సాధారణంగా మనం కూర్చునే ప్లాస్టిక్ స్టూల్ మధ్యలో రంధ్రం ఉంటుంది. మీరెపుడైనా ఆలోచించారా? అది ఎందుకు ఏర్పాటు చేస్తారో..! అది అలంకారం కోసం పెట్టింది కాదు. స్టూల్‌ను తయారు చేయడం, మోయడం, ఉపయోగించడం సులభంగా ఉండేందుకు ఈ చిన్న రంధ్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు.
స్టూల్ మధ్యలో రంధ్రం ఉండటం వల్ల స్టూల్‌ను పట్టుకుని ఒకచోట నుంచి మరోచోటికి సులభంగా తరలించవచ్చు. అలాగే తయారీ సమయంలో ప్లాస్టిక్ పూర్తిగా ఒకే ముక్కగా ఉండకుండా, సరైన ఆకారంలోకి రావడానికి కూడా ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా స్టూల్‌పై ఎవరైనా కూర్చున్నప్పుడు గాలి, ఒత్తిడి ప్రభావాన్ని కొంత తగ్గించడంలోనూ ఈ డిజైన్ ఉపయోగపడుతుంది.
ఇదీ చదవండి: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలా? ఈ ఒక్క రూల్ పాటించండి!


