సముద్రాన్ని చూస్తూ.. వందేళ్లకు పైగా చరిత్రను మోస్తూ.. ముంబై నగరానికి ఓ ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన తాజ్ మహల్ ప్యాలెస్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. 2026లో ప్రపంచంలోని 50 ఉత్తమ హోటళ్ల జాబితాలో 30వ స్థానాన్ని దక్కించుకుంది.
గతేడాది 38వ స్థానంలో ఉన్న ఈ చారిత్రక హోటల్ ఈసారి ఏకంగా ఎనిమిది స్థానాలు పైకి ఎగబాకింది. 1903లో ప్రారంభమైన ఈ హోటల్ నేటికీ తన రాజసాన్ని కోల్పోకుండా ప్రపంచ స్థాయి అతిథులను ఆకట్టుకుంటోంది. వైభవమైన నిర్మాణం, సముద్రతీర దృశ్యం, ఆతిథ్యానికి పేరుగాంచిన సేవలు.. ఇవన్నీ తాజ్ ప్రత్యేకతలు. ప్రపంచంలోని ప్రముఖ హోటల్ రంగ నిపుణులు, ప్రయాణ రచయితలు, అనుభవజ్ఞులైన ప్రయాణికుల అభిప్రాయాల ఆధారంగా ఈ జాబితా రూపొందింది.
ఇదీ చదవండి: స్టూల్ మధ్యలో ఆ రంధ్రం ఎందుకో తెలుసా? కారణం తెలిస్తే షాక్!


