Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YS Jagan Ask Ballot Papers System Instead Of EVMs
EVMలపై వైఎస్‌ జగన్‌ కీలక ట్వీట్‌, ఏమన్నారంటే..

గుంటూరు, సాక్షి: ఏపీ ఎన్నికల ఆశ్చర్యకరమైన ఫలితాలపైనా ఒకవైపు.. ఈవీఎంల ట్యాంపరింగ్‌, హ్యాకింగ్‌, అన్‌లాకింగ్‌ తదితర అంశాలపై చర్చ మరోవైపు తీవ్ర చర్చ నడుస్తోంది. ఫలితాలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు మాత్రమే కాదు.. ఏపీ ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఎక్స్‌ ఖాతాలో ఓ కీలక సందేశం ఉంచారు.‘‘న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు. జరిగినట్లు కనిపించాలి కూడా. అలాగే ప్రజాస్వామ్యం గెలవడంతోపాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా. ప్రపంచం మొత్తమ్మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అత్యధిక దేశాల్లో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్‌ బ్యాలెట్లు వాడుతున్నారు. ఈవీఎంలు కాదు. ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలి’’ అని అన్నారాయన.Just as justice should not only be served, but should also appear to have been served, so should democracy not only prevail but must appear to be prevalent undoubtedly. In electoral practices across the world in almost every advanced democracy, paper ballots are used, not EVMs.…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 18, 20242024 సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్‌, హ్యాకింగ్‌లపై మరోమారు చర్చ మొదలైన సంగతి తెలిసిందే. టెస్లా యజమాని, టెక్నాలజీ మేధావి ఎలాన్‌ మస్క్‌ స్వయంగా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే ఈవీఎంలపై నిషేధం అవసరమని విస్పష్టంగా పేర్కొనగా... కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ మస్క్‌ వ్యాఖ్యలను ఖండించారు. అయితే రాజీవ్‌ మాటలకు ప్రత్యుత్తరంగా మస్క్‌ ఇంకో ట్వీట్‌ చేస్తూ... ఏనీథింగ్‌ క్యాన్‌ బీ హ్యాక్డ్‌ అని స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాదు... దేశంలో టెలికాం విప్లవానికి పునాదులు వేసిన వ్యక్తి, సీ-డాక్‌ వ్యవస్థాపకుడు శ్యామ్‌ పిట్రోడా సైతం ఈ చర్చలో పాల్గొంటూ ఈవీఎంల హ్యాకింగ్‌ సాధ్యమేనని వ్యాఖ్యానించడం ఇటీవలి పరిణామమే.ఈవీఎం 'అన్‌లాకింగ్'పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈసీ అందుకు అవకాశమే లేదని చెబుతున్నా.. తాజా ఫలితాలతో ప్రజల్లోనూ వాటి వాడకంపై అనుమానాలు రెకెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆధునిక ఈవీఎంల వాడకం బదులు సంప్రదాయ రీతిలో పేపర్‌ బ్యాలెట్‌ను ఉపయోగించాలనే అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు వైఎస్‌ జగన్‌.

Lockie Ferguson creates incredible T20I record in clash against PNG
ప్ర‌పంచ క్రికెట్‌లో పెను సంచ‌ల‌నం.. లూకీ ఫెర్గూస‌న్ స‌రికొత్త‌ చరిత్ర

టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ లాకీ ఫెర్గూసన్‌ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్‌కప్‌-2024లో భాగంగా ట్రినిడాడ్‌ వేదికగా పాపువా న్యూగినీతో మ్యాచ్‌లో ఫెర్గూసన్‌ సంచలన ప్రదర్శన కనబరిచాడు.ఈ మ్యాచ్‌లో ఫెర్గుసన్‌ ఎవరూ ఊహించని విధంగా తన 4 ఓవర్ల కోటాను మెయిడిన్లుగా ముగించాడు. ఫెర్గూస‌న్ 4 ఓవ‌ర్లు వేసి ఒక్క ర‌న్ కూడా ఇవ్వ‌లేదు. అంతేకాకుండా 3 వికెట్లు కూడా పడగొట్టాడు.పసికూన పాపువా న్యూగినీ బ్యాటర్లకు ఈ కివీస్పీడ్‌ స్టార్‌ చుక్కలు చూపించాడు. అతడిని ఎదుర్కొనేందుకు న్యూగినీ బ్యాటర్లు గజగజ వణికిపోయారు. పపువా న్యూ గినియా ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో బంతిని అందుకున్న ఫెర్గూసన్ తొలి బంతికే వికెట్ తీసాడు. ఆ ఓవర్‌ను మెయిడిన్‌గా ముగించిన లాకీ.. ఏడో ఓవర్‌లో మరోసారి బంతిని అందుకుని రెండోసారి మెయిడిన్ చేశాడు.మళ్లీ 12వ ఓవర్‌ బౌలింగ్ చేసిన ఫెర్గూసన్ రెండో బంతికి వికెట్ తీసి మూడో ఓవర్‌ను మెయిడిన్ చేశాడు. 14వ ఓవర్‌లో రెండో బంతికి మరో వికెట్ తీసి మరోసారి మెయిడిన్ చేశాడు.ఇక ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఫెర్గూసన్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.ఫెర్గూసన్‌ సాధించిన రికార్డులు ఇవే..అంతర్జాతీయ టీ20ల్లో అత్యత్తుమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా ఫెర్గూసన్‌ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు కెనడా కెప్టెన్‌ సాద్ బిన్ జ‌ఫ‌ర్ పేరిట ఉండేది.పనామాపై సాద్ బిన్ జ‌ఫ‌ర్ 4 మెయిడిన్ ఓవ‌ర్లు వేసి 2 వికెట్లు తీశాడు. అయితే తాజా మ్యాచ్‌లో 4 మెయిడిన్‌ ఓవర్లతో పాటు 3 వికెట్లు పడగొట్టిన ఫెర్గూసన్‌.. సాద్ బిన్ జ‌ఫ‌ర్ ఆల్‌టైమ్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు.టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో 4 ఓవ‌ర్లు మెయిడిన్ వేసిన తొలి బౌల‌ర్‌గా కూడా ఫెర్గూస‌న్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ ఘనత ఎవరికి సాధ్యం కాలేదు.అదేవిధంగా ఓవరాల్‌గా టీ20ల్లో 4కి 4 ఓవ‌ర్లు మెయిడిన్ వేసిన రెండో బౌలర్‌గా ఫెర్గూస‌న్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో కెనడా కెప్టెన్‌ సాద్ బిన్ జ‌ఫ‌ర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2021లో పనమాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో సాద్ బిన్ జ‌ఫ‌ర్ 4 ఓవర్లు మెయిడిన్‌ చేసి 2 వికెట్లు పడగొట్టాడు.

Darshan Renuka Swamy Case Notice To Chikkanna
హీరో దర్శన్ కేసులో మరో కన్నడ హీరోకి నోటీసులు

వ్యక్తిని హత్య చేసిన కేసులో కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ కావడం ఈ మధ్య కలకలం రేపింది. రోజురోజుకి కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్. కన్నడ హాస్య నటుడు కమ్ హీరో చిక్కన్నకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అలానే పోలీస్ స్టేషన్‌కి కూడా తీసుకొచ్చారు. దీంతో ఇప్పుడీ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?)కన్నడ హీరో దర్శన్.. జూన్ 8న రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకర మెసేజులు, వీడియోలని మొబైల్‌లో పంపడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఓవైపు విచారణ, మరోవైపు దర్యాప్తు సాగుతోంది.అయితే హత్య జరగడానికి ముందు దర్శన్‌తో పాటు అతడి మనుషులు.. బెంగళూరు రాజేశ్వరి నగర్‌లోని స్టోనీ బ్రూక్ రెస్టారెంట్‌లో పార్టీ చేసుకున్నారు. దీనికి దర్శన్‌ ఫ్రెండ్, నటుడు చిక్కన్న కూడా హాజరయ్యాడు. ఈ క్రమంలోనే పార్టీ చేసుకునే టైంలో హత్య గురించి దర్శన్ ఏమైనా చర్చించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చిక్కన్నకు నోటీసులు ఇచ్చారు. ఇతడికి హత్యతో సంబంధం లేదు కాబట్టి అరెస్ట్ చేయలేదు. కేవలం కొన్ని వివరాలు అడిగి తెలుసుకుని వదిలేశారు.(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌ అమలా పాల్.. వీడియో వైరల్!)

Vijay Mallya Son Sidhartha To Marry Girlfriend Jasmine Details
విజయ్‌ మాల్యా ఇంట పెళ్లి సందడి

బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్‌ విజయ్‌ మాల్యా ‌ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన తనయుడు సిద్ధార్థ మాల్యా తన చిరకాల ప్రేయసి జాస్మిన్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ ఇద్దరూ ఫొటో షూట్‌ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.ఈ వారంలోనే వీళ్లిద్దరి వివాహం జరగనుంది. అయితే ఈ వివాహ వేడుకకు ఎవరైనా ప్రముఖులు హాజరవుతున్నారా? లేదంటే కొద్ది మంది సమక్షంలోనే జరపనున్నారా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు.. వీళ్లిద్దరూ చాలాకాలంగా స్నేహితులుగా ఉన్నారు. అయితే.. కిందటి ఏడాది హలోవీన్‌ సందర్భంలో రింగ్‌ తొడిగి తన ప్రేమను ప్రపోజ్‌ చేశాడు సిద్ధార్థ్‌. అలా ఆ ప్రపోజల్‌తో ఈ జంట వార్తల్లోకి ఎక్కింది. జాస్మిన్‌ ఇన్‌స్టా బయోలో యూఎస్‌ అని ఉంది. ఆమె ప్రొఫైల్‌ను బట్టి మాజీ మోడల్‌గా తెలుస్తోంది. ఇంతకి మించి ఆమె గురించి సమాచారం లేదు. ఆమె కుటుంబ నేపథ్యం తెలియాల్సి ఉంది. ఇక.. సిద్ధార్థ్‌ నటుడిగా, మోడల్‌గా పరిచయస్థుడే. విజయ్‌ మాల్యా-సమీర త్యాబ్జీ దంపతులకు సిద్ధార్థ్‌ జన్మించాడు. కాలిఫోర్నియా లాస్‌ ఏంజెల్స్‌లో పుట్టి.. లండన్‌, యూఏఈలో పెరిగాడు సిద్ధార్థ్‌. లండన్‌ రాయల్‌ సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ డ్రామా నుంచి డిగ్రీ పుచ్చుకుని.. మోడలింగ్‌ వైపు అడుగు లేశాడు. ఐపీఎల్‌ తరఫున ఆర్బీబీ డైరెక్టర్‌గానూ వ్యవహరించిన సిద్ధార్థ్‌.. అప్పటి నుంచి మీడియా దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కింగ్‌ఫిషర్‌ మోడల్స్‌ జడ్జిగా.. పలువురు హీరోయిన్లతోనూ ఫొటోలకు ఫోజులు ఇచ్చి హాట్‌ టాపిక్‌గా మారాడు. నటుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే.. ఆ తర్వాతే సిద్ధార్థ్‌ కెరీర్‌లో మార్పు కనిపించింది. మెంటల్‌ హెల్త్‌ అవేర్‌నెస్‌ వైపు మళ్లిన సిద్ధార్థ్‌.. యువత, చిన్నారుల మానసిక ఆరోగ్యం-అవగాహన అనే అంశం మీద రెండు పుస్తకాలు కూడా రాశాడు. View this post on Instagram A post shared by Sid (@sidmallya)ఇక.. సిద్ధార్థ్‌ తండ్రి విజయ్‌ మాల్యా ప్రస్తుతం యూకేలో ఉన్నాడు. ఆయన భారత్‌లో రూ.9వేల కోట్ల మేరకు బ్యాంకు రుణం ఎగవేశారు. ఈ కేసులో సీబీఐ ముంబయిలోని కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్‌ ప్రకారం లిక్కర్‌ కింగ్‌ విదేశాల్లో భారీగా ఆస్తులను కొనుగోలు చేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత భారత్‌ను వీడి అతడు పారిపోయినట్లు తెలిపింది. అతడు ఫ్రాన్స్‌లో 35 మిలియన్‌ యూరోలు వెచ్చించి స్థిరాస్తి కొనుగోలు చేశాడు. దీనికి తన ఆధీనంలోని కంపెనీ గిజ్‌మో హోల్డింగ్‌ నుంచి చెల్లింపులు జరిపినట్లు సీబీఐ పేర్కొంది. మరో వైపు ఫ్రాన్స్‌ ప్రభుత్వం రూ.14 కోట్ల విలువైన మాల్యా ఆస్తులను ఇప్పటికే సీజ్‌ చేసింది. ఈడీ అభ్యర్థన మేరకు ఈ చర్యలు తీసుకుంది.

Construction of new buildings in place of dilapidated Harita Resorts
అద్భుత భవనాలపై ‘అగ్లీ’ ఏడుపు

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ప్రభు­త్వానికి చేతకాదు. విభజిత రాష్ట్రానికి 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ.. ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సాగదీసి, స్వలాభం చూసుకోవడమే తప్ప, రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటీ లేదు. రాజధాని పేరుతో చేసిన విధ్వంసం, తాత్కాలిక సచివాలయాల పేరుతో నిర్మించిన నాసి రకం భవనాలు, పోలవరం ప్రాజెక్టులో తప్పులు.. ఇలా అన్నీ రాష్ట్రానికి తలవంపులు తెచ్చే పనులే. ఇప్పుడూ అదే చేస్తోంది టీడీపీ. రుషికొండపైన అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా, విశాఖ ఖ్యాతిని మరింతగా పెంచేలా అద్భుత భవనాలను నిర్మిస్తే, దానిపై వికృత రాజకీయం చేస్తోంది.ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే వాటిపై చేస్తున్న విష ప్రచారం ఆ పార్టీ సంస్కృతికి నిదర్శనం. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు చేస్తున్న కపట నాటకం. రూ.700 కోట్లతో తమ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయం చిన్న వర్షానికే లీకైపోయి, నీరంతా గదుల్లో ప్రవహించగా.. ఇప్పుడు కేవలం రూ. 400 కోట్లతో రుషికొండపై విశాఖకే కాక యావత్‌ రాష్ట్రానికే తలమానికంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్మించిన ఈ ఐకానిక్‌ భవనాలను చూసి తల ఎక్కడ పెట్టుకోవాలో టీడీపీ అధినేతలకే తెలియడంలేదు. అందుకే ఈ అగ్లీ (చెత్త)ఏడుపు. విశాఖపట్నంలోని బీచ్‌కి ఆనుకొని ఉన్న రుషికొండపై రాష్ట్ర పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్ట్స్‌ భవనాలు చాలా కాలం క్రితం నిర్మించినవి.అవి శిథిలమై ప్రమాదకరంగా మారడంతో వాటిని తొలగించి, కొత్త భవనాలు కట్టాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరిపింది. ప్రపంచ స్థాయిలో, 5 స్టార్‌ వసతులతో అత్యాధునికంగా, విశాఖ నగర ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేసేలా డిజైన్లు రూపొందించింది. సీఆర్‌జెడ్‌ పరిమితులకు లోబడి నిర్మాణాలు ప్రారంభించింది. రుషికొండపై ఏ భవనాలు, ఎందుకు నిర్మిస్తున్నారో సమగ్ర వివరాల్ని 2021లోనే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందజేసింది. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో ఫైవ్‌ స్టార్‌ పర్యాటక విడిది కేంద్రంగా మొత్తం రూ.412 కోట్లతో 7 బ్లాకుల్ని నిర్మించింది.రుషికొండ మొత్తం 61 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 9.88 ఎకరాల విస్తీర్ణంలోనే ఈ భవనాలు నిర్మించింది. గతంలో హరిత రిసార్టు 48 వేల చదరపు అడుగుల విస్తీ­ర్ణంలో ఉండేది. ప్రస్తుత భవనాలు 19,968 చ.మీ విస్తీర్ణంలో ఉన్నాయి. వీటన్నింటినీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు వీలుగా నిర్మించారు. ప్రెసిడెన్షియల్‌ సూట్, సూట్‌ రూమ్, బాంక్వెట్‌ హాల్‌తో విజయనగర బ్లాకు, ప్రెసిడెన్షియల్‌ సూట్‌ రూమ్స్, సూట్‌ రూమ్స్, డీలక్స్‌ గదులు, బాంక్వెట్‌ హాల్‌తో కళింగ బ్లాక్‌ నిర్మించింది. సూట్‌ రూమ్‌లు, కాన్ఫరెన్స్‌ హాల్‌తో పల్లవ బ్లాక్, సమావేశ మందిరాలతో చోళ బ్లాక్, రిక్రియేషన్‌ లాంజ్, బిజినెస్‌ సెంటర్‌తో గజపతి బ్లాక్, ప్రైవేట్‌ సూట్‌ రూమ్‌లతో వేంగిబ్లాక్, రెస్టారెంట్స్, లాంజ్, కిచెన్, పార్కింగ్‌ సౌకర్యాలతో ఈస్ట్రన్‌ గంగా బ్లాక్‌లని నిర్మించింది. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే.. విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేస్తే, రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తలంచింది. ఇందుకు ఏర్పాట్లూ ప్రారంభించింది. విశాఖలో పాలన ప్రారంభించడానికి అనువైన భవనాల పరిశీలనకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ విశాఖలోని పలు భవనాలను పరిశీలించింది. వీటిలో రుషికొండపై నిర్మించిన భవనాలు ప్రభుత్వ కార్యకలాపాలకు అనువైనవని తేల్చింది. ఇక్కడ సీఎం నివాసం, సీఎం కార్యాలయానికి ఇవి అనువుగా ఉంటాయని వెల్లడించింది. అప్పట్నుంచి ఈ భవనాల్లో సీఎం నివాసం, కార్యాలయానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు.వాటిని నిర్మించింది ప్రభుత్వం. పనులు జరిగింది ఏపీటీడీసీ ఆధ్వర్యంలో. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు, అంతర్జాతీయ సదస్సులు ఇక్కడే నిర్వహించేందుకు వీలుగా అత్యద్భుతంగా ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌ని తలదన్నేలా నిర్మాణం జరిగింది. సాగర తీరంలో అద్భుతంగా, రాష్ట్రానికి అంతర్జాతీయంగా పేరు తెచ్చేలా నిర్మించిన ఈ భవనాలను చూసి గర్వపడాలి కానీ.., ఎవరో సొంతగా భవనాలు కట్టేసుకొన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతల ఏడుపులు, పెడబోబ్బలు ఎందుకు? అవి ప్రభుత్వం నిర్మించిన భవనాలు. అనుమతి ఉన్న వారు ఎవరైనా వెళ్లొచ్చు. అయినా, టీడీపీ నేతలు ఏదో ఘనకార్యం చేసినట్లు ప్రభుత్వం భవనం లోపలికి వెళ్లి, ఫొటోలు దిగి, వీడియోలు తీసి చెడు ప్రచారం చేయడం నీచత్వానికి పరాకాష్టే. మంచి చేయడమే కాదు.. మరొకరు చేసిన మంచిని అంగీకరించడం కూడా చేతకాదని వారికి వారే నిరూపించుకోవడమే.

22 Teachers Transferred On Filmnagar Government High School
Hyderabad: ఫిలింనగర్‌ పాఠశాలకు టీచర్లు కావలెను!

ఫిలింనగర్‌: రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పాఠశాలలోనూ లేని సమస్యను ఫిలింనగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదుర్కొంటోంది. ఈ పాఠశాలకు చెందిన 22 మంది టీచర్లు ఒకేసారి బదిలీ కావడానికి గల కారణాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. మూడురోజుల క్రితం ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ టీచర్ల మూకుమ్మడి బదిలీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 948 మంది విద్యార్థులున్న ఈ బడిలో ఇప్పుడు హెచ్‌ఎంతోపాటు ఇంకొక టీచర్‌ మాత్రమే మిగిలారు. కొత్తగా విద్యార్థులు చేరడం లేదు. బోధన సాగడంలేదు. ఇక్కడ తెలుగు మీడియం బోధనను పూర్తిగా తొలగించారు. పదో తరగతిలోని తెలుగు మీడియం విద్యార్థులను ఒక్కసారిగా ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చడంతో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు. ఈ పాఠశాలకు రావడానికి టీచర్లు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఒక్క ఈ పాఠశాలకే టీచర్లు ఎందుకు రావడం లేదు, ఉన్న టీచర్లు ఎందుకు వెళ్లారు.. అన్నదానిపై విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. చాలామంది విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే స్కూల్‌లో విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. హైదరాబాద్‌ హల్‌చల్‌ ఒకే చోట.. క్లిక్‌ చేయండి

Horoscope Today: Rasi Phalalu On 18-06-2024 In Telugu
Daily Horoscope: ఆస్తి వివాదాల పరిష్కారం.. శుభవార్తలు వింటారు!

మేషం.. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు రాగలవు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.వృషభం.. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ధనలబ్ధి. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.మిథునం.. వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలలో మార్పులు. వ్యయప్రయాసలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.కర్కాటకం.. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. దైవదర్శనాలు. బంధువులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.సింహం.. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు.. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూ, వాహనయోగాలు. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.కన్య.. మిత్రులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.తుల.. కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి.వృశ్చికం.. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.ధనుస్సు.. మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.మకరం.. శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు.కుంభం.. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.మీనం.. పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

Sakshi Editorial On Terrorist attacks In Jammu and Kashmir
ఇక... జమ్మూ వంతు!

జమ్మూలో వరుస తీవ్రవాద దాడులు కలవరం సృష్టించగా, ఎట్టకేలకు సర్కార్‌ రంగంలోకి దిగింది. కేంద్ర హోమ్‌ మంత్రి సారథ్యంలో ఆదివారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అందులో తొలి అడుగు. పాక్‌ నుంచి తీవ్రవాదుల చొరబాటు యత్నాలను నిర్వీర్యం చేసేందుకు భద్రతా దళాల సంఖ్యను పెంచడం సరైన దిశలో సరైన చర్యగా చెప్పుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి రాజౌరీ, పూంచ్‌ , రియాసీ, కఠువా, ఉధమ్‌పూర్, దోడా జిల్లాలు ఆరింటిలో ఆరు ప్రధాన తీవ్రవాద దాడులు జరిగాయి. సైనిక వర్గాల కథనం ప్రకారం విదేశీ తీవ్రవాదులు నలుగురైదుగురు చొప్పున బృందాలుగా ఏర్పడుతున్నారట. అలాంటి బృందాలు కనీసం అయిదు పీర్‌ పంజల్, చీనాబ్‌ ప్రాంతాల్లో పని చేస్తున్నాయి. జమ్మూలోని ఈ కొత్త తరహా తీవ్రవాద ధోరణి కశ్మీర్‌కూ వ్యాపించే ప్రమాదం పొంచివుంది. అందుకే, జమ్మూ కశ్మీర్‌పై స్వయంగా ప్రధాని గత వారం సమీక్షా సమావేశం నిర్వహిస్తే, తర్వాత మూడు రోజులకే హోమ్‌ మంత్రి సైతం సమీక్ష చేశారు. పరిస్థితి తీవ్రతకు ఇది దర్పణం. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న సమయంలోనే తాజా దాడులు యాదృచ్ఛికం అనుకోలేం. జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు సజావుగా లేవనీ, 370వ అధికరణం రద్దు తర్వాత శాంతి నెలకొనలేదనీ వీలైనప్పుడల్లా ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదులు పని చేస్తూనే ఉన్నారు. తాజా తీవ్రవాద దాడులు అందులో భాగమే. ఇటీవల కొన్నేళ్ళుగా కశ్మీరీ తీవ్రవాదులు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నారు. 2022లో నిర్దేశిత వ్యక్తులే లక్ష్యంగా హత్యలు చేసే పద్ధతిని అనుసరిస్తే, గత ఏడాది నుంచి సాంప్రదాయిక విన్యాసాలు సాగిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల పైచిలుకుగా ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో అలజడులు సృష్టించసాగారు. గతంలో కశ్మీర్‌ ప్రాంతంపై పంజా విసిరిన ముష్కర మూకలు ఇప్పుడు ప్రశాంతమైన జమ్ము ప్రాంతంపై గురి పెట్టాయి. దాంతో, భద్రతా దళాలు తమ వ్యూహాలను మార్చుకోక తప్పని పరిస్థితి. గతాన్ని సింహావలోకనం చేసుకుంటే, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370వ అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత దృష్టి అంతా కశ్మీర్‌పై నిలిచింది. అప్పటికి పదిహేనేళ్ళుగా జమ్మూలోని అధిక భాగంలో నిస్సైనికీకరణ సాగింది. ప్రశాంతత నెలకొంది. ఫలితంగా, విదేశీ తీవ్రవాదులు ఈసారి జమ్మూని తమకు వాటంగా చేసుకున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రధానంగా అడవులు ఈ విదేశీ చొరబాటుదారులకు కలిసొచ్చాయి. రాజౌరీ, పూంచ్‌∙జిల్లాల్లోని దట్టమైన అడవులు, సంక్లిష్టమైన కొండలు తీవ్రవాదుల కొత్త కేంద్రాలయ్యాయి. అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని, గుహల్లో దాక్కొని వారు తమ ఉనికి, బలం పెంచుకున్నారు. తాజాగా నాలుగు రోజుల్లో నాలుగు చోట్ల దాడులు జరగడం, అందులోనూ రియాసీ జిల్లాలో జూన్‌ 9న యాత్రికుల బస్సుపై అమానుష దాడితో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడింది. ప్రభుత్వం హడావిడిగా క్షేత్రస్థాయి పరిస్థితులపై మళ్ళీ దృష్టి పెట్టింది. 2021 జనవరి నుంచే వాస్తవాధీన రేఖ వెంట జమ్మూలోకి చొరబడడానికి విదేశీ తీవ్రవాద బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అప్పట్లో జమ్మూలోని అఖ్నూర్‌లో మన సైన్యం ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టి, ముగ్గురిని హతమార్చింది. అదే ఏడాది జూన్‌లో భారత వైమానిక దళ స్థావరంపై డ్రోన్‌ దాడి ఘటనల నుంచి జమ్మూ ప్రాంత సరిహద్దు జిల్లాల్లో తీవ్రవాద కార్యకలపాలు పెరిగాయి. 2021 నుంచి ఇప్పటి వరకు ఒక్క జమ్మూ ప్రాంతంలోనే 29 తీవ్రవాద హింసాత్మక ఘటనలు జరిగాయి. జమ్మూ కశ్మీర్‌లో దాదాపు 100 మందికి పైగా తీవ్రవాదులు క్రియాశీలంగా ఉన్నారట. వారిలో తీవ్రవాద బాట పట్టిన స్థానికుల కన్నా విదేశీ తీవ్రవాదులే ఎక్కువ. ఇది తీవ్రమైన అంశం. ఒకప్పటి భారీ వ్యవస్థీకృత హింసాకాండ నుంచి ఇప్పుడు పొరుగునున్న శత్రువుల అండతో పరోక్ష యుద్ధంగా మారిన ఈ బెడదపై సత్వరమే కార్యాచరణ జరగాలి.నిజం చెప్పాలంటే, జమ్మూ కశ్మీర్, మణిపుర్‌లు రెండూ ఇప్పటికీ అట్టుడుకుతూనే ఉన్నాయి. మోదీ 3.0 సర్కార్‌ ముందున్న ప్రధానమైన సవాళ్ళు ఇవి. ప్రభుత్వ పెద్దలు వీటిని అశ్రద్ధ చేయడానికి వీలు లేదు. అందులోనూ ఈ జూన్‌ 29 నుంచి అమరనాథ్‌ యాత్ర మొదలు కానున్న వేళ జమ్మూలో భద్రత కీలకం. గతంలో సాంప్రదాయికంగా తీవ్రవాదులకు పెట్టనికోట అయిన కశ్మీర్‌ లోయలో ఆ పరిస్థితిని మార్చడంలో భద్రతాదళాలు విజయం సాధించాయి. నిరుడు ఏకంగా 2.11 కోట్ల మంది సందర్శకులతో కశ్మీర్‌లో పర్యాటకం తిరిగి పుంజుకొంది. మొన్న లోక్‌సభ ఎన్నికల్లోనూ జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. గత 35 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలో 58.46 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. తీవ్రవాదం పీచమణిచి సాధించిన అలాంటి విజయాలు జమ్మూలోనూ పునరావృతం కావాలని హోమ్‌ మంత్రి ఆదేశిస్తున్నది అందుకే. తీవ్రవాదులు ప్రధానంగా అంతర్జాల ఆధారిత వ్యవస్థల ఆధారంగా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. విదేశీ సిమ్‌ కార్డులతో, పాకిస్తానీ సర్వీస్‌ ప్రొవైడర్లతో సాగుతున్న ఈ వ్యవహారానికి సాంకేతికంగా అడ్డుకట్ట వేయాలి. ప్రజలు, పోలీసులు, స్థానిక రక్షణ దళ సభ్యులతో సహా అందరినీ కలుపుకొనిపోతూ దేశంలో చేరిన ఈ కలుపు మొక్కల్ని ఏరిపారేయాలి. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించాలని చూస్తున్న ఈ దుష్టశక్తుల పాచిక పారనివ్వరాదు. ప్రభుత్వం వెనక్కి తగ్గక సెప్టెంబర్‌లో జరగాల్సిన జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలను నిరాటంకంగా జరిపించాలి. పాక్‌ పాలకులు పైకి మెత్తగా మాట్లాడుతున్నా, అక్కడి సైన్యాధ్యక్షుడు, సైనిక గూఢచారి వ్యవస్థ ఐఎస్‌ఐ చేసే కుటిల యత్నాలకు సర్వదా కాచుకొనే ఉండాలి. అప్రమత్తత, సత్వర సన్నద్ధతే దేశానికి శ్రీరామరక్ష.

Eenadu Fake News on Government Schools: Andhra pradesh
ఈ విషానికి విరుగుడేదీ?

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఈ నేపథ్యంలో దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ‘ఆర్థిక సమస్యలతో ఏ పేదింటి బిడ్డ చదువు ఆగిపోకూడదు.. వారు బాగా చదవాలి, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకుని వారంతా ఉన్నతంగా ఎదగాలి. వారి చదువుకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది.. అన్ని సదుపాయాలు కల్పిస్తుంది’ అంటూ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు.ఇందుకు తగ్గట్టే దేశవిదేశాలు కీర్తించేలా విప్లవాత్మక పథకాలను అమలు చేశారు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో సౌకర్యాలకు దూరమై కునారిల్లిన ప్రభుత్వ బడులకు జవసత్వాలు కల్పించి వాటిని కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా పరుగులు పెట్టించారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు అంతకుముందెన్నడూ లేని రీతిలో పెరిగాయి. వివిధ రాష్ట్రాలు, దేశాలు, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్‌లాంటి సంస్థలు ఏపీ విద్యా సంస్కరణలపై ప్రశంసలు కురిపించినా ఈనాడు పత్రిక మాత్రం వాస్తవాలను జీర్ణించుకోలేక మరోసారి వికృత రాతలతో విషం జిమ్మింది. ఐదేళ్ల జగన్‌ పాలనలో విద్య అస్తవ్యస్తమైపోయిందని.. ‘పాఠశాల విద్యలో ప్రతిదీ సవాలే!’ అంటూ తప్పుడు రాతలకు బరితెగించింది. జగన్‌ ప్రభుత్వం పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించేందుకు అవసరమైన అన్ని వసతులు కల్పించింది.మనబడి నాడు–నేడుతో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. కార్పొరేట్‌ విద్యా సంస్థలే అసూయచెందేలా కొత్త పాఠశాల భవనాలు, టాయిలెట్ల నుంచి కాంపౌండ్‌ వాల్‌ వరకు 11 రకాల సదుపాయాలతో అత్యుత్తమంగా తీర్చిదిద్దింది. ప్రభుత్వ బడి అంటే పగిలిన గోడలు.. పెచ్చులూడే స్లాబులు, నేలబారు చదువులేనన్న అభిప్రాయంతో ఉన్న పరిస్థితి నుంచి.. ఆంధ్రప్రదేశ్‌లో సర్కారు చదువులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ప్రభుత్వ బడి పిల్లలు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే వరకు తీసుకెళ్లిన ఘనత ఏపీకి మాత్రమే దక్కింది.దేశంలోనే అత్యత్తమ విద్యా విధానం ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసినట్టు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే కితాబిచ్చినా ఈనాడు పత్రిక మాత్రం అంగీకరించలేక తన అల్పబుద్ధిని చాటుకుంటోంది. ఈ విద్యా సంస్కరణలే తప్పు అనేలా వక్రీకరణలు చేస్తోంది. ఏదోలా ఈ సంస్కరణలను రద్దు చేసి, పేదింటి పిల్లలను ఉత్తమ విద్యకు దూరం చేసే కుట్ర చేస్తున్నట్టు విద్యా రంగ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయంగా సంస్కరణలు 2019కి ముందు ప్రభుత్వం కార్పొరేట్‌ విద్యకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ బడుల్లో పరిస్థితి దిగజారింది. అదే విషయాన్ని ‘అసర్, నాస్‌’ వంటి సర్వేలు కూడా స్పష్టం చేశాయి. దీంతో 2019లో అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యా నాణ్యతను పెంచేందుకు ఈ సర్వేల అంశాలను ప్రామాణికంగా తీసుకొని పలు కార్యక్రమాలను అమలు చేసింది. టీచింగ్‌ ఎట్‌ రైట్‌ లెవెల్, లెర్నింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రామ్, సపోరి్టంగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ వంటి కార్యక్రమాలు అందులో కొన్ని. అసర్‌ నివేదిక ఆధారంగా రూపొందించిన ‘టీచింగ్‌ ఎట్‌ రైట్‌ లెవెల్‌’ కార్యక్రమంలో విద్యార్థుల స్థాయికి అనుగుణంగా పలు నూతన విధానాలతో విద్యాబోధన అమలు చేశారు.ఇందుకోసం ప్రత్యేకంగా ‘ప్రథమ్‌’ సంస్థతో కలిసి టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అందించారు. దీనిద్వారా విద్యార్థుల లెర్నింగ్‌ ఎబిలిటీ, రీడింగ్‌ ఎబిలిటీ మెరుగుపడినట్లుగా 2022 బేస్‌లైన్‌ ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఎంపిక చేసిన కొన్ని జిల్లాల్లో ప్రాథమికోన్నత స్థాయిలో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు ‘లిప్‌’ ప్రోగ్రాం అమలు చేశారు. విద్యార్థుల క్లాస్‌ రూమ్‌ పరీక్షల నిర్వహణలోనూ అనేక మార్పులు తీసుకొచ్చారు.గతంలో ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్స్‌ను ఎక్కడికక్కడ క్లాస్‌ రూమ్‌లో టీచర్‌ రూపొందించి ఇచ్చేవారు. ఇందులో పరీక్ష, ప్రశ్నల నాణ్యత తక్కువగా ఉండడంతో రాష్ట్ర స్థాయిలో నిపుణులతో ప్రశ్నపత్రాలు రూపొందించి అన్ని పాఠశాలల్లోనూ ఒకే తరహా ప్రశ్నపత్రాలు అందించారు. బైజూస్‌ ఉచితంగా అందించిన ఈ–కంటెంట్‌తోపాటు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) రూపొందించిన తెలుగు, ఇంగ్లిష్, హిందీ కంటెంట్‌ను కూడా ఉపాధ్యాయులకు డీటీహెచ్‌ చానల్స్‌ ద్వారా, ఈ–పాఠశాల యాప్‌ ద్వారా అందజేశారు. ఒకే సిలబస్‌.. బోర్డుల ప్రకారం పరీక్షలుసెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ)కి రాష్ట్రంలో 1,000 పాఠశాలలను అనుసంధానించారు. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి మొదటి బ్యాచ్‌ సీబీఎస్‌ఈ పరీక్షలు రాస్తారు. అందుకు అవసరమైన ప్రణాళికను ముందే అమల్లోకి తెచ్చారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో ఒకటో తరగతి నుంచి పేద పిల్లలకు ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ (ఐబీ) విద్యను అందించాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 44,478 స్కూళ్లలోనూ జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) సిలబస్‌నే బోధిస్తున్నారు. అన్ని తరగతులకు ఒకే తరహా సిలబస్‌ ఉంది. పరీక్షా విధానం మాత్రమే ఆయా బోర్డుల ప్రకారం ఉంటుంది. ఇంగ్లిష్‌ నైపుణ్యాల పెంపునకు టోఫెల్‌ విద్యార్థులకు కమ్యూనికేషన్స్‌ స్కిల్స్, మంచి ఇంగ్లిష్‌ ఒకాబులరీ నైపుణ్యాలను అందించేందుకు 3వ తరగతి నుంచి టోఫెల్‌ శిక్షణ ప్రవేశపెట్టారు. అన్ని పాఠశాలల్లో టోఫెల్‌ బోధనకు ప్రత్యేకంగా పీరియడ్‌ కేటాయించారు. ఈ ఏడాది తొలిసారి నిర్వహించిన ‘టోఫెల్‌’ పరీక్షకు దాదాపు 16.50 లక్షల మంది విద్యార్థులు హాజరు కావడం గమనార్హం. ప్రతి విద్యార్థికీ డిజిటల్‌ బోధన నాడు–నేడు పనులు పూర్తయిన హైసూ్కళ్లలో ఇంటర్నెట్‌తో పాటు 62 వేల ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ), 45 వేల స్మార్ట్‌ టీవీలను అందించారు. వీటితో 3డీ పాఠాలను బోధిస్తున్నారు. దేశంలో 25 వేల ఐఎఫ్‌పీలు మాత్రమే ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో 62 వేల డిజిటల్‌ స్క్రీన్లు ఉండటం విశేషం. 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్‌ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్స్‌ ఇచ్చారు. ‘ఏపీ ఈ–పాఠశాల’ మొబైల్‌ యాప్, దీక్ష వెబ్‌సైట్, డీటీహెచ్‌ చానెళ్లు, యూట్యూబ్‌ చానెల్స్‌ ద్వారా నిరంతరం పాఠాలను విద్యార్థులకు చేరువ చేసింది. విద్యార్థులకు సబ్జెక్టుల్లో వచ్చిన సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్‌ క్లియరెన్స్‌ బాట్‌’ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. భావి నైపుణ్యాలపై విద్యార్థులకు శిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను భవిష్యత్‌ టెక్‌ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ‘ఫ్యూచర్‌ స్కిల్స్‌ కోర్సుల’ను జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆరు నుంచి ఇంటర్‌ వరకు మూడు దశల్లో విద్యార్థులకు ఫ్యూచర్‌ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆరి్టఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), 3డీ ప్రింటింగ్, గేమింగ్‌ వంటి 10 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఫెసిలిటేటర్స్‌గా నియమించారు. పేదలకు ‘ఐబీ’తో అంతర్జాతీయ విద్య పేదింటి పిల్లలు ప్రపంచానికి దిక్సూచిగా మారాలనే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌(ఐబీ) బోధన 2025 జూన్‌ నుంచి ఒకటో తరగతి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటిదాకా దేశంలో 210 వరల్డ్‌ క్లాస్‌ కార్పొరేట్‌ స్కూళ్లలో మాత్రమే ఐబీ సిలబస్‌ అమల్లో ఉంది. సంపన్నులు మాత్రమే చదివించగల ఐబీ చదువులను రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలోకి తెచ్చి పేద పిల్లలకు అందించాలన్న సంకల్పంతో జగన్‌ సర్కారు ముందడుగు వేసింది. ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ 2037 నాటికి +2 వరకు విద్యనందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. బాలికల కోసం ప్రత్యేకంగా జూనియర్‌ కాలేజీలు హైసూ్కల్‌ చదువు పూర్తయిన బాలికలు చదువు మానేయకుండా ప్రతి మండలంలోనూ వారి కోసం ఒక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైస్కూల్‌ ప్లస్‌గా అప్‌గ్రేడ్‌ చేశారు. 352 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఇంటరీ్మడియెట్‌ను ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కోఎడ్యుకేషన్‌ జూనియర్‌ కళాశాలలను గరŠల్స్‌ జూనియర్‌ కళాశాలలుగా మార్చారు. రాష్ట్రంలోని 679 మండలాల్లోనూ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలను తీసుకొచ్చారు. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్‌ బోధనప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 66,245 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు 3 నుంచి 10 తరగతులకు బోధించాలి. ఇందులో 59,663 మంది ఉపాధ్యాయులు ఇప్పటికే ఆ తరహా సేవలు అందిస్తున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో 6,582 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్‌జీటీ)కు పదోన్నతి కల్పించి సబ్జెక్ట్‌ టీచర్లు(స్కూల్‌ అసిస్టెంట్లు)గా హైసూ్కళ్లకు పంపించారు. ప్రతి స్కూల్లో ఎంత మంది ఉపాధ్యాయులు తగ్గారో ఒక్కరోజైనా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పరిశీలించని ‘ఈనాడు’ ఈ విషయంలోనూ కాకి లెక్కలు వేసింది. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు సుమారు 7 వేల వరకు ఉన్నాయి. అవన్నీ ఏజెన్సీ, కొండ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అక్కడ విద్యార్థుల సంఖ్య 8 నుంచి 15 మంది లోపే ఉన్నా ప్రతి బడికి ప్రభుత్వం ఉపాధ్యాయుడిని నియమించింది. ఇప్పటి వరకు పాకల్లోనూ, శిథిల గదుల్లోనూ కొనసాగిన వీటికి ‘నాడు–నేడు’ కింద కొత్త భవనాలను నిరి్మస్తోంది. కానీ ‘ఈనాడు’ నోటికొచ్చిన ఓ అంకెను ముద్రించి అసత్యాలను ప్రచురిస్తోంది. హేతుబదీ్ధకరణపైనా అసత్యాలే..రాష్ట్రంలో 2019 కంటే ముందు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయని పలు సంస్థల అధ్యయనాలు తేల్చాయి. దీంతో వైఎస్‌ జగన్‌ సర్కారు ప్రభుత్వ విద్యలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టి.. 1, 2 తరగతుల బోధన, అభ్యాసంపై దృష్టి పెట్టింది. 3, 4, 5 తరగతులను హైసూ్కల్‌ విద్యలోకి తీసుకురావడం ద్వారా బీఈడీ, సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌ ఉన్న సబ్జెక్ట్‌ టీచర్ల ద్వారా పిల్లలకు బోధన అందించి అభ్యసనా సామర్థ్యాలను బలోపేతం చేసింది.ఇందుకోసం ప్రాధమిక పాఠశాలల్లోని 3 నుంచి 5 తరగతులను హైసూ్కల్‌కు మార్చింది. ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ పిల్లలకు పీపీ–1, పీపీ–2తో పాటు ఒకటి, రెండు తరగతుల బోధన ప్రారంభించింది. దీంతో ఏ స్కూల్‌ను మూసివేయాల్సిన అవసరం తలెత్తలేదు. ఈ సంస్కరణలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సైతం స్వాగతించారు. కానీ గత టీడీపీ ప్రభుత్వం మాత్రం విద్యా సంస్కరణలు చేపట్టకుండా సరిపడినంత మంది విద్యార్థులు లేరన్న సాకుతో 2014–2019 మధ్య 1,785 పాఠశాలలను మూసివేయడం గమనార్హం. ఉన్నత విద్యకు అనువుగా ఇంగ్లిష్‌ మీడియం పదో తరగతి లేదా ఇంటర్‌ తర్వాత పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్‌ వంటి కోర్సులు పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంలోనే చదవాలి. పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్‌ మీడియం లేనివారు ఉన్నత విద్యలో వెనుకబడుతున్నారు. మరికొందరు మానే­స్తున్నారు. ఈ నేపథ్యంలో 2020లో రాష్ట్ర­వ్యాప్తంగా తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించగా 97 శాతం మంది ఇంగ్లిష్‌ మీడియం బోధన తప్పనిసరిగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీంతో జగన్‌ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టింది. విద్యార్థుల్లో ఇంగ్లిష్‌ భాషా నైపుణ్యాన్ని పెంచేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, డిక్షనరీలను కూడా అందించింది. ముగిసిన విద్యా సంవత్సరంలో 93 శాతం పైగా విద్యార్థులు ఇంగ్లి‹Ùలోనే పరీక్షలు రాయడం విశేషం. పదో తరగతిలో ఇంగ్లిష్‌ మీడియం అమలు చేయకున్నా 2.23 లక్షల మంది విద్యార్థులు కూడా ఇంగ్లిష్‌ మీడియంలో పరీక్షలు రాశారు. వీరిలో 1.96 మందికి పైగా ఉత్తీర్ణత సాధించారంటే ఇంగ్లిష్‌ బోధనను ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వేలోనూ 90 శాతం పైగా ఇంగ్లిష్‌ మీడియం చదువులనే కోరుకున్నారు.

CM Chandrababu who spread lies on Polavaram
జీవనాడి సాక్షిగా నిజాలు గోదాట్లోకి

సాక్షి, అమరావతి: పోలవరం సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాస్తవాలను గోదాట్లో కలిపేశారు. 2014–19 మధ్య అధికారంలో ఉండగా కమీషన్లకు ఆశ పడి తాను చేసిన తప్పిదాల వల్ల ప్రాజెక్టులో జరిగిన విధ్వంసం.. ఫలితంగా పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై నెడుతూ నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లించారు. చంద్రబాబు సర్కార్‌ చేసిన తప్పులను సరిదిద్దుతూ.. కరోనా లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్, పైలట్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తిచేసి 2021 జూన్‌ 11నే గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా 6.1 కిమీల పొడవున వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మళ్లించింది. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేయకుండా ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ గ్యాప్‌–2లో 1,396 మీటర్ల పొడవున డయాఫ్రమ్‌వాల్‌ నిర్మిం­చడం ద్వారా చంద్రబాబు సర్కార్‌ చారిత్రక తప్పిదానికి పాల్పడిందని.. ఆ తప్పు జరిగి ఉండకపోతే 2022 నాటికే అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ పోలవరాన్ని పూర్తి చేసి ఉండేవారని సాగునీటిరంగ నిపుణులు, అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు తొలిసారిగా పోలవరం పనులను సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. చారిత్రక తప్పిదంతో కోతకు గురైన డయాఫ్రమ్‌ వాల్‌⇒ విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరాన్ని కమీషన్లకు ఆశ పడి దక్కించుకున్న చంద్రబాబు సర్కార్‌ ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను తుంగలో తొక్కింది. సులభంగా చేయగలిగి, కాంట్రాక్టర్లకు అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇచ్చింది. ⇒ ప్రపంచంలో ఎక్కడైనా వరదను మళ్లించేలా స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌లు కట్టాకే ప్రధాన డ్యామ్‌ పనులు చేపడతా­రు. 2014–19 మధ్య పోలవరంలో చంద్రబాబు సర్కార్‌ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. గోదావరి వరదను మళ్లించే స్పిల్‌వే పునాది స్థాయి కూడా దాటలేదు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను ప్రారంభించనే లేదు. కానీ.. డ్యామ్‌ గ్యాప్‌–2లో పునాది డయాఫ్రమ్‌వాల్‌ పనులను 2017లో ప్రారంభించి 2018 జూన్‌ 11 నాటికి పూర్తి చేశారు. 35 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పింస్తామంటు హామీ ఇచ్చి 2018 నవంబర్‌లో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను ప్రారంభించారు. ఇదే ప్రధాన డ్యామ్‌గా చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. ⇒ 2019 ఫిబ్రవరి నాటికి కూడా నిర్వాసితులకు పునరా­వాసం కల్పింంచకపోవడంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సీడబ్ల్యూసీ ఇదే అంశాన్ని ప్రస్తావిస్త⇒ నిర్వాసితులకు పునరా­వాసం కల్పిస్తూ కాఫర్‌ డ్యామ్‌ల పనులు చేయాలని ఆదేశించింది. అయితే పునరావాసం కల్పింంచలేక ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి పనులు ఆపేశారు. ⇒ 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడంతో అదే ఏడాది మే 30న సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టారు. జూన్‌ రెండో వారంలోనే గోదావరికి వరద ప్రారంభమైంది. అంటే.. వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి, గోదావరి వరద ప్రారంభం కావడానికి మధ్య కేవలం 10 నుంచి 12 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ వ్యవధిలో కాఫర్‌ డ్యామ్‌లలో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయడం ఎలా సాధ్యమన్నది చంద్రబాబే చెప్పాలి. ⇒ గోదావరికి 2019లో భారీగా వరదలు వచ్చాయి. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద 2.4 కి.మీ. వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి వరద.. కాఫర్‌ డ్యామ్‌లు వదిలిన 800 మీటర్ల ఖాళీ ప్రదేశానికి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో వరద ఉద్ధృతి పెరిగి డయాఫ్రమ్‌వాల్‌లో నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై గ్యాప్‌–1లో 35 మీటర్ల లోతు, గ్యాప్‌–2లో 26 నుంచి 36.50 మీటర్ల లోతుతో కూడిన అగాధాలు ఏర్పడ్డాయి. ⇒ వీటిన్నింటినీ అధ్యయనం చేసిన ఐఐటీ–హైదరాబాద్, నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ సంస్థలు మానవ తప్పి­దం వల్లే పోలవరంలో విధ్వంసం చోటుచేసుకుందని తేల్చి చెప్పాయి. అంటే ఆ తప్పిదం చేసింది చంద్రబాబేనని తేల్చాయని సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు. విధ్వంసం వల్లే పనుల్లో జాప్యంనాడు చంద్రబాబు చారిత్రక తప్పిదాన్ని వైఎస్‌ జగన్‌ అధి­కా­రంలో ఉండగా సరిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. కేంద్ర జల్‌శక్తి శాఖ, పీపీఏ, సీడబ్ల్యూసీ అభ్యంతరాలను బేఖా­తరు చేస్తూ చంద్రబాబు సర్కార్‌ నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్‌ పద్ధతిలో నవయుగకు అప్పగించిన రూ.2,917 కోట్ల విలువైన కాంట్రాక్టు ఒప్పందాన్ని 2019 జూలైలో వైఎస్‌ జగన్‌ రద్దు చేసి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించారు. తద్వారా ఖజానాకు రూ.783.44 కోట్లు ఆదా చేశారు. గోదావరి వరద తగ్గాక 2019 నవంబర్‌లో వడివడిగా పనులు ప్రారంభించారు. అయితే 2020 మార్చి నుంచి 2021 చివరి వరక కరోనా మహమ్మారి విజృంభించడంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోన గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌­వే­ను 48 గేట్లు బిగించడంతో సహా ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేశారు. అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ ఛానల్, పైలట్‌ చానల్‌ను పూర్తి చేశారు. 2021 జూన్‌ 11న గోదావరి వరదను స్పిల్‌వే మీదుగా 6.1 కి.మీ.ల పొడవున మళ్లించారు. దిగు­వ కాఫర్‌ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు చేపట్టి పూర్తి చేశారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి కావడంతో ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలో చేరిన నీటిని తోడివేసి వరదల ఉద్ధృతి వల్ల ఏర్ప­డిన అగాధాలను సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్‌ చేస్త యథాస్థితికి తెచ్చా­రు. దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ స్థానంలో సమాంత­రంగా కొత్తగా డయాఫ్రమ్‌వాల్‌ నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న చోట్ల ‘యూ’ ఆకారంలో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మిం­చి అనుసంధానం చేయాలా? అనే విషయాన్ని సీడ­బ్ల్యూసీ తేల్చలేదు. సాంకేతికపరమైన ఈ అంశాన్ని తేల్చితే పనులు చేపట్టి వేగవంతంగా ఈసీఆర్‌ఎఫ్‌ పనులు పూర్తి చేస్తామని 2022 డిసెంబర్‌ నుంచి గత ప్రభుత్వం కేంద్ర జల్‌శక్తి శాఖ, సీడబ్ల్యూసీని కోరుత⇒ వచ్చింది. డయాఫ్రమ్‌ వాల్‌సహా ప్రాజెక్టు డిజైన్లపై కాంట్రాక్టు సంస్థ ఒక అంత­ర్జాతీయ ఏజెన్సీ సహకారం తీసుకోవాలని, తాము కూడా ఒక అంతర్జాతీయ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని.. రెండు సంస్థలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన డిజైన్‌ను ఆమోదించి పనులు చేయాలని సీడబ్ల్యూసీకి చెబుత⇒ వచ్చిం­ది. నాడు చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే విధ్వంసం జరిగేదే కాదని.. ఇప్పుడు పనుల్లో జాప్యానికి అదే కారణమవుతోందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 2029 నాటికే.. వరదల ప్రభావం వల్ల నవంబర్‌ వరక⇒ పోలవరం పను­లు చేపట్టడానికి సాధ్యం కాదు. డయాఫ్రమ్‌ వాల్‌ భవితవ్యాన్ని సీడబ్ల్యూసీ తేల్చితే నాలుగు సీజన్లలో పోలవరాన్ని పూర్తి చేయవచ్చని అధికారులు చెబుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నాటి టీడీపీ సర్కారు తప్పిదాలను వైఎస్‌ జగన్‌ చక్కదిద్దినప్పటికీ పోలవరాన్ని 2029 నాటికి గానీ పూర్తి చేయలేమని చంద్రబాబు అంగీకరించారని సాగునీటిరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కాఫర్‌ డ్యామ్‌ల లీకేజీల పాపం బాబు సర్కార్‌దే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పనులు చేపట్టడానికి వీలు­గా లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి జెట్‌ గ్రౌటింగ్‌ చేయాలి. నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం గోదావరి నదిలో ఇసుక ఫరి్మయబులిటీ విలువను 2018లో అప్పటి కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ తప్పుగా మదింపు చేసింది. దాన్నే పరిగణనలోకి తీసుకుని 30 నుంచి 35 మీటర్ల లోతువరక⇒ స్టోన్‌ కాలమ్స్‌ వేసి జెట్‌ గ్రౌటింగ్‌ చేయకుండా కేవలం 20 మీటర్ల లోతు వరక⇒ జెట్‌ గ్రౌటింగ్‌ చేసేలా డిజైన్‌లు రూపొందించింది. నవయుగ సంస్థ ఆ మేరకే జెట్‌ గ్రౌటింగ్‌ చేసి కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టింది. జెట్‌ గ్రౌటింగ్‌ నిబంధనల మేరకు చేసి ఉంటే ఎగువ, దిగు­వ కాఫర్‌ డ్యామ్‌లలో లీకేజీ సమస్య ఉత్పన్నమయ్యేది కాద­ని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తన హయాంలో జరిగిన ఈ తప్పిదాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై నెట్టేందుకు సీఎం చంద్రబాబు యతి్నంచడం గమనార్హం. రూ.12,157.53 కోట్లకు మోకాలడ్డు పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేస్తానని 2016 సెపె్టంబరు 7న చంద్రబాబు కేంద్రానికి హామీ ఇచ్చా­రు. 2013–14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్య­యం రూ.20,398.61 కోట్లే. ఇందులో 2014 ఏప్రిల్‌ 1 వర­కు చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లుపోను మిగతా రూ.15,667 కోట్లే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అయితే 2017–18 ధరల ప్రకారం పునరావాసం, భూసేకరణ వ్యయమే రూ.33,168.23 కోట్లు ఉంది. అందువల్ల రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని, తాజా ధరల మేరకు నిధులిచ్చి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని 2019 మే 30 నుంచి పలుదఫాలు ప్రధాని మోదీని అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ కోరుతూ వచ్చారు. దానికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రధాని ఆదేశాల మేరకు తొలి దశ పూర్తికి రూ.12,157.53 కోట్లు అవసరమని కేంద్ర జల్‌ శక్తి శాఖ తేల్చింది. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపింది. అప్పటికే బీజేపీతో పొత్తు కుదరడంతో పోలవరానికి నిధుల విడుదల ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ ముందు పెట్టవద్దని, తమకు రాజకీయంగా ఇబ్బందులు వస్తాయంటూ చంద్రబాబు అడ్డుపుల్ల వేశారు. దీంతో అప్పట్లో కేంద్ర కేబినెట్‌ ఆ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేయలేదు. ప్రస్తుతం ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న ఆ ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్‌తో ఆమోదముద్ర వేయిస్తే నిధుల సమస్య తీరుతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సాంకేతిక సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం సీడబ్ల్యూసీ ద్వారా ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఆ ప్రణాళికను అమలు చేయడం ద్వారా ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని సాగునీటిరంగ నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement