బర్న్‌బీ: కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో రెండు ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన దిల్‌రాజ్ గిల్(28) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 22వ తేదీన సాయంత్రం 5.30 గంటల సమయంలో బర్న్‌బీలోని కెనడా వేలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని వాంకోవర్‌కు చెందిన దిల్‌రాజ్ గిల్‌గా గుర్తించామని తెలిపింది.
గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్యగా భావిస్తున్నామని తెలిపింది. కాల్పులు జరిగిన వెంటనే నిందితుడు లేదా నిందితులు ఆ ప్రాంతం నుంచి పరారయ్యారని, వాహనం దహనంతో వారికి సంబంధంముంటుందని అనుమానాలున్నాయని ఆర్‌సీఎంపీ పేర్కొంది. వివిధ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు జరుగుతోందని వివరించింది.


