సముద్రం మధ్యలో పచ్చని స్వర్గమా?! ఈ దీవి ఎక్కడుందో తెలుసా? | Swaraj Dweep Havelock Island Andaman Travel | Sakshi
Sakshi News home page

సముద్రం మధ్యలో పచ్చని స్వర్గమా?! ఈ దీవి ఎక్కడుందో తెలుసా?

Sep 21 2026 9:18 AM | Updated on Sep 21 2026 9:18 AM

Swaraj Dweep Havelock Island Andaman Travel

ట్రావెల్‌

ఎమరాల్డ్‌ ఐలాండ్‌

భారత్‌లో ఎన్నో అందమైన దీవులు ఉన్నాయి. అయితే పచ్చని ప్రకృతి, నీలిరంగు సముద్రం, ప్రశాంతమైన వాతావరణంతో అండమాన్‌ లోని హేవ్‌లాక్‌ ఐలాండ్‌ను భారతదేశపు ఎమరాల్డ్‌ ఐలాండ్‌గా పిలుస్తారు. ప్రస్తుతం ఈ దీవిని స్వరాజ్‌ ద్వీప్‌ అని కూడా పిలుస్తున్నారు. సముద్రం మధ్యలో పచ్చని అడవులు, తెల్లని ఇసుక తీరాలు కలిసిన ఈ దీవి ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది.

బంగాళాఖాతంలో ఉన్న అండమాన్‌  దీవుల సమూహంలో స్వరాజ్‌ ద్వీప్‌ ఒక ముఖ్యమైన పర్యాటక ప్రాంతం. ఒకప్పుడు హేవ్‌లాక్‌ ఐలాండ్‌గా ప్రసిద్ధి చెందిన ఈ దీవికి 2018లో స్వరాజ్‌ ద్వీప్‌గా పేరు మార్చారు. చుట్టూ పచ్చని చెట్లు, ప్రశాంతమైన బీచ్‌లు, స్వచ్ఛమైన సముద్రపు నీరు కనిపిస్తాయి. అందుకే ‘ఎమరాల్డ్‌’ అనే పేరు దీనికి చక్కగా సెట్‌ అవుతుంది.

స్వరాజ్‌ ద్వీప్‌లో రాధానగర్‌ బీచ్‌ ప్రధాన ఆకర్షణ. తెల్లటి ఇసుక, నీలి సముద్రం, చుట్టూ పచ్చని చెట్లు.. ఇవన్నీ కలిసి పైసా వసూల్‌ అనుభూతిని అందిస్తాయి. సూర్యాస్తమయం సమయంలో బీచ్‌ వాతావరణం మరింత ప్రశాంతంగా మారుతుంది. ఎలిఫెంట్‌ బీచ్‌ వద్ద స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్‌ వంటి వాటర్‌ యాక్టివిటీస్‌ ట్రై చేయవచ్చు. నీటి అడుగున కనిపించే పగడాలు, రంగురంగుల చేపలు మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.

ఇక్కడికి చాలా మంది వెళ్లే ముందు బీచ్‌ గురించి మాత్రమే ఆలోచిస్తారు. అయితే ఉదయం పూట పచ్చని చెట్ల మధ్య ప్రయాణించడం, చిన్న చిన్న లోకల్‌ షాపుల్లో షాపింగ్‌ చేయడం, సముద్ర తీరంలో కొంతసేపు ప్రశాంతంగా గడపడం కూడా ఈ ప్రయాణంలో భాగమే. అక్టోబర్‌ నుంచి మే వరకు సాధారణంగా అండమాన్‌  పర్యటనకు అనుకూలమైన కాలంగా భావిస్తారు. పోర్ట్‌ బ్లెయిర్‌ నుంచి ఫెర్రీ ద్వారా స్వరాజ్‌ ద్వీప్‌ చేరుకోవచ్చు.

పచ్చని అడవులు, నీలి సముద్రం, తెల్లటి ఇసుక తీరాల కాంబినేషన్‌ లో కనిపించే ఈ ఎమరాల్డ్‌ ఐలాండ్‌.. అంటే ఒకప్పటి హేవ్‌లాక్‌ ఐలాండ్‌.. ప్రయాణికులకు ఎవర్‌గ్రీన్‌ మెమరీగా మిగిలిపోతుంది.

ఇదీ చదవండి: ఆకాశానికి దగ్గరగా ఓ నగరం ఉందా?! ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement