ప్రపంచంలోనే అత్యంత శీతల మార్కెట్..! కొనాలంటే గజగజ వణకాల్సిందే..
గజగజలాడించే చలిప్రాంతాలు గురించి ఉన్నాం. అయితే మార్కెట్లు వ్యాపార ప్రాంతాలు కాస్త అనువైన ప్రదేశాల్లో, సాధారణ ఉష్ణోగ్రతలు ఉండే చోటనే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మార్కెట్ మాత్రం గడ్డకట్టుకుపోయే మార్కెట్. అక్కడ కొనుగోలు చేయడానికి వెళ్లాలంటే తగిన జాగ్రత్తలతో వెళ్లకపోతే అంతే సంగతులు. అంతలా వణుకుపుట్టిస్తుంది అక్కడ చలి. శీతాకాలంలో అయితే ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 60 డిగ్రీలకు పడిపోతుందట. అంతలాంటి పరిస్థితుల్లోనూ అక్కడ జనాభా వృద్ధి చెందుతుండటం విశేసం. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుందంటే..సైబీరియాలోని యాకుట్స్క్ అనే నగరం అత్యంత శీతల నగరంగా పేరుగాంచింది. అక్కడ నివాసితులు సాధారణ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నట్లుగా మనుగడ సాగించటం విశేషం. వాళ్లేమి ఆ చలిని పెద్దగా లెక్కచేయరు. అది వారికి అత్యంత సర్వసాధారణం. అక్కడ ఒక నాన్వెజ్ మార్కెట్ ఉంటుంది. సందర్శనకు వెళ్లితే గజగజ వణికిపోవాల్సిందే. దీనిపై ట్రావెల్ వ్లాగర్ అంకితా కుమార్ డాక్యుమెంట్ చేసి మరీ ఈ నగరం విశేషాల గురించి వివరించింది. ఎముకలు కొరికే చలిలో మార్కెట్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు అక్కడి ప్రజలు. యాకుట్స్క్ నగరవాసులు మాంసం బాగా తింటారట. అక్కడ చేపల మార్కెట్లు కూడా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయట. ఎలాంటి వాసనరాదట. అక్కడ గుర్రం, రెయిన్ డీర్, కుందేలు, కొన్ని రకాల పచ్చి మాంసాలు, చేపలు తదితరాలను విక్రయిస్తుంటారట. అక్కడ స్థానిక ప్రజలకు బాగా ఇష్టమైనది గుర్రపు కాలేయం అట. ఈ మార్కెట్ సందర్శించాలనుకుంటే రెడీమేడ్గా తినగలిగే పదార్థాలను తీసుకువెళ్లితే మంచిదట. ఇంతలా వణికించే చలికి తగ్గట్టుగానే వేసవి ఉష్ణోగ్రతలు ఓ రేంజ్లో ఉంటాయట. జూలైలో యాకుట్స్క్ సగటు అధిక ఉష్ణోగ్రత 78 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుందట. ఇది లండన్తో పోలిస్తే మరింత ఎక్కువని చెబుతోంది ట్రావెల్ వ్లాగర్ అంకితా కుమార్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరీ.. View this post on Instagram A post shared by Ankita Kumar 🇮🇳| TRAVEL (@monkey.inc) (చదవండి: పొట్ట ఫ్లాట్గా ఉండాలా..? ఐతే సాయంత్రం ఆరు తర్వాత ఆ ఆరు ఆహారాలను నివారించండి!)