‘మరోసారి చంద్రబాబు రహస్య విదేశీ టూర్‌’ | YSRCP State General Secretary Lakshmi Parvathi Slams Chandrababu Tours, Demands Clarity On His Whereabouts, Watch Video | Sakshi
Sakshi News home page

‘మరోసారి చంద్రబాబు రహస్య విదేశీ టూర్‌’

Sep 28 2026 4:11 PM | Updated on Sep 28 2026 4:32 PM

YSRCP State General Secretary Lakshmi Parvathi Slams Chandrababu Tours
  • మూడు రోజులుగా పత్తా లేని చంద్రబాబు
  • రాష్ట్రంలో సమస్యలు వదిలేసి రహస్య టూర్ 
  • పట్టించుకోకుండా కేంద్రం మొద్దునిద్రపోతోందా ?
  • వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఫైర్

తాడేపల్లి:  రాష్ట్రం ఓవైపు ఉద్యోగులు, నిరుద్యోగుల ఆందోళనలతో అట్టుడుకుతోందని, మరోవైపు కరువు, వరదలతో రైతులు కష్టాల్లో ఉన్నారని, అయినా ఇవేవీ పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు మూడు రోజులుగా రహస్య పర్యటనల్లో ఉన్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. రాష్ట్రంలో సమస్యల్ని వదిలేసి చంద్రబాబు దోచుకున్న డబ్బు దాచుకోవడానికి విదేశాలకు రహస్య టూర్లు చేస్తుంటే, కేంద్రం మొద్దునిద్రలో ఉందని లక్ష్మీపార్వతి ఆక్షేపించారు. గతంలో సీఎంగా ఉండగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టు అనుమతితో, వివరాలు ఇచ్చి విదేశాలకు వెళ్లినా కారుకూతలు కూసిన లోకేష్..ఇప్పుడు తన తండ్రి ఎక్కడికి వెళ్లాడో సమాధానం చెప్పాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. 

ప్రెస్ మీట్లో లక్ష్మీపార్వతి ఇంకేమన్నారంటే..

సమస్యలు గాలికొదిలేసి చంద్రబాబు రహస్య టూర్లు
మూడు రోజులైనా చంద్రబాబు అడ్రస్ లేడు, అయినా ఆయన ఇక్కడే ఉన్నట్లు పచ్చ మీడియా బిల్డప్ లు ఇస్తోంది. చంద్రబాబు ఈ రహస్య ప్రయాణాలు ఎందుకు పెట్టుకుంటున్నారు ?, రాష్ట్రవ్యాప్తంగా ఓవైపు ఆందోళనలు, మరోవైపు కరువు, ఇంకోవైపు అతివృష్టితో ఉత్తరాంధ్ర వరదలు వచ్చి మునిగిపోయింది. ఉత్తరాంధ్రలో వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అటు రాయలసీమలో చూస్తే కరవుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. 

మరోవైపు డీఎస్సీ అభ్యర్ధులు న్యాయం కోసం రోడ్డెక్కుతున్నారు. ఇలా ఎటు చూసినా కల్లోలమే. ఇన్ని రకాల సమస్యలు రాష్ట్రాన్ని చుట్టుముడుతుంటే, జనం ఆందోళనలు చేస్తుంటే.. ముఖ్యమంత్రి ఎటుపోయాడు? ఏ ప్రభుత్వంలో అయినా ముఖ్యమంత్రి ఇలా చెప్పకుండా,  తాను ఎక్కడికి పోతున్నాడో కూడా చెప్పలేని పరిస్ధితుల్లో ఉన్నాడా? గతంలోనూ చంద్రబాబు ఫ్యామిలీ టూర్ పేరుతో ఇలాంటి పర్యటనలే చేశాడు. కస్టమ్స్ తనిఖీ కూడా ఉండదు కాబట్టి సూట్ కేసులతో స్పెషల్ ఫ్లైట్లతో తిరుగుతుంటాడు. 

ఇలా ప్రతీసారీ తాను దోచుకున్న డబ్బు దాచుకోవడానికి వెళ్లి వస్తుంటాడు. మాల్దీవులు, ఇండోనేషియా, మారిషస్, సింగపూర్ వంటి దేశాలకు వెళ్లి డబ్బులు దాచుకుంటూ ఉంటాడు. సింగపూర్ లో అయితే ఓ పెద్ద హోటలే కట్టేశారు. అప్పట్లో దావూద్ ఇబ్రహీంతో చెప్పి తన సమస్య పరిష్కరించుకున్నాడు. ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా చేస్తాడా ? భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో అయినా ఇలా చేశాడా? కేంద్రం ఎందుకు ఆయనపై  నిఘా పెట్టలేకపోతోందా ? ఓ ముఖ్యమంత్రి వ్యక్తిగత టూర్ పేరుతో ఇలా రహస్య పర్యటనలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ?

జగన్ వివరాలు ఇచ్చి వెళ్లినా కారుకూతలు కూసేవారు
జగన్ మోహన్ రెడ్డి గారు అయితే గతంలో ఏ దేశం వెళ్తున్నారో సీబీఐకి, కోర్టుకు వివరాలు ఇచ్చి మరీ వెళ్లారు. అవి వ్యక్తిగత పర్యటనలు అయినా సరే ఏ దేశం వెళ్తున్నారో వివరాలు మాత్రం ఇచ్చేవారు. కానీ ఇవాళ చంద్రబాబు మాత్రం ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు. దోపిడీ సొమ్ము దాచుకోవడానికే ఇలా చెప్పకుండా రహస్యంగా టూర్లకు వెళ్తున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. గతంలో జగన్ మోహన్ రెడ్డి గారు సీబీఐ అనుమతి తీసుకుని మరీ విదేశాలకు వెళ్తే.. బుర్రా బుద్దీ లేని సకల శాఖ మంత్రి లోకేష్ మాత్రం కారుకూతలు కూశారు. 

అలాంటి హీనసంస్కారంతో పెరిగిన వ్యక్తి .. స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ స్టూడెంట్ అంటే నమ్మలేం. ఎందుకంటే లోకేష్ ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్ వీధి రౌడీలా ఉంటుంది. చూసే వాళ్లకు అంత హీనంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా టూర్ వివరాలు ఇచ్చి వెళ్లినా కారుకూతలు కూసిన పచ్చ మీడియా ఇప్పుడు చంద్రబాబు ఎక్కడున్నాడో సమాధానం చెప్పాలి కదా. ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేకపోయినా ఉన్నట్లు ప్రచారాలు చేస్తున్న ఎల్లో మీడియా .. రాష్ట్రాన్ని దిగజారుస్తోంది. మీరంతా ఆంధ్రప్రదేశ్ ను 50 ఏళ్లు వెనక్కి తీసుకుపోయారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పరిశ్రమలన్నీ ఎటుపోయాయి, 

ఫ్యామిలీ టూర్ పేరుతో నువ్వు నీ కొడుకు ఎక్కడి వెళ్తున్నారో చెప్పమంటావా

పెట్టుబడిదారులంతా రాష్ట్రం వదిలి పారిపోతున్నారు. మీ రెడ్ బుక్ దోపిడీ వ్యవస్థ అందరినీ ఆ స్ధాయిలో భయపెడుతోంది. పార్టీలో కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఓ పరిశ్రమ వస్తే చాలు లంచాల కోసం వేధిస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? నదుల గర్భాన్ని తొలిచేసి మరీ ఇసుక అమ్ముకుంటున్నారు. వేల సంవత్సరాలుగా పూజలందుకుంటున్న కొండల్ని సైతం సీఎం రమేశ్ వంటి వారు తవ్వేస్తున్నారు. ఎంపీగా దొంగచాటుగా ఎన్నికైన ఇలాంటి వ్యక్తికి అక్కడి సంపద దోచుకునే హక్కు ఎక్కడిది ?

చంద్రబాబు, లోకేష్‌కు ప్రజల ఉసురు తప్పదు
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమలు చేసిన సంక్షేమం,  విద్య, వైద్యంలో అభివృద్ది వల్ల ఏ రోజూ పేదవాడు రోడ్డుపైకి రాలేదు. అది నిజమైన విజన్. నాడు-నేడులో స్కూల్స్ అభివృద్ది చేసి పిల్లల డ్రాప్ అవుట్ లేకుండా చేశారు. కానీ ఇప్పుడు వేల మంది విద్యయార్దులు స్కూల్స్ మానేస్తున్నారు. 40 ఏళ్ల చంద్రబాబు అనుభవం అంతా ఏమైంది ? చంద్రబాబుకు పాలన చేతకాదని నేను ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నాను. ఫ్యామిలీ టూర్ల పేరుతో దోపిడీ చేసిన డబ్బంతా చంద్రబాబు విదేశాలకు తరలిస్తుంటే కేంద్రం నిద్రపోతోందా ? కేంద్రానికి బాధ్యత లేదా ? నిఘా వర్గాలకు బాధ్యత లేదా ? డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి ఈ దోపిడీని కేంద్రం ప్రోత్సహిస్తూనే ఉంటుందా ? డీఎస్సీలో ఒక్కో ఉద్యోగం 15లక్షలకు అమ్ముకున్నారు కాబట్టి, ఆ డబ్బంతా తరలించేందుకు రహస్య టూర్లు వేస్తున్నారు. 

ఈ విషయం ప్రజలకూ అర్దమైంది. వీళ్లు రహస్య టూర్ అనేసరికి ఎంత సొమ్ము తీసుకుపోతున్నావంటూ సోషల్ మీడియాలో జనం ప్రశ్నిస్తున్నారు. మీరు విమర్శించేటప్పుడు కాస్తయినా బుర్ర ఉపయోగించండి. జగన్మోహన్ రెడ్డి గారిపై పిచ్చి ప్రేలాపనలు చేసే లోకేష్.. తన భాషలోనే తన తండ్రి ఎక్కడికి వెళ్లాడో అడుగు. మళ్లీ ఇలాంటి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే మర్యాద దక్కదని లోకేష్ ను హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో తాగడానికి నీళ్లు లేవు, వ్యవసాయానికి నీళ్లు లేవు. ఇవన్నీ వదిలేసి చంద్రబాబు రహస్య టూర్లు వేస్తారా? ఈ టూర్ నుంచి వచ్చాక అయినా చంద్రబాబు తన రహస్య టూర్ వివరాలు బయటపెట్టకపోతే బాధ్యతారాహిత్యంగానే ప్రజలు భావించాల్సి ఉంటుంది. 

అసలు ముఖ్యమంత్రిని సైతం పట్టించుకునే పరిస్ధితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జనం కడుపులో చల్ల కదలకుండా హాయిగా నిద్రపోయారు, పిల్లల్ని బాగా చదివించుకున్నారు, రైతులు కరువు లేకుండా నదులు, చెరువులు ఉప్పొంగి ప్రవహించాయి. రాయలసీమలో సైతం నదులు, కాలువలు నిండి పంట దిగుబడులు పెరిగాయి. చంద్రబాబు అడుగుపెట్టగానే అంతా నాశనమైంది. రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినట్లు కరువు, చంద్రబాబు కవల పిల్లలు. నీ కొడుకు లోకేష్ ఒక్కటే బాగుపడాలా? ఒక్కడిని కాపాడేందుకు డీఎస్సీ తప్పుల్ని కప్పిపుచ్చుతున్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టిస్తున్నారు. 

ఇదేం పాలన చంద్రబాబూ? ఒక్కసారైనా నీకు పశ్చాత్తాపం కలగదా ? కొన్ని లక్షల కోట్లు ఇప్పటికే సంపాదించుకున్నాం.. ఇప్పటికైనా పేద వర్గాలకు న్యాయం చేయాలని తండ్రీ కొడుకులు ఎందుకు అనుకోరు. అమరావతి పేరుతో చంద్రబాబు  దోపిడీ చేస్తే, డీఎస్సీ స్కాం పేరుతో లోకేష్ దోపిడీ చేస్తున్నారు. వీరిద్దరికీ మానవత్వం లేదు, ఎప్పుడు కనువిప్పు అవుతుందో కూడా తెలియదు. కాలం విధించే శిక్షలకు మీరిద్దరూ సిద్దంగా ఉండండి. ఇంత మంది ప్రజల్ని బాధపెట్టిన ఉసురు మీకు కచ్చితంగా తగులుతుంది. దాన్ని అనుభవించడానికి చంద్రబాబు, లోకేష్ సిద్దపడాలని లక్ష్మీపార్వతి హెచ్చరించారు.

ఇదీ చదవండి: చంద్ర‌బాబు స‌ర్కారుపై కాకర్ల ధ్వ‌జం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement