గెలుపు బాటలో ఓటమి పాఠాలు | Startup Founder Lessons Venture Capital Pitch Deck Power Law | Sakshi
Sakshi News home page

గెలుపు బాటలో ఓటమి పాఠాలు

Sep 25 2026 11:06 AM | Updated on Sep 25 2026 11:19 AM

Startup Founder Lessons Venture Capital Pitch Deck Power Law

వ్యూ పాయింట్‌

స్టార్టప్‌ ప్రపంచంలోని చేదు వాస్తవాల గురించి మాట్లా డారు వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ సాషా మీర్‌చందానీ. అను భవం ద్వారా పెరిగే క్రమశిక్షణ, ఓటముల నుండి పాఠాలు నేర్చుకునే నైజం, ఆర్భాటాలకు దూరంగా ఉండే ఫౌండర్ల లక్షణాలు ఎలా ఉంటాయో తెలిపారు.

ఇగోని తుడిచిపెట్టిన అనుభవం
‘‘నేను ఒనిడా వ్యవస్థాపకుని కొడుకుగా పెరిగినప్పటికీ, నాలో ఎలాంటి అహంభావమూ తలెత్తకుండా మా నాన్న జాగ్రత్త పడ్డారు. ఆయన నన్ను నేరుగా వీధుల్లోకి పంపి, కస్టమర్ల ఇళ్లకు వెళ్లి టీవీలు అమ్మేలా చేశారు. ఆ అనుభవం నాకు నేలను చూపించింది. ఒకరి గుమ్మం ముందు నిలబడి, మొహం మీదే తలుపులు వేయించు కుంటూ, ఒక అపరిచితుడికి టీవీ కొనేలా నచ్చ జెప్పడం అనేది మనలో ఉన్న అహాన్ని తుడిచి పెట్టేస్తుంది.

ఓటమిని తట్టుకునే శక్తి ఉండాలి!
‘‘నేను ఎంతో మంది తెలివైనవారిని చూశాను. కానీ పని చేయడం కాస్త కష్టంగా లేదా విసుగ్గా అనిపించగానే వారు వెనకడుగు వేసేవారు. అందుకే ఒకసారి ఓడి పోయి, ఆ అనుభవంతో మరింత తెలివిగా తిరిగి వచ్చిన ఫౌండర్లకు నిధులు ఇవ్వడానికి నేను ఇష్టపడతాను. గతంలో తన ఓటమికి పూర్తి బాధ్యత వహించిన ఫౌండర్, మార్కెట్‌ నేర్పిన పాఠాలకు ఇప్పటికే తగిన మూల్యం చెల్లించి ఉంటాడు. అతడిలో కొత్తగా ప్రారంభించేవారికి ఉండే అహంభావం లేదా అజ్ఞానం ఉండవు. డబ్బు ఎంత వేగంగా ఖర్చవుతుందో అతడికి తెలిసి ఉంటుంది.

పట్టుదల ఉన్నవాళ్లను పసిగట్టొచ్చు!
‘‘నేను ఫండ్స్‌కి సంబంధించి చెక్‌ ఇచ్చే ముందు, ఆ ఫౌండర్‌ తాను పరిష్కరిస్తున్న సమస్యతో ఎంత లోతుగా ముడిపడి ఉన్నారో చూస్తాను తప్ప, మార్కెట్‌లోనడు స్తున్న ట్రెండ్‌ను చూసి వచ్చారా లేదా అనేది చూడను. ఎవరైనా కేవలం ‘30–అండర్‌–30’ జాబితాలో చోటు దక్కించుకోవడానికో, త్వరగా డబ్బు సంపాదించ డానికో, లేదా సోషల్‌ మీడియాలో స్టార్టప్‌ కల్చర్‌ మెరిసి పోతూ కనిపిస్తుందనో కంపెనీ ప్రారంభించి ఉంటే, వారు త్వరగా విఫలమవుతారు. హంగామా తగ్గిపోయి, ప్రాడక్ట్‌ విఫలమవుతున్నప్పుడు కేవలం పేరు ప్రఖ్యా తుల కోసం వచ్చినవారైతే నిలబడలేరు.

