‘రీసర్వే పేరుతో 300 ఎకరాలు కబ్జా చేశారు’ | Kaile Anil Kumar complains to Krishna District Collector | Sakshi
Sakshi News home page

‘రీసర్వే పేరుతో 300 ఎకరాలు కబ్జా చేశారు’

Sep 28 2026 4:32 PM | Updated on Sep 28 2026 4:55 PM

Kaile Anil Kumar complains to Krishna District Collector

పామర్రు(కృష్ణాజిల్లా):  జిల్లాలోని పామర్రు నియోజకవర్గం పరిధిలోని లంకపల్లి లంక భూముల అన్యాక్రాంతం పై జిల్లా కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిలో భాగంగా కైలే అనిల్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘కూటమి ప్రభుత్వం అక్రమార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తుంది. 

లంకపల్లి గ్రామ పరిధిలోని సుమారు 300 ఎకరాల భూములను రి సర్వే పేరుతో అక్రమార్కులు కబ్జా చేశారు. పామర్రు ఎమ్మెల్యే , అధికారులు కుమ్మక్కై 200 కోట్ల విలువైన భూములు దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారు. 

గతంలో ఇదే విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది. 300 ఎకరాల భూమిని రికార్డులు తారుమారు చేసి అన్యాయంగా ఇసుక తవ్వకాలను కూటమి నేతలు చేపడుతున్నారు. రైతులకు సంబంధించిన భూములను నదిలో ఉన్నట్లుగా నివేదికలు రూపొందించారు. 

జిల్లా ఉన్నతాధికారులు ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టేలా చర్యలు చేపట్టాలి. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పామర్రులో జరిగే ఇసుక అక్రమాలపై రాజీలేని పోరాటాలు సాగిస్తాం. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం పట్టించుకోకుండా రోజుకు 400 టిప్పర్ల ఇసుకను అన్యాయంగా తరలించుకుని పోతున్నారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ‘మరోసారి చంద్రబాబు రహస్య విదేశీ టూర్‌’

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement