breaking news
stool
-
కండరాల నొప్పులూ... ఒంటి నొప్పులు!
ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఒళ్లు నొప్పులతో బాధపడటం సహజం. వైద్యపరిభాషలో ‘మయాల్జియా’అనిపిలిచే ఈ ఒళ్లు నొప్పులనేవి ఒక వ్యాధి కాదు... ఎన్నో రుగ్మతల్లో కనిపించేఒక లక్షణం మాత్రమే. నిజానికి అదికండరాల నొప్పి, మృదుకణజాలంలోనొప్పి, ఎముకల్లో నొప్పులు, నరం లాగడం... ఇలా అది ఏదైనా... అవన్నీ ఒళ్లు నొప్పుల రూపంలోనేబయటపడతాయి. అందువల్ల ఒళ్లునొప్పులు వచ్చినప్పుడు అందుకు కారణమేమిటో తెలుసుకుని దానికి తగిన చికిత్స అందించాలి.ఒళ్లు నొప్పులకు మామూలుగా అ΄ాయకరం కాని కారణాలు మొదలుకొని తీవ్రమైన అస్వస్థత వరకు కారణాలేమైనా కావచ్చు. ఉదాహరణకు... పరిమితికి మించి శ్రమపడ్డప్పుడు, ఒంట్లో క్యాల్షియమ్, మెగ్నీషియమ్ వంటి లవణాలూ, బి12, డి వంటి విటమిన్లు తగ్గినప్పుడు; ఏదైనా ప్రమాదంలో గాయపడ్డప్పుడు ఒళ్లు నొప్పులు రావడాన్ని సాధారణ కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇక అ΄ాయకరమైన కారణాల విషయానికి వస్తే ఆటో ఇమ్యూన్ వ్యాధులతో పాటు రాబ్డోమయోలైసిస్ వంటి జబ్బులతో బాధపడుతున్నప్పుడు, జీవక్రియల్లో లోపాలతో వచ్చే మెటబాలిక్ డిసీజ్‌లతో... ఇలా రకరకాల పరిస్థితుల్లో కండరాల నొప్పులు లేదా ఒళ్లునొప్పులు వస్తాయి. అలాంటి కొన్ని సందర్భాలివి...కొన్ని వ్యాధులు / ఆరోగ్య సమస్యల్లో... డెంగీ వంటి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో. జ్వరం తగ్గాక వచ్చే ఒళ్లునొప్పులు. (వీటిని పోస్ట్ వైరల్ మయాల్జియాస్ అంటారు) ట్రైకినోసిస్ వంటి పరాన్నజీవులు ఒంట్లోకి చేరడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్లో స్పాండిలోసిస్ వంటి కేసుల్లో నరం నొక్కుకుపోతున్నప్పుడు. కొన్ని మందులతో... కొన్ని టీకాలు తీసుకున్నప్పుడు. ఫైబ్రేట్స్ లేదా స్టానిన్స్, ఏసీఈ ఇన్హిబిటార్స్, హెచ్ఐవీ మందుల వంటివి కొన్ని వాడుతున్నప్పుడు.కొన్ని మందుల వాడకం ఆపినప్పుడు... 👉 కొన్ని రకాల మందులు ముఖ్యంగా కార్టికోస్టెరాయిడ్స్, ఓపియాయిడ్స్, బార్బిట్యురేట్స్, బెంజోడయజిపైన్స్ వంటి వాటిని అకస్మాత్తుగా ఆపినప్పుడు. 👉 ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల... సొంత వ్యాధినిరోధకత సొంత కణాలపై ప్రతికూలంగా పనిచేసే ఆటో ఇమ్యూన్ వ్యాధులైన సిస్టమిక్ ల్యూపస్ అరిథమెటోసస్ (ల్యూపస్); పాలీమయాల్జియా రుమాటికా; పాలీమైయోసైటిస్; డెర్మటోమయోసైటిస్; మల్టిపుల్ స్కి›్లరోసిస్ వంటి కేసుల్లో.జీవక్రియల్లో లోపాలతో వచ్చే మెటబాలిక్ డిసీజెస్‌లో... దేహంలో జీవక్రియలన్నీ ఒక క్రమపద్ధతిలో జరగకుండా అస్తవ్యస్తంగా జరుగుతున్నప్పుడు వచ్చే వ్యాధులైన మెటబాలిక్ డిసీజెస్‌లో... ఉదాహరణకు హైపర్ థైరాయిడిజమ్; హైపో థైరాయిడిజమ్; తగినంత ఎడ్రినాలిన్ స్రావాలలోపం (అడ్రినాలిన్ ఇన్సఫిషియెన్సీ); కార్నిటిన్ పాల్మిటైల్ ట్రాన్స్‌ఫరేజ్ లోపం; కాన్స్ సిండ్రోమ్ వల్ల.లక్షణాలు... మొదటి లక్షణం ఒంటినొప్పులు. వాటితోపాటు... నొప్పి కారణంగా దేహంలోని ఆ భాగం కదలలేకపోవడం (కాళ్లూ, చేతుల్లో) కండరం బిగుసుకు΄ోవడం లేదా లాగినట్టుగా తీవ్రమైన నొప్పి కండరం తీవ్రమైన అలసట (ఫెటీగ్) లేదా నీరసానికి గురై ఆ అవయవాన్ని కదిలించలేకపోవడం నొప్పి కారణంగా నిద్రపట్టకపోవడం కండరాల్లో మంట లేదా సూదితో పోడుస్తున్నట్లుగా నొప్పి. (ఇది ఒకే చోటగానీ లేదా నొప్పి వస్తున్న పరిసరాలంతటిలోనూ వచ్చే నొప్పి) తీవ్రమైన నొప్పి కారణంగా డిప్రెషన్‌కు లోనుకావడం.నివారణ: ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా... అన్ని పోషకాలతో సమతులాహారం క్రమం తప్పని వ్యాయామం కంటి నిండా నిద్రచికిత్స: ఉపశమనం కోసం డాక్టర్ల సలహా మేరకు ఎన్ఎస్ఏఐడీ (నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్) 👉 ఒళ్లునొప్పులు లేదా కండరాల నొప్పులు వస్తున్నప్పుడు... అందుకు సరైన కారణాన్ని కనుగొని, వ్యాధి నిర్ధారణ తర్వాత ఏ కారణం వల్ల ఆ నొప్పులు వస్తున్నాయన్నది గుర్తించి, దానికి తగిన చికిత్స తీసుకోవడం.👉 శస్త్రచికిత్సలు: స్పాండిలోసిస్, సయాటికా లేదా నడుము భాగంలోని వెన్నుపూసల అరుగుదల వంటి సందర్భాల్లో నరం నొక్కుకుపోయి వచ్చే నొప్పులు ఎంతకీ తగ్గనప్పుడు చివరి ప్రత్యామ్నాయంగా శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు.అపోహ... వాస్తవం: 👉 కండరం గాయపడటం వల్ల నొప్పి వచ్చినప్పుడు దాంతో మళ్లీ బాగా పని చేయించినప్పుడు అది బాగవుతుంది, నొప్పి తగ్గుతుంది అనేది అ΄ోహ. అలాగే జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు పట్టేసిన కండరం కూడా మళ్లీ అదే ప్రక్రియ చేస్తున్నప్పుడే రిలాక్స్ అవుతుందన్నది కూడా అపోహే. నొప్పి వస్తున్నప్పుడు అదే కండరంతో పదే పదే పనిచేయిస్తే అది మరింత గాయపడుతుంది. ఆ గాయాన్ని ‘రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజురీ’ అంటారు. గాయపడి నొప్పిగా ఉన్న కండరానికి నొప్పి తగ్గేవరకు విశ్రాంతి ఇవ్వాలి. -
యూట్యూబ్ లో 'జెట్' ల్యాండింగ్ హల్ చల్
మనిషి మెదడుకు కాస్త పదును పెడితే అద్భుతాలను ఆవిష్కరించగలడు, చరిత్రను సృష్టించగలడు అనేందుకు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కెర్లు కొడుతున్న ఓ వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. అమెరికన్ యుద్ధ నౌక యూఎస్ఎస్ బతాన్ టేకాఫ్ అవ్వడం ప్రశాంతంగానే జరిగినా... ల్యాండ్ అయ్యే సమయంలో విమానానికి ముందు చక్రాలు తెరచుకోపోవడంతో అత్యంత ఉత్కంఠతను రేపింది. సమయస్ఫూర్తితో ఓ పైలట్ జెట్ విమానాన్ని ల్యాండ్ చేసిన విధానం, చూపరులకు గగుర్పాటును కలిగేట్లు చేస్తోంది. ఎటువంటి సమస్యా లేకుండా టేకాఫ్ అయిన విమానం... ఆకాశంలోకి ఎగిరాక అనుకోని అవాంతరాలు ఏర్పడితే ఏం చేయాలో.. మెరైన్ క్రాప్స్ పైలట్ విలియమ్ మహోనీ సమయస్ఫూర్తిని చూస్తే తెలుస్తుంది. ఎవి-8బి ల్యాండింగ్ సమయంలో ఏర్పడ్డ సాంకేతిక కారణాలతో విమానం ప్రమాదంలో చిక్కుకుందని తెలిసిన పైలట్... సమయస్ఫూర్తితో వ్యవహరించడం పెను ప్రమాదాన్ని తప్పించింది. జెట్ యుద్ధ విమానం ఫ్రంట్ వీల్స్ తెరుచుకోవడం లేదని గమనించిన పైలట్... ఏమాత్రం భయపడకుండా... ధైర్యంగా వ్యవహరించాడు. విమానాన్ని సురక్షితంగా కిందికి దించేందుకు కొత్త ప్లాన్ వేశాడు. తన ప్లాన్ ను అధికారులకు తెలిపి వారివద్ద అనుమతి తీసుకున్నాడు. నౌకపై విమానాన్ని దింపేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేయించుకొన్నాడు. విభిన్నంగా స్టూల్ పై విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించి విజయం సాధించాడు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ సమయస్ఫూర్తిని వేనోళ్ళ అభినందించారు. 2014 జూన్ నెలలో ఫైటర్ జెట్ విమానం ల్యాండింగ్ ఘటనకు సంబంధించిన అరుదైన వీడియో... ఇప్పుడు ఇంటర్నెట్లో అందర్నీ ఆకట్టకుంటోంది. లక్షలకొద్దీ కామెంట్లు, వేలకోద్దీ షేర్లతో హల్ చల్ చేస్తోంది.