పులులు, ఏనుగులే కాదు.. అడవిలో ఆరు కొత్త జీవజాతులు! | Periyar Tiger Reserve Six New Species Biodiversity Survey | Sakshi
Sakshi News home page

పెరియార్‌కి కొత్త అతిథులు!

Sep 26 2026 9:55 AM | Updated on Sep 26 2026 9:55 AM

Periyar Tiger Reserve Six New Species Biodiversity Survey

వింతలు విశేషాలు

అడవి అంటే పులులు, ఏనుగులే కాదు.. మన కంటికి చిక్కని ఎన్నో జీవుల ప్రపంచం కూడా! కేరళలోని పెరియార్‌ పులుల అభయారణ్యంలో నిర్వహించిన జీవ వైవిధ్య సర్వేలో ఆరు కొత్త జీవజాతులు వెలుగులోకి వచ్చాయి.

నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సర్వేలో ఒక పక్షి, ఒక సీతాకోకచిలుక, నాలుగు తూనీగ జాతులు తొలిసారిగా పెరియార్‌లో నమోదయ్యాయి. వీటిలో గోల్డెన్‌ –హెడ్‌ సిస్టికోలా అనే పక్షి, కామన్‌  ఓనిక్స్‌ అనే సీతాకోకచిలుకలు ఉన్నాయి. వీటిలో ప్యారకీట్‌ డార్నర్, ఫ్రేజర్స్‌ క్లబ్‌టైల్, స్పైని హార్న్‌టైల్, నీలగిరి క్లాటైల్‌ ఉన్నాయి.

ఈ  సర్వేలో 75 మంది నిపుణులు, 21 సంస్థలకు చెందిన ప్రతినిధులు, 21 బృందాలుగా ఏర్పడి, 20 ప్రాంతాల్లో సర్వే చేశారు. అయితే ఈ  ఆవిష్కరణ పెరియార్‌ అడవిలో ఇంకా వెలుగులోకి రాని జీవ వైవిధ్యం ఎంత విస్తారంగా ఉందో చెబుతోంది. ఇలాంటి సర్వేలు అరుదైన జీవులను గుర్తించడంతో పాటు, వాటి సంరక్షణకు కూడా కీలకంగా మారుతున్నాయి.
– నిర్వహణ రమా జంబుల

ఇదీ చదవండి: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలా? ఈ ఒక్క రూల్‌ పాటించండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement