శ్రీనగర్: ‘ఆడపులి.. ధీరవనిత..తలవంచదు’..అంటూ పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ శుక్రవారం పశి్చమబెంగాల్ సీఎం మమ తా బెనర్జీపై ప్రశంసలు కురిపించారు. కోల్‌కతాలోని కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్‌తోపాటు సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంపై గురువారం ఈడీ చేపట్టిన దాడులు, అనంతర నాటకీయ పరిణామాలపై మెహబూబా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి దాడులు జమ్మూకశ్మీర్‌లో నిత్యకృత్యంగా మారాయని, వీటి రుచి ఇప్పు డు దేశం యావత్తూ చూస్తోందని చెప్పారు.
‘ఆర్టికల్ 370 రద్దు, సర్వసాధారణంగా మారిన నిఘా సంస్థల దాడులు, ముగ్గురు సీఎంలను కటకటాల వెనక్కి నెట్టడం వంటి దారుణాలెన్ని జరిగిన దేశంలోని రాజకీయ పారీ్టలు మౌనం దాల్చాయి. అవే పరిణామా లను ఇప్పుడు దేశం మొత్తం చవిచూస్తోంది’అని అన్నారు. ఆరి్టకల్ 370 రద్దు అనంతరం తనతోపాటు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్‌లను నిర్బంధంలో ఉంచడాన్ని ఆమె పరోక్షంగా ప్రస్తావించారు. ‘బెనర్జీ చాలా ధైర్యవంతురాలన్నది నా నమ్మకం. ఆమె ఒక ఆడ పులి. ఆమె ధైర్యంగా పోరాడుతారు. ఆమె ఎవరికీ తలవంచరు’అని అన్నారు.


