హర్యానాలో కర్ఫ్యూ విధించిన సూర్యుడు | Sakshi
Sakshi News home page

హర్యానాలో కర్ఫ్యూ విధించిన సూర్యుడు

Published Mon, May 20 2024 9:20 AM

Chandigarh City Weather Report Curfew Like situation in Markets

హర్యానాలో వేసవి తాపం బీభత్సం సృష్టిస్తోంది. దీంతో పగటిపూట ఎక్కడ చూసినా కర్ఫ్యూ  లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చండీగఢ్‌తో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణీయంగా పెరిగాయి. దేశంలోని హాటెస్ట్ నగరాల్లో హర్యానాలోని నుహ్ రెండో స్థానంలో ఉంది. దేశంలోనే అత్యంత వేడిగా ఉండే నగరంగా యూపీలోని ఆగ్రా నిలిచింది.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం హర్యానాలోని 25 నగరాల్లో  ఉష్ణోగ్రతలు  45 డిగ్రీల కంటే  అధికంగా నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ హర్యానాలోని 11 జిల్లాల్లో మే 23 వరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జాబితాలో మహేంద్రగఢ్, రేవారీ, గురుగ్రామ్, నుహ్, పల్వాల్, ఫరీదాబాద్, సిర్సా, ఫతేహాబాద్, హిసార్, భివానీ, చర్కి దాద్రీ జిల్లాలు ఉన్నాయి. పంచకుల, అంబాలా, యమునానగర్, కురుక్షేత్ర, కైతాల్, కర్నాల్, ఝజ్జర్, రోహ్‌తక్, సోనిపట్, పానిపట్, జింద్ 11 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

మరోవైపు అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు పలు  వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంబాలాలో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పగటిపూట మార్కెట్లు వెలవెల బోతున్నాయి. సాయంత్రం పూట కొద్దిసేపు మాత్రమే వ్యాపారం జరుగుతున్నదని దుకాణదారులు వాపోతున్నారు. ఒకప్పుడు సందడిగా ఉండే మార్కెట్లు ఇప్పుడు ఎండ వేడిమి కారణంగా నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement