క్లౌడ్‌బరస్ట్‌ దెబ్బకు పలు ఇళ్లు ధ్వంసం.. ఐదుగురు గల్లంతు | Uttarakhand Chamoli Cloudburst Heavy Rainfall, It Destroyed Several Houses And Five People Went Missing | Sakshi
Sakshi News home page

Uttarakhand: క్లౌడ్‌ బరస్ట్‌ దెబ్బకు పలు ఇళ్లు ధ్వంసం.. ఐదుగురు గల్లంతు

Sep 18 2025 8:53 AM | Updated on Sep 18 2025 10:13 AM

Uttarakhand Chamoli Cloudburst Heavy Rain

చమోలి: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో పెను విపత్తు సంభవించింది. ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న నందనగర్‌లో గురువారం తెల్లవారుజామున సంభవించిన క్లౌడ్‌ బరస్ట్‌ పలు ఇళ్లను ధ్వంసం చేసింది. ఐదుగురు అదృశ్యమయ్యారు. జిల్లా విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, నందనగర్‌లోని కుంత్రి వార్డులో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. చమోలి జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
 

క్లౌడ్‌ బరస్త్‌ దరిమిలా ఆ ప్రాంతంలో భయాందోళనలు అలుముకున్నాయి. ఇళ్ల శిథిలాలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంఘటన జరిగిన సమయంలో ఏడుగురు ఇళ్లలో ఉండగా, వారిలో ఇద్దరిని రెస్క్యూ సిబ్బంది సజీవంగా బయటకు తీసుకువచ్చారు. గల్లంతైన మరో ఐదుగురు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.  ఎస్‌డీఆర్ ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, వైద్య బృందాలు  సంఘటనా స్థలంలో సహాయక చర్యల్లో  పాల్గొంటున్నాయి.

చమోలి జిల్లా మేజిస్ట్రేట్ సందీప్ తివారీ వార్తా సంస్థ  ఏఎన్‌ఐతో మాట్లాడుతూ బుధవారం రాత్రి చమోలి జిల్లాలోని నందనగర్ ఘాట్ ప్రాంతంలో  క్లౌడ్‌ బరస​్‌ సంభవించి, భారీ నష్టం జరిగిందన్నారు. నందనగర్‌లోని కుంత్రి లంగాఫలి వార్డులో ఆరు ఇళ్ల శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగామని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇంతలో వాతావరణ శాఖ ఉత్తరాఖండ్‌లో 20 గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement