
వరుస క్లౌడ్‌బరెస్టులు హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్ని వణికిస్తున్నాయి.

ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడిందా? అనే రేంజ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి.

సాయంత్రం పూటే ప్రభావం చూపిస్తుండంతో.. ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. రోడ్ల మీదే కాదు.. ఇళ్లలోకి వాన నీరు చేరి జనాలు ఇబ్బందులు పడుతున్నారు.

పలు చోట్ల పవర్ కట్‌లతో చీకట్లు తప్పడం లేదు. వాతావరణ శాఖ మరిన్ని వర్షాల సూచనతో అప్రమత్తంగా ఉండాలని నగరవాసుల్ని హెచ్చరిస్తోంది.




















