Uttarakhand: ఉత్తరాఖండ్​లో మళ్లీ క్లౌడ్‌ బరస్ట్.. పలువురు గల్లంతు | Uttarakhand Cloudburst in Chamoli: Heavy Floods, Rescue Operations Underway | Sakshi
Sakshi News home page

Uttarakhand: ఉత్తరాఖండ్​లో మళ్లీ క్లౌడ్‌ బరస్ట్.. పలువురు గల్లంతు

Aug 23 2025 11:51 AM | Updated on Aug 23 2025 12:00 PM

Cloudburst hits Uttarakhands Chamoli District

చమోలీ: ఉత్తరాఖండ్‌ను మళ్లీ భారీ వరదలు చుట్టుముట్టాయి. తాజాగా చమోలీ జిల్లాలో థరలీలో కురిసిన భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. ఫలితంగా అనేక నివాస ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. లెక్కలేనన్ని వాహనాలు బురదలో కూరుకుపోయాయి. విద్యాసంస్థలను మూసివేశారు. వరదలు కారణంగా పలువురు గల్లంతైనట్లు సమాచారం.
 

ఈ విపత్తుపై సమాచారం అందుకున్న ఎన్డీఆర్​ఎఫ్​, ఎస్డీఆర్​ఎఫ్​ బృందాలు తక్షణం వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని సహాయక చర్యలు మొదలుపెట్టాయి. వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ ‘చమోలీ జిల్లాలోని థరాలి ప్రాంతంలో క్లౌడ్​బరస్డ్ సంభవించింది. జిల్లా యంత్రాంగం, ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపడుతున్నారు. తాను స్థానిక పరిపాలన అధికారులతో నిరంతరం సంప్రదిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని’ అన్నారు

ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వర్షాల కారణంగా సంభవించిన విపత్తుకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక అనుసంధాన రహదారులు మూసుకుపోవడంతో ప్రజలు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంతలో ఆగస్టు 22 నుంచి 25 వరకు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.  పిథోరగఢ్, బాగేశ్వర్ జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. భారత వాతావరణ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం అతి స్వల్ప సమయంలో భారీ వర్షాలకు దారి తీయడాన్నే క్లౌడ్‌ బరస్ట్‌ అని అంటారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement