బాధను దిగమింగుతూ కేక్ కట్ చేయించిన బంధువులు
పెద్దపల్లి జిల్లా: లింగాపూర్ గ్రామానికి చెందిన కందుల తిరుపతి–స్రవంతి దంపతుల మధ్య వచ్చిన స్వల్ప ఘర్షణతో క్షణికావేశంలో దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడారు. వారి దాంపత్య జీవితానికి గుర్తుగా 15ఏళ్ల ఏకైక కూతురు శివాణి ఉంది. ఈక్రమంలో బుధవారం తల్లిదండ్రుల దశదినకర్మ రోజే కూతురు శివాణి జన్మదినం కావడంతో బంధువులు, గ్రామస్తుల ప్రోత్సాహంతో బాధ నుంచి మరల్చేందుకు తల్లిదండ్రుల చిత్రపటం ఎదుట కేక్ కట్ చేయించారు. కాగా ఉద్విగ్న క్షణాలతో కన్నీటిని ఆపుకుంటూ బాధను అదిమి పట్టి అతికష్టంగా ముఖంపై చిరునవ్వును చిందినట్లుగా శివాణి కేక్ కట్ చేసిన తర్వాత పక్కకు వచ్చి ఒక్కసారిగా కన్నీంటిపర్యంతమైంది. బాలిక రోధనను చూసిన బంధువులు, గ్రామస్తులు మరోసారి కంటతడిపెట్టారు. గ్రామస్తులంతా చిన్నారికి అండగా నిలుస్తూ భరోసా కల్పించారు.


