
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ధరాలి గ్రామంపై ఒక్కసారిగా జల ప్రవాహం విరుచుకుపడటంతో ఊరంతా అతలాకుతలమైంది. హోటళ్లు, నివాస భవనాలు కొట్టుకుపోయాయి. ఆ గ్రామాన్ని ఒక్కసారిగా ముంచేసిన వరదలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు అద్భుతమైన రీతిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"భాగ్ భాయ్ భాగ్, అరే భాగ్ భాగ్! (పరిగెత్తు.. పరిగెత్తు) అంటూ దూరం నుంచి అరుస్తున్నవారి మాటలు వీడియోలో వినిపిస్తాయి.. ఒక వ్యక్తి బురద నీటిలో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తుంది. కాగా, ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. 60 మంది గల్లంతయినట్లు చెబుతున్నారు.
हर्षिल से झकझोर देने वाला दृश्य-
मलबे में दबे जीवन की आखिरी कोशिश।
एक व्यक्ति रेंगते हुए खुद को बचाने की जद्दोजहद में,तो दूसरा भागकर ऊपर चढ़ता दिखा।
ऊपर से आवाज आई “उसे भी खींच लो!”
लेकिन जब जान पर बनी हो,तो दूसरों की फिक्र बहुत पीछे छूट जाती है।#cloudburst #DisasterRelief pic.twitter.com/chvrssd1Fy— Adarsh Katiyar official (@Adarshkatiya) August 5, 2025
ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. 150 మంది సైనికులను ఘటనాస్థలానికి పంపినట్లు ఆర్మీ తన అధికారిక ‘ఎక్స్’లో తెలిపింది. మరో వైపు స్థానిక పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. గ్రామం మొత్తం బురద నీటితో నిండిపోవడంతో సహాయక చర్యలకు అటంకం కలుగుతోంది. బురదను తొలగించి.. బాధితులను బయటకు తీసుకురాడానికి తీవ్రంగా శ్రమించవలసి వస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టి వర్షాలు కారణంగానే ఒక్కసారిగా వరద ప్రవాహం ముంచుకొచ్చినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.