‘పిచ్‌ డెక్‌’లు 3 విషయాలు చెప్పాలి!
‘‘నా కెరీర్‌లో వేలాది పిచ్‌ డెక్‌లను (ఒక స్టార్టప్‌ లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి వెంచర్‌ కేపిట లిస్ట్‌లు ఏంజెల్‌ ఇన్వెస్టర్‌ల నుండి నిధులు సేకరించడం కోసం 10–15 స్లయిడ్‌లతో తయారుచేసే ఒక సంక్షి ప్తమైన ప్రెజెంటేషన్‌) పరిశీలించిన తర్వాత నేను గ్రహించిందేమిటంటే... విజయవంతమయ్యే డెక్‌లు ఆకర్షణీ యమైన డిజైన్లు, క్లిష్టమైన పదాలు, లేదా బలహీనమైన పునాదులను కప్పిపుచ్చే ఆర్భాటపు గణాంకాల జోలికి వెళ్లవు.

ఒక గెలిచే పిచ్‌ డెక్‌ మూడు ముఖ్యమైన విష యాలపై స్పష్టమైన వివరణను ఇస్తుంది.
1. మీరు పరిష్కరిస్తున్న నిజమైన సమస్య ఏమిటి?
2. దానిని పరిష్కరించడానికి మీ వద్ద ఉన్న ప్రత్యేకమైన ఆలోచన లేదా నైపుణ్యం అందుకు మిమ్మల్ని ఎలా అర్హులను చేస్తుంది?
3. వ్యాపార యూనిట్‌ ఎకనామిక్స్‌ (ఒక వ్యాపారంలో ఒక చిన్న యూనిట్‌... అంటే ఒక్క ప్రాడక్ట్, ఒక్క ఆర్డర్‌ లేదా ఒక్క కస్టమర్‌పై ఎంత ఆదాయం వస్తోంది, దాని కోసం ఎంత ఖర్చవుతోంది అని లెక్కించే ఆర్థిక విధానం) వాస్తవానికి ఎలా సాధ్యమవు తాయి?
ఈ మూడూ తప్ప మిగిలినవన్నీ అనవసరం.

పవర్‌ ‘లా’ ఒక కఠినమైన వాస్తవం
మేము ఫండ్‌ ఇచ్చే స్టార్టప్‌లలో దాదాపు 40 శాతం పూర్తిగా విఫలమై, సున్నాకి చేరతాయి. మరొక 30 నుండి 40 శాతం కంపెనీలు అసలు లాభాలు రాక లేదా చాలా తక్కువ లాభాలతో సరిపెట్టుకుంటాయి. వెంచర్‌ క్యాపిటల్‌ బిజినెస్‌ మోడల్‌ అంతా పూర్తిగా ‘పవర్‌ లా’ సూత్రం పైనే నడుస్తుంది. పోర్ట్‌ఫోలియో లోని 5 నుండి 10 శాతం అత్యుత్తమ కంపెనీలను పట్టుకోవడమే అసలు లక్ష్యం. ఆ కొన్ని కంపెనీలే ఏకంగా 50 రెట్లు లేదా 100 రెట్ల భారీ లాభాలను తెచ్చిపెట్టి, మిగిలిన ఓటముల వల్ల వచ్చిన నష్టాలన్నింటినీ భర్తీ చేయడమే కాకుండా, ఫండ్‌ మొత్తానికి గొప్ప విజయాన్ని అందిస్తాయి.
- ఎడిటోరియల్‌ టీమ్‌

ఇదీ చదవండి: సంక్షుభిత క్యూబా 'ఆత్మగౌరవ పతాక'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement