హిమాచల్‌: వరద బాధితులకు తక్షణ సాయం రూ. 50 వేలు | Shimla Heavy Rain Cloudburst Many Dead | Sakshi
Sakshi News home page

హిమాచల్‌: వరద బాధితులకు తక్షణ సాయం రూ. 50 వేలు

Aug 3 2024 10:26 AM | Updated on Aug 3 2024 11:45 AM

Shimla Heavy Rain Cloudburst Many Dead

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు ఎనిమిదిమంది మృతిచెందారు. 50 మంది గల్లంతయ్యారు. తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

సిమ్లా జిల్లాలోని సమేజ్, రాంపూర్, కులులోని బాఘిపుల్, మండిలోని పద్దర్‌లలో భారీ వర్షాలు కురిసి విధ్వంసం సృష్టించాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శి డీసీ రాణా తెలిపారు. భారీ వర్షాలకు 53 మంది గల్లంతయ్యారని తెలిపారు. ఆరు మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. 60కి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్‌లు సిమ్లా, కులు జిల్లాల్లో పర్యటించి వరద బాధితులతో మాట్లాడారు.  ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బాధితులకు తక్షణ సాయంగా రూ.50వేలు ఇస్తామని ప్రకటించారు.  అలాగే వచ్చే మూడు నెలల పాటు నెలకు రూ.5వేలు చొప్పున ఇస్తామని, వంటగ్యాస్, ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులను కూడా అందజేస్తామని తెలిపారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement