చొరబాట్లకు ఆర్మీ చెక్‌  | Army opens fire after suspicious movement along LoC in Jammu Kashmir | Sakshi
Sakshi News home page

చొరబాట్లకు ఆర్మీ చెక్‌ 

Mar 5 2026 6:28 AM | Updated on Mar 5 2026 12:22 PM

Army opens fire after suspicious movement along LoC in Jammu Kashmir

రాజౌరీ జిల్లాలో అడ్డుకున్న సరిహద్దు బలగాలు  

రాజౌరీ/జమ్మూ: తెల్లవారుజామున గుట్టుచప్పుడుకాకుండా భారత భూభాగంలోకి చొరబడేందుకు తెగించిన ముష్కరులను బుల్లెట్ల వర్షంతో భారత సరిహద్దు దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. బుల్లెట్‌ గాయాలతో చనిపోయిన లేదా గాయపడిన ఉగ్రవాదుల కోసం వేట మొదలెట్టారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని భీమ్‌బేర్‌ గలీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వివరాలను ఆర్మీ అధికారులు ‘ఎక్స్‌’ఖాతాలో పోస్ట్‌చేశారు. 

బుధవారం తెల్లవారుజామున సరిహద్దు ఆవల పాకిస్తాన్‌ నుంచి భీమ్‌బేర్‌ గలీలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయతి్నస్తున్నారన్న నిఘా సమాచారంతో ఆరీ్మలోని వైట్‌ నైట్‌ కోర్‌ దళ సభ్యులు రంగంలోకి దిగి ఆ ప్రాంతంపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో ఉగ్రవాదులు వెనక్కి పారిపోయారు. ‘‘మన బలగాలు శత్రుదుర్భేద్య గోడలా నిల్చున్నారు. ప్రతి చొరబాటు యత్నం విఫలం కావాల్సిందే’’అని ఆర్మీ వ్యాఖ్యానించింది. ఫిబ్రవరి 19వ తేదీ రాత్రి సైతం ఇలాగే రాజౌరీలోని సుందర్‌బనీ సెక్టార్‌లో ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించగా భారత బలగాల కాల్పుల మోతకు వెనక్కి పారిపోవడం తెల్సిందే.  

Advertisement
 
Advertisement
Advertisement