం ప్రజలు చూడలేకపోతున్నారని బెహెరా చెప్పారు. కానీ త్వరలో ఈ పరిణామాలు స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు. ప్రసంగంలో మంచి మనుషులుగా మారడానికి ఏం చేయాలని బెహెరాను కొందరు విద్యార్థులు అడిగారు. ఇందుకు మాంసం తినడం మానేయాలని బెహెరా చెప్పారు. ఈ సందర్భంలోనే రాష్ట్రంలో విపత్తులు జంతువులను చంపడం వల్లనే వస్తున్నాయని అన్నారు. విద్యార్థుల చేత మాంసం తినడం మానేసేలా జపించాలని కోరారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మాంసం తినడానికి అతి వర్షాలకు సంబంధం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల వరదలు బీభత్సం సృష్టించాయి. నదులు పొంగి ప్రవహించాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 250 మంది వరకు మరణించారు. రూ.2,913 కోట్ల నష్టం జరిగిందని ప్రభుత్వం పేర్కొంది. ఇదీ చదవండి: G20 Summit:ఢిల్లీలో భారీ భద్రత.. ట్రాక్టర్‌పై పోలీసుల పెట్రోలింగ్ -
హిమాచల్ ప్రదేశ్‌లో జల ప్రళయం.. 29 మంది మృతి..
సిమ్లా: ఎడతెరిపిలేని వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ వణికిపోతోంది. గతకొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు కూడా విరిగిపడుతున్నాయి. తాజాగా సోలాన్ జిల్లాలోని మామిసిఘ్ గ్రామంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. గత 24 గంటల్లో వివిధ ఘటనల్లో వర్షాల కారణంగా 29 మంది మరణించారని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి గ్రామంపైకి దూసుకొచ్చాయి. ఈ ఘటనలో రెండు ఇళ్లు, పశువుల పాకలు కూలిపోయాయి. ఏడుగురు మృతి చెందారు, మరో ఆరుగుర్ని రక్షించామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ సంతాపం తెలిపారు. ఘటనస్థలంలో సహాయక చర్యలు చెపట్టాలని అధికారులను ఆదేశించారు. 16 Killed, Many Feared Trapped As Monsoon Fury Returns To Himachal Read here: https://t.co/5bjrcB342e pic.twitter.com/k3QM3rfryM — NDTV (@ndtv) August 14, 2023 తీవ్రంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఆగష్టు 14న నిర్వహించనున్న పీజీ, బీఈడీ పరీక్షలను రద్దు చేశారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే వర్షాలతో రాష్ట్రంలో 257 మంది మృతి చెందారు. రూ.7,020 కోట్ల నష్టం జరిగిందని వెల్లడించారు. కాగా.. 32 మంది తప్పిపోయారు. 290 మంది గాయపడ్డారు. శివ మందిర్ కూలి.. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో సిమ్లాలో శివ మందిర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. శ్రావణమాసం సందర్భంగా ప్రార్థనల కోసం భక్తులు గుమికూడారని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ తెలిపారు. ఈ క్రమంలో మందిరం కూలిపోగా.. భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేస్తోంది. శిథిలాలను తొలగిస్తున్నారు. Rescue Operations Underway As Temple Collapses Due To Landslide In Shimla pic.twitter.com/WJYBNXVchQ — NDTV (@ndtv) August 14, 2023 ఉత్తరాఖండ్‌లోనూ.. ఉత్తరాఖండ్‌లోనూ వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. దీంతో పలు నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. బాదల్ నది ప్రవాహాంలో డెహ్రాడూన్‌లోని మాల్దేవత ప్రాంతంలో ఉన్న డిఫెన్స్ కాలేజ్ కూలిపోయింది. ఈ దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. కాగా.. రాష్ట్రంలో ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో ఇప్పటివరకు 60 మంది మరణించారు. 17 మంది తప్పిపోయారు. #WATCH | A college building collapsed due to incessant rainfall in Dehradun, Uttarakhand. (Source: Dehradun Police) https://t.co/i4dpSQs2MH pic.twitter.com/1XhTLTafCi — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 14, 2023 వర్షాలతో తెహ్రీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. రిషికేష్- చంభా జాతీయ రహదారిలో రాకపోకలు నిలిపివేశారు. రిషికేష్- దేవప్రయాగ జాతీయ రహదారిలో వాహనాలు ఎక్కడిక్కడే నిలిపివేశారు. 1,169 ఇళ్లు నేలమట్టమయ్యాయి. పంటపొలాలు ధ్వంసమయ్యాయి. ఇదీ చదవండి: Dwarka Expressway: ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వ్యయంపై కాగ్ సంచలన వ్యాఖ్యలు -
చైనా: కరువుపై మేఘమథన అస్త్రం!
చాంగ్కింగ్(చైనా): దక్షిణ చైనాలో కరువు ఉరుముతోంది. ఎండలు మండిపోతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. నదుల్లో నీరు లేక విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతోంది. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని, ఏసీలు వాడొద్దని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. కరెంటు లేక ఫ్యాక్టరీలకు తాళాలు వేయాల్సి వస్తోంది. రిజర్వాయర్లలో నీరు అడుగంటుతోంది. తాగునీరు కూడా సరఫరా కావడం లేదు. కరువు నేపథ్యంలో కొన్నిచోట్ల అత్యవసర పరిస్థితిని సైతం ప్రకటించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కరువు సమస్యను అధిగమించడానికి మేఘ మథనంపై చైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మేఘాలపై రసాయనాలు వెదజల్లి, వర్షాలు కురిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. సిచువాన్, హూబే ప్రావిన్స్‌ల్లోనూ ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు చేతికి రాకుండా పూర్తిగా ఎండిపోయాయి. మిగిలిన ప్రాంతాల్లో పంటలను కరువు బారినుంచి కాపాడుకోవాలన్నదే తమ ప్రయత్నమని పేర్కొంది. చైనాలో వర్షపాతం, ఉష్ణోగ్రతలను ప్రభుత్వం అధికారికంగా రికార్డు చేసే ప్రక్రియ 61 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యింది. ఇప్పటినుంచి ఇప్పటిదాకా చూస్తే ఈ ఏడాదే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా సిచువాన్ ప్రావిన్స్‌లో 45 డిగ్రీల సెల్సియస్(113 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదయ్యింది. దక్షిణ చైనాలో వరిసాగు అధికం. పంట దెబ్బతినకుండా కాపాడుకోవడానికి రాబోయే 10 రోజులు చాలా కీలకమని వ్యవసాయ శాఖ మంత్రి టాంగ్ రెంజియాన్ చెప్పారు. ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసే అవకాశం లేదు. దాంతో చైనా సర్కారుకు ఇప్పుడు మేఘమథనం (క్లౌడ్ సీడింగ్) ఒక ప్రత్యామ్నాయంగా మారింది. డ్రోన్ల సాయంతో మేఘాలపై రసాయనాలు చల్లి, కృత్రిమంగా వర్షాలు కురిపించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా, ఉత్తర చైనాలో మాత్రం వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కింగాయ్ ప్రావిన్స్‌లో వరదల కారణంగా 26 మంది మృతిచెందారు. ఐదుగురు గల్లంతయ్యారు. -
గ్లూమీ.. గ్లూమీ సార్లు మస్తుగున్నరు
ఇప్పుడు మనం ఓ గాడిద కథ చెప్పుకుందాం.. ప్రాచీన గ్రీసు దేశంలో డెమాస్తనీస్కు మహావక్తగా మంచి పేరుండేది. ఆయనోసారి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పన్నులు.. ఇలా చెప్తుంటే జనంలో కాస్త అలజడి, గందరగోళం కనిపించాయి. వాళ్ల అనాసక్తి గ్రహించిన డెమాస్తనీస్.. వెంటనే ప్రసంగం ఆపి మీకు ఒక కథ చెబుతాను వినండి అంటూ మొదలుపెట్టాడు. ‘‘ఇద్దరు వ్యక్తులు వేసవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒకడి దగ్గర గాడిద ఉంది. మరొకడికి దాని అవసరం ఉంది. దాన్ని అమ్ముతావా అని అడిగాడు. ఇద్దరూ మాట్లాడు కున్నారు. బేరం కుదిరింది. అమ్మకం అయిపోయింది.. వారు వాళ్ల ప్రయాణం కొనసాగిస్తున్నారు. అసలే వేసవి ఎండ ఎక్కువగా ఉండి.. ఓ దగ్గర ఆగారు. గాడిద నిలబడి ఉండగా దాని నీడలో అమ్మిన వ్యక్తి కూర్చున్నాడు. కొన్నా యనకు మండుకొచ్చింది. కొనుక్కున్న నేను ఎండలో ఉండాలి అమ్మినవాడు నీడలోకూర్చుంటాడా? అని ఆర్గ్యు చేశాడు. ‘నువ్వు లే నేను కూర్చుంటా’నని గదమాయించాడు. చదవండి: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. అమ్మిన వ్యక్తి బాగా తెలివైన వాడు.. ‘నేను గాడిదను అమ్మాను గానీ నీడను కాదు.. నీడ నాదే..’ అంటూ తన లాజిక్ వదిలాడు.. ఇంకేం తగువు మొదలైంది. నలుగురూ చుట్టూ చేరారు. వాదులాట పెరిగింది. గాడిద–నీడ సమస్య పరిష్కరించడంలో అందరూ మునిగిపోయారు’’ అని చెప్పడం ఆపేశాడు డెమాస్తనీస్. వింటున్న జనంలో ఆసక్తి మొదలైంది. వాళ్లలో వాళ్లు గాడిద గొడవపై మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ పరిష్కారమేమైంది? ఏం తేల్చారు? అని డెమాస్తనీస్ను అడగడం మొదలుపెట్టారు. అసలు తమ బతుకు సంగతి చెబితే పట్టని జనం గాడిద గొడవ చర్చించడం చూసి డెమాస్తనీస్ నవ్వి ఊరుకున్నాడు. ఆ గాడిద గొడవ తేలేది కాదు కాబట్టి, మనమూ వదిలేద్దాం. జనాన్ని మనకు అనుకూలమైన చర్చ వైపు నెట్టడమే కదా.. మంచి వక్త నేర్పరితనం. చుట్టూ వరదలున్నా గ్లూమీ.. గ్లూమీ సమాచారంతోనైనా మనకు ఇష్టమైన దారిలోకి ‘మంద’ను మళ్లించడమే కదా.. అసలైన పొలిటీషియన్ టెక్నిక్.. చర్చ గాడిదల వైపు కావచ్చు.. విదేశీ కుట్రల వైపూ కావచ్చు.. జనం ‘కళ్ల నిండా కాళేశ్వరం’ చూసి కంగారు పడో, కడుపు మండో ‘విదేశీ కుట్ర’ అని ఒక మాట అనరా.. బరాబర్ అంటారు ఆయన.. ఇంకా ‘విదేశీ కుట్ర’ అన్నారాయన. ఈ విషయంలో సొంత ప్రభుత్వంపైన అనుమానాలున్నవారు కూడా ఉన్నారు. ఇట్లా రండి అలా సోషల్ మీడియాలో దూరుదాం.. సిడ్నీ.. స్వదేశీ కుట్ర కొద్దిరోజుల క్రితం.. సిడ్నీలో భారీ వర్షాలు పడ్డాయి. ఎంతగా అంటే ఎనిమిది నెలల వర్షం నాలుగు రోజుల్లో దంచేసింది. సహజంగానే పెను నష్టం వాటిల్లింది. ఇంకేం రకరకాల సిద్ధాంతాలు నిద్ర లేచాయి. ప్రభుత్వం చేపట్టిన ‘క్లౌడ్ సీడింగ్’ దానికి కారణమని ప్రచారమైంది. ఆ స్థాయిలో వర్షాలు తెచ్చే క్లౌడ్ సీడింగ్ భౌతికంగా, ఆర్థికంగా సాధ్యం కాదని గవర్నమెంట్ చెప్పినా.. అ వాయిస్ జనానికి చేరేలోపు.. లక్షల్లో వ్యూస్ నమోదయ్యాయి. రాడార్ చిత్రాలు, మేఘాలలో వింత ఆకారాల ఫొటోలు.. విమానం ఎగరడాలు.. ఇలా ఏవేవో ఆధారాలు చూపుతూ.. అది ప్రభుత్వం ప్రజలపై వేసిన ‘వెదర్ బాంబే..’ అనేయడం మొదలుపెట్టారు. ఇదంతా న్యూస్ చానళ్లలో, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. వాతావరణ నిపుణులు శాస్త్రీయ కారణాలు చెప్పినా ఎవరూ వినలేదు.. అంతా అధికార పక్షం చేసినదేంటూ ఢంకా బజాయించారు... దీనికన్నా మనం విన్న ‘విదేశీ కుట్రే’ నయం కదా.. థాయ్‌లాండ్.. వరద రాజకీయాలు 2011లో ఇక్కడ వచ్చిన వరదలు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ‘నష్టం’గా పేర్కొంటారు. జూలై నుంచి అక్టోబర్ వరకు వరదలు కొనసాగాయి. జనవరి 2012 వరకు కూడా అక్కడక్కడా కొన్ని ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు.. ఆ వరదల ప్రభావం ఎంతో. ఆ వరదలు బ్యాంకాక్‌ను కూడా చుట్టుముట్టాయి. 20వేల చదరపు కిలోమీటర్ల మేర పంట పొలాలు నీట మునిగాయి. 13.6 మిలియన్ల జనాభా ముంపు ప్రభావానికి లోనయింది. అనేక పరిశ్రమలు నీట మునిగాయి. లక్షన్నరకుపైగా వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆర్థికంగా జరిగిన నష్టం 46.5 బిలియన్ డాలర్లు.. ఇంత విధ్వంసానికి కారణం ‘ప్రకృతి ప్రకోపం’ అన్న పాయింట్ పక్కకుపోయింది.. చర్చలన్నీ రాజకీయం చుట్టే తిరిగాయి. ఎందుకంటే అచ్చంగా ఎన్నికల ప్రచార సమయంలో వరదలు వచ్చాయి. ‘తాము ఎలాగూ ఓడిపోతామని తెలిసిన అధికార పక్షం డ్యాములను ఖాళీ చేయకుండా ఊరుకుందనీ.. తర్వాత వానలతో డ్యాములన్నీ నిండా మునిగి ఊర్లకు ఊర్లు నీటిలో కొట్టుకుపోయాయని విపక్షం వాదనకు దిగింది. ‘వరదల పెను నష్టంతో రానున్న ప్రభుత్వానికి ఊపిరి ఆడకుండా చేయాలని.. రాజకీయంగా తమను, ఆర్థికంగా ప్రజలను కుదేలు చేయాలనే కుట్రతోనే ఇదంతా జరిగిందని..’ ప్రతిపక్షం గగ్గోలు పెట్టింది. కొన్నేళ్ల పాటు ఆ దేశంలో ఈ చర్చ జరిగింది.. ‘‘అధికార పక్షానికి అంత తెలివి లేదు. వరదలను సరిగ్గా మేనేజ్ చేయకపోవడం వల్లే ఈ దురవస్థ’’ అని అక్కడి వామపక్ష మేధావులు చెప్పినా ఎవరూ వినలేదు. విపక్షాలపై కుట్రతోనే తమ ప్రజలకు భారీ నష్టాన్ని కలిగించారని బలమైన వాదన జనంలోకి పోయింది. ..ఇదీ స్వదేశీ వరద రాజకీయమే. అవకాశం రావాలేగానీ.. వరదలు, విపత్తులు, మహమ్మారులు వేటినీ వదలడం లేదు. కుట్ర కోణాలు, రాజకీయాలు, సొంత అవసరాలు వాటిని అంటుకునే తిరుగుతున్నాయి. 2011లో జపాన్‌లో తారస్థాయిలో వచ్చిన భూకంపం ఏకంగా సునామీనే సృçష్టించింది. 30 అడుగుల ఎత్తుతో అలలు ఎగిసిపడి.. ఫుకుషిమా పవర్ ప్లాంట్‌లో ‘అణు’ ప్రమాదానికి దారి తీసింది. ఇదంతా ప్రకృతి విలయంగా ప్రపంచం భావిస్తుండగా.. ‘ఠాట్!.. అంతా తప్పు. దీనికి ఇజ్రాయెల్ చేసిన అణు విస్పోటనమే కారణమని.. ఇరాన్ కోసం çజపాన్ యురేనియం శుద్ధి చేయకుండా అడ్డుకునే పనే’నని జపాన్‌లో బాగా నమ్మిన వారున్నారు. 2004లో ఇండోనేసియాలో 9.1–9.3 తీవ్రతతో భూకంపం, సునామీ వచ్చినప్పుడు 14 దేశాల్లో 2,27,000 మందికిపైగా మరణించారు. ఇదంతా అమెరికా అధ్యక్షుడి పనేనని ప్రచారమైంది. తూర్పు ఆసియా ప్రాంత ఆర్థిక ప్రగతిని తగ్గించడానికి అమెరికా చేసిన పనేనని బలంగా నమ్మారు. అక్కడ కనిపించిన అమెరికా యుద్ధనౌకను ఆధారంగా చూపారు. గతంలో ఎప్పుడూ అక్కడ భూకంపాలు రాలేదని నిరూపించే ప్రయత్నం చేశారు.. ఇలాంటి సిద్ధాంతాలకు వందలకొద్దీ ఆధారాలు (?) గుప్పించడం కూడా సామాన్య జనానికి అది నిజమేనని అనిపించేలా చేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం నాటి అమెరికా అణుబాంబు ఇప్పుడు పేలిందని కొందరు అనుమానాలు వ్యక్తీకరించారు. పాకిస్తాన్ టార్గెట్‌గా ఇండియా చేస్తున్న అణు పరీక్షలే దానికి కారణమని మనవైపూ అనుమానంగా చూసినవారూ ఉన్నారు. .. చివరికి భూమి భ్రమణాన్ని మార్చేందుకు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారని నమ్మి ప్రచారం హోరెత్తించిన వారూ ఉన్నారు. ఇలా అనుమానాలు, కుట్ర కోణాల సిద్ధాంతాలు, వాటికి తగిన ఆధారాలను పుంఖానుపుంఖాలుగా జనం నెత్తిన రుద్దేవారెవరూ నిపుణులో, శాస్త్రవేత్తలో కాదు.. గ్లూమీ, గ్లూమీగా విషయం తెలిసినవారే. అప్పటి అవసరాలు, పాలిటిక్స్ కోసం జనం ముందుకు తెచ్చినవారే. ఇది బాగుంది... శుక్రవారం మళ్లీ వర్షాలు మొదలు కావడంతో సోషల్ మీడియాలో కనిపించిన జోక్.. ఇది కూడా బాగుంది... ఈ మధ్య వరదలు, వ్యాఖ్యలు చూస్తుంటే గుర్తొస్తుందంటూ ఓ మిత్రుడు చెప్పిన కామెంట్.. ప్రముఖ అమెరికన్ రచయిత, కాలమిస్టు, వక్త, యాక్టివిస్టు జిమ్ హైటవర్.. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌పై వేసిన చురక ఇది.. ‘అజ్ఞానం బ్యారెళ్ల లెక్కన అమ్మే వీలుంటే.. జార్జి బుష్ బుర్ర డ్రిల్లింగ్ హక్కులు సంపూర్ణంగా నేనే కొనుక్కుంటా..’ .. ఆహా.. నిజమే ఇలాంటి మార్కెట్ ఉంటే బాగుండు.. సహజ వనరులున్న బుర్రలు మనకు అనేకం ఉన్నాయి కదా.. -సరికొండ చలపతి -
సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
అమర్నాథ్ వరదల్లో చిక్కుకున్న ఏపీ వాసులు.. సీఎం జగన్ ఆరా.. కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ఏపీ వారిని రక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కేంద్రంతో సమన్వయం చేస్తున్నారు. అకస్మాత్తుగా అమర్నాథ్లో వరదలు రావడంతో వేలాది యాత్రికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రయాణికుల భద్రతపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీంతో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ రంగంలోకి దిగారు. అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్ష్ కౌశిక్ శ్రీనర్‌కు వెళ్లారు. అమర్నాథ్లో ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని హిమాన్షు కౌశిక్ తెలిపారు. శ్రీనగర్‌లోని టెంపుల్ బోర్డ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌తో టచ్‌లో ఉన్నామని ఆయన తెలిపారు. చనిపోయిన వారిలో ఏపీ వారు ఎవరూ లేరని పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు ఏపీకి చెందిన ఆరుగురి ఆచూకీ తెలియలేదు. వినోద్ అశోక్ (విజయవాడ), గునిసెట్టి సుధ, పార్వతి (రాజమహేంద్రవరం), బి.మధు (తిరుపతి), మేడూరు జాన్సిలక్ష్మి (గుంటూరు), వానపల్లి నాగేంద్ర కుమార్‌లు (విజయనగరం) కనిపించడం లేదని గుర్తించారు. అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగువారి సమాచారం కోసం సంప్రదించాల్సిన నంబర్లు ►ఢిల్లీ ఏపీ భవన్ హెల్ప్ లైన్ నంబర్స్: 011-23384016, 011-23387089 ►ఆంధ్ర ప్రదేశ్ హెల్ప్ లైన్ నంబర్: 1902 కాగా అమరానాథ్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జల ప్రళయంలో ఇప్పటి వరకు 16 మంది మృతి చెందగా.. ఇంకా 40 మంది యాత్రికుల ఆచూకీ తెలియరాలేదు. ఇప్పటి వరకు ఆర్మీ బేస్ క్యాంప్‌కు 15 వేల మందిని తరలించారు. అయితే అనుమతిస్తే దర్శనానికి వెళ్తామని కొందరు భక్తులు చెబుతున్నారు. -
వరదలో కొట్టుకుపోయిన కుటుంబం
సిమ్లా: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఒక కుటుంబంలోని ఐదుగురు సభ్యులు కొట్టుకుపోయారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ సిమ్లాకు సమీపంలోని గవల్ది గ్రామంలో చోటుచేసుకుంది. నేపాలీ కుటుంబంలో 12 ఏళ్ల దివ్యాంగ బాలుడు మాత్రం యాదృచ్చికంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. భారీ వరదలకు ఇంటితో సహా కుటుంబంలోని సభ్యులంతా కొట్టుకుపోయారని, స్థానికుల సహకారంతో మృతదేహాలను వెలికితీసినట్టు సిమ్లా పోలీసు కమిషనర్ తెలిపారు.