ఆ గ్రహంపై అధిక ఉష్ణోగ్రతలు.. తుఫాను గాలులు, రాళ్ల వర్షాలు

It Rains not Water but Stones on this Planet - Sakshi

కొన్నేళ్ల క్రితం శాస్త్రవేత్తలు  రెండు గ్రహాలను కనుగొన్నారు. ఈ గ్రహాలు మిగిలిన గ్రహాల కన్నా భిన్నంగా ఉన్నాయి. వాటి పరిమాణం బృహస్పతి గ్రహానికి సమానంగా ఉంది. ఈ రెండు గ్రహాలు మన పాలపుంత గెలాక్సీలో వాటి నక్షత్రానికి సమీపంలో ఉన్నాయి. ఈ రెండు గ్రహాలు అక్కడి అధిక ఉష్ణోగ్రత కారణంగా వేడెక్కుతాయని, ఈ గ్రహాల్లో ఒకదానిపై ఆవిరితో కూడిన రాళ్ల వర్షం కురుస్తుండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ తీవ్రతకు టైటానియం వంటి శక్తివంతమైన లోహాలు కూడా కరిగి ఆవిరైపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

శాస్త్రవేత్తలు తమ అధ్యయనాలలో ఈ రెండు గ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని అందించారు. ఈ గ్రహాల ద్వారా పాలపుంతలోని వైవిధ్యం, సంక్లిష్టత, విశిష్ట రహస్యాలను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు  విశ్వసిస్తున్నారు. ఈ గ్రహాల ద్వారా విశ్వంలోని గ్రహ వ్యవస్థ అభివృద్ధిలో వైవిధ్యాన్ని కూడా తెలుసుకోవచ్చంటున్నారు. నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక రిపోర్టులో శాస్త్రవేత్తలు హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా భూమికి 1300 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న డబ్ల్యుఏఎస్‌పీ-178b అనే గ్రహాన్ని గుర్తించామని తెలిపారు. ఈ గ్రహంపైగల వాతావరణంలో సిలికాన్ మోనాక్సైడ్ వాయువు ఉంటుంది.

ఈ గ్రహంపై పగటిపూట మేఘాలు ఉండవని, అయితే రాత్రిపూట గంటకు రెండు వేల మైళ్ల వేగంతో తుఫాను గాలులు వీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ గ్రహం దాని నక్షత్రానికి చాలా దగ్గరగా ఉంది. దీనితో పాటు, ఈ గ్రహంలోని ఒక భాగం ఎల్లప్పుడూ దాని నక్షత్రం వైపు ఉంటుంది. ఈ గ్రహానికి అవతలి వైపున ఉన్న సిలికాన్ మోనాక్సైడ్ చాలా చల్లగా ఉండడం కారణంగా మేఘాల నుంచి నీరు వెలువడేందుకు బదులుగా రాళ్ల వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఇది మాత్రమే కాదు ఈ గ్రహం మీద ఉదయం, సాయంత్రం వేళ్లల్లో ఉష్ణోగ్రత చాలా అధికంగా ఉంటుంది. దీని వల్ల రాళ్లు కూడా ఆవిరిగా మారుతాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మొదటిసారి సిలికాన్ మోనాక్సైడ్ ఇలాంటి రూపంలో కనిపించింది. మరొక అధ్యయనం ఆస్ట్రోఫిజికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. దీనిలో అత్యంత వేడి వాతావరణం కలిగిన గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారనిపేర్కొన్నారు. 400 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ‍ గ్రహానికి కేఈఎల్‌టీ-20బీ అని పేరు పెట్టారు.
ఇది కూడా చదవండి: భారత్‌-శ్రీలంకల ‘కచ్చతీవు’ వివాదం ఏమిటి? ఇందిరాగాంధీని ఎందుకు తప్పుబడుతున్నారు?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top