కాశ్మీర్‌లోయలో కుండపోత.. అమర్‌నాథ్‌ యాత్ర నిలిపివేత | Amarnath Yatra Suspended Along Baltal Route Due To Inclement Weather, More Details Inside | Sakshi
Sakshi News home page

కాశ్మీర్‌లోయలో కుండపోత.. అమర్‌నాథ్‌ యాత్ర నిలిపివేత

Aug 4 2024 6:13 PM | Updated on Aug 4 2024 6:42 PM

Amarnath Yatra Suspended Along Baltal Route Due To Inclement Weather

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని గండేర్‌బల్‌ జిల్లాలో ఆదివారం(ఆగస్టు4) కుండపోత(క్లౌడ్‌బర్స్ట్‌) వర్షం కురిసింది. దీంతో శ్రీనగర్‌-లేహ్‌ జాతీయరహదారికి దారి తీసే ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ రోడ్డును తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. 

శ్రీనగర్‌- లేహ్‌ జాతీయరహదారిపైనా ట్రాఫిక్‌ను రద్దు చేయడంతో బల్టాల్‌ వద్ద అమర్‌నాథ్‌ యాత్రికులు చిక్కుకుపోయారు. దీంతో యాత్ర మధ్యలోనే నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన ఆకస్మిక వరదల కారణంగా పలు ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement