పర్యాటకుడు ప్రకృతికి అతిథి.. | Responsible Tourism Environment Local Development | Sakshi
Sakshi News home page

పర్యాటకుడు ప్రకృతికి అతిథి..

Sep 26 2026 12:20 PM | Updated on Sep 26 2026 12:20 PM

Responsible Tourism Environment Local Development

ఇన్‌ బాక్స్‌

పర్యాటకం అంటే కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతా నికి వెళ్లడం కాదు. భిన్న సంస్కృతులను దగ్గర చేసే వంతెన. ఉపాధిని పెంచుతూ, ప్రజల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించే శక్తిమంతమైన సాధనం. మనం సందర్శించే ప్రాంతం ప్రకృతికి, స్థానిక ప్రజలకు, భవిష్యత్‌ తరాలకు నష్టం కలగకుండా ఉండేలా చూసు కోవాలి. అందుకే పర్యాటక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వా ల్సిన అవసరం ఉంది.

హోటళ్లు, రవాణా సంస్థలు, రెస్టారెంట్లు, చిరువ్యాపా రులు, హస్తకళాకారులు, గైడ్లు, స్థానిక కళాకారులు... ఇలా అనేక వర్గాలకు ఉపాధి, ఆదాయం లభిస్తాయి. పర్యాటకాన్ని ప్రోత్సహించడం అంటే స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి ఇవ్వడమే.

పర్యాటక ప్రాంతాల్లో తరచూ ప్లాస్టిక్, ఆహార వ్యర్థాలు పేరుకుపోతూ ఉండటం వల్ల ప్రకృతి సౌందర్యం దెబ్బ తినడమే కాదు, దానికి తీవ్రమైన హాని కలుగుతుంది. పర్యాటక అభివృద్ధి పేరుతో ప్రకృతిపై మితి మీరిన ఒత్తిడి తీసుకురావడం చివరకు పర్యాటకానికే నష్టం చేస్తుంది. ఈ పరిస్థితిని మార్చాలంటే ‘బాధ్యతాయుతమైన పర్యాటకం’ ఆచరణలోకి రావాలి.

ఒక ప్రాంతం భరించగలిగిన దాని కంటే ఎక్కువమంది పర్యాట కులు ఒకేసారి చేరుకుంటే నీటి కొరత, చెత్త నిర్వహణ, ట్రాఫిక్, వసతి, పారిశుద్ధ్యం వంటి సమస్యలు తీవ్రతరం కావచ్చు. స్థానిక సంస్థలు కూడా శాస్త్రీయంగా వ్యర్థాలను నిర్వహించడం నేర్చుకోవాలి. అందుకు తగిన పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

పర్యాటక అభివృద్ధి అంటే ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడం కాదు, ప్రకృతిని కాపాడే, స్థానికులకు ప్రయోజనం చేకూర్చే పర్యాటక విధానాన్ని రూపొందించడం కూడా! పర్యాటకులు, స్థానిక ప్రజలు, వ్యాపార వర్గాలు, ప్రభుత్వ విభాగాలు కలిసి పనిచేసినప్పుడే ఈ సమతు ల్యత సాధ్యం. భారతీయ సంస్కృతిలో ‘అతిథి దేవోభవ’ అనే గొప్ప భావన ఉంది.

అదే సమయంలో అతిథిగా వచ్చే ప్రతి పర్యాటకుడు కూడా తాను సందర్శించే ప్రాంతాన్ని, సంస్కృతిని, స్థానిక ప్రజల జీవన విధానాన్ని గౌర వించాలి. ఆతిథ్యం ఇచ్చేవారు సౌకర్యాలు, భద్రత, పరిశుభ్రత కల్పిస్తే... పర్యాటకులు బాధ్యత, క్రమశిక్షణ, పర్యావరణ స్పృహతో వ్యవహరించాలి. అప్పుడే ‘అతిథి దేవోభవ’ స్ఫూర్తి పరిపూర్ణమవుతుంది.
– వాడవల్లి శ్రీధర్‌, ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు (రేపు ప్రపంచ పర్యాటక దినోత్సవం)

ఇదీ చదవండి: ఆటపాటల ప్రజా కళాజాతర..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement