
లా నినా ఎఫెక్ట్‌తో.. డిసెంబర్ దాకా వణుకుడే..
ఈ సంవత్సరం చివర్లో లా నినా పరిస్థితులు తిరిగి రావచ్చని, ఇది ప్రపంచ వాతావరణ నమూనాలను నిర్ధేశ్యించనుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. మన శీతాకాలాన్ని సాధారణం కంటే చాలా చల్లగా మార్చే అవకాశం ఉందని వీరు హెచ్చరిస్తున్నారు. రానున్న అక్టోబర్ డిసెంబర్ 2025 మధ్య లా నినా అభివృద్ధి చెందడానికి 71 శాతం అవకాశం ఉందని సెప్టెంబర్ 11న నేషనల్ వెదర్ సర్వీస్‌కు చెందిన క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్ తెలిపింది. ఇది అలాగే కొనసాగి డిసెంబర్ 2025 నుంచి తగ్గడం మొదలవుతుందని ఫిబ్రవరి 2026 మధ్యకు వచ్చేసరికి 54%కి తగ్గుతుందని వెల్లడించింది. కానీ లా నినా వాచ్ అప్పటికీ ప్రభావం చూపుతూనే ఉంటుందంది.
ఎల్ నినో–సదరన్ ఆసిలేషన్ (ఇఎన్‌ఎస్‌ఓ) శీతలీకరణ దశ అయిన లా నినా, భూమధ్యరేఖ పసిఫిక్‌లో సముద్ర ఉష్ణోగ్రతలను మారుస్తుంది తద్వారా ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై చాలా గాఢమైన ప్రభావాలను చూపుతుంది. ఈ ప్రభావం భారతదేశంపైన ఎలా ఉంటుంది అనే విషయానికొస్తే, ఇది తరచుగా సాధారణం కంటే చల్లగా ఉండే శీతాకాలాలను మనం ఎదుర్కోవలసి రావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
భారత పౌరాణిక విభాగం (ఐఎమ్‌డి) తన ఇటీవలి తన ఇఎన్‌ఎస్‌ఓ బులెటిన్‌లో భూమధ్యరేఖ పసిఫిక్‌పై ప్రస్తుతం తటస్థ పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది అంటే ఎల్ నినో లేదా లా నినా పరిస్థితి లేదు). ఐఎమ్‌డి కి చెందిన మాన్సూన్ మిషన్ క్లైమేట్ ఫోర్కాస్ట్ సిస్టమ్ (ఎమ్‌ఎమ్‌సిఎఫ్‌ఎస్) ఇతర అంచనాలు, ఈ తటస్థ పరిస్థితులు రుతుపవనాల సీజన్ మొత్తం కొనసాగుతాయని తేల్చాయి. అయితే రుతుపవనాల తర్వాత నెలల్లో లా నినా ఆవిర్భవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా అంచనా వేశాయి.
ఈ నమూనాలు ఈ సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ (50% కంటే ఎక్కువ) మధ్య లా నినా అభివద్ధి చెందే అవకాశాలను చూపిస్తున్నాయని ఐఎమ్‌డి శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. వాతావరణ మార్పులు భూ ఉపరితలం వేడెక్కడం ప్రభావం కొంతవరకు దీనిని భర్తీ చేయగలదు, లా నినా ఉన్న శీతాకాలాలు అది లేని సంవత్సరాలతో పోలిస్తే మరింత చల్లగా ఉంటాయని స్పష్టం చేశారు.
ప్రైవేట్ ఫోర్కాస్టర్ స్కైమెట్ వెదర్ అధ్యక్షుడు జిపి శర్మ మాట్లాడుతూ స్వల్పకాలిక లా నినా ఎపిసోడ్‌ను తోసిపుచ్చలేమని అన్నారు. ‘పసిఫిక్ మహా సముద్రం ఇప్పటికే సాధారణం కంటే చల్లగా ఉంది, అయినప్పటికీ లా నినా పరిమితుల వద్దకు ఇంకా రాలేదు. అయితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు –0.5నిఇ కంటే తక్కువగా పడిపోయి అదే విధంగా కనీసం మూడు త్రైమాసికాల పాటు కొనసాగితే, దానిని లా నినాగా ప్రకటిస్తారు.
2024 చివరిలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. నవంబర్ నుంచి జనవరి వరకూ లా నినా పరిస్థితులు కాస్త కనిపించి, మళ్ళీ తటస్థంగా మారిందన్నారు. కొనసాగుతున్న పసిఫిక్ శీతలీకరణ ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని శర్మ అన్నారు. ‘లా నినా ప్రారంభమైతే ఏర్పడే పొడి శీతాకాలాల కోసం అమెరికా ఇప్పటికే అప్రమత్తంగా ఉంది. భారత దేశానికి, చల్లటి పసిఫిక్ జలాలు సాధారణంగా కఠినమైన శీతాకాలాలుగా మారతాయి.
ముఖ్యంగా ఉత్తర హిమాలయ ప్రాంతాలలో హిమపాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది‘ అని ఆయన అంచనా వేస్తున్నారు. మొహాలి (పంజాబ్)లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఇఆర్) బ్రెజిల్‌లోని నేషనల్ ఇన్సి్టట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్ చేసిన 2024 అధ్యయనం ప్రకారం, ఉత్తర భారతదేశంపై తీవ్రమైన చలి తరంగాలను ప్రేరేపించడంలో లా నినా పరిస్థితులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేలింది. ‘లా నినా సమయంలో దేశంలోకి చల్లని గాలి ప్రవేశిస్తుంది. ‘ఎల్ నినో, తటస్థ సంవత్సరాలతో పోలిస్తే లా నినా సంవత్సరాల్లో శీతల తరంగ సంఘటనల ఫ్రీక్వెన్సీ వ్యవధి కూడా ఎక్కువగా ఉన్నాయి‘ అని అధ్యయనం తేల్చింది.