Woman suicide
-
సారీ మమ్మీ.. జీవితంలో ఇంకో స్టెప్ తీసుకోలేను..
మంచిర్యాల: ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై సంతోష్ తెలిపిన వివరాల మేరకు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే 6 హట్స్ ఏరియాకు చెందిన మేరుగు సౌమ్య (22)కొంతకాలం ప్రైవేటు ఉద్యోగం చేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. యువతి తండ్రి కొంతకాలం క్రితం మృతి చెందగా తల్లి కీర్తనతో కలిసి ఉంటుంది. సోమవారం సాయంత్రం కీర్తన సంతకు వెళ్లిన సమయంలో సూసైడ్ నోట్ రాసి ఇంటి పైకప్పుకు ఉరేసుకుంది. తనకు పెళ్లంటే ఇష్టం లేదని, జీవితంలో ఇంకో స్టెప్ తీసుకోలేనని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని, సారీ మమ్మీ.. సారీ డాడి అని లేఖలో రాసి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి కీర్తన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపార -
ప్రేమలో విఫలమై కాశ్మీరీ యువతి ఆత్మహత్య..!
ఫిలింనగర్: జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ సరిహద్దులోని బారాముల్లా ప్రాంతానికి చెందిన ఓ యువతి ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి ప్రేమలో విఫలమై ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... బారాముల్లా మాలాపొరా ప్రాంతానికి చెందిన ఇరం నబీడార్ (23) షేక్‌పేట గుల్షన్కాలనీలో ఓ పెంట్‌హౌస్‌లో అద్దెకు ఉంటూ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా గత జనవరి నుంచి పనిచేస్తున్నది. ఈ నెల 8వ తేదీన ఉదయం ఆమె స్నేహితుడు అబ్దుల్ ఆమెకు ఫోన్ చేయగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కొద్దిసేపటికే ఆమె తల్లి కూడా అబ్దుల్‌కు ఫోన్ చేసి తన కూతురు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, ఒకసారి ఇంటికి వెళ్లి చూసి రావాలని తెలిపింది. ఆందోళన చెందిన అబ్దుల్ సాయంత్రం 5.30 గంటలకు ఇరం ఉంటున్న గదికి వెళ్లి తలుపు తట్టగా ఎంతకూ తెరవలేదు. దీంతో పక్కనే ఉన్న వాచ్‌మెన్‌ను పిలిచి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే అంబులెన్స్ సహాయంతో ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అబ్దుల్ ఇచి్చన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అంతకముందు రోజు అర్ధరాత్రి 2 గంటల వరకు కశ్మీర్‌లోని బారాముల్లాలో ఉండే తన ప్రియుడితో మాట్లాడినట్లుగా నిర్థారించారు. ప్రేమ విఫలం కావడం వల్లనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని విమానంలో కశీ్మర్‌కు తరలించారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నీవు లేక నేనుండలేనని..
కుత్బుల్లాపూర్: ప్రేమికుడిని మరిచిపోలేని ఓ వివాహిత మనస్తాపంతో భనవంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పేట్బషరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసులు తెలిపిన మేరకు.. ఎంఎన్‌రెడ్డి నగర్లో నివాసముంటున్న ఓ వివాహిత (25)కి పెళ్లికి ముందే మరొకరిని ప్రేమించింది. ఈ నేపథ్యంలో ప్రియుడిని మరిచిపోలేక శుక్రవారం రాత్రి తాము నివాసముంటున్న భవనం 5వ అంతస్తు నుంచి ఆమె కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపతున్నారు. -
కోట్లలో కట్నం.. ఆరంకెల జీతం..అత్తింటి వేధింపులతో కోడలి ఆత్మహత్య?
గతేడాది వరకు ఆమె సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ ఉద్యోగి. ఆరంకెల జీతం. ఉద్యోగ జీవితంలో క్లిష్టమైన సమస్యల్ని మేనేజ్ చేసిన నైపుణ్యం. 12 ఏళ్ల క్రితం తండ్రి చనిపోయారు. తల్లి, సోదరుడి అండతో ఏ చీకూచింత లేని జీవితం. రూ.కోట్లలో బంగారం, కట్నం ఇచ్చి మరీ నగరంలోని ఓ చార్టర్డ్ అక్కౌంటెంట్తో ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేశారు. ఈ 8 మాసాల్లో ఏం జరిగిందో.. ఎంత క్షోభ అనుభవించిందో.. ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి, సోదరుడు మాత్రం ఇది ఆత్మహత్య కాదని, అత్తింటివారే హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీతమ్మధార: నగరంలోని బాలయ్యశాస్త్రి లేఅవుట్‌కు చెందిన సత్యప్రియ(31) ఆత్మహత్య అనుమానాలకు తావిస్తోంది. మృతురాలి తల్లీ, సోదరుడు ఇది ముమ్మాటికీ అత్తింటి వారు చేసిన హత్యేనని ఆరోపిస్తున్నారు. ద్వారకా స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాలు. సత్యప్రియ కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. తండ్రి 12 ఏళ్ల క్రితం మరణించారు. అన్నయ్య అడబాల రామకృష్ణ హైదరాబాద్‌లో ఎస్ఎంఆర్ ఫౌండేషన్ హెడ్. వీరి సొంతూరు రాజమండ్రి. సత్యప్రియ బెంగళూరులోని డిలైట్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేది. తర్వాత హైదరాబాద్‌కు మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న నగరంలోని బాలయ్యశాస్త్రి లేఅవుట్‌కి చెందిన ఎల్లిశెట్టి కార్తికేయ(32)తో హైదరాబాద్‌లో ఘనంగా వివాహం జరిగింది. కార్తికేయ విశాఖలో చార్టర్డ్ అకౌంటెంట్. ఇతని తండ్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వద్ద ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. పెళ్లయ్యాక బాలయ్యశాస్త్రి లేఅవుట్లోని కృపా నిలయంలో ఉంటున్నారు. ఈ నెల 5న వీరు అరకు వెళ్లారు. సత్యప్రియ అక్కడి నుంచి తల్లి శ్రీవెంకటరమణకు వీడియోకాల్ చేసింది. ఐ మిస్ యూ అని చెప్పడంతో తల్లి కంగారు పడింది. వెంటనే ఫోన్ కాల్ చేసి మాట్లాడింది. కానీ, కుమార్తె ఏమీ లేదని చెప్పిందట. బుధవారం భార్యాభర్తలు ఇంటికి వచ్చేశారు.గురువారం ఉదయం కార్తికేయ యథావిధిగా ఆఫీసుకి వెళ్లిపోయాడు. ఆమె మళ్లీ తల్లికి ఫోన్ చేసి తన బాధ వెల్లబోసుకుంది. సత్యప్రియ పిన్ని కుమార్తెకు వివాహం కుదిరిందని తల్లి చెప్పగా, చెల్లికి బాగా విచారణ చేశాకే మంచి సంబంధం ఖాయం చేయండని సలహా ఇచ్చింది. గురువారం భర్తకి వాట్సప్‌లో కార్టూన్ బొమ్మ పంపించి, మధ్యాహ్నం 12.30 సమయంలో ఫోన్ చేయగా అతను లిఫ్ట్ చేయలేదు. తిరిగి 2.30కు కాల్ చేయగా ఆమె నుంచి బదులు రాలేదు. సాయంత్రం ఇంటికొచ్చి చూసేసరికి పడక గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని సత్యప్రియ కనిపించింది. వెంటనే తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. వారు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. కోడలు చనిపోయి ఉండటాన్ని చూసిన అత్త స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెను ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చేరి్పంచారు. కుమార్తె ఆత్మహత్య విషయమై అత్తింటివారు కాకుండా వేరే వ్యక్తి ఆమె తల్లికి ఫోన్ చేయడం గమనార్హం. గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో సత్యప్రియ మామ సూర్యచంద్రరావు కోడలి తల్లికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. పోలీసులకు రాత్రి 10.20 కు ఫిర్యాదు చేయడం విశేషం. మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు. పోస్టుమార్టం శనివారం చేస్తారని సమాచారం. విమానంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చి, అక్కడి నుంచి కారులో శుక్రవారం ఉదయం తల్లి, సోదరుడు విశాఖ చేరుకున్నారు. ద్వారకా స్టేషన్లో తమ కుమార్తెది ఆత్మహత్య కాదని, అత్తింటివారే హత్య చేశారని తల్లి ఫిర్యాదు చేశారు. వివాహ సమయంలో రూ.4.5 కోట్ల విలువైన బంగారం, కట్నం ఇచ్చామని, పెళ్లికి మరో రూ.కోటి ఖర్చయిందన్నారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, మొదటి నుంచి అల్లుడు తల్లిదండ్రుల మాటలు విని, తన కుమార్తెను అనుమానంతో వేధించేవాడని పేర్కొన్నారు. తల్లి ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త కార్తికేయ, మామ సూర్యచంద్రరావులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఏసీపీ రాంబాబు పర్యవేక్షణలో ద్వారకా స్టేషన్ సీఐ బీవీ రమణ మృతు రాలి భర్త, అత్త, మామల పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య
పాలకొల్లు సెంట్రల్: భర్త కొట్టడంతో మనస్తాపం చెందిన గర్భవతి అయిన రావూరి దేవి (23) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాలు ప్రకారం పాలకొల్లు మండలంలోని అరట్లకట్టకు చెందిన ఇళ్ల వెంకటేశ్వరరావు, లక్ష్మీ దంపతుల కుమార్తె దేవి బీఈడి చదివేందుకు తణుకు వెళ్లింది. అక్కడ రావూరి జనార్ధన్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దేవి ఇంట్లో ఈ విషయం తెలియగా జనార్ధన్‌కు 2021లో ఆచంట గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహమైందని.. భార్య వదిలేసి వెళ్లిపోయిందని తెలిసింది. రెండో పెళ్లి వాడు వద్దని తల్లిదండ్రులు ఎంత చెప్పినా దేవి వినిపించుకోలేదు. ఇద్దరూ తణుకులో పెళ్లి చేసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో దేవి తల్లిదండ్రులు కేసు పెట్టగా ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. దేవికి ఏ సమస్య వచ్చినా భర్తదే బాధ్యత అంటూ జనార్ధన్‌తో కాగితాలు రాయించుకున్నట్లు దేవి బందువులు తెలిపారు. గత ఎనిమిది నెలలుగా దేవి ఎంతో నరకం అనుభవించిందని ఆమె బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. దేవి పక్కింటి వారితో మాట్లాడినా, తల్లిదండ్రులతో మాట్లాడినా వేధించేవాడని వాపోతున్నారు. శుక్రవారం సాయంత్రం జనార్ధన్ దేవిని కొట్టి కేకలు వేసుకుంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అనంతరం దేవి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. అత్తగారు ఎంత పిలిచినా పలకకపోవడంతో స్థానికులు తలుపు పగులగొట్టగా ఉరివేసుకుని ఉన్నట్లు గుర్తించారు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలియడంతో దేవి బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. దేవి మెడ మీద, దవడపై దెబ్బలు ఉన్నాయని భర్తే కొట్టి చంపేశాడని ఆవేదన వ్యక్తంచేశారు. మార్చురీలో ఉన్న దేవి మృతదేహాన్ని తహసీల్దార్ వై.దుర్గాప్రసాద్, సీఐ కె. రజనీకుమార్‌లు పరిశీలించారు. మృతురాలి తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ కె. రజనీకుమార్ తెలిపారు. -
పెళ్లయిన వ్యక్తితో ప్రేమాయణం..
రాయపర్తి: అతనికి పెళ్లయ్యింది. కానీ వరుసకు చెల్లె అయ్యే యువతితో చాలాఏళ్ల ప్రేమ.. పెద్దలు పలుమార్లు మందలించారు. చివరికి ఆ జంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలకేంద్రంలోని రామచంద్రుని చెరువు వద్ధ సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా పైడిపల్లి పరిధిలోని మధ్యగూడానికి చెందిన తిక్క అంజలి(25), అదే గ్రామానికి చెందిన సంగాల దిలీప్(30) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ దగ్గరి బంధువులు కావడం, అందులోనూ వరుసకు అన్నాచెల్లెళ్లు కావడంతో పెద్దలు ఒప్పుకోరనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం దిలీప్‌కు వరంగల్ జిల్లా నెక్కొండ మండలం జంజరపల్లికి చెందిన ఓ యువతితో వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. అయినా వీరి ప్రేమను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దిలీప్ వరంగల్ హంటర్‌రోడ్డులో ఓ మార్బుల్ దుకాణంలో సూపర్వైజర్గా పనిచేస్తుండగా, అంజలి ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా చేస్తుంది. వీరి ప్రేమ విషయం భార్యకు తెలియడంతో చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల భార్య తన పుట్టింటికి వెళ్లింది. దీంతో దిలీప్.. అంజలితో తిరగడం ప్రారంభించారు. విషయ పెద్దలకు తెలియగా నాలుగురోజులక్రితం మందలించారు. ఇప్పటినుంచి అలా తిరగమని చెప్పి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో దిలీప్ ఆదివారం ఉదయం 9:30 గంటల సమయంలో డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రి అయినా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎక్కడికో వెళ్లి ఉంటాడనుకున్నారు. సోమవారం ఉదయం రాయపర్తిలోని రామచంద్రుని చెరువులో రెండు మృతదేహాలు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ సూర్యప్రకాష్, వర్ధన్నపేట ఎస్సై ప్రవీణ్‌లతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పరిశీలించగా దిలీప్, అంజలిదిగా గుర్తించారు. క్లూస్‌టీంతో పరిశీలించి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ సూర్యప్రకాష్ తెలిపారు. -
భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనీ భార్య ఆత్మహత్య
యశవంతపుర: భర్త వేధింపులను తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం సాయంత్రం బెంగళూరు బ్యాడరహళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. ఆంధ్రహళ్లికి చెందిన మానస (25)కు ఆరేళ్ల క్రితం దిలీప్‌తో పెళ్లి కాగా, వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. ఏడాదిన్నరగా దిలీప్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీనిపై ఇంట్లో రోజూ గొడవ జరిగేది. దీనికి తోడు దిలీప్ మానసను వేధించేవాడు. దీంతో విరక్తి చెందిన ఆమె సెల్ఫీ వీడియో తీసుకుని, ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు బ్యాడరహళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయగా, దిలీప్ని అరెస్టు చేశారు. -
పెళ్లయిన ఆరు నెలలకే మహిళ ఆత్మహత్య
మదనపల్లె : ఒకే ఊరిలో వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న అబ్బాయి, అమ్మాయి ఆన్లైన్ వేదికగా పరిచయమై ప్రేమించుకున్నారు. పెద్దల అనుమతితో వివాహం చేసుకుని నూరేళ్ల ప్రయాణం ప్రారంభించారు. అయితే అత్తింటి వేధింపులు ఆ అమ్మాయిని మానసిక వేదనకు గురిచేశాయి. పెళ్లయిన ఆరు నెలలకే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బుధవారం మదనపల్లెలో వెలుగు చూసింది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని రాంనగర్‌కు చెందిన వెంకటరమణ, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె సాయి ప్రియాంక(24) బాబూ కాలనీకి చెందిన శ్రీనివాసులు, ఉష దంపతుల కుమారుడు మణికంఠతో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. కొంతకాలం తరువాత ఇరువురూ ప్రేమించుకున్నారు. వారి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించి వివాహం జరిపించారు. కొన్ని రోజుల కిదట మణికంఠ చేనేత పని మానేసి టమాట మార్కెట్లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన అతడు కొద్ది రోజుల కిందట భార్య సాయి ప్రియాంకను వేధించసాగాడు. మంగళవారం రాత్రి మరోసారి కట్నం విషయమై భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. వేధింపులు తీవ్రం కావడంతో రాత్రి అందరూ నిద్రపోయాక ఇంట్లోనే సాయిప్రియాంక చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెల్లవారు జామున గమనించిన కుటుంబ సభ్యులు, తాలూకా పోలీసులు, పుట్టింటివారికి సమాచారం అందించారు. ఎస్.ఐ రవికుమార్ ఆత్మహత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. తహసీల్దారు రమాదేవి కుటుంబ సభ్యుల వాంగ్మూలం నమోదు చేసి శవ పంచనామా చేశారు.కుటుంబ సభ్యుల ఆందోళనసాయిప్రియాంక మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు తాలూకా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కట్నం కోసం వేధించిన ప్రియాంక భర్త మణికంఠ, మామ శ్రీనివాసులు,అత్త ఉష,తాత మునెప్పలపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌చేశారు. ఈ విషయంతో మనస్థాపం చెందిన సాయి ప్రియాంక అత్త ఉష (49) ఇంటివద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. బాధితురాలిని కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై మృతురాాలి తల్లి లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. -
ప్రాణం తీసిన ‘ఫైనాన్స్’
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి తీసుకున్న రుణం ఓ మహిళ పాలిట మృత్యు పాశమైంది. అధిక వడ్డీలు చెల్లించలేక, ఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులు భరించలేక తనువు చాలించింది. మంగళవారం విజయవాడలో ఈ విషాదం చోటు చేసుకుంది. విజయవాడ వాంబే కాలనీకి చెందిన అల్లంపల్లి మస్తానమ్మ అలియాస్ మాధవి (44) పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. భర్త లక్ష్మీనారాయణతో విభేదాలు తలెత్తడంతో పదేళ్ల క్రితం విడిపోయి వేరుగా ఉంటోంది. ఇద్దరు ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తగారిళ్లకు పంపింది. వ్యాపారంలో నష్టం రావడం, పిల్లల వివాహాల కోసం కొంత అప్పులు చేసింది. హైదరాబాద్‌కు చెందిన క్రిస్ ఫైనాన్స్, స్పందన అనే సంస్థల ప్రతినిధులు రుణాలు ఇస్తామని చెప్పడంతో వారి వద్ద డబ్బులు అప్పుగా తీసుకోవడంతో పాటు మరి కొంతమంది మహిళలను కూడా గ్రూపులుగా చేర్చి అప్పు ఇప్పించింది. రూ.42 వేలు అప్పు ఇస్తే ప్రతి నెల మొదటి బుధవారం రూ.3,370 చొప్పున 20 నెలల పాటు చెల్లించాలనే షరతుతో ఫైనాన్స్ సంస్థలు అప్పులు ఇచ్చాయి. కొద్ది నెలలుగా అనారోగ్యం, వ్యాపారం సరిగా నడవకపోవడంతో డబ్బులు చెల్లించేందుకు బయట అప్పులు చేసింది. గత బుధవారం డబ్బులు కట్టకపోవడంతో ఫైనాన్స్ సంస్థల ఏజెంట్లు ఆమె ఇంటి వద్దకు వచ్చి బెదిరించినట్లు సమాచారం. తాజాగా మంగళవారం మరోసారి వచ్చి భయబ్రాంతులకు గురి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మస్తానమ్మ వారి ముందే ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసి ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై నున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.గృహ సారథిగా సేవలు..మస్తానమ్మ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని. 60వ డివిజన్లో వైఎస్సార్ సీపీ గృహ సారథిగా మస్తానమ్మ సేవలందించారు. ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియడంతో వైఎస్సార్సీపీ నాయకులు, మహిళలు ఆమె ఇంటి వద్దకు చేరుకుని సంతాపం తెలిపారు. -
ఉరేసుకుని యువతి బలవన్మరణం
పాలకవీడు: ఉరేసుకుని యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్ గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్ఐ లక్ష్మీనర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జాన్‌పహాడ్ గ్రామానికి చెందిన ఉబెల్లి ఉమ(27)కు మూడు నెలల క్రితం సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. వారం రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన ఉమ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా తన భర్తకు జాబ్ లేదనే మనస్తాపంతో ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
మహిళపై టీడీపీ నేత అకృత్యం
రాయదుర్గం : టీడీపీ నేత అకృత్యంతో అనంతపురం జిల్లా హోసగుడ్డంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కురుబ కావేరి (26) అనే వివాహితపై లోకేశ్ అనే టీడీపీ నేత కన్నేశాడు. మార్చి 31 రాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. నిద్రిస్తున్న ఆమె వద్దకు వెళ్లే ప్రయత్నంలో భర్త గోనప్ప కాలు తొక్కాడు. దీంతో మేల్కొన్న గోనప్ప లైటువేసి టీడీపీ నేతను పట్టుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ పెద్దది కావడంతో లోకేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై ఏప్రిల్ 1న కావేరి దంపతులు డి.హీరేహాళ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. టీడీపీ నేత లోకేశ్ అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఇన్నాళ్లు నాటకం ఆడాడు. కాగా.. గురువారం గ్రామంలోకి వచ్చి తిరుగుతూ కనిపించాడు. దీనిని అవమానంగా భావించిన కావేరి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. తన భార్య చావుకు లోకేశ్ కారణమని ఆమె భర్త గోనప్ప, తల్లి శకుంతలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
టీడీపీ, జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు!
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తెనాలి, అమరావతి: ఆమె చేసిన తప్పల్లా... తన సంతోషాన్ని దాచుకోలేకపోవటమే. జగనన్న తన పేరిటే ఇంటి పట్టా ఇచ్చారని, తన పిల్లల్ని చదివించుకోవటానికి అమ్మ ఒడి కూడా వస్తోందని పట్టలేని సంతోషంతో చెప్పిందామె. కళ్లలో మెరుపులతో, పట్టలేని ఆనందంతో ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల సోషల్ మీడియా మూకలు దీన్ని జీర్ణించుకోలేకపోయాయి. వీధికుక్కల్లా వెంటాడాయి. మారుపేర్లతో సంచరించే నీతీజాతీ లేని ఈ ఆన్లైన్ మారీచులు.... తాము మనుషులమన్న సంగతే మరిచిపోయి ప్రతి వేదికమీదా ఆమెను నానా దుర్భాషలాడారు. అక్కచెల్లెళ్లుంటారని, తమ ఇళ్లలోనూ ఆడపిల్లలు ఉంటారని గ్రహింపే లేని రీతిలో ఆ బీసీ మహిళ గీతాంజలిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఆమె వేషభాషలను ఎగతాళి చేస్తూ, అసభ్యంగా దూషించారు. సమాజం సిగ్గుపడే కామెంట్లతో రంపపు కోత కోశారు. భరించలేని ఆ ఆడబిడ్డ మరణమే శరణ్యమనుకుంది. రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. లోతుగా చూస్తే ఇది ఆత్మహత్య కాదు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకలు వెంటాడి వెంటాడి చేసిన దారుణమైన హత్య. గొల్తి గీతాంజలి (30) భర్త చంద్రశేఖర్ తెనాలిలోని వహాబ్ పార్క్ ప్రాంతంలో బంగారం పని చేస్తుంటారు. వాళ్లకిద్దరు పిల్లలు. గీతాంజలి కొద్దిరోజుల కిందట ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. తనకు ఇంటిపట్టా ఇచ్చారని, పిల్లలకు అమ్మ ఒడి వస్తోందని, అత్తమామలకు చేయూత, పింఛన్ కానుక అందుతున్నాయని చెబుతూ సీఎం వైఎస్ జగన్‌కు, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు ధన్యవాదాలు తెలియజేసింది. జగనన్నకు తప్ప ఇంకెవరికి ఓటు వేస్తామంటూ.. ఆమె ఎదురు ప్రశి్నంచిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే ఆమెకు శాపమైంది. ఐటీడీపీ, జనసేన కిరాయి మూకలు సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా వేధించాయి. ఆమెను కించపరుస్తూ విపరీతంగా ట్రోల్స్ చేశాయి. వాస్తవానికి గీతాంజలికి గతంలోనే ఇంటి స్థలం మంజూరైంది. ఇటీవల ప్రభుత్వం ఆమెకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందచేసింది. ఈ నెల 4న కొత్తపేటలోని తాలూకా కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరైనప్పుడు ఈ ఇంటర్వ్యూ వ్యవహారం చోటుచేసుకుంది. ఉదయమే సభా ప్రాంగణానికి వచ్చిన గీతాంజలి అందరితోపాటు ఎమ్మెల్యే శివకుమార్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి ఎంతో ఉత్సాహంగా కనిపించింది. ఎమ్మెల్యే చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ పట్టాను అందుకున్నాక తన సంతోషాన్ని ఓ యూట్యూబ్ చానల్‌తో పంచుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్న తమకు ఇంటి స్థలం పొందడం ద్వారా కల నెరవేరిందంటూ ఉద్వేగంగా మాట్లాడింది. జగనన్నను గెలిపించుకోవటం తమ బాధ్యతని పేర్కొంది. ఫీజులు కట్టలేని తమకు అమ్మఒడి ఆసరాగా నిలిచిందని, తన పిల్లలిద్దరూ ఈ కార్యక్రమానికి వస్తే జై జగన్.. అని నినదించేవారని ఉత్సాహంగా చెప్పింది. ఈ క్రమంలో కొంత భావోద్వేగానికి గురి కావడం, మీడియా ఎదుట మాట్లాడే అలవాటు లేకపోవడంతో తడబాటుకు గురైంది. దీన్ని అవకాశంగా మలుచుకున్న టీడీపీ, జనసేన ‘సోషల్ మాఫియా’ బాధితురాలిని దారుణంగా ట్రోల్ చేసింది. ఉచ్చం నీచం లేకుండా అసభ్యంగా దూషిస్తూ, ఆమె వ్యక్తిత్వాన్ని తప్పు పడుతూ, రాయలేని భాషలో దుర్భాషలాడుతూ కొందరు కామెంట్లు పెట్టారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన గీతాంజలి శనివారం తెనాలి రైల్వే ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు హుటాహుటిన ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. తెనాలి జీఆర్పీ పోలీసులు గుంటూరు జీజీహెచ్‌కు చేరుకుని కుటుంబ సభ్యులను విచారించగా సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాల కారణంగా ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్ల తాను, తన కుటుంబం లబ్ధి పొందినట్లు గతంలో కూడా ఆమె కొన్ని వీడియోల్లో పేర్కొన్నారు. గీతాంజలిని ఆత్మహత్యకు పురిగొల్పేలా దారుణ వ్యాఖ్యలతో వికృతంగా వ్యవహరించిన సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. గీతాంజలిని బూతులు తిడుతూ టీడీపీ, జనసేన అభిమానులు పెట్టిన పోస్టులు, కామెంట్లు.. గీతాంజలి మృతదేహం వద్ద రోదిస్తున్న ఇద్దరు కుమార్తెలు పచ్చ మీడియాపై బాధిత కుటుంబం ఆగ్రహం ఇద్దరు చిన్నారులతో ఎంతో చలాకీగా అందరితో కలిసి మెలసి ఉండే గీతాంజలిని సోషల్ మాఫియా పొట్టన పెట్టుకుందని బాధితురాలి కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్ మార్చురీ వద్ద కన్నీరు మున్నీరయ్యారు. తల్లి మృతి చెందడంతో ఇద్దరు ఆడపిల్లల గతి ఏం కావాలంటూ విలపించారు. సోషల్ మీడియా ఆమెను పొట్టనపెట్టుకుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చ సోషల్ మీడియా కళ్లు ఎప్పుడు పచ్చగానే ఉంటాయని, పేదింటి మహిళకు ఇంత సంతోషం దక్కడం వారికి ఇష్టం లేదంటూ మండిపడ్డారు. గీతాంజలికి తల్లితండ్రి దూరంగా ఉండటంతో అమ్మమ్మ, తాతయ్య, మేనమామ కలిసి వివాహం చేశారని, గీతాంజలి సంతోషం పచ్చ సోషల్ మీడియాకు కంటగింపుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని చూసి తల్లడిల్లిన చిన్నారులు ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్‌తో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి అంతిమ సంస్కారాలు సోమవారం రాత్రి జరిగాయి. గుంటూరు జీజీహెచ్‌లో శవపరీక్ష అనంతరం చినరావూరుతోటలోని హిందూ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను భర్త బాలచంద్ర నిర్వహించారు. తల్లి భౌతికకాయాన్ని చూసి చిన్నపిల్లలైన కుమార్తెలు రిషిత, రిషిక హృదయ విదారకంగా విలపించడం అందరినీ కలచివేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అక్కడకు చేరుకుని గీతాంజలి భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సీఎం ఆదేశానుసారం మంగళవారం వారి ఇంటికి వచ్చి బిడ్డల భవిష్యత్ కోసం ఏం చేయాలనే అంశంపై మాట్లాడతానని హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన అరాచకత్వానికి బీసీ మహిళ బలి: పద్మ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన బీసీ మహిళ గీతాంజలి సంతోషాన్ని చూసి ఓర్వలేక టీడీపీ, జనసేన పార్టీలు ఆమె ప్రాణాన్ని బలి తీసుకున్నాయని ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విచక్షణ మరచిన పచ్చ మూకలు అరాచకంగా ట్రోల్ చేయడంతో తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఆప్యాయంగా పలకరించేది.. మా ఇంటికి ఎదురుగా నివసించే గీతాంజలి ఎప్పుడూ సంతోషంగా, చలాకీగా ఉంటుంది. ఎక్కడ కనిపించినా మామ్మగారూ... అంటూ చాలా ఆప్యాయంగా పలకరించేది. రెండు రోజులుగా కనిపించకపోతే శివరాత్రి కావడంతో ఎటైనా వెళ్లిందేమో అనుకున్నా. ఇలా జరుగుతుందని అనుకోలేదు. చాలా బాధనిపిస్తోంది. – అవ్వారు పద్మావతి, ఇస్లాంపేట, తెనాలి జీవితంలో మర్చిపోలేనంటూ.. మేం ఇస్లాంపేటలో సోడాలు విక్రయిస్తాం. గీతాంజలితో కొద్ది రోజుల పరిచయమే అయినా చాలా కలివిడిగా మాట్లాడేది. ఇటీవలే చిన్నపిల్లల్లా ఆడుకున్నాం. ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రం తీసుకున్నానని ఎంతో సంతోషంగా చెప్పింది. నా పేరు మీద ఇచ్చారు... జీవితంలో మర్చిపోలేనని చెప్పి మురిసిపోయింది. ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తోందని చెబుతుండేది. ఆమె చనిపోయిందని తెలిసి ఎంతో బాధపడుతున్నా. – షేక్ రేష్మా, ఇస్లాంపేట, తెనాలి -
సోషల్ మాఫియా c/o టీడీపీ - జనసేన
మేలు చేసిన సీఎం, ఎమ్మెల్యేలను మెచ్ఛుకోవడమే ఆమె చేసిన పాపం. చాన్నాళ్ళ కు ఓ గూడు దొరికిందన్న సంతోషాన్ని మిగల్చకుండా సోషల్ మీడియా ముసుగులో టీడీపీ- జనసేన రాబందులు వాలిపోయాయి. ట్రోల్స్ తో పీక్కు తిన్నాయి. అవమానాలు తట్టుకోలేక ఆ మహిళ ఆఖరుకు ఉసురు తీసుకోవడమే మేలు అనుకుంది. రైలు చక్రాల కింద నలిగి పోయింది. సాక్షి, గుంటూరు: టీడీపీ, జనసేన వేధింపులు ఓ మహిళ ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జగనన్న కాలనీలో ఇంటి స్థలం గురించి మాట్లాడిన మహిళను మానసికంగా హింసించి ఆమె చావుకు యమపాశంగా మారాయి. ఇళ్ల పట్టా వచ్చిందన్న ఆనందంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాటు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్లను మెచ్చుకుంటూ ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడటమే ఆ మహిళ పాలిట శాపమైంది. జగనన్న ఇల్లు ఇచ్చాడని సంతోషంగా చెప్పిన తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ టీడీపీ, జనసేన మితిమీరిన ట్రోలింగ్ కారణంగా అవమాన భారం తట్టుకోలేక రైలు కింపడి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. గుల్టి గీతాంజలి దేవి(29) గృహిణి, ఆమె భర్త బాలచంద్ర బంగారం పని చేస్తుంటాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రిషిత నాలుగో తరగతి, చిన్న కుమార్తె రిషిక ఒకటో తరగతి చదువుతున్నారు. తెనాలిలోని ఇస్లాంపేటలో నివసిస్తున్నారు. పెద్ద కుమార్తెకు నాలుగు సార్లు ‘అమ్మ ఒడి’ వచ్చింది. ఈమెకు ఇటీవల జగనన్న కాలనీలో ఇంటి స్థలం వచ్చింది. ఈనెల 4వ తేదీన కొత్తపేటలోని తాలూకా కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన శాశ్వత రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాను అందుకుంది. ఆ తర్వాత తన సంతోషాన్ని ఓ యూట్యూబ్ ఛానల్‌తో పంచుకుంది. తాను తన కుటుంబ సభ్యులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నానని, స్వంత ఇళ్లు అనేది అందరి కల అని, ఇళ్ల స్థలం పొందడం ద్వారా తన కల నెరవేరిందంటూ ఎంతో ఉద్వేగంగా మాట్లాడింది. తన పిల్లలకు అమ్మ ఒడి కూడా వస్తోందని, ఇన్ని మంచి పనులు చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను మళ్లీ గెలిపించుకోవడం తమ బాధ్యత అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆమె మాటలను కొందరు టీడీపీ, జనసేన కార్యకర్తలు వివరీతంగా ట్రోల్స్ చేశారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో కామెంట్లు పెట్టారు. దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన గీతాంజలి రెండు రోజుల క్రితం తెనాలి రైల్వేస్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. తీవ్రంగా గాయపడటంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా సోమవారం తుదిశ్వాస విడిచింది. అయితే ఒక బీసీ మహిళ.. కేవలం ఇళ్ల పట్టా వచ్చిందన్న తన ఆనందాన్ని పంచుకోవడమే ఆమె చేసిన తప్పా అంటూ పలువురు ప్రశ్నిస్తుండగా టిడిపి సోషల్ మీడియానే దారుణమైన ట్రోల్స్ చేసి ఆమెను బలితీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మాఫీయా కేరాఫ్ ‘టీడీపీ - జనసేన’ ‘వాలంటీర్లు మాకు బీడీ కట్ట తెచ్చి పెడతారా, ఓయి వాలంటీర్ నాకు కండోమ్ తెచ్చిపెడతావా అంటూ తెలుగుదేశం సోషల్ మీడియా చేసిన విషప్రచారంతో చేస్తున్న సేవలో కూడా హేళన ఎదుర్కొని మనస్తాపంతో మొన్న వాలంటీర్ నవీన చనిపోతే.. నిన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమెరికన్ ఇంగ్లీష్ స్లాంగ్ నేర్చుకున్న నిరుపేద మేఘన అనే బాలిక తెలుగుదేశం, జనసేన చేసిన ట్రోల్స్‌తో మానసిక వేదనకు గురైంది. నేడు ప్రభుత్వం నుంచి లబ్ది పొందాను అంటూ ధైర్యంగా చెప్పిన పాపానికి తెలుగుదేశం, జనసేన ట్రోల్ పేజీల మాఫీయా వేదింపులకి గీతాంజలి ప్రాణాలు తీసుకుంది. తమ రాజకీయ స్వలాభం కోసం, అసత్యాలను ప్రచారం చేస్తూ, అది తప్పు అని చెప్పిన సామాన్యులపై దుషణలకు దిగే సోషల్ మాఫీయాలను కోట్లు వెచ్చింది పెంచి పోషిస్తున్న తెలుగుదేశం జనసేన మాఫీయాని ఈ రాష్ట్రం నుంచే తరిమి కొట్టాల్సిన సమయం వచ్చింది.’ అంటూ నిప్పులు చెరుగుతున్నారు. -
లావున్నావంటూ భర్త వేధించడంతో గృహిణి ఆత్మహత్య
ముంబై: భర్త తనను ‘లావున్నావని’ వేధించాడని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్లాం కాండే, తెహ్మీనాలకు 2016లో పెళ్లి జరిగింది. ఇంటి పనుల విషయంలో తల్లిదండ్రులతో గొడవ అవుతుండటంతో అస్లాం భార్యను తీసుకొని వచ్చి బయట ఉంటున్నారు. అయితే.. కొన్ని రోజుల తరువాత భార్యాభర్తల మధ్యా గొడవలు ప్రారంభం అయ్యాయి. ఓసారి తెహ్మీనా పోలీసులకు పిర్యాదు చేయగా.. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని, అందుకే తనతో గొడవపడుతోందని పోలీసులకు చెప్పాడు. అంతే కాదు.. భార్యను బైకుల్లాలోని ఆమె తల్లి రజియా వసీం అన్సారీ ఇంటిలో దించేశాడు. ఫిబ్రవరి 14న తల్లి బయటికి వెళ్లిన సమయంలో తెహ్మీనా ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త అస్లాంపై కేసు నమోదు చేశారు. ‘నువ్వు లావుగా ఉన్నావు, నీకు డ్రెస్‌సెన్స్ లేదు, నీకు పిల్లలు కావడం లేదు’ అంటూ అస్లాం తన కూతురును తరచూ వేధించేవాడని రజియా తెలిపింది. తనకు పిల్లలు పుట్టడం లేదని తన భర్త వేరే పెళ్లి చేసుకున్నాడని తెహ్మీనా తరచూ అనుమానించేదని, ఆ డిప్రెషన్‌తోనే ఆత్మహత్య చేసుకుందని రజియా పోలీసులకు వెల్లడించింది. రజియా ఫిర్యాదు మేరకు అస్లాంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మొయినాబాద్ యువతి కేసులో ట్విస్ట్.. ఎస్సై సస్పెండ్
సాక్షి, రంగారెడ్డి: మొయినాబాద్‌లో యువతి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. బాకరం గ్రామ పరిధిలో సోమవారం మంటల్లో కాలిపోయిన యువతి మృతదేహం ఘటన హత్య కాదు.. ఆత్మహత్యగా పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతి చెందిన యువతిని మల్లేపల్లికి చెందిన తైసీల్గా (22) గుర్తించారు. డిప్రెషన్, స్నేహితురాలితో ఎడబాటు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడైంది. జనవరి 8వ తేదీని ఇంటి నుంచి ఆటోలో సంఘటన స్థలానికి వచ్చి మధ్యాహ్నం 2 గంటల సమయంలో తానంత తానుగా పెట్రోల్ లేదా డీజిల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలు చదువు పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉంది. గతంలో రెండు మూడు సార్లు ఇలాగే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇంట్లో గొడవపడి ఒకటి రెండు రోజుల్లో తిరిగి వచ్చేదని.. అందుకే ఈసారి కూడా అలాగే వస్తుందని భావించి పోలీస్ స్టేషన్లో ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు తలిదండ్రులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఘటన సంబంధించి పూర్తి సమాచారాన్ని పోలీసులు మీడియా సమావేశంలో తెలిపే అవకాశం ఉంది. వెలుగులోకి కొత్త విషయాలు పోలీసుల విచారణలో పలు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన తరువాత సీసీ కెమెరాల పరిశీలించిన పోలీసులకు.. ఒక ఆటో అక్కడి పరిసరాలలో అనుమానాస్పదంగా తిరగడం కనిపించింది. దీంతో పోలీసులు ఆటో నడిపిన వ్యక్తిని గుర్తించి విచారించారు. వెయ్యి రూపాయలు ఇచ్చి డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ దగ్గర దింపమని యువతి కోరిందని.. తాను అలాగే అక్కడ దించేసి వెళ్లినట్లు ఆటో డ్రైవర్ పోలీసులతో చెప్పాడు. తరువాత ఎం జరిగిందో తెలియదని అన్నాడు. అయితే యువతి ఆత్మహత్యకు ఒక రోజు ముందే 5 లీటర్ల పెట్రోల్ తీసుకొని ఫ్రెండ్ ఇంట్లో పెట్టినట్లు తెలిసింది. ఘటన జరిగిన రోజు ఉదయం తన వెంట తెచ్చుకోని బలవన్మరణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు.. మొయినాబాద్తోపాటు చేవెళ్ల, శంకర్ పల్లి, షాబాద్ పోలీస్ స్టేషన్ పోలీసులతో కలిసి లో బృందాలుగా విడిపోయి ఈ కేసును ఛేదించాయి. పోలీసుల నిర్లక్ష్యం.. సీపీ ఆగ్రహం ఈ కేసులో హబీబ్ నగర్లో పోలీసుల నిర్లక్ష్యంపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 8న తైసీల్ కనిపించకుండా పోగా.. పదో తేదీనా యువతి సోదరుడు హబీబ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. దీంతో హైదరాబాద్ సీపీ స్వయంగా హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు వివరాలను పరిశీలించారు. కేసుపై విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హబీబ్ నగర్ పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ చేస్తామన్నారు. మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తామని చెప్పారు. హబీబ్ నగర్ ఎస్సై సస్పెండ్ మొయినాబాద్ యువతి మృతి ఘటనపై సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య సీరియస్ అయ్యారు. ఘటనలో మిస్సింగ్ కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన హబీబ్ నగర్ ఎస్సై శివను సస్పెండ్ చేశారు. ఇన్స్పెక్టర్ రాంబాబుకు మోమో జారీ చేసినట్లు తెలిపారు. -
Hyderabad: భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య
హైదరాబాద్: భర్త మరణాన్ని తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధూల్‌పేట ఆరంఘర్కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. మంగళ్‌హాట్ ఎస్ఐ.సాయికృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రహింపురాకు చెందిన అమన్‌కుమార్ సింగ్, ఆరంఘర్ కాలనీకి చెందిన అస్మితసింగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. అమన్‌కుమార్ సింగ్ గత నెల 26న బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందాడు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేక అస్మిత డిఫ్రెషన్‌కు లోనైంది. మంగళవారం మధ్యాహ్నం గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుంది. దీనిని గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను కిందకు దించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మంగళ్‌హాట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నల్లవెల్లిలో వివాహిత ఆత్మహత్య
నిజామాబాద్: మండలంలో ని నల్లవెల్లిలో ఆదివారం రా త్రి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై మహేశ్, స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జగన్నాథచారితో నిజామాబాద్ నగరానికి చెందిన స్నేహలత(23)కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి మూడేళ్లలోపు వయసున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన స్నేహలత ఆత్మహత్యకు పాల్పడగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సోమవారం అంత్యక్రియల అనంతరం స్నేహలత మృతికి అత్తింటి వారి వేధింపులే కారణమంటూ మృతురాలి బంధువులు ఆందోళన చేశారు. వారి ఇంటిపై దాడి చేసి వస్తువులను ధ్వంసం చేశారు. పోలీసులు జగన్నాథచారి కుటుంబ స భ్యులను అదుపులోకి తీసుకొని రక్షణ కల్పించారు. మృతురాలి తండ్రి రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. జీవితంపై విరక్తితో యువకుడు.. బాల్కొండ: అనారోగ్య కారణాలతో జీవితంపై విరక్తి చెంది వరద కాలువలో దూకి మండలంలోని బోదేపల్లి గ్రామానికి చెందిన కోట శ్రీనివాస్(26) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై గోపి తెలిపిన వివరాల ప్రకారం.. మెడికల్ చెకప్ కోసం శనివారం నిజామబద్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లిన శ్రీనివాస్ తిరిగి రాలేదు. దీంతో ఆదివారం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
మూడు రోజుల్లో పెళ్లి.. వరుని ఇంట్లో వధువు మృతి
కర్ణాటక: పెళ్లిపత్రికలు పంచారు, వధూవరుల ఇళ్లలో పెళ్లి సందడి నెలకొంది, ఇంతలోనే ఘోరం జరిగింది. తాలూకాలోని టీబీ డ్యాం వద్ద మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువతి అనుమానాస్పదరీతిలో శవమైన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు..టీబీ డ్యాం నివాసి ఐశ్వర్య (26) అనే యువతి వరుని ఇంట్లో విగతజీవిగా మారింది. వివరాలు.. అశోక్ (27), ఐశ్వర్య ఇద్దరు టీబీ డ్యాం వాసులు కాగా ఐదారేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు వేర్వేరు కులాల వారు అయినప్పటికీ పెద్దల అంగీకారంతో పలు షరతుల ప్రకారం వివాహానికి సిద్ధమయ్యారు. తమ సంప్రదాయ ప్రకారం పెళ్లాడదామని ఐశ్వర్యను వరుడు తీసుకెళ్లాడని, తమ తరఫు నుంచి ఎవరూ రావద్దని చెప్పారని అమ్మాయి బంధువులు తెలిపారు. ఇంతలో యువతి ఆత్మహత్య చేసుకుందని హఠాత్తుగా కట్టుకథ అల్లుతున్నారని ఆరోపించారు. ఇది హత్యే: యువతి తండ్రి వారితో మనకు పొసగదని, ఈ పెళ్లి వద్దు అని మా కూతురికి చెప్పాం. ఆమె చాలా దృఢమైన మనస్సు గలది. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, యువకుడి కుటుంబ సభ్యులే ఈ హత్యకు పాల్పడ్డారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. యువతి తండ్రి సుబ్రమణి మాట్లాడుతూ ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి వద్దని నేను వారించినా, కూతురు, బంధువులు ఒప్పుకోలేదు, 15వ తేదీన ఆమె అమ్మమ్మ ఇంట్లో పూజలు చేయడానికి పంపించాము. 16వ తేదీన అశోక్ ఇంటికి తీసుకెళ్లారు. సోమవారం మధ్యాహ్నం ఫోన్ చేసి మీ కూతురు చనిపోయిందని చెప్పారు. అంతకుముందే వారు రెండు ఆస్పత్రులకు ఆమెను తీసుకెళ్లారు. ఎలా చనిపోయిందో తెలియదు అని వాపోయారు. అశోక్ కుటుంబమే హత్య చేసిందని అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి వరున్ని అరెస్టు చేశారు. -
‘మీది వేరే కులం.. నిన్ను చేసుకోవడం మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు’
చిత్తూరు: ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు. పెళ్లి చేసుకుంటానని దగ్గరయ్యాడు. ఆపై పెళ్లిమాట ఎత్తగా ఎప్పటికప్పుడు దాటవేస్తూ తప్పించుకోవడం ప్రారంభించాడు. గట్టగా నిలదీయగా.. ‘మీది వేరే కులం.. నిన్ను చేసుకోవడం మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు’ అంటూ ముఖంపై తెగేసి చెప్పేశాడు. పాపం.. అతనే జీవితమని నమ్ముకున్న ఆ ప్రియురాలి మనసు కకావికలమైంది. తీవ్ర మనస్తాపానికి గురైంది. మిద్దైపె నుంచి ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూ ఉరివేసుకుని తనువు చాలించింది. ఈ ఘటన వెంకటగిరి పట్టణంలోని 5వ వార్డు కాలేజీ మిట్టలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు మృతురాలి తల్లి భారతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. భారతికి కుమారుడు, కుమార్తె కావ్య ఉన్నారు. కావ్య (25) బీటెక్ పూర్తిచేసి పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేస్తోంది. రెండేళ్ల క్రితం ఆమె ఓ ప్రైవేటు కంపెనీలో ఉపాధి నిమిత్తం విధులు నిర్వర్తిస్తుండగా పెళ్లకూరు మండల కేంద్రానికి చెందిన తేజతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో తేజ పెళ్లి చేసుకుంటానని కావ్యను నమ్మించాడు. దీంతో కావ్య తేజకు దగ్గరైంది. అలా రెండేళ్ల వరకు గడిచాయి. కావ్య తేజాతో పెళ్లి విషయంపై మాట్లాడినప్పుడల్లా అతను ఏదో ఒకరకంగా మాట్లాడుతూ దాటవేసేవాడు. కావ్య అతన్ని గట్టిగా ప్రశ్నించడంతో ‘మీది వేలే కులం.. మాది వేరే కులం.. నిన్ను పెళ్లిచేసుకోవడం మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. నిన్ను నేను పెళ్లి చేసుకోలేను’ అంటూ యువతికి సమాధానం ఇచ్చాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కావ్య శుక్రవారం రాత్రి ప్రియుడు తేజాకు చివరి సారిగా ఫోన్‌చేసి పెళ్లి చేసుకోమని ప్రాధేయపడింది. అతను ఒప్పుకోకపోవడంతో విఽధిలేని పక్షంలో ఆ యువతి ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూ తన ఇంటి మిద్దైపెన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కావ్య ఎంతకీ కనిపించకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు మిద్దైపెకి వెళ్లి పరిశీలించగా.. ఆమె విగత జీవిగా ఉరితాడుకు వేలాడుతోంది. కావ్య ఫోన్ కాల్‌డేటా ఆధారంగా మృతురాలి తల్లి భారతి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కావ్య మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మహిళ ఆత్మహత్య
హైదరాబాద్: ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మూడుచింతలపల్లి మండలం, కొల్తూర్ గ్రామానికి చెందిన ప్రవళిక (25) శామీర్‌పేట్ మండలం, లాల్‌గడీ మలక్‌పేట్‌కు చెందిన రమేశ్ ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతనం కలిగారు. కాగా ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవళిక ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న జీనోమ్ వ్యాలీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైయిందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని సీఐ రాజ్‌గోపాల్‌రెడ్డి తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
బతుకమ్మకు వస్తనంటివి బిడ్డా..
దుగ్గొండి: ‘అమ్మా నాన్న జాగ్రత్త.. బతుకమ్మ ఆడుకునే సమయానికి ఇంటికి వస్తా’ అని ఫోన్లో మాట్లాడిన కొద్ది సేపటికే ఆ చదువుల తల్లి అనంత లోకాలకు వెళ్లిపోయింది. గ్రూప్–2 పరీక్షలు వాయిదా పడడంతో మనస్తాపానికి గురై మండలంలోని బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన మర్రి విజయ–లింగయ్య దంపతుల కుమార్తె ప్రవళిక (22) ఆత్మహత్య ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ బిడ్డ ఇక తిరిగిరాదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. విజయ–లింగయ్య దంపతులు.. కుమార్తె ప్రవళిక, కుమారుడు ప్రణయ్‌కుమార్‌ను ఉన్నంతలో బాగా చదివిస్తున్నారు. ప్రవళిక హనుమకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసింది. సంవత్సరం నుంచి హైదరాబాద్‌లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటలకు తల్లిదండ్రులతోపాటు సోదరుడు ప్రణయ్ కుమార్, శాయంపేట మండలం నేరేడుపల్లిలోని తన అమ్మమ్మతో ఫోన్లో మాట్లాడింది. అన్నం తిన్నారా? అని అడిగింది. బతుకమ్మ ఆడుకోవడానికి శనివారం సాయంత్రం వరకు ఇంటికి వస్తానని చెప్పి ఫోన్ పెట్టేసింది. పరీక్షలు వాయిదా పడి మనస్తాపానికి గురై ప్రవళిక ఆత్మహత్య చేసుకుందనే పిడుగులాంటి వార్త వారికి చేరింది. ఇప్పుడే తమ కూతురు ఫోన్లో మాట్లాడి విగత జీవిగా మారిందని తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. పోలీసులే సమాధానం చెప్పాలి.. మా అక్క చదువులో నాకన్నా చురుకైంది. గ్రూప్– 2 ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపరేషన్ అవుతోంది. పరీక్షలు వాయిదా పడడంతో కొంత ఆందోళన చెందినప్పటికీ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. మేం హైదరాబాద్ వెళ్లే వరకే చనిపోయి ఉంది. రాత్రే పోస్టుమార్టం చేశారు. అసలు ఎలా చనిపోయిందో, సూసైడ్ లెటర్ ఒకటని, రెండని పోలీసులు చెబుతున్నారు. వారే నిజాలతోపాటు సమాధానం చెప్పాలి. – మర్రి ప్రణయ్‌కుమార్, ప్రవళిక సోదరుడు -
చెల్లితో ఆస్తి పంపకాల గొడవ.. ఉరేసుకున్న వివాహిత
నల్గొండ: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం నేరేడుచర్ల మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. ఎస్ఐ పచ్చిపాల పరమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మున్సి పాలిటీలో నివాసముంటున్న ధీరావత్ వీర్యానాయక్, శ్రీదేవి(33) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు కార్తీక్, సాత్విక్ ఉన్నారు. వీర్యానాయక్ పెంచికల్‌దిన్న గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీదేవి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీర్యానాయక్ సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చి తలుపులు ఎంత కొట్టినా శ్రీదేవి తీయకపోవడంతో స్థానికుల సహకారంతో తలుపులు పగులకొట్టగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆమెను కిందకు దింపి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. శ్రీదేవి రాసిన సూసైట్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్తి పంపకాలే కారణమా..? శ్రీదేవి తల్లిదండ్రులు బిక్య హరిలాల్, కమ్మలమ్మ పెన్‌పహాడ్ మండలం గుడిబండతండాలో ఉంటున్నారు. శ్రీదేవి చెల్లెలు సునీత సూర్యాపేటలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంది. కాగా అక్కాచెల్లెళ్ల మధ్య కొంతకాలంగా ఆస్తి పంపకాలకు సంబంధించి గొడవలు జరగుతున్నాయని, ఈ విషయంలో తన తల్లిదండ్రులు సైతం తన చెల్లెలు సునీతకే సపోర్ట్ చేస్తుండడంతో శ్రీదేవి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి భర్త వీర్యానాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య
నల్గొండ: అదనపు కట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చల్లపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం స్థానిక సన్‌ఫ్లవర్ కాలనీలో నివసిస్తున్న లక్ష్మీపురం వీఆర్వో బెల్లంకొండ గోపీకృష్ణ భార్య అవిల (28) ఆదివారం మధ్యాహ్నం తన ఇంట్లోని బెడ్ రూమ్‌లో ఆత్మహత్య చేసుకుంది. గోపీకృష్ణకు, బందరు మండలం బీవీతోట పంచాయతీ సీతారామపురం గ్రామానికి చెందిన మట్టా వెంకటేశ్వరరావు కుమార్తె అవిలతో వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. వీరు ఇటీవల సన్‌ఫ్లవర్ కాలనీలో ఇల్లు కొనుగోలు చేసి నూతన ఇంట్లో కాపురం ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం అవిల తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన సమయంలో గోపీకృష్ణ భోజనం చేస్తుండగా తమ కుమార్తె గురించి అడిగారు. బెడ్రూమ్లో ఉన్నట్లు చెప్పాడు. తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటం గమనించి కంగారుగా కిటికీలో నుంచి చూడగా, అప్పటికే అవిల ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే గోపీకృష్ణకు విషయం చెప్పటంతో బెడ్రూమ్ తలుపులు పగుల గొట్టి అవిలను కిందకు దించి చూడగా అప్పటికే అవిల మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కొంతకాలంగా గోపీకృష్ణ అవిలను అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని మృతురాలి తండ్రి మట్టా వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో పెద్దల సమక్షంలో రాజీ చేయగా, నెల రోజుల నుంచి గోపీకృష్ణ మళ్లీ వేధింపులు ప్రారంభించాడని తెలిపాడు. భర్త్త గోపీకృష్ణ, అతని అన్న, తల్లి, మేనమామ, మేనమామ భార్య వేధించేవారని పేర్కొన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సీహెచ్ చినబాబు తెలిపారు. -
ఒంటరితనం భరించలేక.. యువతి తీవ్ర నిర్ణయం..!
సంగారెడ్డి: ఒంటరితనం భరించలేక యువతి తనువు చాలించిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెంకు చెందిన నూనె ధనూజ(21) రెండు నెలల క్రితం బ్రాంచ్ పోస్టు ఉమెన్‌గా ఉద్యోగం సాధించింది. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా చందుర్తి మండలం మర్రిగడ్డకు వచ్చింది. రెండు నెలలుగా మర్రిగడ్డలో అద్దె ఇంట్లో ఉంటూ విధులు నిర్వర్తిస్తుంది. ఈక్రమంలో వరుసకు బావ అయిన రాకేశ్‌ను ప్రేమిస్తుంది. ఒంటరితనంతో బాధపడుతున్నానని రాకేశ్‌తో చెప్పుకోగా.. ఉద్యోగానికి రాజీనామా చేసి రమ్మనడంతో గత నెల 31న రాజీనామా పత్రాన్ని సమర్పించింది. రెండు రోజులగా స్థానికంగా లేని ధనూజ శుక్రవారం మర్రిగడ్డలో అద్దెకుంటున్న ఇంటికి సామగ్రి తీసుకెళ్లేందుకు వచ్చింది. అదే రోజు రాత్రి 11.30 గంటల సమయంలో ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూనే తల తిప్పుతుందని చెప్పి ఫోన్ కట్ చేసింది. వెంటనే రాకేశ్ మర్రిగడ్డలోని తెలిసిన వ్యక్తులకు ఫోన్ చేసినా వారు స్పందించలేదు. శనివారం తెల్లవారుజామున మర్రిగడ్డకు చెందిన మరొక వ్యక్తికి రాకేశ్ ఫోన్ చేసి ధనూజ ఇంటికెళ్లి చూసి రావాలని కోరాడు. సదరు వ్యక్తి వెళ్లి పిలువగా గదిలో నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇంటి పైకప్పు ఎక్కి చూడగా ఉరివేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి నూనె మమత ప్రేమ వ్యవహారమే తన కూతురు మరణానికి కారణమని ఫిర్యాదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పెళ్లయి రెండేళ్లయినా పిల్లలు కలగకపోవడంతో వివాహిత ఆత్మహత్య..
తమిళనాడు: పెళ్లయి రెండేళ్లయినా పిల్లలు కలగకపోవడంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండిలో జరిగింది. నెట్టుకాడు గ్రామానికి చెందిన ఏలుమలై కుమార్తె సౌందర్య(21)కు మాంగావరం సమీపంలోని చెన్నవరం గ్రామానికి చెందిన గణేషన్‌తో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే ఇంత వరకు పిల్లలు లేరు. దీంతో అవమానంగా భావించిన యువతి తరచూ తల్లిదండ్రుల వద్ద బాధపడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 13న తనకు పిల్లలు లేకపోవడంతో అందరి వద్ద మాటపడాల్సి వస్తోందని తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాధపడింది. అదే రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. యువతి తల్లిదండ్రులు అనుమానంతో అక్కడికి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చిక్సిత కోసం చైన్నె వైద్యశాలకు తరలించారు. అక్కడ చిక్సిత పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి ఏలుమలై ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కగానొక్క కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. -
ఐదు నెలల క్రితమే పెళ్లి.. అత్తింటి వేధింపులతో గర్భిణి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: అత్తింటి వారి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎస్పీఆర్హిల్స్ అశయ్య నగర్‌కు చెందిన జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో డ్రైవర్‌గా పనిచేసే రాజేందర్‌కు బాలానగర్ చింతల్‌కు చెందిన లావణ్యతో ఐదు నెలల క్రితం వివాహం జరిగింది. లావణ్యకు పుట్టుకతోనే వినికిడి లోపం ఉంది. పెళ్లయిన కొద్ది రోజులకే ఆమె భర్త రాజేందర్, అత్తింటి వారు ఆమెను వేధింపులకు గురిచేసేవారు. చెవిటి దానివిగనుక అదనపు కట్నం తీసుకోరావాలని అత్తింటి వారు లావణ్యను వేధించేవారు. ఈ క్రమంలోనే గర్భిణి అయిన లావణ్య(25)తనలో తాను కుమిలిపోయి ఆగస్టు 14న తెల్లవారు జామున తన అత్తగారింట్లో ఫ్యానుకు ఊరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అయితే ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను కాపాడి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతిరాలి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు భర్త రాజేందర్, అత్త నరసవ్వలపై వరకట్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. చదవండి: బ్యాంక్ ఖాతాల్లోంచి డబ్బునలా కాజేస్తున్నారు! -
పిల్లలు లేరనే ఆవేదనతో వివాహిత ఆత్మహత్య
అన్నానగర్: కలరంపట్టి సమీపంలో పిల్లలు లేరనే ఆవేదనతో మంగళవారం ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. పెరంబలూరు జిల్లా కలరంపట్టి ఉత్తర వీధికి చెందిన జగన్, అతడి భార్య రంజనీదేవి (33). వీరికి పెళ్లయ్యి ఏడేళ్లయ్యింది. వారికి పిల్లలు లేరు. దీంతో రంజనీదేవి మనస్థాపంతో ఉంటూ వచ్చింది. ఈక్రమంలో మంగళవారం వేకువజామున రంజనీదేవి ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెరంబలూరు పోలీసులు రంజనీదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెరంబలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు ముందు రంజనీదేవి తన సెల్ఫోన్లో శ్రీ నా చావుకు ఎవరూ కారణం కాదుశ్రీ అంటూ వీడియో రికార్డ్ చేసింది. పోలీసులు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి కుదిరింది.. 9 రోజుల్లో నిశ్చితార్థం ఉందని చెప్పిన వినలేదు..
సాక్షి, నల్గొండ: తనకు పెళ్లి కుదిరింది.. మరో తొమ్మిది రోజుల్లో నిశ్చితార్థం ఉందని చెప్పినా.. ఆ ప్రేమోన్మాది వినిపించుకోలేదు.. పైగా ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లి నన్నే ప్రేమించాలని ఒత్తిడి చేశాడు.. ఆపై శారీరకంగా కలవాలంటూ అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలు కేకలు వేయడంతో పరారయ్యాడు. అయితే పరువు పోయిందని భావించిన ఆ యువతి గడ్డిమందు తాగి చివరకు ప్రాణాలు విడిచింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలిలా.. నల్లగొండ జిల్లా కనగల్ మండలం లింగాలగూడెం గ్రామానికి చెందిన కదిరే శంకర్, మంగమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. చిన్న కూతురు మౌనిక(20) నల్లగొండలోని మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతోంది. చదవండి: Viveka Case: కావాలనే ఇరికించారు.. బెయిల్ ఇవ్వండి ప్రేమించాలని మూడు నెలలుగా వేధింపులు నల్లగొండ మండల పరిధిలోని జి.చెన్నారం గ్రామానికి చెందిన బొల్లం శ్రవణ్ మూడు నెలల నుంచి మౌనికను ప్రేమించమని వెంటపడుతున్నాడు. ఆమె ఫోన్ నంబర్ తీసుకుని అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతున్నాడు. ప్రేమించకపోతే చంపుతానంటూ బెదిరింపులకు దిగాడు. ఇదే క్రమంలో శ్రవణ్ ఈ నెల 9న మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో మౌనిక ఇంటికి చేరుకున్నాడు. ప్రేమించమని, శారీరకంగా కలవాలని చేయి పట్టుకోవడంతో మౌనిక కేకలు వేసింది. దీంతో శ్రవణ్ పారిపోతుండగా చుట్టు పక్కలవారు, తండ్రి శంకర్ గమనించి అతన్ని మందలించారు. ఈ ఘటనతో పరువుపోయిందని తీవ్ర మనస్తాపం చెందిన మౌనిక అదే రోజు సాయంత్రం గడ్డి మందు తాగింది. వాంతులు చేసుకుంటుండగా మౌనిక తమ్ముడు జాని గమనించి నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. అక్కడ చికిత్స పొందుతున్న మౌనిక శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు శ్రవణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అంతిరెడ్డి తెలిపారు. -
అవమానించిన అత్తింటి బంధువులు.. సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మామ, భర్త తరపు బంధువులు తరచూ తనను అవమానిస్తున్నారని గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... సరూర్‌నగర్ కృష్ణానగర్ కాలనీ నివాసి విష్ణువర్ధన్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం మియాపూర్, ఆల్వీన్ కాలనీకి చెందిన శశికళ(33)తో వివాహమైంది. వీరికి కుమార్తె శ్రేయారెడ్డి(6)ఉంది. శశికళను మామ దేవేందర్‌రెడ్డి, భర్త తరఫు బంధువులు ఉషారాణి, వందన, రాజశేఖర్ తరచూ అవమానిస్తున్నారని శశికళ తన తల్లి యానాం గౌరికుమారికి పలుమార్లు చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా ఉండగా, విష్ణువర్దన్‌రెడ్డి గురువారం ఉదయం శశికళ తల్లి గౌరీకుమారికి ఫోన్ చేసి తక్షణమే తమ ఇంటికి రమ్మన్నాడు. దీంతో ఆమెకు అనుమానం వచ్చి కుమార్తె ఇంటి పక్కన ఉండేవారికి ఫోన్ చేయగా, శశికళ చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. వెంటనే బంధువులతో కలిసి ఆమె కృష్ణానగర్‌కు చేరుకొని కన్నీరు మున్నీరైంది. మామ, బంధువులు అవమానకరంగా ప్రవర్తించడంతోనే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని, నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గౌరీకుమారి ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. చదవండి: Hyderabad: తాగుడుకు బానిసైన భర్త.. ఉద్యోగం మానేసి అబద్ధాలు చెప్తుండటంతో -
Hyderabad: తాగుడుకు బానిసైన భర్త.. ఉద్యోగం మానేసి అబద్ధాలు చెప్తుండటంతో
సాక్షి, హైదరాబాద్: తాగుడుకు బానిసైన భర్తను భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లా దరూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన అంజలికి 2014లో పెళ్లి జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని శ్రీరాంనగర్‌లో నివసిస్తూ కాల్ సెంటర్లో పనిచేస్తోంది. ఆమె భర్త నరేంద్ర రోడ్ నెం. 12లోని టీఎక్స్ ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా పని చేస్తుండేవాడు. ఇటీవల ఉద్యోగం కూడా చేయకుండా మద్యానికి బానిసై ఇంట్లోనే ఉంటూ భార్య సంపాదనతోనే మద్యం తాగుతున్నాడు. ఈ విషయంలో ఆమె ఎన్నిసార్లు మందలించినా వినిపించుకోకపోగా సెల్ఫోన్లు అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో మద్యం తాగుతుండటమే కాకుండా అబద్దాలు కూడా చెప్తుండేవాడు. దీంతో విసిగిపోయిన అంజలి గురువారం తెల్లవారుజామున తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చిన్నారులపై దూసుకెళ్లిన వాహనం -
పెద్దలను ఎదిరించి వివాహం.. ఊయల తాడుకు ఉరేసుకొని..
ప్రకాశం: వేప చెట్టుకు ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముండ్లమూరులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ముండ్లమూరుకు చెందిన షేక్ కాలేషా, మహబూబి దంపతుల రెండో కుమార్తె నూర్ అప్సర అలియాస్ బుజ్జి (27) తండ్రి ఆమె చిన్నతనంలోనే మృతి చెందాడు. అద్దంకి మండలం వేలమూరిపాడు గ్రామానికి చెందిన ఎస్సీ యువకుడు కాలింత కిరణ్‌కుమార్‌ను ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకుంది. కొంతకాలానికి తల్లి కూడా మరణించింది. కొన్నేళ్లపాటు వీరి కాపురం సజావుగానే సాగింది. కిరణ్‌కుమార్ అద్దంకిలోని బంగ్లా రోడ్లో ఫొటోస్టూడియో నిర్వహిస్తున్నాడు. నూర్అప్సర ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తోంది. ఇటీవల దంపతుల మధ్య తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో నూర్అప్సరను కిరణ్‌కుమార్ వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగినట్లు చుట్టుపక్కల వారు తెలిపారు. మనస్తాపం చెందిన నూర్ అప్సర ఆదివారం ఉదయం వేలమూరిపాడు నుంచి ముండ్లమూరు వచ్చింది. పిల్లలు తొమ్మిదేళ్ల నిషిత, ఏడేళ్ల సంగీత ఏడుస్తూ వెంటపడినా పట్టించుకోకుండా వారిని అక్కడే వదిలేసి వచ్చింది. ముండ్లమూరులోని తమ ఇంటి ఆవరణలో ఉన్న వేపచెట్టుకు అట్లతద్దె సమయంలో ఏర్పాటు చేసిన ఊయల తాడుకు ఉరేసుకునేందుకు సిద్ధమైంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అటుగా వెళ్తున్న ఎస్సీకాలనీకి చెందిన ఒక మహిళ నూర్ అప్సర వద్దకు వచ్చి కాసేపు కూర్చుని వెళ్లింది. పక్కనే చర్చి ఉండటంతో ఆదివారం ప్రార్థనలకు వచ్చిన మహిళలు ఇళ్లకు వెళ్లేంత వరకు ఆగింది. ఆ ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న తొట్టెను వేపచెట్టుకు వేలాడుతున్న తాడు వద్దకు తెచ్చుకుని మెడలో ఉన్న బంగారు భరణాలు హ్యాండ్‌బ్యాగ్‌లో వేసి ఉరేసుకుంది. ఉరేసుకునే ముందు భర్తకు చెట్టుకు వేలాడుతున్న తాడు ఫొటో, ఆ ప్రాంతం ఫొటోలను వాట్సాప్‌లో పంపినట్లు తెలిసింది. చెట్టుకు మృతదేహం వేలాడుతుండగా, సాయంత్రం అటుగా వెళ్లిన కొందరు చూసి చుట్టుపక్కల వాళ్లకు చెప్పారు. రోడ్డు పక్కనే కావడంతో స్థానికులు మృతదేహాన్ని చూసేందుకు గుమిగూడారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై యూవీ కృష్ణయ్య సిబ్బందితో అక్కడికి చేరుకుని వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలికి ముగ్గురు తోడబుట్టిన వారు ఉన్నారు. కులాంతర వివాహం చేసుకోవడంతో మృతదేహాన్ని చూసేందుకు బంధువులెవరూ ముందుకురాలేదు. -
వివాహేతర సంబంధం.. ప్రియుడితో బిడ్డకు జన్మనిచ్చిన ప్రియురాలు
తమిళనాడు: వివాహేతర సంబంధంతో పుట్టిన బిడ్డను నీటి డ్రమ్ములో ముంచి చంపి తర్వాత తల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అరియలూరు జిల్లా సెంతురై సమీపంలోని దిఖుర్ గ్రామానికి చెందిన రాజేశ్వరి (27). ఈమె భర్త చనిపోయాడు. రాజేశ్వరి తిరుపూర్‌లోని ఒక బనియన్ కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో అక్కడ ఒకరితో రాజేశ్వరికి వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో రాజేశ్వరి గర్భం దాల్లి నాలుగు నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ స్థితిలో చిన్నారి తండ్రి ఎవరని బంధువులు తరచూ అడగడంతో రాజేశ్వరి మనస్తాపం చెందింది. ఇంట్లో ఉన్న వాటర్ డ్రమ్ములో బిడ్డను ముంచి కడతేర్చింది. తర్వాత రాజేశ్వరి ఇంటి సమీపంలోని చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కువాగం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జయంగొండం ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సూపర్ వాస్మోల్ తాగి మహిళ.. నితిన్ మాట వినడంలేదని...
పార్వతీపురం: కన్న కుమారుడు చెప్పిన మాట వినడంలేదని మనస్తాపం చెందిన ఓతల్లి సూపర్ వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. సోమవారం జరిగిన సంఘటనపై పార్వతీపురం అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొమరాడ మండలం గుమడ గ్రామానికి చెందిన మామిడి నాగినికి 16 ఏళ్ల కుమారుడు నితిన్ ఉన్నాడు. నితిన్ వీధిలో ఉన్న ఇతర స్నేహితులతో కలిసి హైదరాబాద్, చెన్నై వెళ్లిపోతానని అంటున్నాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు వెళ్లిపోతే ఎలా అని తల్లి నాగిని మనస్తాపానికి గురై సోమవారం రాత్రి తలకు రాసుకునే సూపర్ వాస్మోల్ తాగేసింది. ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు 108 ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
అనుమానం... భార్యను అతికిరాతంగా హతమార్చిన భర్త..
మైలవరం: కుటుంబ కలహాల నేపథ్యాన భార్యను భర్త అతికిరాతంగా హతమార్చిన ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మంగళవారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన పెనుముక్కల మధుమురళి, దుర్గాభవాని(21) భార్యాభర్తలు. వీరికి ఆరేళ్ల వర్షిత్, ఏడాదిన్నర కుమార్తె జెస్సీ ఉన్నారు. ఏడాది క్రితం వీరు మైలవరం వచ్చి రామకృష్ణ కాలనీలో అద్దెకు ఉంటుండగా మధుమురళి టైల్స్ పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, మధుకి ఇటీవల భార్యపై అనుమానం పెరగడంతో మనస్పర్థలువచ్చాయి. ఈ క్రమంలోనే మంగళవారం మాటామాటా పెరిగి దుర్గాభవాని మెడపై ఆయన కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావం అవుతుండగా ఆమె కేకలు వేస్తూ బయటకు పరుగులు తీస్తూ గేట్ వద్ద కుప్పకూలింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించడంతో పాటు మధుమురళిని అదుపులోకి తీసుకున్నారు. -
దివ్యకి ఏమైంది? భర్త ఫోన్ చేసి ఇంటికి చేరోలోపే..
హైదరాబాద్: పటాన్చెరు ఎస్ఐ దుర్గయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన దివ్య(18) అదే రాష్ట్రానికి చెందిన వికాస్‌కు ఇచ్చి వివాహం చేశారు. బతుకుదెరువు కోసం మండల పరిధిలోని ఇస్నాపూర్‌కు వచ్చి అద్దెకు ఉంటున్నారు. వికాస్ డీమార్ట్‌లో పనిచేస్తున్నాడు. ఈ నెల 25వ తేదీన వికాస్ ఎప్పటిలాగే పనికి వెళ్లగా మధ్యాహ్నం అతని భార్య దివ్య పోన్‌చేసి ఇంటికి రమ్మని చెప్పింది. దీంతో వికాస్ ఇంటికి వెళ్లేసరికి ఎలుకల మందు తాగానని చెప్పడంతో ఆమెను వెంటనే పటాన్‌చెరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి దివ్య చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి రాధాగజనాన్ తన కూతురు ఆరోగ్య పరిస్థితి సరిగాలేక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బావతో ప్రేమ.. అంతా బాగుంది అనుకునేలోపే చివరికి!
విజయనగరం: ప్రియుడు లేని లోకంలో తాను జీవించలేనని, తన జీవితం వ్యర్థమైపోయిందని మనస్తాపం చెందిన ఓ యువతి గన్నేరుపిక్కలు తిని ఆత్మహత్యకు పాల్పడింది. గుమ్మలక్ష్మీపురం మండలంలో జరిగిన ఈ విషాద సంఘటనపై ఎల్విన్‌పేట ఎస్సై ఎస్.షన్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డొంగరికిక్కువ గ్రామానికి చెందిన కోలక కిశోర్ పాముకాటుకు గురై చికిత్సపొందుతూ వారం క్రితం మృతిచెందాడు. వరుసకు బావ అయిన కిశోర్‌తో ప్రేమలో ఉన్న అదే గ్రామానికి చెందిన తాడంగి పుష్పవతి (19) కిశోర్ మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి గన్నేరుపిక్కలు నూరి మింగేసింది. అపస్మారక స్థితిలో ఉన్న పుష్పవతిని గుర్తించిన కుటుంబసభ్యులు కురుపాం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్య సేవల అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి తండ్రి చిన్నప్పుడే చనిపోగా తల్లి లక్ష్మి అన్నీ తానై చూసుకునేది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పురుగు మందు తాగి యువకుడు.. బొబ్బిలి: మండలంలోని రెడ్డియ్యవలసకు చెందిన సొంగలి గణేష్(21) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. డిగ్రీ పూర్తిన గణేష్ ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఏమైందో ఏమో కానీ బుధవారం రాత్రి పురుగు మందు తాగేశాడు. ఈ విషయం గుర్తించిన కుటుంబసభ్యులు బొబ్బిలి సీహెచ్‌సీకి గణేష్‌ను తీసుకురాగా ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సిఫార్సు మేరకు విజయనగరం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలపై కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చీమల మందు తాగి వ్యక్తి.. పాచిపెంట: భార్య మందలించిందని మనస్తాపానికి గురైన వ్యక్తి చీమల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం పాచిపెంట మండలంలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పద్మాపురం పంచాయతీ పిండ్రంగివలస గ్రామానికి చెందిన డి.రాజు మద్యానికి బానిసై భార్యతో తరచు గొడవపడేవాడు. ఈ క్రమంలో పదిరోజులక్రితం భార్యతో గొడవ పడగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. బుధవారం ఉదయం మద్యం తాగిన రాజు భార్య వద్దకు వెళ్లి ఇంటికి రావాలని కోరగా నిరాకరించింది. దీంతో మనస్తాపం చెంది సాయంత్రం చీమల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సాలూరు ఏరియాఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై ముసలయ్య తెలిపారు. -
బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణ.. భర్త, ఆడపడచుతో గొడవ..
హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం అబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మూసాపేట్, భరత్‌నగర్ ప్రాంతానికి చెందిన మురారి అనూష(32)కు గత ఫిబ్రవరి 12న విజయవాడకు చెందిన నాంచారయ్యతో వివాహం జరిగింది. నాంచారయ్య సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, బీటెక్ పూర్తి చేసిన అనూష ఉద్యోగాన్వేషణలో ఉంది. మూడురోజుల క్రితం ఇంట్లో జరిగిన వేడుకలో భర్త, ఆడపడచుతో గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి వచ్చింది. అయినా భర్త, ఆడపడుచు ఫోన్‌చేసి గొడవ పడుతుండటంతో మనస్తాపానికి లోనైంది. ఈ నేపథ్యంలో బ్యాంకు పని నిమిత్తం ఎస్ఆర్నగర్ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటికి వచ్చిన అనూష నేరుగా గగన్‌విహార్ భవనం 11వ అంతస్తు పైకి ఎక్కి సోదరుడికి వాయిస్ మెసేజ్ చేసి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి సోదరుడు కార్తీక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని మనస్తాపం.. యువతి ఆత్మహత్య
సాక్షి, వరంగల్: డిగ్రీ వరకు చదివిన తనకు ఉద్యోగం రావడం లేదని మనస్తాపం చెందిన ఓ యువతి జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం గ్రేటర్ వరంగల్ పరిధిలో జరిగింది. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారంలో ఊదరి రవికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరికి వివాహమైంది. చిన్న కూతురు మేఘన (23) డిగ్రీ వరకు చదవి ఇంటివద్దే ఉంటోంది. ఉదయం 11 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ ఇన్స్పెక్టర్ సట్ల రాజు తెలిపారు. ‘డిగ్రీ వరకు చదివినా ఆర్థికంగా నా కుటుంబానికి ఏమీ చేయలేకపోతున్నా. నన్ను తల్లిదండ్రులు బాగా చూసుకున్నారు. నా తండ్రి మద్యం తాగడం బంద్ చేసి ఆరేళ్ల నుంచి బాగానే చూసుకుంటున్నాడు. నాకు జాబ్ రావడం లేదనే ఒత్తిడికి గురవుతున్నా. అందరూ జాబ్ కోసం ట్రై చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత ఓడిపోతారని, కానీ నేను ప్రయత్నం చేయకుండానే ఓడిపోతున్నా. ఐ మిస్‌యూ అమ్మానాన్న.. సిస్టర్స్, కుటుంబ సభ్యులు బాగుండాలి’అని తన డైరీలో రాసుకుని ఆత్మహత్య చేసుకుందని బంధువులు తెలిపారు. పోలీసులు ఆ డైరీని స్వాధీనం చేసుకున్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: రిజిస్ట్రేషన్ చేయకుంటే పెట్రోల్ పోస్తాం.. పోలీసుల సాక్షిగా మహిళా తహసీల్దార్‌కు బెందిరింపులు.. -
భర్త ఆలస్యంగా వచ్చాడని..భార్య ఆత్మహత్య!
సాక్షి, బెంగళూరు: పక్కింట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి ఆలస్యంగా వచ్చిన భర్తతో గొడవపడిన భార్య అలిగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. దక్షిణ కన్నడ జిల్లా సూరత్కల్లోని బాళ గ్రామం ఒట్టెకాయారుకు చెందిన హరీశ్, దివ్య (24) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆదివారం పక్కింట్లో శుభకార్యం జరిగితే హరీశ్ ఒక్కడే వెళ్లాడు. ఇంటికి ఆలస్యంగా రావడంతో ఆక్రోశం వ్యక్తం చేసిన దివ్య సాయంత్రం నాలుగు గంటల సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. దివ్వ సూరత్కల్లోని ఒక మందుల షాపులో పని చేసేది. అన్యోన్యంగా కాపురం సాగుతుండగా, కూతురు ఇలా చేయడంపై అనుమానంతో ఆమె తల్లి గిరిజా పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు భర్త హరీశ్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తునారు. చదవండి: ముగ్గురు లేడీ కిలాడీలు.. అమాయక యువకులను సైగలతో ఆకర్షించి -
పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిన యువకుడు.. పెళ్లై ఏడాది తిరగకముందే
సాక్షి, వరంగల్: యువకుడు, అతని కుటుంబ సభ్యుల వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బండమీదితండాలో సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన మనుబోతులగడ్డకు చెందిన భూక్య డోలి, బిచినిల చిన్న కుమార్తె మూడు అనూష (24)ను బండమీదితండాకు చెందిన రమేశ్‌కు ఇచ్చి 2022 ఫిబ్రవరి మాసంలో వివాహం జరిపించారు. ప్రస్తుతం అనూష మూడు నెలల గర్భిణి. వీరి జీవితం సజావుగా సాగుతున్న క్రమంలో తండాకు చెందిన ఉస్మాన్‌తో పాటు మరికొంతమంది వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో గ్రామ పెద్దలు, పోలీసులు హెచ్చరించినా వేధింపులు ఆపకపోవడంతో సోమవారం రాత్రి పురుగుల మంది తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించగా ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. తన కుమార్తె మృతికి కారణమైన ఉస్మాన్, మస్తాన్, ఇమామ్‌సాబ్, సర్వర్, అనిల్, సైదులుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ సంపత్‌రావు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. చదవండి: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. శవాలను భద్రపరిచే కెమికల్ కలుపుతూ.. -
Hyderabad: స్వప్నతో పరిచయం.. భార్యను పట్టించుకోకుండా..
సాక్షి, హైదరాబాద్: భర్త వేధింపులు తాళలేక మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గురువారం చోటు చేసుకుంది. సీఐ చంద్రశేఖర్ వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా దర్పనపల్లి మండలం దమ్మన్నపేట్ తండాకు చెందిన మాలోత్ మంజుల(24)ను సిరిసిల్లా జిల్లాకు చెందిన మాలోత్ ప్రసాద్‌తో 2021 జనవరి 8న వివాహం జరిగింది. పెళ్లిలో రూ.10లక్షల నగదు, ప్లాట్, 8 తులాల బంగారాన్ని కట్నంగా అందజేశారు. ఉపాధి కోసం హకీంపేట్‌కు వలస వచ్చిన ప్రసాద్, అతడి భార్య, 15 నెలల కుమారుడితో కలిసి జీవిస్తున్నారు. గత కొంత కాలంగా ప్రసాద్‌కు స్వప్ప అనే మహిళతో పరిచయం ఏర్పడింది. భార్య, కుమారున్ని పట్టించుకోకుండా ప్రసాద్ తిరుగుతున్నాడు. కుల పెద్దలకు ఫిర్యాదు చేసినా ప్రసాద్ ప్రవర్తనలో మార్పు రాలేదు. అంతేకాకుండా మంజులను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన మంజుల ఇంట్లో ఫ్యాన్ రాడ్డుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీకి తరలించి మంజుల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: (పవన్ కల్యాణ్ ఇంటి ఎదుట మహిళ హంగామా) -
భర్త ఇంటికి లేటుగా వచ్చాడని.. బాత్రూమ్లోకి వెళ్లి యాసిడ్..
సాక్షి, పటాన్చెరు టౌన్: భర్త ఇంటికి లేటుగా వచ్చాడని మనస్తాపం చెందిన భార్య యాసిడ్ తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రామనాయుడు వివరాల ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం గాజిపూర్ జిల్లాకు చెందిన రవీంద్ర, భార్య అంజులదేవి(28)తో కలిసి బతుకుదెరువు నిమిత్తం పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌లో ఓ కిరాణ షాపులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 18న రవీంద్ర ఇంట్లో టిఫిన్ తినకుండా షాపుకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తతో అంజుల దేవి మధ్యాహ్న భోజనానికి ఎందుకు రాలేదని అరుస్తూ బాత్రూమ్లోకి వెళ్లి యాసిడ్ తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు పటాన్చెరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చేర్యాలలో.. చేర్యాల(సిద్దిపేట): చేర్యాల మండలం ఆకునూరులో ఆత్మహత్యకు పాల్పడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బోయిని శేఖర్(32) ఈ నెల 15న పురుగుల మంది తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య కావ్య ప్రస్తుతం 5నెలల గర్భిణి. కాగా మృతుడి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పిల్లలే దూరమైతే నా బతుకెందుకు..!
సాకక్షి, హైదరాబాద్: పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.. ఇద్దరు పిల్లలు కలిగినా తరచుగా శారీరకంగా మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. చివరకు పేగు తెంచుకుని పుట్టిన సొంత బిడ్డలను సైతం దూరం చేయడంతో మానసికంగా కృంగిపోయిన ఆ తల్లి తీవ్ర మనోవేదనకు గురై పిల్లలే నాకు దూరమైతే నేనెందుకు బతకాలి, ఇంకెందుకు నా బతుకంటూ పుట్టింట్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని సంజయ్న గర్‌లో జరిగింది. భర్త వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందనే విషయం సూసైడ్ నోటు ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు తమ బిడ్డ మృతదేహంతో సంజయ్‌నగర్ బస్తీలోని భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పోలీసులు.. స్థా నికుల కథనం ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి మండలం, అంతమ్మ గూడంనకు చెందిన శ్రీలత(30)కు పదేళ్ల క్రితం బాగ్‌లింగంపల్లికి చెందిన సాగర్‌తో వివాహమైంది. వీరికి చెర్రి (7), హని (6) ఇద్దరు సంతానం. డీజే సౌండ్ సిస్టమ్‌ను నడుపుకునే సాగర్, అతని తమ్ముడు గడ్డం సతీష్ ఓ రాజకీయ పారీ్టలో పనిచేస్తున్నారు. వారి తల్లి భాగ్యలక్ష్మి రైల్వేలో ఉద్యోగి. గత కొన్నిరోజులుగా సాగర్ మద్యం సేవించి భార్య శ్రీలతను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు తెలిసింది. కాగా అదనపు కట్నం తీసుకురావాలంటూ తీ వ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అమ్మకు దయ్యం పట్టిందంటూ ఇద్దరు పిల్లలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఇటీవల శ్రీలత పుట్టింటికి వెళ్లగా పిల్లలను తనవద్దే ఉంచుకుంటానని చెప్పి భా ర్యకు విడాకులు ఇస్తున్నట్లుగా ఓ అడ్వొకేట్ ద్వారా సాగర్ భార్యకు నోటీసులు పంపినట్లు సమాచారం. పిల్లలే దూరమైతే నేనెందుకు బతకాలి, నాబతుకెందుకు అంటూ ఆమె పుట్టింట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. భర్త ఇంటిముందు బంధువుల ఆందోళన... మంగళవారం ఉదయం 5గంటల నుంచి 6గంటల మధ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న శ్రీలత మృతదేహానికి స్థానిక పోలీసులు భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం శ్రీలత మృతదేహంతో బాగ్‌లింగంపల్లిలోని సంజయ్‌నగర్‌లోని భర్త సాగర్ ఇంటి ఎదుట తల్లిదండ్రులు, బంధువులు సాయంత్రం 4గంటల ప్రాంతంలో వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, సీఐ సంజీవకుమార్, ఎస్సైలు వెంకట్రమణ, శ్రీనివాస్‌రెడ్డి, కిరణ్, సందీప్‌రెడ్డితోపాటు ముషీరాబాద్, గాం«దీనగర్, గోషామహల్ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ సందర్భంగా పోలీసులు, మృతిరాలి బంధువుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక్కడే దహన సంస్కారాలు నిర్వహిస్తామని, కనీసం పిల్లలను తమకు అప్పగించేలా చూడాలని పోలీసులను వేడుకున్నారు. తమకు న్యాయం జరిగేవరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మీంచుకోని కూర్చున్నారు. ఏసీపీ, సీఐలు ఎంత నచ్చజెప్పినా మృతదేహాన్ని నిందుతుని ఇంటిముందు పెట్టుకోని నిరసన వ్యక్తం చేశారు. శ్రీలత ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలంటూ ఓ ఫ్లెక్సీని ఇంటి గేటుకు తగిలించారు. అయితే గడ్డం సాగర్, అతని తమ్ముడు సతీష్‌కు పలువురు రాజకీయ నాయకులు అండగా నిలుస్తున్నారని బాధితులు ఆరోపించారు. శ్రీలత మరణానికి కారకులైన వారిని అరెస్టు చేయాలని, అప్పుడు మాత్రమే ఆందోళన విరమిస్తామని మృతిరాలి బంధువులు, తల్లిదండ్రులు స్పష్టం చేశారు. -
ప్రియుడి మోసం.. గర్భవతి కావడంతో యువతి ఆత్మహత్య
కరీంనగర్: ప్రేమ పేరుతో గర్భవతిని చేసి ఆపై ప్రియుడు ముఖం చాటేయడంతో గిరిజన యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కౌటాల మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గురుడుపేట గ్రామానికి చెందిన ఎర్మ సత్తయ్య భక్కుబాయి దంపతులకు కూతురు అంజలి(19) ఇంటర్ పూర్తి చేసి మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రిలో లాబ్ టెక్నిషీయన్‌గా పని చేస్తుంది. ఇదే క్రమంలో అదే ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నిషియన్‌గా విధులు నిర్వహిస్తున్న చింతలమానెపల్లి మండలంలోని రుద్రాపూర్ గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో శరీరకంగా దగ్గరయ్యారు. దీంతో అంజలి గర్భవతి కావడంతో ఆ విషయాన్ని ప్రియుడికి తెలిపింది. పెళ్లి చేసుకోవాలని కోరడంతో ముఖం చాటేశాడు. దీంతో తాను మోసపోయానని మూడు నెలల క్రితం స్వగ్రామమైన గురుడుపేటకు వచ్చింది. అప్పటి నుంచి మానసికంగా బాధపడుతోంది. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. బంధువులు గమనించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో కాగజ్‌నగర్ మండలంలోని ఈజ్‌గాంలోని ప్రైవేట్ క్లినిక్‌లో చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కాగజ్‌నగర్‌కు శనివారం రాత్రి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందింది. డీఎస్పీ విచారణ... యువతి మృతిచెందిన వార్తను తెలుసుకున్న కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, కౌటాల సీఐ బుద్దే స్వామి, ఎస్సై ప్రవీణ్‌కుమార్ గురుడుపేట గ్రామానికి చేరుకుని యువతి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిర్పూర్(టి) సామాజిక ఆసుపత్రికి తరలించారు. -
భార్య ప్రాణాలు తీసిన భర్త సోమరితనం
సాక్షి, బెంగళూరు: భర్త సోమరిగా మారడంతో ఇల్లు గడవక, పిల్లలకు పూటకు ఇంత తిండి పెట్టలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన చామరాజనగర జిల్లా కొళ్లెగాలలో చోటు చేసుకుంది. ముడిగండ లేఔట్లో రియాజ్, ఉమైజైబా(22) నివాసం ఉంటున్నారు. వీరికి పిల్లలు ఉన్నారు. అయితే భర్త ఎలాంటి పనులకు వెళ్లకుండా కుటుంబ పోషణను పట్టించుకోలేదు. కనీసం వంట వండుకునేందుకు కూడా సరుకులు లేవని, పిల్లలకు ఆహారం ఎలా పెట్టాలని భర్త వద్ద వాపోయినా ఫలితం లేకపోయింది. దీంతో మనో వేదనకు గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కొళ్లెగాల పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ప్రియుడితో భార్య షికారు.. వెంబడించి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్న భర్త -
బెంగళూరులో ఘోరం.. తమ్ముని భార్య వేధిస్తోందని..
సాక్షి, బెంగళూరు : బంధువు వేధిస్తోందని తీవ్ర నిర్ణయం తీసుకుందో తల్లి. ఈ దుర్ఘటన బెంగళూరు బ్యాటరాయనపుర పోలీసుస్టేషన్ పరిధిలోని హొసగుడ్డహళ్లిలో జరిగింది. తమ్ముని భార్య సతాయిస్తోందని లక్ష్మమ్మ (48), కొడుకు మదన్ (13)ను గొంతు పిసికి చంపి, తాను ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమ్ముని భార్య కేసు పెట్టిందని వివరాలు... లక్ష్మమ్మ తమ్ముడు సిద్దేగౌడకు రంజిత అనే యువతితో వివాహమైంది. అప్పుడప్పుడు భార్యభర్తలు గొడవపడేవారు. రంజిత కట్నం, గృహహింస కేసును పెట్టడంతో భర్త సిద్దేగౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో లక్ష్మమ్మ, ఈమె భర్త శివలింగేగౌడతో పాటు 9 మందిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామాలతో విరక్తి చెంది అకృత్యానికి పాల్పడింది. భర్త ఫోన్ చేయగా హొసగుడ్డహళ్లిలో నివాసం ఉంటున్న లక్ష్మమ్మ భర్త గాందీనగరలో హోటల్ నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 9:30 హోటల్‌కు భర్త హోటల్ నుంచి ఫోన్ చేశాడు. ఎంతసేపటికీ స్పందించకపోవడంతో పక్కింటి వారికి ఫోన్ చేయగా వారు వెళ్లి చూస్తే శవాలై కనిపించారు. భర్త శివలింగేగౌడ, పెద్ద కొడుకు నవీన్ ఇంటికి చేరుకుని విలపించారు. పెద్ద తప్పు చేశాను రంజితతో నా తమ్మునికి పెళ్లి చేసి పెద్ద తప్పు చేశాను, ఆమె వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొంటున్నాను. నా మరణానికి సవితా, శివణ్ణ, లక్ష్మి, పుట్ట, సిద్ధరాజు, శివలింగ, శంకర, సిద్దరామ అనే వారు కారణమని, భర్త, తమ్ముడు తన అంత్యక్రియలను చేయాలని వీడియోలో తెలిపింది. -
ప్రేమ పేరుతో లొంగదీసుకొని.. ప్రియుడు మోసం చేశాడంతో
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అజ్మీరతండా గ్రామ పంచాయతీ పరిధి దారావత్‌తండాకు చెందిన భూక్య అనూష(18) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అనూష మహబూబాబాద్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. అదే తండాకు చెందిన దారావత్ శేఖర్ ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అనూష, శేఖర్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈక్రమంలో శేఖర్ పెళ్లి చేసుకుంటానని అనూషను నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈవిషయం ఇటీవల యువతి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు శేఖర్ తల్లిదండ్రులతో మాట్లాడారు. అనూష తల్లిదండ్రులు వారిద్దరికీ పెళ్లి చేద్దామన్నారు. దీంతో యువకుడి తల్లిదండ్రులు ఒక్కసారిగా కోపోద్రుక్తులై దుర్భాషలాడారు. ఇదే విషయంపై యువకుడిని నిలదీయగా.. అతను కూడా ముఖం చాటేశాడు. దీంతో తాను ప్రేమికుడి చేతిలో మోసపోయానని గ్రహించిన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కాగా.. తన బిడ్డ చావుకు కారణమైన శేఖర్, అతడి కుటుంబీకులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిపెడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: ఎంత పని చేశావు తల్లీ! తన కొడుకుకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని.. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
Hyderabad: మహిళకు ఫైనాన్స్ సంస్థ వేధింపులు.. సుసైడ్ నోట్ రాసి..
సాక్షి, హైదరాబాద్: ఫైనాన్స్ సంస్థ వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజబొల్లారం తండాకు చెందిన సునీత(35) గత కొంత కాలంగా కూతురుతో కలిసి మేడ్చల్ పట్టణంలోని కేఎల్ఆర్ వెంచర్లో నివాసం ఉంటూ అలియాబాద్ ఎక్స్ రోడ్డు వద్ద బైక్‌జోన్ నిర్వహిస్తుంది. వ్యాపార నిర్వహణకు ఇన్‌స్టా ఫండ్ ఫైనాన్స్ సంస్థలో రుణం తీసుకుంది. అయితే కొన్ని నెలలుగా ఫైనాన్స్ సంస్థ నిర్వాహకులు వేధింపులకు గురి చేస్తుండడంతో మనస్థాపానికి లోనైంది. శుక్రవారం ఉదయం కుమార్తెను పాఠశాలకు పంపిన తర్వాత తన ఆత్మహత్యకు ఇన్‌స్టా ఫండ్ ఫైనాన్స్ వారి వేధింపులే కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పింఛన్ కోసం వెళ్తే చనిపోయావన్నారు ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
భర్త ఆగడాలు తట్టుకోలేక.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మద్యానికి బానిసైన భర్త తరచూ గొడవ పడుతుండటంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిజాంపేట్ భవ్యాస్ ఆనంద్‌లో నివాసముండే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మామిడి ప్రసాద్, స్పందన(35)లు భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కాగా ప్రసాద్ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో బంగారు నగలను సైతం జల్సాలకు విక్రయించాడు. దీంతో మనస్తాపానికి గు రైన స్పందన ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరే సుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రియురాలి విషయంలో వాగ్వాదం.. స్నేహితుడే హంతకుడు ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పెళ్లి అయిన కొద్ది రోజుల నుంచే డబ్బులు కావాలని వేధింపులు.. తట్టుకోలేక
సాక్షి, ఆదిలాబాద్: వరకట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరేసుకున్న సంఘటన మండలంలోని నిర్మల్ జిల్లా గంజాల్‌లో శనివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిలావర్పూర్ మండలం కంజర్ గ్రామానికి చెందిన అడెల్ల–శంకర్ కూతురు అరుణ(24)ను సోన్ మండలం గంజాల్ గ్రామానికి చెందిన గుండారపు గంగాసాగర్‌కు ఇచ్చి 2018లో వివాహం జరిపించారు. వృత్తిరీత్యా ఫొటో గ్రాఫర్ అయిన గంగాసాగర్ పెళ్లి అయిన కొద్ది రోజుల నుంచే తనకు డబ్బులు అవసరం ఉన్నాయని రూ.లక్ష తీసుకురమ్మని వేధించసాగాడు. ఆమె తీసుకురాకపోవడంతో భార్యపై అనుమానం పెంచుకుని మానసికంగా వేధించాడు. ఈ విషయమై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు సైతం జరిగాయి. బుద్ధిగా వుంటానని చెప్పి భార్యను కాపురానికి తీసుకువచ్చిన గంగాసాగర్ మళ్లీ కొద్దిరోజులకే అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభించాడు. అరుణ డబ్బుల విషయాన్ని పలుమార్లు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. ఈక్రమంలో భర్త వేధింపులు ఎక్కువ కావడంతో శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుంది. అరుణకు మూడేళ్ల కూతురు సంస్కృతి ఉంది. అరుణ తమ్ముడు నల్ల అనిల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. చదవండి: పిల్లలు చూస్తుండగానే భార్య గొంతు కోసి... -
‘నా మృతదేహం దరిదాపుల్లోకి కూడా అత్తింటివారిని రానివ్వద్దు’
సాక్షి, హైదరాబాద్: అత్తింటి వేధింపులతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బి.భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. షాహిన్నగర్కు చెందిన ఖాజా మోయియుద్దీన్ అన్సారీ ఐదో కుమార్తె ఫిర్దోస్ అన్సారీ (29) వివాహం రెండేళ్ల క్రితం మహ్మద్ సుల్తాన్ పటేల్‌తో జరిగింది. వివాహ సమయంలో కట్న కానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. కొన్నాళ్లుగా భార్యపై అనుమానంతో భర్త వేధించసాగాడు. అంతేకాకుండా అదనపు కట్నం తేవాలంటూ సుల్తాన్‌తో పాటు అతని తల్లి కూడా వేధించారు. వేధింపులు తట్టుకోలేక ఫిర్దోస్ తల్లిగారింటికి వచ్చి నివాసం ఉంటోంది. అయినప్పటికీ సుల్తాన్ షాహిన్‌నగర్ వచ్చి తరచూ భార్యతో గొడవపడి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల ఒకటిన రాత్రి సుల్తాన్ భార్యను ఇష్టానుసారంగా కొట్టి, తిట్టి వెళ్లాడు. దీంతో జీవితంపై విరక్తిచెందిన ఫిర్దోస్ మంగళవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. గన్‌తో బెదిరించేవాడు.. తన మృతదేహం దరిదాపుల్లోకి కూడా అత్తింటివారిని రానివ్వరాదంటూ.. తాను అనుభవించిన నరకాన్ని ఫిర్దోస్ డైరీలో రాసింది. గన్‌తో బెదిరించి చిత్రహింసలకు గురిచేశాడని రాశారు. ఎన్నో హత్యలు చేశానని, ఎవరికీ భయపడనని అంటూ కొట్టేవాడని పేర్కొన్నారు. -
ఏడాదిన్నర కిందట పెళ్లి.. 9 నెలల బాబు.. చిన్న గొడవకే
సాక్షి, ఆదిలాబాద్: భైంసా పట్టణంలోని రాహుల్‌నగర్‌లో ఆదివారం రాత్రి ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై హ న్మాండ్లు కథనం ప్రకారం.. ముధోల్‌కు చెందిన మౌనిక(21)కు తానూర్ మండలం బెంబర గ్రామానికి చెందిన చుక్కబొట్ల అనిల్‌తో ఏడాదిన్నర కిందట వివాహం జరుగగా, భైంసాలోని రాహుల్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య స్వల్ప తగాదా తలెత్తింది. దీంతో మౌనిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఎంతకీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన భర్త తలుపు తీసి చూడగా, బాత్రూంలో ఉరివేసుకుని కనిపించింది. వీరికి తొమ్మిదినెలల బాబు ఉన్నాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మల్లేశంతో ప్రేమ వివాహం.. ఐదేళ్లయినా..
సిద్దిపేటకమాన్ (సిద్దిపేట): పెళ్లి జరిగి ఐదేళ్లు గడిచినా సంతానం కలగడం లేదనే తీవ్ర మనస్థాపానికై గురై రంగనాయక సాగర్ కాల్వలో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సిద్దిపేట వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణం భరత్‌నగర్‌కు చెందిన శివాని(23)ఐదేళ్ల క్రితం కామారెడ్డి జిల్లా మాచాపూర్ మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన మల్లేశంను ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి వీళ్లు సిద్దిపేటలోని ముర్షద్‌గడ్డలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లి అయి ఐదేళ్లు గడిచినా సంతానం కలగక పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన శివాని జీవితంపై విరక్తితో మంగళవారం రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో సిద్దిపేట పట్టణ శివారు ఇమాంబాద్ వార్డు వద్ద ఉన్న కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఉదయం గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న కుటంబ సభ్యులు మృతురాలిని గుర్తించారు. ఘటనపై మృతురాలి అన్న కృపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (నిశ్చితార్థం జరిగినా.. వీడియోలతో భయపెడుతూ పలుమార్లు అత్యాచారం) -
కలహాలతో పిల్లలు బలి.. కన్న పేగుతో కాటికి..
నవమాసాలు కడుపులో మోసి జన్మనిచ్చిన తల్లి తాను ఆత్మహత్య చేసుకుని మరణిస్తే తన పిల్లలను చూసుకునే వారు ఉండరని భావించింది. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న ఆ తల్లి కడుపున పుట్టిన పిల్లలను సైతం తన తోడు తీసుకెళ్లాలని భావించి వారిని తన కొంగుతో చుట్టుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన మేడ్చల్ మండలంలోని రాజబొల్లారం గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం భర్త వేధింపులు తాళలేక ముగ్గురు పిల్లలతో సహా ఆ మహిళ చెరువులో దూకింది. ఇద్దరు చిన్నారులతో సహా ఆమె మరణించిన విషయం విదితమే. మేడ్చల్‌రూరల్: ఈ ఘటనలో శివరాణి పెద్ద కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఇద్దరు చిన్నారుల(దీక్షిత్, ప్రణీత)తో పాటు ఆమె మృతి చెందారు. శివరాణి మృతికి కారణమైన భర్త(భిక్షపతి)కు మృతురాలి బంధువులు దేహశుద్ధి చేశారు. మేడ్చల్ పోలీసులు మృతదేహాలను గాంధీ మార్చురికి తరలించారు. కలహాలతో పిల్లలు బలి.. భార్యాభర్తల మధ్య గొడవ అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. మేడ్చల్ పోలీసులు భర్త భిక్షపతి, అత్త రాములమ్మను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వారిపై 498ఏ, 302, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గ్రామంలో విషాదఛాయలు.. శివరాణి, పిల్లలు దీక్షిత్, ప్రణీతల మృతదేహాలకు గురువారం గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు రాజబొల్లారం గ్రామానికి మృతదేహాలు చేరుకోవడంతో అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారుల మృతదేహాలను మృతురాలి తండ్రి, బంధువులు తమ చేతుల్లో పట్టుకుని తీసుకెళ్లిన దృశ్యం అందరినీ కలచివేసింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రాణాలతో బయటపడిన మరో కుమారుడు జగదీశ్‌ను మృతురాలి తల్లిదండ్రులు చెంత ఉన్నాడు. అంత్యక్రియలు ముగిసే వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చదవండి: జూబ్లీహిల్స్: తాళాలు పగలగొట్టి.. దౌర్జన్యంగా ప్రవేశించి.. -
ఇంట్లో తల్లిదండ్రుల సమక్షంలోనే తాళి కట్టి.. ఆపై..
సాక్షి, నెల్లూరు(క్రైమ్): వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం పోలీసులు వివరాలు వెల్లడించారు.. నెల్లూరులోని చంద్రమౌళి నగర్‌కు చెందిన సుకృత (23) అదే ప్రాంతానికి చెందిన ఉదయబాబీ ప్రేమించుకున్నారు. ఏడాది క్రితం ఉదయబాబీ తన ఇంట్లోనే తల్లిదండ్రుల సమక్షంలో సుకృతకు పసుపుతాడు కట్టాడు. అప్పటినుంచి వారు అదే ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. కొంతకాలం అన్యోన్యంగా ఉన్నారు. అనంతరం ఉదయబాబీ అతని కుటుంబసభ్యులు ఆమెను కులం పేరుతో దూషిచడంతోపాటు మానసికంగా, శారీరకంగా హింసించసాగారు. ఈ నేపథ్యంలో ఈనెల 22వ తేదీన ఆమె ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఉదయబాబీ ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం జయభారత్ హాస్పిటల్‌కు తరలించాడు. సుకృత అనారోగ్యంగా ఉందని ఆమె సోదరికి సమాచారం అందించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు చెన్నై అపోలో హాస్పిటల్‌కు, తర్వాత మరో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ఈనె 27వ తేదీన అర్ధరాత్రి మృతిచెందారు. ఈమేరకు బాధితురాలి కుటుంబసభ్యులు సోమవారం రాత్రి వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఉదయబాబీ అతని కుటుంబసభ్యులపై వరకట్న వేధింపులు, ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చదవండి: (బావ వరసయ్యే వ్యక్తితో ప్రేమ.. గర్భం దాల్చిన ఇంటర్ విద్యార్థిని) అనారోగ్యంతో.. అనారోగ్యంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం అర్ధరాత్రి నెల్లూరులోని నవాబుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని షిర్డీ సాయినగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ముత్తుకూరు మండలం కొత్త హరిజనవాడకు చెందిన ఎ.ఆనందకుమార్, స్రవంతి (30) దంపతులు కొంతకాలంగా నవాబుపేట షిర్డీ సాయినగర్‌లో నివాసం ఉంటున్నారు. స్రవంతి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి ఆమె తన ఇంట్లోని సీలింగ్ ఐరన్ రాడ్‌కు చీరతో ఉరేసుకున్నారు. మృతురాలి తల్లి రమణమ్మ మంగళవారం తెల్లవారుజామున చూసి నవాబుపేట పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై బి.రమేష్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నాలుగేళ్ల ప్రేమ..పెళ్లి వద్దంటూ.. సంబంధాలు చెడగొడుతూ చివరికి..
నల్లగొండ: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలంలోని బొక్క ముంతలపాడు గ్రామానికి చెందిన మనీష(25) తల్లి నాగేంద్రమ్మతో కలిసి పట్టణంలోని సాగర్ రోడ్డులో అయ్యప్పగుడి సమీపంలో నివాసం ఉంటున్నారు. నాగేంద్రమ్మ కూరగాయల వ్యాపారం చేస్తూ కుమార్తెను ఎమ్మెస్సీ వరకు చదివించింది. సమీప బంధువు అయిన మిర్యాలగూడ మండలం అన్నపురెడ్డి గూడేనికి చెందిన బోదల రాజేశ్, మనీషలు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మనీష కుటుంబసభ్యులకు రాజేశ్ భరోసా ఇచ్చాడు. అయితే ఆలస్యం అవుతుండడంతో పెళ్లి విషయమై స్పష్టత ఇవ్వాలని మనీష కుటుంబ సభ్యులు తమ ఇంటికి పిలిచి అడిగారు. తన కుటుంబ సభ్యులను ఒప్పిస్తానని కొంతసమయం పడుతుందని చెప్పాడు. దీనికితోడు ఇతర సంబంధాలు చూస్తే చెడగొడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం తల్లి ఇంట్లో లేని సమయంలో మనీష చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వెళ్లిన తల్లి తలుపు కొట్టినా తెరవక పోవడంతో సమీపంలోని వారితో కలిసి డోర్‌ను తొలగించి వేలాడుతున్న కూతురు మృతదేహాన్ని కిందికి దింపారు. స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. విషయం పోలీసులకు చేరడంతో తల్లిని వివరాలు అడిగి తెలుసుకోగా పెళ్లి విషయం ప్రస్తావించానని, రాజేశ్‌తో ప్రేమ వ్యవహారం ఉందని, పెళ్లి సంబంధాలను చెడగొట్టడంతోపాటు అతడు పెళ్లి చేసుకోలేదని తెలిపింది. అయితే తన కమార్తె ఆత్మహత్యకు రాజేశ్‌యే కారణమని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ ఎస్సై సందీప్‌రెడ్డి తెలిపారు. -
కట్నం వేధింపులకు ముగ్గురి బలి
గంభీరావుపేట (సిరిసిల్ల): అదనపు కట్నం.. వేధింపులకు మూడు ప్రాణాలు బలయ్యాయి. ముక్కుపచ్చలారని చిన్నారులతో సహా తల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం జరిగిన ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం కొత్తపల్లిలో విషా దం నింపింది. ముగ్గురి మృతదేహాలు చూసి స్థానికులు కంటతడి పెట్టారు. వివరాలిలా ఉన్నాయి.. గంభీరావుపేట మండలం లింగ న్నపేటకు చెందిన రేఖ (28)కు కొత్తపల్లికి చెందిన వరుకుటి రాజు తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. రేఖ తల్లిదండ్రులు దాదాపు రూ.9 లక్షల కట్నం, పది తులాల బంగారం, ఇతర లాంఛానాలతో పెళ్లి చేశారు. అయితే రాజు అదనపు కట్నం కావాలని రేఖను తరచూ శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. నెల క్రితం రేఖ తల్లిదండ్రులు రూ.లక్ష ఇవ్వగా, మూడు రోజుల క్రితం ద్విచక్రవాహనం కొనిచ్చారు. అయినా.. అతను రేఖను వేధించడం మానలేదు. దీంతో మానసికంగా కుంగిపోయిన రేఖ.. భర్త హింస ను తట్టుకోలేక తన పిల్లలు అభిజ్ఞ (3), హన్సిక (ఐదు నెలలు)లతో స్థానిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో పోలీసులు గ్రామంలో గట్టి బందో బస్తు ఏర్పాటు చేశారు. రేఖ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. -
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొని నిలదీయడంతో..
సాక్షి, రాజేంద్రనగర్: విడాకులు ఇచ్చిన భర్త వేధింపులు రోజురోజుకూ ఎక్కువ అవుతుండటం, కుమారుడిని తీసుకువెళ్లి పంపకపోవడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం హుడా కాలనీకి చెందిన షహజాబేగం(25), ఎంఎం పహాడీకి చెందిన షేక్ ఇమ్రాన్(29)తో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. షేక్ ఇమ్రాన్ స్థానికంగా హార్డ్‌వేర్ దుకాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఇతడికి బంధువుల మహిళతో అక్రమ సంబంధం ఉంది. సంవత్సరం క్రితం షహజాబేగం రెడ్‌హ్యాండ్‌గా పట్టుకొని నిలదీసింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆరు నెలల క్రితం షేక్ ఇమ్రాన్ పాలల్లో గుర్తు తెలిని క్రిమి సంహారక మందు కలిపి షహజాబేగంతో తాగించాడు. దీంతో అస్వస్తతకు గురైన షహజాబేగంను ఆసుపత్రికి తరలించగా వారం రోజుల పాటు చికిత్స పొంది డిశ్చార్జ్ అయింది. ఈ సమయంలో భర్తపై రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. వీరికి ఇద్దరు సంతానం. స్థానిక పెద్దల జోక్యంతో కేసు విత్‌డ్రా చేసుకున్న షహజాబేగం అమ్మగారి ఇంటి వద్దే ఉంటోంది. మూడు నెలల క్రితం విడాకులు తీసుకుంది. చదవండి: సెల్ఫీ కోసం రైలు బోగీ పైకి.. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలడంతో కాగా పది రోజుల క్రితం షేక్ ఇమ్రాన్ కుమారుడిని చూస్తానని ఇంటికి తీసుకువెళ్లాడు. తిరిగి షాజాహబేగంకు అప్పగించలేదు. తరచూ స్థానికులతో అసత్య ప్రచారాన్ని చేపడుతున్నాడు. దీంతో మనస్తాపం చెందిన షాహజాబేగం ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందింది. తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. బుధవారం రాత్రి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రూ.579 కోట్ల కాంట్రాక్టులంటూ..రూ.3 కోట్లు స్వాహా -
నవవధువు ఆత్మహత్య: భర్త వేధింపుల వల్లే మా కుమార్తె చనిపోయింది
తాళ్లరేవు: వివాహం జరిగి రెండు నెలలు గడవకుండానే ఆమె ఆత్మహత్య చేసుకున్న ఘటన తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పటవల గ్రామానికి చెందిన బీఎస్పీ, బీఈడీ చదివిన బడుగు గంగా భవానీకి, కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పరంపేట గ్రామానికి చెందిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ జంగా కృష్ణమూర్తికి అక్టోబరు–21వ తేదీన వివాహం జరిగింది. ఏమైందో తెలియదుగాని మంగళవారం అర్ధరాత్రి గంగాభవానీ పటవలలోని తన స్వగృహంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. బుధవారం ఉదయం తలుపు తెరచి చూడగా విగత జీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కోరంగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కాకినాడ డీఎస్పీ భీమారావు, కాకినాడ రూరల్ సీఐ కె.శ్రీనివాసు ఘటనా స్థలానికి వచ్చి విచారణ నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాళ్లరేవు ఎంపీపీ రాయుడు సునీత, గంగాధర్ దంపతులు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. భర్త వేధింపుల వల్లే మా కుమార్తె చనిపోయింది.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నాడని, లక్షలాది రూపాయల కట్నం ఇచ్చి తమ కుమార్తెకు వివాహం చేశామని, అయితే వివాహం జరిగిన నాటి నుంచి కృష్ణమూర్తి తన విచిత్రమైన ప్రవర్తనతో గంగాభవానీని తరచూ వేధించేవాడని మృతురాలి తల్లి లక్ష్మీకాంతం బోరున విలపించడం అందరినీ కలిచివేసింది. పెళ్లయిన తరువాత ఢిళ్లీ వెళ్లిన కృష్ణమూర్తి సెల్ఫోన్లో సూటిపోటి మాటలతో మానసిక వేదనకు గురిచేసేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ కుమార్తె పలుమార్లు వేధింపులను తమ దృష్టికి తీసుకువస్తే సంక్రాంతి పండగకు వచ్చినప్పుడు మాట్లాడతామని చెప్పామని, అంతలోనే ఈ దారుణం జరిగిపోయిందని బోరున విలపించారు. -
మూడు నెలలుగా సహజీవనం.. మనస్పర్థల కారణంగా ఆత్మహత్య
సాక్షి, గన్నవరం: యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం జరిగింది. గన్నవం పోలీసుల సమాచారం మేరకు.. విజయవాడ రూరల్ మండలం గూడవల్లికి చెందిన సొంగా శశి, జి.మండలం కవులూరుకు చెందిన కంచర్ల అహల్య (22) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరూ బంధువులే. అహల్య కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించలేదు. కొండపల్లిలో ఉంటూ బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న అహల్య మూడు నెలలు క్రితం గూడవల్లి వచ్చి శశితో సహజీవనం చేస్తోంది. చదవండి: ప్రాణాలు తీసిన ‘పార్టీ’ ఈ నేపథ్యంలో వారి మధ్య విభేదాలు తలె త్తాయి. దీంతో అహల్య ఆదివారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్ది సేపటికి శశి కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ రమేష్‌బాబు తెలిపారు. -
ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య.. ‘నా భర్త సైకో..’
రాజేంద్రనగర్ (హైదరాబాద్): భార్యాభర్తల మధ్య గొడవలు.. ఆవేదనకు లోనైన భార్య ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. తనకు తన పిల్లలంటే ఇష్టమని, వారినీ వెంట తీసుకుపోతున్నానని సూసైడ్‌నోట్ రాసింది. మొదట కొడుకు, బిడ్డ ఇద్దరికీ ఉరివేసింది. వారు చనిపోయాక బెడ్‌పై పడుకోబెట్టి.. తానూ ఉరివేసుకుంది. హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలో శనివారం ఈ విషాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడకు చెందిన సాయికుమార్, స్వాతికుసుమ ఇద్దరూ గతంలో ఓ సాప్ట్వేర్ కంపెనీలో పనిచేసేవారు. ఆ సమయంలో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కుటుంబాలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి ప్రాంతంలోని ఫోర్ట్ వ్యూ కాలనీలో కాపురం పెట్టారు. పెళ్లయిన 6 నెలలకు గర్భవతి కావడంతో స్వాతి ఉద్యోగం మానేసింది. తర్వాత వారికి కుమారుడు తన్విక్ శ్రీ (4), కుమార్తె శ్రేయ (రెండున్నరేళ్లు) పుట్టారు. కుమార్తె పుట్టనప్పటి నుంచి సాయికుమార్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రుల నుంచి బంగారం, డబ్బులు తీసుకురావాలని స్వాతిపై ఒత్తిడితెచ్చాడు. ఒకట్రెండు సార్లు స్వాతి డబ్బులు తీసుకురావడంతో ఇది అలవాటుగా మారింది. స్వాతి తల్లిదండ్రులకు మగపిల్లలు లేకపోవడంతో.. ఆ ఇంటికి కొడుకైనా, అల్లుడైనా తానేనని, ఆస్తులన్నీ తనకు రాసివ్వాలని ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు. జల్సాలకు అలవాటు పడి స్వాతి బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టాడు, కొన్నింటిని అమ్మేశాడు. దీనితో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు సాగుతున్నాయి. ఈ క్రమంలో స్వాతికుసుమ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. శుక్రవారం రాత్రి పిల్లలను తీసుకుని బెడ్రూంలోకి వెళ్లి గడియ వేసుకుంది. శుక్రవారం రాత్రంతా బయటికి వెళ్లొచ్చిన సాయికుమార్.. శనివారం సాయంత్రం దాకా ఏమీ పట్టించుకోలేదు. సాయంత్రం 5 గంటల సమయంలో వెళ్లి బెడ్రూం తలుపుతట్టినా లోపలి నుంచి ఏ స్పందనా రాలేదు. తలుపులు బద్దలుకొట్టి చూడగా.. స్వాతి ఉరివేసుకుని కనిపించింది. ఈ విషయం తెలిసిన వెంటనే స్వాతి తల్లిదండ్రులు శారద, జగన్నాథం, ఇతర కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. దీనిపై పోలీసులకు సమాచారమిచ్చారు. చదవండి: (మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన ఓనర్ కొడుకు.. 3 నెలలుగా..) గోడపై సూసైడ్ నోట్ స్వాతి తొలుత పిల్లలు తన్విక్‌శ్రీ, శ్రేయలకు చీరతో ఉరివేసి.. బెడ్‌పై పడుకోబెట్టి, తర్వాత తాను ఉరివేసుకుని ఉంటుందని పోలీసులు తెలిపారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించామని, ఆ నివేదిక వస్తే పూర్తి వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. కాగా.. ఆత్మహత్యకు ముందు స్వాతి బెడ్రూం గోడపై రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. ‘‘నా భర్త శాడిస్టు, సైకో.. బాగా ఏడిపిస్తున్నాడు. సరిగా చూసుకోవడం లేదు. ఊరంతా అప్పులు, మా బంగారం కూడా అమ్మేశాడు. ఐ డోంట్ లైక్ హిజ్ డిస్‌రెస్పెక్టివ్ టువర్డ్స్ అవర్ ఫ్యామిలీ. అతడిని నేను ఇంకా భరించలేను. లవ్ యూ అమ్మా, నాన్నా. మీరే మీ బాధపడకండి. నా పిల్లలు అంటే నాకు పిచ్చి. నేను లేనిదే వాళ్లను ఎవరూ చూసు కోరు. అందుకే తీసుకోని పోతున్నా..’’ అని ఆ సూసైడ్ నోట్లో ఉంది. స్వాతి భర్త సాయికుమార్‌ను పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ఎంత పనిచేశావ్ తల్లీ..!
సాక్షి, చెన్నై: బంధువుల వేడుకకు తీసుకెళ్లలేదని భర్తపై కోపంతో అభంశుభం తెలియని పిల్లలను బావితో తోసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లాలో చోటుచేసుకుంది. కులితలై సమీపంలోని సెంబియం గ్రామానికి చెందిన శక్తి వేల్ (35) టైలర్. భార్య శరణ్య(30), కుమార్తెలు కనిష్క(6), పుదిషా(3) ఉన్నారు. నాచ్చిముత్తు పాళ యంలో బంధువుల ఇంటి వేడుకకు సోమవారం రాత్రి శక్తివేల్ వెళ్లాడు. తమకు చెప్పకుండా భర్త మాత్రమే వెళ్లడంతో ఆగ్రహించిన శరణ్య పిల్లలిద్దరిని ఇంటి సమీపంలోని బావిలో పడేసింది. తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మంగళవా రం ఉదయం ఇంటికి వచ్చిన శక్తివేల్ భార్య పిల్ల లు కనిపించకపోవడంతో గాలించారు. బావిలో శరణ్య మృతదేహం కనిపించింది. అతి కష్టంతో పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బెంజ్ కారు బీభత్సం.. వాయువేగంతో దూసుకెళ్లి.. చదవండి: మహిళల సాయంతో ఇంట్లోనే ప్రసవం.. తల్లీబిడ్డా మృతి -
పుస్తెలతాడు చేయించలేదని ప్రాణం తీసుకుంది..
టెక్కలి రూరల్: వివాహమై ఎనిమిదేళ్లయినా తన భర్త బంగారం పుస్తెల తాడు చేయించలేదని మనస్తాపానికి గురైన మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కోట»ొమ్మాళి మండలం భావాజీపేట గ్రామంలో చోటుచేసుకోగా పంగ సత్యవతి (30) ఇంట్లోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమదాలవలస మండలం గేదెలవానిపేట గ్రామానికి చెందిన సత్యవతికి ఎనిమిదేళ్ల క్రితం భావాజీపేటకు చెందిన సూర్యనారాయణతో వివాహమైంది. శుక్రవారం రాత్రి కూడా ఇరువురి మధ్య పుస్తెలతాడు విషయమై గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన సత్యవతి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. శనివారం ఉదయం సూర్యనారాయణ నిద్ర లేచేసరికి సత్యవతి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. కోటబొమ్మాళి ఎస్సై రవికుమార్ ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి చల్ల రత్నాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సత్యవతికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
రెండేళ్ల ప్రేమ.. ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకుంటాను అనడంతో...
సాక్షి, ఆదిలాబాద్: మండలంలోని అంకాపూర్‌కు చెందిన మర్సుకోల గంగుబాయి (18) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై అంజమ్మ తెలిపిన వివరాలు.. జైనథ్ మండలం జామ్నికి చెందిన పెందూర్ రవీందర్, గంగుబాయి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వేరే యువతిని వివాహం చేసుకుంటానని రవీందర్ తెలపడంతో గంగుబాయి మనస్తాపం చెంది ఈనెల 24న పురుగుల మందు తాగింది. చదవండి: మరో వ్యక్తితో వివాహం.. ప్రియునితో కలిసి వివాహిత ఆత్మహత్య గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. తల్లి శోభబాయి ఫిర్యాదు మేరకు రవీందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చదవండి: మరొకరితో పెళ్లి.. హైదరాబాద్‌కు వెళ్తూ ప్రియున్ని రమ్మని.. -
మాట్రిమోనియల్ మోసం: పోలీసుల నిర్లక్ష్యమే చంపేసింది!
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలు, వితంతు మహిళలకు మాట్రిమోనియల్ సైట్స్ ద్వారా టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నిందితుడు కిరణ్‌కుమార్‌ను పట్టుకోవడంలో సైబరాబాద్ పోలీసులు విఫలమయ్యారు. అతడి చేతిలో మోసపోయిన ఓ అభాగ్యురాలు అవమానభారం తట్టుకోలేక కన్న కొడుకు ముందే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని పట్టుకోవడంలో ఆలస్యం ఎందుకైందంటూ మృతురాలి కుటుంబీకులు బాచుపల్లి పోలీసులను నిలదీశారు. బందోబస్తు విధులే కారణమంటూ అధికారులు తప్పించుకోవాలని చూస్తున్నారని మృతురాలి కుటుంబీకులు బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. దాదాపు 14 మందిని ఇదే పంథాలో మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కిరణ్ కుమార్‌పై ఫిర్యాదు చేయడానికి రాచకొండ పరిధిలోని నాచారం ఠాణాకు మరో బాధితురాలు వెళ్లింది. అక్కడ ఆమెకూ అవమానమే ఎదురైంది. వరుసగా మోసాలు చేసిన కిరణ్.. ములుగు జిల్లా ఇంచర్లకు చెందిన కోరండ్ల కిరణ్‌కుమార్ రెడ్డి(29) హైదరాబాద్‌లోని ఎల్అండ్టీ కంపెనీలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నానంటూ ప్రచారం చేసుకున్నాడు. వివిధ మాట్రిమోనియల్ సైట్స్‌లో రెండో వివాహం అంటూ రిజిస్టర్ చేసుకున్నాడు. విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న మహిళలు, వితంతు మహిళలను ఆకర్షించాడు. వారికి రకరకాల సమస్యలు చెప్పి అందినకాడికి దండుకుని మోసం చేస్తుంటాడు. ఇప్పటికి 14 మంది మహిళల నుంచి రూ.30 లక్షల నగదు, 10 తులాల ఆభరణాలు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ► కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన కుమారుడితో కలిసి భర్తకు దూరంగా ఉంటూ నిజాంపేటలో కుటుంబీకులతో కలిసి ఉండేది. కిరణ్ బారినపడిన ఈ బాధితురాలు రూ.3.12 లక్షలు మోసపోయింది. దీనిపై గత నెల 22న బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆపై ఈ కేసును పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ‘సాక్షి’ని ఆశ్రయించడంతో ‘ఒంటరి మహిళలే టార్గెట్’ శీర్షికన ఈ నెల 9న కథనం ప్రచురించింది. అయినప్పటికీ పోలీసుల్లో స్పందన లేకపోవడంతో ఠాణా చుట్టూ కాళ్లరిగేలా తిరిగింది. ‘మహిళల రక్షణకు కీలక ప్రాధాన్యం ఇస్తాం.. మహిళలపై జరిగే నేరాలను ఉపేక్షించం’ పోలీసులు చేసే ఇలాంటి ప్రకటనలు నిజమని నమ్మిన బాధితురాలికి నిరాశే ఎదురైంది. విసిగి వేసారి తనువు చాలించింది.. అప్పటికే దురలవాట్లకు బానిసైన భర్తకు దూరంగా ఉండటం, కుమారుడి పోషణ బాధ్యతలతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. మరోపక్క కిరణ్‌కుమార్ చేతిలో దారుణంగా మోసపోయి మరింత కుంగిపోయింది. కేసు నమోదు చేసినా నిందితుడిని పట్టుకోకపోవడంతో పోలీసులు నిర్లక్ష్యం వహించడాన్ని అవమానంగా భావించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తనువు చాలించాలని నిర్ణయించుకుంది. ► ఈమె తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఆదివారం సాయంత్రం ఆమెతో పాటు అమ్మమ్మ ఆసుపత్రికి వెళ్లారు. అలా ఇంట్లో ఒంటరిగా మిగిలిన బాధితురాలు తన కుమారుడు చూస్తుండగానే బెడ్రూమ్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రి నుంచి తిరిగొచ్చిన తల్లి, అమ్మమ్మలకు మనవడు ఏడుస్తూ కనిపించాడు. దీంతో ఆందోళకు గురైన వాళ్లు లోపలకు వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. వారిద్దరూ గుండెలు బాదుకుంటూ స్థానికులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి మృతదేహాన్ని కిందికి దింపారు. ► తండ్రి దూరమై.. తల్లి మరణించడంతో ఇప్పుడు ఆ ఐదేళ్ల చిన్నారి అనాథగా మారాడు. ఈమె లాగే కిరణ్ చేతిలో మోసపోయిన మరో బాధితురాలు నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ఇటీవల వెళ్లారు. ఆమెకూ అక్కడ ఛీత్కారాలే ఎదురయ్యాయి. ‘మీలాంటి వాళ్లకు ఇలాగే జరగాలి. వాడికి డబ్బులు ఎందుకిచ్చావు’ అంటూ అక్కడి పోలీసులు తనను అవమానించారని ఆమె ‘సాక్షి’కి తెలిపారు. చదవండి: వన్‌డ్రైవ్ ఇన్ ఫుడ్‌కోర్టు బాత్రూంలో స్పై క్యామ్: వెలుగులోకి సంచలన విషయాలు -
పుట్టింటికి వస్తానన్న కుమార్తె.. తల్లి వద్దనడంతో
ఆదిలాబాద్ రూరల్: మండలంలోని ఖండాల గ్రామ పంచాయతీ పరిధిలోని మొలాలగుట్టకు చెందిన ఆత్రం మోతిబాయి (21) పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆదిలాబాద్ రూరల్ ఎస్సై అంజమ్మ తెలిపారు. ఆమె కథనం ప్రకారం... మొలాలగుట్టకు చెందిన నాగోరావ్‌తో గాదిగూడ మండలం పర్సువాడ గ్రామానికి చెందిన మోతిబాయికి గతేడాది వివాహమైంది. ఇటీవల రాఖీ పండుగకు పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంది. రెండు రోజుల కిందట భర్త ఇంటికి వచ్చింది. తాను పుట్టింటికి వస్తానని, తనను తీసుకెళ్లేందుకు తమ్ముడిని పంపించాలని తల్లితో ఫోన్లో కోరింది. రెండు రోజుల కిందటనే వెళ్లావు కదా ఇంకెందుకు వస్తావ్ అని తల్లి పేర్కొంది. దీంతో మోతిబాయికి ఆమె భర్త నాగోరావ్ మధ్య చిన్నప్పటి గొడవ జరిగింది. దీంతో శనివారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11.30 గంటలకు మృతి చెందింది. మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె వివరించారు. -
తాగుబోతు భర్తతో వేగలేక భార్య దారుణం.. పిల్లలతో సహా..
రామగుండం: అన్యోన్యంగా సాగిపోతున్న కుటుంబంలో కలహాలు చెలరేగాయి. రోజూ తాగొచ్చి వేధిస్తున్న భర్తతో వేగలేక ఆమె మరణమే శరణ్యమని భావించింది. తాను లేకుంటే పిల్లలెలా బతుకుతారనుకుందో ఏమో.. వారినీ తన వెంటే తీసుకెళ్లాలని కఠిన నిర్ణయం తీసుకుంది. అంతే ఇద్దరు పిల్లలను ఎదురుగా వస్తున్న రైలుకింద తోసి.. తాను దూకింది. ఈ సంఘటనలో తల్లి అక్కడికక్కడే మృత్యువాత పడగా.. గాయపడిన పిల్లలిద్దరినీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అక్కడ ఓ చిన్నారి కన్నుమూసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. రామగుండం జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్చార్జి గంగారపు తిరుపతి కథనం ప్రకారం.. స్థానిక యైటింక్లయిన్‌కు చెందిన జంగేటి ప్రవీణ్‌కు ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న ఓరుగంటి వెంకటరమణ కూతురు అరుణతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు సాత్విక్ (5), కూతురు సాత్విక (2) ఉన్నారు. భర్త మద్యానికి బానిస కావడంతో.. కాగా, ప్రవీణ్ కొంత కాలంగా పనికి వెళ్లకుండా మద్యానికి బానిసయ్యాడు. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని అరుణను వేధించసాగాడు. ఆ వేధింపులు భరించలేక అరుణ జీవితంపై విరక్తి చెంది.. తాను చనిపోతే పిల్లలు ఒంటరి వారవుతారని భావించి పిల్లలతో సహా రామగుండం రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. మధ్యాహ్నం రెండుగంటలకు సికింద్రాబాద్ నుంచి దాణాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు వస్తున్న క్రమంలో ముందుగా పిల్లలను తోసింది. అనంతరం తానూ రైలు కింద పడింది. అయితే రైలు కొద్దిదూరంలో ఉండడంతో గమనించిన లోకోపైలట్ హారన్ మోగించాడు. సడన్ బ్రేక్ వేసినా ఫలితం లేకపోయింది. రైలు తల్లితోపాటు ఇద్దరు చిన్నారులపైకి కొద్దిదూరం దూసుకెళ్లింది. రైలు ఆగాక లోకోపైలట్ జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ముగ్గురినీ రైలు కింద నుంచి బయటకు తీశారు. అరుణ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయింది. పిల్లలు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా.. వారిని 108లో గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాత్విక మృతిచెందింది. బాబు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అరుణ తండ్రి వెంకటరమణ ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వనస్థలిపురం అగ్నిప్రమాదం కేసులో ట్విస్ట్
హైదరాబాద్: అనుమానాస్పదస్థితిలో మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైన వనస్థలిపురం ప్రభుత్వ ఉద్యోగి సరస్వతి కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని పోలీసులు నిర్థారణ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి సరస్వతి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఆ సమయంలో కాపాడేందుకు యత్నించిన భర్త బాలకృష్ణకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త బాలకృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగిందని మొదట స్థానికులు భావించారు. కానీ భర్తే ఆమెను హత్యచేసి.. పెట్రోల్ పోసి నిప్పంటించాడని మృతురాలి బంధువులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈమేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని నిర్ధారించారు. చదవండి: వివాహిత సజీవ దహనం: హత్యా.. ప్రమాదమా? -
ఇంటి నిర్మాణంపై వివాదం: పెళ్లి రోజే విషాదం
జగద్గిరిగుట్ట: వాళ్లది ప్రేమ వివాహం... ఆదివారం వాళ్ల పెళ్లిరోజు.. ఉదయం దేవుడిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం ఇంటి విషయంమై మాట్లాడుకున్నారు.. ఇంతలో ఏమైందో ఏమో..! ఆ ఇల్లాలు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దుర్ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదాన్ని నింపింది. పోలీసులు.. స్థానికుల కథనం ప్రకారం ఇందుకు సబంధించిన వివరాలిలా ఉన్నాయి. జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప సముదాయంలోని 20వ బ్లాక్‌లో నివాసముంటున్న అశోక్ గౌడ్ ఆర్టీసీ జీడిమెట్ల డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య శిరీష అలియాస్ శివ జ్యోతి(28). వారిది ప్రేమ వివాహం. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అందరూ 10 సంవత్సరాలలోపు వారే. నారాయణపేటకు చెందిన శిరీష, మక్తల్‌కు చెందిన అశోక్‌గౌడ్‌లు ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆదివారం పెళ్లి రోజు కావడంతో ఉదయం దైవ దర్శనం కూడా చేసుకున్నారు. కొంత కాలంగా రాజీవ్ గృహకల్పలో అదనపు గదుల నిర్మాణం జరుగుతోంది. ఈ విషయమై రెండుమూడు రోజులుగా దంపతులు చర్చించుకుంటున్నారు. అందరూ గదులు కట్టుకుంటున్నారు.. మనం కూడా పక్కకు జరిగి కట్టుకుందామని శిరీష తన భర్త అశోక్‌తో చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా మాటామాట పెరిగింది. మధ్యాహ్నం అశోక్ లాక్డౌన్ మూలంగా బస్సులు నడవకపోవడంతో జీడిమెట్ల డిపోలో సంతకం చేడయానికి కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శిరీష ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి రోజే భార్య చనిపోవడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. చదవండి: కట్టు తప్పాడని.. కడతేర్చిన తల్లి..ఇంటి ఆవరణలోనే...! -
కరోనాతో భర్త మృతి చెందాడని.. గర్భిణి ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: భర్త కరోనాతో మృతి చెందడంతో కలత చెందిన భార్య (గర్భిణి) ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కనకపుర పట్టణంలో చోటుచేసుకుంది. కనకపుర పట్టణ పరిధిలోని బసవేశ్వరనగర్‌లో నివసిస్తున్న బెస్కాం ఉద్యోగి నందిని (28)ఆత్మహత్యకు పాల్పడ్డారు. నందిని రెండేళ్ల క్రితం మైసూరుకు చెందిన సతీష్ అనే వ్యాపారవేత్తను ప్రేమ వివాహం చేసుకుంది. సతీష్ వ్యాపార నిమిత్తం మైసూరు, కనకపుర తిరిగేవారు. మైసూరులో ఉన్న సతీష్ తల్లి గతవారం కరోనాతో మృతి చెందింది. సతీష్‌కూ కరోనా సోకడంతో మూడు రోజుల క్రితం మృతి చెందాడు. ప్రస్తుతం నందిని మూడు నెలల గర్భిణి. దీంతో కలత చెందిన నందిని గురువారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కనకపుర పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: బ్యుటీషియన్‌పై అత్యాచారం.. నటి బాడీగార్డ్‌పై కేసు -
ఏం కష్టమొచ్చిందో.. బిడ్డను చంపి ఉరేసుకున్న తల్లి
సాక్షి, అల్వాల్: అసలే చిన్న కుటుంబం.. బతుకుదెరువు కోసం ఒడిశా రాష్ట్రం నుంచి వలస వచ్చి జీవనంసాగిస్తున్నారు. ఏ కష్టం వచ్చిందో.. బిడ్డను చంపిన తల్లి తానూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయవిదారక సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లా బారిపాడకు చెందిన సుధేందుగిరి పాత అల్వాల్ భరత్‌నగర్‌లో నివాసముంటూ సిద్దిపేటలోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎనిమిదేళ్ల కిత్రం బిష్ణుప్రియ(30)తో అతడి వివాహం జరిగింది. వీరికి మూడున్నర సంవత్సరాల కూతురు హ్రితిక ఉంది. ఈ నెల 22వ తేదీన సుధేందుగిరి యథావిధిగా ఉద్యోగానికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. కూతురు మృతి చెంది ఉండడం, బిష్ణుప్రియ ఉరివేసుకొని కనిపించడం గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. మొదట కూతురును చంపి తాను ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సుధేందుపరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని చంపి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను కలిచివేసింది. చదవండి: రూ.30 లక్షలు డిమాండ్.. తీన్మార్ మల్లన్నపై కేసు ! హ్రితికతో బిష్ణుప్రియ (ఫైల్) -
బంజారాహిల్స్: పెళ్లయిన తొమ్మిది నెలలకే..
సాక్షి, బంజారాహిల్స్: వివాహమైన తొమ్మిది నెలలకే ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. జీడిమెట్లకు చెందిన శైలజ (23)కు ఎస్పీఆర్హిల్స్ సమీపంలోని సంజయ్‌నగర్‌కు చెందిన డ్రైవర్ నవీన్‌తో తొమ్మిది నెలల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో ఒప్పందం ప్రకారం కట్న కానుకల కింద శైలజ తల్లిదండ్రులు 2 తులాల బంగారం, రూ.10 వేలు బాకీ పడ్డారు. ఈ నేపథ్యంలో పెళ్లైన మరుసటి రోజు నుంచే శైలజకు వేధింపులు మొదలయ్యాయి. ఆమె అత్త తిరుపతమ్మ, భర్త నవీన్ శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. పలుమార్లు భర్త కొట్టడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి అత్తకు, భర్తకు నచ్చజెప్పి అత్తారింటికి పంపించారు. మూడు వారాలుగా ఆమెకు మళ్లీ వేధింపులు మొదలయ్యాయి. ప్రతిరోజూ కొట్టడం, దూషిస్తుండటంతో భరించలేని శైలజ మంగళవారం అర్ధరాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అత్త, భర్తతో పాటు మరిది ప్రవీణ్ హత్య చేశారని, నిందితులను శిక్షించాలని మృతురాలి తండ్రి యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు శైలజ అత్త తిరుపతమ్మను, భర్త నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరిది ప్రవీణ్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఖైరతాబాద్: ఆన్లైన్ క్లాసుల్లో అశ్లీల ఫోటోలు షేర్ చేస్తూ.. సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడి ఆత్మహత్య -
అనుమానించి ఉద్యోగం మాన్పించాడు.. చివరకు!
తెల్లవారుజామున చుట్టుపక్కల వారంతా ఆ ఇంటి వైపు పరుగులు తీశారు. మూడు నెలల గర్భిణి ఫ్యానుకు వేలాడుతుండడం చూసి హతాశులయ్యారు. ఉదయానికల్లా ఊరంతా విషాదం అలుముకుంది. బోడిరెడ్డిగారిపల్లెలో గురువారం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. భాకరాపేట : చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచెర్ల పంచాయతీ బోడిరెడ్డిగారిపల్లెకు చెందిన పాపిరెడ్డికి ఇద్దరు భార్యలు. రెండో భార్య పద్మావతమ్మకు ఒక కుమార్తె హరిత(23), ఒక కుమారుడు ఉన్నారు. హరితను అదే గ్రామానికి చెందిన రామిరెడ్డి, పూర్ణమ్మ కుమారుడు ఆనందరెడ్డికి ఇచ్చి 4 నెలల క్రితం వైభవంగా వివాహం చేశారు. వివాహమైన నెల నుంచే అత్తింటి వేధింపులు ప్రారంభం అయ్యాయి. ఆనందరెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్. లాక్ డౌన్ నేపథ్యంలో పెళ్లయినప్పటి నుంచి ఇంట్లో ఉంటూ విధులు నిర్వహిస్తున్నాడు. (కృష్ణప్రియ ఆత్మహత్య: వాట్సాప్ చాట్‌లో కీలక విషయాలు) హరిత అరగొండ అపోలో ఆస్పత్రిలో పనిచేసేది. తరచూ అనుమానించి, అవమానించిన భర్త నెల క్రితం ఆమెను ఉద్యోగం మాన్పించాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్య, భర్త మధ్య గొడవ జరిగింది. అదే గ్రామంలో ఉన్న హరిత తల్లి వచ్చి నచ్చ చెప్పింది. అయితే అల్లుడు ఆనందరెడ్డి రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఒక్కటే ఉన్న కూతురుతోపాటు అక్కడే పడుకుంది. గురువారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో పాలు పితికేందుకు నిద్రలేచి తన ఇంటికి వెళ్లింది. 6 గంటల సమయంలో గ్రామంలో హరిత చనిపోయిందంటూ పరుగులు పెడుతుంటే తల్లి పోయి చూసే సరికి ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందింది. తన బిడ్డ మృతికి ఆనందరెడ్డి, పూర్ణమ్మ, రామిరెడ్డి కారణమంటూ మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భాకరాపేట ఇన్చార్జ్ ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపించినట్లు తెలిపారు. -
ఈగల సత్యానికి 14 రోజుల రిమాండ్
సాక్షి, విశాఖపట్నం: తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు ఈగల సత్యనారాయణ (సత్యం)ను ఎంవీపీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎస్తేర్‌రాణి అనే మహిళపై దౌర్జన్యానికి దిగడంతోపాటు వేధింపులకు గురిచేసిన నేపథ్యంలో అతనిపై ఎంవీపీ పోలీసు స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. వేధింపులు తాళలేక ఆదివారం రాత్రి ఎస్తేర్‌రాణి శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు తరలించారు. దీంతో అక్కడికి వెళ్లిన ఎంవీపీ పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకొని సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం బీచ్‌రోడ్డులో ఈగల సత్యంను అదుపులోకి తీసుకున్నట్లు ఎంవీపీ ఎస్ఐ భాస్కర్ తెలిపారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అక్కడి నుంచి సత్యంను సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఎస్తేర్‌రాణి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. శానిటైజర్ తాగడం వల్ల శరీరంలోని అవయవాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించినట్లు తెలిపారు. మహిళా సంఘాల ఆగ్రహం ఒంటరిగా ఉంటున్న మహిళ పట్ల ఈగల సత్యం వ్యవహరించిన తీరుపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహిళలపై టీడీపీ నాయకులకు ఉన్న చిన్నచూపునకు ఈ ఘటన నిదర్శనమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు మంగళవారం కేజీహెచ్‌కు వెళ్లి ఎస్తేర్‌రాణిని పరామర్శించారు. వైఎస్సార్సీపీతోపాటు నగరంలోని మహిళా సంఘాలన్నీ అండగా ఉన్నాయంటూ భరోసా కల్పించారు. ఎస్తేర్‌రాణి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ మహిళ విభాగం అధ్యక్షురాలు కృపజ్యోతి మాట్లాడుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియోలు చూస్తుంటే ఎస్తేర్‌రాణిపై సత్యం ఏ స్థాయిలో దౌర్జన్యానికి దిగాడనేది అర్థమవుతుందన్నారు. నిత్యం ఆమె ఇంటికి వెళ్లి దుర్భాషలాడుతూ, వేధిస్తూ మానసికంగా హింసించాడన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి అండతోనే సత్యం ఇంతగా బరితెగించాడంటూ దుయ్యబట్టారు. మానసికంగా, శారీరకంగా ఎస్తేర్‌రాణిని హింసించిన తీరుపై కుటుంబ సభ్యులు తెలిపిన విషయాలు బాధ కలిగించాయన్నారు. సత్యంను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విశాఖలో మరోసారి ఇలాంటి ఘటన వెలుగుచూడకుండా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన దిశ వంటి చట్టాలను ఉపయోగించి సత్యంలాంటి వారికి తగిన గుణపాఠం నేర్పాలన్నారు. కార్యక్రమంలో శిరీష, షకీనా, వరలక్ష్మి, వెంకటలక్ష్మి, శశికళ పాల్గొన్నారు. చదవండి: మహిళపై టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి దౌర్జన్యం -
పిల్లలకు విషమిచ్చి, తల్లి ఆత్మహత్య
సాక్షి, నెల్లూరు : మనస్తాపంతో ఓ మహిళ ... ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి, తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. కోట మండలం ఊనుగుంటపాలెంకు చెందిన నాగార్జున, రాణి భార్యభర్తలు. వీరికి ప్రదీప్ (5), సుధీర్ (2) సంతాపం. కాగా కొంతకాలంగా నాగార్జున నెల్లూరులోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. అతడు అక్కడే ఉంటూ...వారంలో ఒకరోజు ఇంటికి వచ్చి వెళ్లేవాడు. అయితే తమను కూడా నెల్లూరుకు తీసుకు వెళ్లాలంటూ కొద్దిరోజులుగా రాణి భర్తను కోరుతోంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత కుటుంబాన్ని అక్కడకు తీసుకు వెళతానంటూ సర్థి చెబుతూ వచ్చాడు. ఇదే విషయమై రెండు రోజుల క్రితం భార్యాభర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో బంధువులు, స్థానికులు కలగచేసుకుని, ఇద్దరికి సర్ధి చెప్పారు. నాగార్జున యథావిథిగా నెల్లూరు వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో రాణి నిన్న రాత్రి ఇద్దరు పిల్లలకు విషం తాగించి, వారు చనిపోయిన తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తెల్లారినా ఇంట్లో నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంతో పక్కింటివాళ్లు వచ్చి చూడగా అప్పటికే పిల్లలతో పాటు రాణి కూడా విగతజీవిగా పడిఉంది. సమాచారం అందుకున్న నాగార్జున స్వగ్రామానికి చేరుకుని భార్య, పిల్లల మృతదేహాలను చూసి భోరున విలపించాడు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. -
క్రీడల్లో కుమార్తెను గెలిపించి..
సాక్షి, కడప స్పోర్ట్స్: కుమార్తెను మంచి క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలనుకున్న ఆ తల్లి ఆకాంక్ష నెరవేరింది కానీ.. ఆ కుమార్తె విజయాన్ని ఆనందించే క్షణాలు మాత్రం కన్నతల్లికి లేకుండా పోయాయి. జాతీయ స్థాయిలో తన కుమార్తె సాధించిన ఘనత చూడకుండానే కన్నుమూసింది. క్రీడల్లో కుమార్తెను గెలిపించగలిగిన ఆ మహిళ.. కుటుంబ కలహాలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన వైఎస్సార్ జిల్లాలో జరిగింది. కడపలో ఓ అపార్ట్మెంట్లో భార్యభర్తలు గంగయ్య, వెంకటలక్షుమ్మ (45) వాచ్మెన్లుగా పనిచేసేవారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కుమార్తె వరలక్ష్మికి చదువుతో పాటు క్రీడల్లో ఆసక్తి ఉంది. తల్లి వెంకటలక్షుమ్మ వరలక్ష్మిని ప్రోత్సహిస్తూ వచ్చింది. కళాశాల నుంచి అండర్–19 ఎస్జీఎఫ్ షూటింగ్‌బాల్ జట్టుకు ఎంపికైంది. గతనెలలో ప్రకాశం జిల్లాలో నిర్వహించిన ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు కూడా ఎంపికైంది. ఈనెల 1 నుంచి న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న షూటింగ్‌బాల్ పోటీల్లో పాల్గొని కాంస్య పతకం గెలిచింది. అయితే ఢిల్లీ వెళ్లేందుకు డబ్బును ఇవ్వడానికి తండ్రి నిరాకరించగా.. తల్లి సమకూర్చింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమైనట్లు స్థానికులు చెబుతున్నారు. మరికొందరు మాత్రం పెద్ద కుమార్తెను పనిలోకి తీసుకువెళ్లే విషయంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగి వెంకటలక్షుమ్మ కలత చెందిందంటున్నారు. వెంటిలేటర్‌పై.. ఈనెల 2న వెంకటలక్షుమ్మ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆమెను వెంటనే హాస్పిటల్లో చేర్పించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించగా సోమవారం ఆమె తుదిశ్వాస విడిచింది. అయితే ఈ విషయాన్ని ఢిల్లీకి వెళ్లిన కుమార్తెకు చెప్పలేదు. ఢిల్లీ నుంచి వరలక్ష్మి ఫోన్ ద్వారా అమ్మతో మాట్లాడేందుకు ప్రయత్నించినా.. కుటుంబ సభ్యులు మభ్యపెడుతూ వచ్చారు. సోమవారం ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో ఏపీ జట్టు ప్రతిభ కనబరిచి మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. అమ్మతో మాట్లాడే అవకాశం రాకపోవడంతో అనుమానం వచ్చి మంగళవారం సాయంత్రం తనకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి వాకబు చేయగా ఆమెకు అసలు విషయం తెలిసింది. దీంతో కోచ్ ఆమెను విమానంలో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
నాన్నా.. నీ కష్టాన్ని చూడలేను ఇక వెళ్లొస్తా!
చీరాల అర్బన్: తాను తండ్రికి భారం కాకూడదని భావించిన ఓ యువతి బలవన్మరణం చెందింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాల మండలం కొత్తపేటలో జరిగింది. వేల్పూరి రాంబాబుకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. రాంబాబు సౌదీలో ఉద్యోగం చేస్తూ తన ముగ్గురు పిల్లలను చదివించాడు. చివరి అమ్మాయి వైష్ణవి (22) చీరాలలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. 2 నెలల క్రితం స్వదేశానికి వచ్చిన రాంబాబుతో తాను సివిల్స్ కోచింగ్ తీసుకుంటానని వైష్ణవి చెప్పింది. ఆర్థిక ఇబ్బందులున్నా సరే కుమార్తె మాట కాదనలేక రాంబాబు హైదరాబాద్‌లోని ఓ కోచింగ్ సెంటర్లో మాట్లాడి వచ్చాడు. డబ్బులు కట్టడానికి రాంబాబు పడుతున్న ఇబ్బందులను వైష్ణవి గమనించింది. తాను తండ్రికి భారంగా మారుతున్నానని కలత చెంది, మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వైష్ణవి మృతి చెందింది. -
తల్లడిల్లిన తల్లి మనసు
చిలకలగూడ: కుమార్తె మృతిని తట్టుకోలేక ఓ మహిళ భవనం పైనుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన గురువారం సికింద్రాబాద్, చిలకలగూడ ఠాణా పరిధిలోని దూద్‌బావిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దూద్‌బావి, పద్మావతి ఎన్‌క్లేవ్‌లో ఉంటున్న మనోహర్‌బాబు, మంజుల దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె. వీరి కుమార్తె మానస (12) సికింద్రాబాద్ కీస్ హైస్కూలులో ఏడో తరగతి చదువుతోంది. గత కొన్నాళ్లుగా ఆమె ఆస్తమా, గుండె సంబంధ వ్యాధితో బాధపడుతోంది. బుధవారం ఉదయం మానస గుండెపోటుతో మృతి చెందింది. కుమార్తె మరణాన్ని జీర్ణించుకోలేక మనస్తాపానికి లోనైన మంజుల గురువారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో భవనం నాల్గో అంతస్తు పైకి ఎక్కి కిందికు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రక్తపు మడుగులో పడి ఉన్న మంజులను గుర్తించిన స్థానికులు ఆమెను ఆటోలో గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రాణంగా చూసుకునేది... కుమార్తె మరణాన్ని తట్టుకోలేకే మంజుల ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు, అపార్ట్‌మెంట్‌వాసులు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న మానసను గాజుబొమ్మలా చూసుకునేదన్నారు. బుధవారం ఉదయం మానస స్కూల్‌కు వెళ్లనని చెబితే తల్లి ఎంతగానో తల్లడిల్లిందని, బిడ్డను దగ్గరికి తీసుకుని సపర్యలు చేసిందన్నారు. బు«ధవారం మానస గుండెపోటుతో తల్లి చేతుల్లోనే ప్రాణాలు విడవడంతో ఆమె జీర్ణించుకోలేకపోయిందని, కుమార్తె లేకుండా తాను బతకలేనని, తానూ కూడా బిడ్డ వద్దకే వెళతానని బోరున విలపించిందన్నారు. తాము ఎంతో నచ్చజెప్పామని, అయితే ఇంతలోనే అఘాయిత్యానికి పాల్పడుతుందనుకోలేదని బంధువులు విలపించారు. గురువారం ఉదయం భవనంపైకి వెళ్తుంటే దుస్తులు ఆరేసేందుకు వెళుతుందనుకున్నామని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుందనుకోలేదని వారు కన్నీటిపర్యంతమయ్యారు. మృతురాలి భర్త మనోహర్‌బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అడ్మిన్ ఎస్ఐ రవికుమార్ తెలిపారు. అమ్మ తిట్టిందని..మనస్తాపంతో బాలుడి ఆత్మహత్య బాలానగర్: సెల్‌ఫోన్ విషయంలో తల్లి మందలించటంతో మనస్తాపానికిలోనైన ఓ బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ వాహిదుద్దీన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫిరోజ్‌గూడలో ఉంటున్న సత్యవరపు సుశీలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల సుశీల కుమార్తెకు సెల్‌ఫోన్ కొనిచ్చింది. గురువారం సెల్‌ఫోన్‌తో కుమారుడు కార్తీక్ (15) ఆడుకుంటున్నాడు. అయితే అతడి సోదరి ప్రాజెక్టు పని ఉందని సెల్‌ఫోన్ ఇవ్వాలని తమ్ముడిని కోరగా, కార్తీక్ అందుకు నిరాకరించాడు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న సుశీల కుమారుడిని మందలించి సెల్‌ఫోన్ ఇప్పించింది. మధ్యాహ్నం కుమార్తెకు టిఫిక్ బాక్స్ ఇచ్చేందుకు బయటికి వెళ్లిన సుశీల ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపులు లోపలి నుంచి గడియ వేసి ఉన్నాయి. తలుపులు కొట్టినా కార్తీక్ తెరవకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె స్థానికులతో కలిసి పక్కింటి బాల్కనీలోనుంచి చూడగా కార్తీక్ బెడ్ రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో తలుపులు బద్ధలు కొట్టి కార్తీక్‌ను కిందకు దింపి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. మృతుడి తల్లి సుశీల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మాజీ మంత్రి నిర్వాకం మహిళ ఆత్మహత్య!
కర్ణాటక, బనశంకరి: ఓ మాజీ మంత్రి భారీమొత్తంలో రుణం తీసుకుని చెల్లించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరులోని చంద్రాలేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధి లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు... చంద్రాలేఔట్‌కు చెందిన అంజనా వి. శాంతవేరి (35) అనే మహిళ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన మాజీ మంత్రి బాబు రావ్ చించనసూర్ రూ.11.88 కోట్లు రుణం గా తీసుకున్నారు. ఆ తరువాత అప్పు చెల్లించలేదు. దీంతో అంజన మాజీ మంత్రి పై కోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ తరుణంలో మరోవైపు అంజనాకు అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి అధికమైంది. తమ వద్ద తీసుకున్న రుణాలను చెల్లించాలని ఆమెను డిమాండ్ చేయసాగారు. ఒకవైపు తాను ఇచ్చిన డబ్బులు రాకపోవడం, మరోవైపు ఒత్తిళ్లతో జీవితం మీద విరక్తి చెందిన అంజన చంద్రాలేఔట్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఆమె కుమారునికి ఫోన్ చేసి తన మృదేహానికి నువ్వే నిప్పు పెట్టాలని చెప్పినట్లు తెలిసింది. ఈ ఘటన పై చంద్రాలేఔట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన బాబురావ్ స్వస్థలం కలబుర్గి జిల్లా చించోళి. ఇటీవల ఆయన బీజేపీలో చేరారు. -
భర్త కొట్టాడని..
నాగోలు: భర్త కొట్టాడని మనస్తాపానికి లోనైన ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎల్బీనగర్ సీఐ అశోక్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా, పులిచర్ల గ్రామం, పెద్దవురె గ్రామానికి చెందిన బొడ్డుపల్లి చంద్రశేఖర్, మంగమ్మ (33) దంపతులు నగరానికి వలసవచ్చి మాన్సూరాబద్ డివిజన్ శ్రీరామ్‌హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన చంద్రశేఖర్ పిల్లలు టీవీ చూస్తున్నా పట్టించుకోవడం లేదంటూ భార్య మంగమ్మతో గొడవ పడి ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో మంగమ్మ కోపంతో బెడ్ రూమ్‌లోకి వెళ్లిపోగా, పిల్లలతో కలిసి చంద్రశేఖర్ మరో గదిలో నిద్రకు ఉపక్రమించాడు. అర్థరాత్రి అతడు బెడ్ రూమ్ తలుపు తెరిచి చూడగా మంగమ్మ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని కనిపించింది. దీంతో అతను ఆమెను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. దీంతో అతను రాగన్నగూడలో ఉంటున్న బావమరిది శ్రీనుకు సమాచారం అందించాడు. ఆదివారం మృతురాలి తండ్రి భిక్షమయ్య ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని భిక్షమయ్య ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిందితుడు చంద్రశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
పెళ్లికి కూతురు ఒప్పుకోవడం లేదంటూ..లెటర్ రాసి..
సాక్షి, బేతంచెర్ల(కర్నూలు) : కూతురు పెళ్లికి ఒప్పుకోవడంలేదనే మనస్తాపంతో తల్లి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండల కేంద్రంలోని ముద్దవరం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి భార్య రమణమ్మ(46) రెండవ అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. ఈమెకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె భాగ్యలక్ష్మికి వివాహం కాగా, చిన్న కుమార్తె భార్గవికి ఇటివలే రహిమానుపురం గ్రామానికి చెందిన యువకునితో పెళ్లి కుదిరింది. అయితే తనకు ఈ సంబంధం ఇష్టం లేదని కూతురు చెప్పడంతో మాట ఇచ్చామని, ఎలాగైనా వివాహం చేసుకోవాలని కోరింది. అయినా వినకపోవడంతో ఆదివారం ఉదయం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నమైనా ఇంటికి రాకపోవడంతో కూతురు అంగన్వాడీ కేంద్రం వద్దకు వచ్చి చూడగా తల్లి ఉరి వేలాడుతుండటంతో గుండెలు బాదుకుంది. మృతురాలి చేతిలో ఉన్న సూసైడ్‌నోట్‌లో ‘అయామ్ స్వారీ భార్గవీ, నీకు ఇష్టం లేనిపని ఏమి నేను చెయ్య లేను. అలాగని చేయిదాటిపోయినందుకు నాకు నేనే బాధపడుతున్నాను. నీకు మంచి తల్లిని కాలేక పోయా, సో అయామ్ సారీ, నాకు ఇక ఏమార్గం కన్పించలేదు’ అని రాసి సంతకం చేసి ఉంది. వీఆర్వో వెంకట్రావు అక్కడకు చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సురేష్ ఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బనగానపల్లె ఆస్పత్రికి తరలించారు. -
అనాథలు కావద్దని పిల్లలతో సహా ఆత్మహత్య
కుటుంబ కలహాలు ఆ తల్లిని తల్లడిల్లిపోయేలా చేశాయి. మూడేళ్ల పాపను చంకనెత్తుకొని, ఐదేళ్ల బాలుడి చిటికెన వేలు పట్టుకొని అడుగులేస్తుంటే ... అమ్మ ఎక్కడికో తీసుకువెళ్తోందని సంబరపడ్డారు. కోనసీమలోని గోదారి కాలువ గట్టు వెంబడి వెళ్తుంటే పచ్చని పంటపొలాలు, కొబ్బరి తోటలు, ఆ పక్కనే గలగలపారే జలప్రవాహాన్ని చూస్తూ ఆ చిన్నారుల మదిలో సందడి. వారి కళ్లలో సంతోషాన్ని చూసిన ఆ కన్న తల్లి మనసులో మాత్రం అలజడి. కన్నపేగులను గట్టిగా కావలించుకొని ఆ తల్లి ఒక్కసారిగా దూకేసింది. పరుగులు తీసే ప్రవాహంలోనే ఆ ముగ్గురి ప్రాణాలూ కలిసి పోయాయి. సాక్షి, ఆత్రేయపురం (తూర్పు గోదావరి): ఆమెకు ఏకష్టమొచ్చిందో ఏమో తెలియదు. ముక్కు పచ్చలారని పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుంది. భర్తపైన కోపంతో విగతజీవిగా మారిన ఆమె తన తండ్రిని మాత్రం క్షమించమని వేడుకుంది. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. అందిన సమాచారం ప్రకారం.. ఆత్రేయపురం మండలం వసంతవాడకు చెందిన మిద్దె బాబూరావు, దుర్గల కుమార్తె నవీనకు బావ వరసయ్యే కారింకి శ్రీనుతో వివాహమైంది. వారికి ఐదేళ్ల రాజేష్, మూడేళ్ల నిత్యనందిని పిల్లలు. వీరు కొంతకాలం వసంతవాడలో కాపురం ఉన్నారు. ఆ తర్వాత మండపేటలో నివాసం ఉంటున్నారు. శ్రీను జూదాలకు, వ్యసనాలకు బానిసవడంతో కుటుంబపోషణ కష్టంగా మారింది. పిల్లలను కూడా పట్టించుకోవడం లేదంటూ ఆమె చాలా సార్లు భర్తతో గొడవపడింది. కుమార్తె కుటుంబంలో కల్లోలం తలెత్తడంతో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల ముందు బాబూరావు మండపేటలోని కొండపల్లివారి వీధిలోకి మకాం మర్చారు. ఏం చేసినా ఫలితం లేదని భావించిన నవీన పిల్లలను వదిలేస్తే వారు అనాథలవుతారని భావించి వారితో కలసి లొల్ల లాకుల సమీపంలో అమలాపురం బ్యాంక్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కాలువలోకి దూకే ముందు ఆమె పలకమీద ‘నువ్వు చేసిన తప్పుకు నా బిడ్డలు బాధ పడాలి బావా’ అని ‘నాన్నా నన్ను క్షమించండి’ అని వ్రాసి పలకను గట్టుమీద వదిలివేసింది. ఈ ఆత్మహత్యకు కుటుంబ తగాదాలే కారణం కావచ్చని పలకమీద రాతలను బట్టి తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హుటాహుటిన సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతదేహాలను వెలికి తీయాలని పోలీసులను ఆదేశించారు. దీనిపై అమలాపురం డీఎస్పీ ఆర్ రమణ ఆధ్వర్యంలో రావులపాలెం సీఐ వి.కృష్ణ, ఎస్సై నరేష్ కాలువలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తొలుత బాలిక, అనంతరం బాలుడు, చివరగా నవీన మృతదేహలు సంఘటనా స్థలం సమీపం నుంచే వెలికి తీశారు. మృతదేహాలను కొత్తపేట ప్రభుత్వ అసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నరేష్ తెలిపారు. రోజూ తమతో ఆడుకునే స్నేహితులు విగతజీవులుగా పడి ఉండటం చూసి అర్థం కాక తోటి స్నేహితులు వారిని ఆడుకోడానికి రమ్మని పిలవడం చూపరులను ఆవేదనకు గురిచేసింది. ఆ తండ్రిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తు చేపడితే అసలు విషయాలు వెలుగుచూస్తాయి. -
పెళ్లి కావడం లేదని ఆత్మహత్య!
సాక్షి, ఎల్లారెడ్డి (కామారెడ్డి): కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా పెళ్లి కావడం లేదని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఎల్లారెడ్డి పట్టణం లో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై కమలాకర్ కథనం ప్రకారం.. ఎల్లారెడ్డికి చెందిన చిలక రాజమౌళి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఈ క్రమంలో రాజమౌళి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. అయితే, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన కుమార్తె స్వప్న (20)కు పెళ్లి చేయడం లేదు. ఈ విషయమై తల్లితో గొడవ పడిన స్వప్న ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది. మృతురాలి సోదరుడు సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మంత్రగాడి ఇంటి పక్కన ఓ మహిళ..
సాక్షి, చిత్తూరు : మంత్రగాడిని ఆశ్రయించిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో కలకలం రేపుతోంది. రాపకుప్పం మండలం వీర్నమల పంచాయతీ కుల్లిగానూరుకు చెందిన పవనమ్మ గత ఆరునెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఆమె ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో కుప్పంకు చెందిన హకీమ్ అక్బర్ అనే మంత్రగాడిని సంప్రదించారు. మూడు రోజుల పాటు ఆ మహిళ ఆ మంత్రగాడి ఇంట్లోనే ఉన్నారు. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ మంత్రగాడి ఇంటి పక్కనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గోపినగర్ సమీప వ్యవసాయ పొలాల్లో ఈ ఘటన జరగ్గా.. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని కారులో బాధితురాలి ఇంటికి తరలించారు. మంత్రగాడి వల్లే పవనమ్మ ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య
చిక్కడపల్లి: భర్త, కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. సీఐ సైరెడ్డి వెంకట్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, ఇందిరానగర్‌కు చెందిన సౌజన్య (29), మెట్రో సర్వో డ్రైవ్స్ కంపెనీలో అసిస్టెంట్ ఇంజినీరింగ్‌గా పని చేస్తోంది. అదే కంపెనీలో పనిచేస్తున్న చిక్కడపల్లికి చెందిన ప్రకాష్‌ను 2017లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత ఏడాది జూలైలో పాపకు జన్మనిచ్చిన సౌజన్య రెండు నెలల క్రితం చిక్కడపల్లిలోని అత్తగారింటికి వచ్చి అక్కడే ఉంటోంది. ఆదివారం మధ్యాహ్నం గదిలోకి వెళ్లిన సౌజన్య ఎంత కూ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె భర్త కిటికీలోంచి చూడగా సౌజన్య ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. తలుపులు బద్దలు కొట్టి ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె భర్త, అత్త రుష్యేంద్రమణి వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని మృతురాలి తండ్రిపెద్దపుల్లయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సర్పంచ్‌గా పోటీ చేయాలని వేధింపులు.. వివాహిత సూసైడ్..!
సాక్షి, దిండి : సర్పంచ్ ఎన్నికలు ఓ కుటుంబంలో చిచ్చు రేపాయి. భార్యను సర్పంచ్‌గా పోటీ చేయాలని ఓ భర్త వేధింపులకు గురిచేశాడు. దాంతోపాటు పుట్టింటి నుంచి రూ.5 లక్షల తీసుకురావాలని ఒత్తిడి చేశాడు. దీంతో ఆమె బలన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలోని దిండి మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఎర్రగుంటపల్లికి చెందిన జంతుక లింగమయ్య, రాధ (22) దంపతులు. వీరికి 8 నెలల కిందట వివాహమైంది. పెళ్లి సమయంలో ఒప్పుకున్న బైక్ కోసం లింగమయ్య రాధను నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. ఇదే క్రమంలో ఎర్రగుంటపల్లి సర్పంచ్ స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించడంతో తన భార్యను పోటీచేయించడానికి లింగమయ్య ఆసక్తి చూపించాడు. సర్పంచ్‌గా పోటీ చేయాలని రాధను ఒత్తిడి చేశాడు. పుట్టింటికి వెళ్లి 5 లక్షల రూపాయలు తేవాలని వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ఈ నెల 6న నిజాంనగర్‌లో ఉంటున్న తల్లిదండ్రులు భైరాపురం మీనయ్య, శారదలకు తన గోడు వెళ్లబోసుకున్నా లాభం లేకపోయింది. బుధవారం పుట్టింట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రాధను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాధ అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
అత్తింటి వేధింపులకు ప్రభుత్వ ఉద్యోగిని బలి
రాంగోపాల్‌పేట్, తార్నాక: అత్తింటి వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బాలాజీనగర్‌కు చెందిన బలరాం, లక్ష్మిబాయిల కుమార్తె నాగమణి (34)కి సీతాఫల్మండి రవీంద్రనగర్‌కు చెందిన మారుతికుమార్తో 2014లో వివాహం జరిగింది. నాగమణి తిరుమలగిరి ఎమ్మార్వో కార్యాలయంలో వీఆర్ఏగా పనిచేసేది. పెళ్లి సమయంలో రూ.రెండు లక్షల నగదు, రూ.లక్ష విలువైన బంగారు నగలు ఇచ్చారు. వీరికి కుమారుడు(3) ఉన్నాడు. మారుతి కుమార్ లండన్‌లో సాప్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా నాగమణి కొద్ది నెలల క్రితం డిప్యూటేషన్‌పై సికింద్రాబాద్ ఆర్డీవో కార్యాలయానికి వచ్చింది. పెళ్లైనప్పటినుంచి వేధింపులు పెళ్లైన తర్వాత కొద్ది రోజుల నుంచే నాగమణిని ఆమె అత్త, మామలు, ఆడపడుచు వేధింపులకు గురిచేస్తున్నారు. అదనపు కట్నం తేవాలని తరచూ వేధించేవారు. భర్త మారుతికుమార్ కూడా వేధింపులకు గురి చేసేవాడని తెలిపారు. కుమారుడికి అనారోగ్యంతో... ఇటీవల ఆమె కుమారుడు అనారోగ్యంతో బాధపడుతుండటంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చూపించగా శస్త్ర చికిత్సకు సుమారు రూ.7లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఇటీవల లండన్ నుంచి వచ్చిన భర్త్త, అత్త, మామ సదరు డబ్బు పుట్టింటి నుంచి డబ్బు తేవాలని ఆమెపై ఒత్తిడి తెస్తుండటంతో మనస్తాపానికిలోనైన నాగమణి ఈ నెల 15న రాత్రి ఆర్పిక్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. ‘అత్తింటి వారే చంపేశారు’ నాగమణిని ఆమె భర్త, అత్త, మామలే బలవంతంగా ఆర్పిక్ తాగించి చంపేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గురువారం వారు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆమె అత్తామామలపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పిల్లలను బావిలోకి తోసి.. వివాహిత ఆత్మహత్య
అనంతపురం, గుడిబండ: హిరేతుర్పి సమీపంలో ఓ మహిళ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఇద్దరు పిల్లలను సమీపంలోని బావిలోకి తోసినట్లు అనుమానం రావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్ఐ శరత్చంద్ర వివరాల మేరకు..కర్ణాటక రాష్ట్రం కోట గ్రామానికి చెందిన లక్ష్మీ(26)కి పదేళ్ల క్రితం అదే రాష్ట్రం మధుగిరి తాలూకా శిడదరగల్లు గ్రామానికి చెందిన యశ్వంత్‌తో వివాహం జరిగింది. వీరికి వంశీ, చందు అనే ఇద్దరు కుమారులున్నారు. రెండు రోజుల కిందట లక్ష్మీ పుట్టింటికి వెళతానని భర్తతో చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. గురువారం ఉదయం పొలం పనుల నిమిత్తం వెళ్లిన రైతులకు చెట్టుకు వేలాడుతున్న మహిళ మృతదేహం కనిపించడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హిరేతుర్పిలో పూజారి పని చేసున్న అనిల్‌కుమార్ మృతదేహాన్ని తన సోదరి లక్ష్మీదిగా గుర్తించారు. ఘటన స్థలానికి సమీపంలో ఉన్న బావి గట్టున చిన్నారుల చెప్పులు ఉండడంతో వారిని ఆమె బావిలోకి తోసేసినట్లు అనుమానించి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చీకటి పడడంతో గాలింపు చర్యలు ఆపేశారు. సీఐ దేవేంద్రకుమార్ సంఘట నాస్థలాన్ని పరిశీలించారు. -
ఓవర్ బ్రిడ్జిపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య
కృష్ణాజిల్లా , పొన్నూరు: ఓవర్ బ్రిడ్జిపై నుంచి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పొన్నూరు పట్టణంలో మంగళవారం కలకలం రేపింది. పట్టణంలోని 10వ వార్డుకు చెందిన అద్దంకి వీర ప్రసాదరావు కుమార్తె అమదాలపల్లి సునీత(35) నిడుబ్రోలు ఓవర్ బ్రిడ్జిపై నుంచి తుంగభద్ర డ్రెయిన్‌లో దూకింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే డ్రెయిన్‌లోకి దిగి ఆమెను బయటకు తీసి నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలి సిన పట్టణ సీఐ ఎం.నాగేశ్వరావు, ఎస్ఐ డి.కిషోర్‌బాబులు ఆస్పత్రికి బాధితురాలిని సందర్శించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలి పారు. మృతిరాలు తండ్రి అద్దంకి వీరప్రసాదరావు మాట్లాడుతూ తన కుమార్తెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో 2 నెలల క్రి తం అల్లుడు వద్ద నుంచి ´న్నూ రు తీసుకువచ్చి వైద్యం చేయిస్తున్నామని తెలిపారు. రో గం తగ్గకపోవటంతో మనస్తాపానికి గురై ఓవర్ బ్రిడ్జి పై నుంచి దూకి మృతి చెందిం దని ఆయన పోలీసులకు తెలిపారు. వీరప్రసాదరావు ఫిర్యాదు మేరకు ఎస్ఐ డి.కిషోర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. -
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
చిత్తూరు, తిరుపతి క్రైం: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం తిరుపతి నగరం కొర్లగుంటలో జరిగింది. ఈస్ట్ సీఐ చంద్రబాబునాయుడు కథనం మేరకు.. కొర్లగుంటలో నివాసముంటున్న ప్రకాష్, కమల దంపతుల కుమార్తె లావణ్య(20)ను చిత్తూరు సమీపంలోని బొడేవారిపల్లెకు చెందిన నిర్మల, ఆంజనేయులు దంపతుల కుమారుడు ఈశ్వర్(25) మైనర్లుగా ఉన్నప్పుడే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులకు దూరంగా కొర్లగుంటలోని ప్రశాంత్ స్కూల్ సమీపంలో కాపురం పెట్టారు. వీరికి భవ్య(3) కుమార్తె ఉంది. ఈశ్వర్ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. అతను కొంతమంది మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్టు భార్య గుర్తించింది. దీనిపై భర్తను నిలదీసేది. దీంతో ఈశ్వర్ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. శనివారం రాత్రి కూడా భార్య, భర్త గొడవపడ్డారు. అనంతరం ఏమి జరిగిందేమోగానీ ఉదయం లేచి చూసే సరికి లావణ్య ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఉండడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ, ఎస్ఐ అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకురాలు శ్రీదేవి, ఐద్వా లక్ష్మీ సంఘటన స్థలానికి చేరుకుని లావణ్యను భర్త ఈశ్వర్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపించారు. పోలీసులు మాత్రం కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు వేధింపులకే ఆత్మహత్యకు పాల్పడినట్లు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. -
పిల్లలను చంపి..తానూ అంతమొందించుకొని
హైదరాబాద్: తన భర్తతో నెలకొన్న స్పర్థల కారణంగా అతని వద్దకు వెళ్లేందుకు ఇష్టంలేని ఓ గృహిణి తన పిల్లలను అంతమొందించి తానూ ఆత్మహత్యకు పాల్పడింది.ఎల్బీనగర్ పొలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు జనగాం జిల్లా ధర్మసాగర్ మండలం, మల్లికుదుర్లకు చెందిన కుంట యాదగిరి, లక్ష్మీ భార్యాభర్తలు. వారు బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి మన్సూరాబాద్ వీకర్ సెక్షన్ కాలనీలో నివాసం వుంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె స్రవంతి(28)కి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పాయిగూడెంకు చెందిన కత్తుల రమేశ్‌కు ఇచ్చి 12ఏళ్ల కిందట వివాహం చేశారు. వీరికి సాయితేజ (10) సాత్విక (6) పిల్లలు.కాగా రమేశ్ మాససిక స్ధితి సరిగా లేనందున దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో విసిగిన స్రవంతి 5 ఏళ్ల కిందట ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. ఇక్కడే ఇళ్లలో పనిచేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటోంది. భర్త వద్దకు వెళ్లేందుకు ఇష్టం లేక.. కాగా దసరా అనంతరం తమ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించి స్రవంతిని అత్తారింటికి పంపే ఏర్పాట్లలో ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. ఈ ప్రయత్నం స్రవంతికి ఇష్టం లేదు. దీంతో వారు శుక్రవారం పనులకు వెళ్లిన సమయంలో ఆమె కొంతసేపు బయట గడిపి తిరిగి 10 గంటలప్పుడు ఇంటికి చేరుకుంది. బయట నుంచి వస్తూ పురుగుల మందు వెంట తెచ్చుకుని చక్కెరతో కలిపి పిల్లలకు అన్నంతో తినిపించి తానూ తిన్నది. అనంతరం బాత్రూమ్ లోని హీటర్‌తో పిల్లలకు కరెంట్ షాక్ ఇచ్చి, తాను కూడా షాక్ పెట్టుకుంది. ఈలోగా బయట నుంచి వచ్చిన తల్లి లక్ష్మి ఇంట్లో ఘటనను చూసి భయంతో చుట్టు ప్రక్కల వారికి తెలిపింది. వారు వచ్చేసరికి పిల్లలు చనిపోయివున్నారు. కొన ఊపిరితో ఉన్న స్రవంతిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఆమె 108 వాహనం లోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా స్రవంతి భర్త మానసిక స్థితి బాగోలేకపోవటం, శారీరక బాధలు పెడుతుండటంతోనే స్రవంతి అతని వద్దకు వెళ్లేందుకు నిరాకరించినట్లు స్థానికులు తెలిపారు. -
వరకట్న వేధింపులకు వివాహిత ఆత్మహత్య
పెదకాకాని: జీవితాంతం తోడు ఉండాల్సిన భర్త, కన్న తల్లిలా ఆదరించాల్సిన అత్తల వేధింపులు భరించలేక ఓ వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పలపాడు గ్రామంలో చోటు చేసుకుంది. కట్నం తీసుకురావాలంటూ చీటికి మాటికి వారు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ఏడాదిన్నర కన్నబిడ్డను కూడా వదిలి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన కావూరు రాఘవేంద్రరావుకు మూడేళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ప్రభావతితో వివాహం అయింది. వారి దాంపత్యజీవితం ఆరంభంలో సాఫీగానే సాగింది. వారికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. కొంతకాలంగా అత్త మల్లేశ్వరి పుట్టింటి నుంచి కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేస్తోంది. భర్త రాఘవేంద్రరావు సైతం తల్లి మాటలకే వత్తాసు పలకడంతో ప్రభావతి ఎవరికీ చెప్పుకోలేని వేదన అనుభవించింది. ఈ నేపథ్యంలో ఈనెల 10 వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగింది. చికిత్స కోసం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ప్రభావతి(24) గురువారం రాత్రి మృతి చెందింది. మృతురాలి మరణవాగ్మూలం, ఆమె తల్లి రామతులశమ్మ ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ పి.శేషగిరిరావు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
ప్రేమించిన పాపానికి...
నెల్లూరు / బుచ్చిరెడ్డిపాళెం: ప్రేమించానని వెంటపడ్డాడు. ప్రేమించకపోతే చనిపోతానని బెదిరించాడు. ఇంట్లో తెలియడంతో తల్లి మందలించి బంధువుల ఇంటికి పంపించారని తెలుసుకున్నాడు. తనను పెళ్లి చేసుకోమంటూ నిత్యం ఫోన్లు చేశాడు. సమాధానం లేకపోయే సరికి వాట్సప్‌లో తనతో కలిసిన దృశ్యాలను పంపాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి బంధువులు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని మృతి చెందింది. ఈ ఘటన తెలంగాణ యాదాద్రి జిల్లా కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. బుచ్చిరెడ్డిపాళెం మండలం వవ్వేరుకు చెందిన మెధోమి, మస్తానయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె మానస నెల్లూరు వేదాయపాళెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నర్సింగ్ కోర్సు చదువుతోంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన యువకుడు తనను ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. తనను ప్రేమించకపోతే చనిపోతాన న్నాడు. దీంతో ఈ విషయాన్ని మానస తల్లికి చెప్పింది. తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన మానస నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించారు. అయినా ఆగక చేయికోసుకుంది. దీంతో తల్లిదండ్రులు మానసను భువనగిరిలోని బంధువుల ఇంటికి పంపించారు. ఈ నేపథ్యంలో ప్రియుడు నిత్యం ఫోన్లు చేసి తనను పెళ్లి చేసుకోమని వేధించసాగాడు. సమాధానం లేకపోవడంతో తనతో కలిసిన వీడియోలను వాట్సప్ పంపడం ప్రారంభించాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన మానస శనివారం బంధువులు ఇంట్లో లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అటు ప్రియుడు, ఇటు తల్లి ఎవరూ తనను అర్థం చేసుకోకపోవడంతో తన చెల్లెలకు భవిష్యత్‌లో ఇలా జరగరాదని సూసైడ్ నోట్లో రాసింది. తన అవయవాలను దానం చేయాలని అందులో కోరింది. భువనగిరి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వరకట్న వేధింపులతో మహిళ ఆత్మహత్య
రాయచూరు రూరల్ : వరకట్నం తీసుకు రావాలని భర్త, కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెడుతుండడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాలూకాలోని దేవసూగూరులో సంభవించింది. మార్చి 31 2018న దేవసూ గూరుకు చెందిన కాంట్రాక్టర్ జంబణ్ణ కుమారు డు బాళేగౌడతో యాదగిరి జిల్లా శహాపుర తాలూకా మళ లి గ్రామానికి చెందిన బసవలింగప్ప కూతురు సవిత(18)కు వివాహమైంది. వివాహ సమయంలో 5 తులాల బంగారాన్ని వరకట్నంగా ఇచ్చారు. అయితే మరింత బంగారం తేవాలని భర్త కుటుంబ సభ్యులు నిత్యం వేధించడమేగాకుండా వరకట్నం తేకపోతే బాళేగౌడకు రెండో పెళ్లి చేస్తామని బెదిరించారు. దీం తో వేధింపులు తాళలేక సవిత గురువారం రాత్రి ఇం టిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విష యంపై శక్తినగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కుమారుడికి దీక్ష.. కోడలిపై లైంగిక వాంఛ
పెద్దపల్లి : భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగి.. అత్తమామలు తల్లి తరఫున రక్తసంబంధికులే.. ఇక తన జీవితం పచ్చని కాపురంతో వెలుగుతుందని ఆశపడ్డ ఆ యువతికి ఆరు నెలలు తిరగక ముందే నరకం చూపించారు. తాళలేని ఆ నవవధువు మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన పెద్దపల్లి జిల్లా తుర్కలమద్దికుంట గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఊటూరు గ్రామానికి చెందిన కొమురయ్య కూతురు ముత్యాల కోమలత (23)ను ఆరు నెలల క్రితం పెద్దపల్లి జిల్లా మద్దికుంట గ్రామానికి చెందిన ఈర్ల విజయ్‌కి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ సమయంలో రూ.15 లక్షల కట్నం, కానుకలు ఇచ్చారు. కోమలత తల్లికి కొమురయ్య స్వయాన సోదరుడే కావడంతో సంసారం సుఖంగా సాగుతుందని పుట్టింటివారు ఆశించారు. అప్పటికే విజయ్ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడంతో కూతురు సంతోషంగా ఉంటుందనుకున్నారు. ఇటీవల ఉద్యోగాన్ని వదులుకున్న విజయ్ ఇంటిదారి పట్టి హార్వెస్టర్ కొనుగోలు చేశాడు. ఆ సమయంలో కోమలత పుట్టింటివారు మరో రూ.5 లక్షలు విజయ్‌కి ఇచ్చారు. కోడలిపై మామ లైంగిక వేధింపులు.. ఈర్ల కొమురయ్య వ్యూహాత్మకంగా కోడలిపై లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కుమారుడికి దీక్ష ఇప్పించి రెండు నెలల పాటు ప్రతీ రోజు కోడలిని లైంగికంగా వాంఛ తీర్చాలని వెంటపడ్డాడు. ఈ విషయం కులపెద్దలకు చెప్పడంతో ఈర్ల కొమురయ్యను మందలించారు. అయినా వేధింపులు ఆగలేదు. మూడు రోజుల క్రితం ఇదే విషయమై మళ్లీ పంచాయితీ జరిగింది. అందరూ మామ వైఖరిని తప్పుబట్టారు. అయినా ప్రవర్తనలో మార్పు రాలేదు. మరోవైపు అత్త, భర్త మానసికంగా వేధింపులకు గురి చేశారు. దీంతో తీవ్రమస్తాపం చెందిన కోమలత మంగళవారం తన అత్తారింట్లో ఉరివేసుకొని ప్రాణాలు వదిలింది. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పెద్దపల్లి ఆస్పత్రికి తరలించగా, ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. భర్త, అత్తమామలు పరారీ.. కోమలత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకొని భర్త, అత్తమామ ఊరు వదిలి పారిపోయారు. మృతదేహానికి అత్తింటి వారే దహన సంస్కారాలు చేయాలని.. నిందితులను పట్టుకోవాలని కోమలత బంధువులు పోలీసులను కోరారు. ఇందుకోసం పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి సాయంత్రం మృతదేహాన్ని అంతిమయాత్ర కోసం ఊటూరుకు తరలించారు. కోమలత ఆత్మహత్య కేసులో ఈర్ల విజయ్, కొమురయ్య, విజయ, ఆడబిడ్డ స్వప్న, మహేందర్ కేసు నమోదు చేసినట్లు సీఐ నరేందర్ తెలిపారు. -
ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య
గుంతకల్లు రూరల్: ఎంతో ప్రాణంగా ఏడేళ్లుగా ప్రేమించిన మేనమామ పెళ్లికి నిరాకరించడంతో గుంతకల్లు మండలంలోని దోసలుడికి గ్రామానికి చెందిన సుజాత (24) అనే యువతి గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాములు, గురులక్ష్మి దంపతులకు నలుగురు కుమార్తెలు కాగా అందులో రెండో కూతురు సుజాత. అదే గ్రామానికి చెందిన తన మేనమామ గురునాథ్, సుజాతలు ఇద్దరు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుజాత పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారీ అప్పులు, ఇతర సమస్యలను సాకుగా చూపి గురునాథ్ మాట దాటవేస్తూ వచ్చాడు. మేనమామపైనే ఆశలు పెట్టుకున్న సుజాత ఇంట్లో వేరే పెళ్లి సంబంధాలు చూడటంతో గురునాథ్‌ను తప్ప వేరేవాళ్లను చేసుకోనంటూ ఇంట్లో వాళ్లకు తెగేసి చెప్పింది. కొంత కాలం తరువాత పెళ్లి చేసుకుంటానని గురునాథ్ కూడా అంగీకరించడంతో సుజాత తల్లిదండ్రులు ఆమెను ఏడాది క్రితం మూడో కూతురుకు వివాహం చేశారు. కాగా గురునాథ్ ఇటీవల సుజాతతో పెళ్లిచేసుకోనని తెగేసి చెప్పడంతో సుజాత తీవ్ర మనస్థాపానికి గురైంది. కూతురు బాధను చూడలేని ఆమె తల్లి ఆగ్రహంతో తన కూతురుకు వేరే సంబంధం చూసేందుకు సిద్ధపడింది. గురువారం ఉదయం పెళ్లి సంబంధం చూడటానికి ఏర్పాట్లు చేసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సుజాత బుధవారం అర్ధరాత్రి సమయంలో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం కొన ఊపిరితో ఉన్న సుజాతను చూసిన కుటుంబ సభ్యులు అసుపత్రికి తరలించినప్పటికీ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదుచేసకొని దర్యాప్తు చేపట్టారు. -
సముద్రంలో మునిగి మహిళ ఆత్మహత్య
చీరాల రూరల్: వేటపాలెం మండలం రామాపురం బీచ్‌లో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది. తమ కుమార్తె ఆత్మహత్యకు భర్త, అత్తమామలు, ఆడపడుచులే కారణమని మృతిరాలి తల్లిదండ్రులు ఈపురుపాలెం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి కథనంప్రకారం.. చీరాలలోని సంతబజారు రామాలయం వీధికి చెందిన కోట గౌతమి, వెంకట రామకృష్ణ మణికంఠ పవన్‌కుమార్ అలియాస్ పవన్‌లు భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. కుమారై, కుమారుడు ఉన్నారు. ఏం జరిగిందో ఏమోకానీ గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన గౌతమి రామాపురంలోని సముద్రంలో మునిగి ఆత్మహత్యకు పాల్పడింది. భారీగా వస్తున్న అలల తాకిడికి గౌతమి మృతదేహం 10 గంటలకే రామాపురం బీచ్ తీరానికి కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు ఈపురుపాలెం పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ డాక్టర్ ప్రేమ్‌కాజల్, సీఐ భక్తవత్సలరెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అత్తింటి వేధింపులే కారణమా? మృతురాలి తల్లిదండ్రులు మాత్రం తమ కుమారై ఆత్మహత్యకు ఆమె భర్త పవన్‌కుమార్, అతని తల్లిదండ్రులు, ఆడపడుచే కారణమని, వారంతా కలిసి తమ కుమారైను నిత్యం హింసించే వారని, వారి వరకట్న వేధింపులు తాళలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈపురుపాలెం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపా రు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
భర్త దుబాయ్ నుంచి రాలేదని..
రసూల్‌పురా: దుబాయ్‌కి వెళ్లిన భర్త తిరిగి రాకపోవడంతో మనస్థాపానికిలోనైన ఓ మహిళ అత్మహత్యకు పాల్పడిన సంఘటన బోయిన్పల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సాయి కిరణ్ కథనం మేరకు.. పాతబోయిన్‌పల్లి మిలట్రీ క్వార్టర్స్‌కు చెందిన సింధూజకు 2016లో కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన క్రిష్ణతో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత క్రిష్ణ దుబాయ్‌కు వెళ్లడంతో సిందూజ తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. భర్త తిరిగి రాకపోవడంతో మనస్థాపానికి గురైన ఆమె ఆదివారం రాత్రి తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అన్యాయం జరిగిందంటూ..
మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, సీఐ ఇస్లావత్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. మరిపెడ మండలం గుండెపుడికి చెందిన వడ్లకొండ పిచ్చయ్య, ముత్తమ్మ దంపతుల రెండో కుమారుడి మల్లయ్యతో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రాలకు చెందిన రాయిండ్ల దుర్గాసాబ్,వీరమ్మ దంపతుల కుమార్తె లక్ష్మీ(45)తో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మమత, కుమారుడు జన్మించారు. కుమారుడు మూడేళ్లకే నీటితొట్టిలో పడి మృతి చెందాడు. మమత ఇంటర్ ఇరకు ఖమ్మంలోని ఉమెన్స్ కళాశాలలో చదివి అనంతరం హైదరాబాద్‌లోని కుట్టు మిషన్ నేర్చుకుంటున్న సమయంలో దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సమీప బంధువు ఉపేందర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం పెళ్లిదాక చేరుకోవడం, అనతరం ఉపేందర్ మ మతను పెళ్లి చేసుకోననడంతో జనవరి 27న ఆత్మహత్యకు పాల్పడింది. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న మమత తల్లిదండ్రులు ప్రేమించిన వ్యక్తి పెళ్లిచేసుకోనని చెప్పడంతోనే మమత ఆత్మహత్యకు పాల్పడిందని మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసుల విచారణ చేయకపోవడంతో కన్న కొడుకు చనిపోయి, ఆ తర్వాత కూతురు చనిపోవడంతో మానసిక క్షోభకు గురైన లక్ష్మీ ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సైని సస్పెండ్ చేయాలి.. లక్ష్మీ ఆత్మహత్యకు కారణమైన మరిపెడ ఎస్సైని సస్పెండ్ చేయాలని దళిత సంఘాల నాయకులు గుండెపుడిలో ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాస్ మరో ఎస్సై ప్రసాద్‌రావుతో కలిసి గుండెపుడికి చేరుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని సీఐ చెప్పడంతో ఆందోళన విరమించారు. అలాగే మమత ఆత్మహత్యకు కారణమైన వారిపై కూడా నిర్భయ కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ విషయమై తొర్రూరు డీఎస్పీతో కూడా మాట్లాడించారు. అనంతరం లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
అదనపు కట్నపు వేధింపులు..మహిళ ఆత్మహత్య
బడంగ్పేట్/అఫ్జల్‌గంజ్ : అదనపు కట్నంతోపాటు సూటిపోటి మాటలతో వేధిస్తుండటంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. అయితే తమ కూతురిది హత్యే అని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. డైనమిక్ కాలనీకి చెందిన కైసర్ మితానియేల్, విజయ దంపతుల కూతురు విన్సీ జ్ఞాన సజనిని(28) కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన జాన్ విక్టర్‌కు ఇచ్చి గత ఏడాది ఆగష్టులో వివాహం జరిపించారు. పెళ్లిఅయిన కొత్తలో చెన్నైలో కొద్దికాలం కాపురం పెట్టారు. అక్కడి నుంచే అదనపు కట్నం వేధింపులు మొదలయ్యాయి. వివాహ సమయంలో మాట్లాడుకున్న కట్న కానుకల కోసం భర్త జాన్ ప్రతిరోజూ విన్సీని వేధించడం మొదలుపెట్టాడు. భర్త జాన్ తల్లితండ్రులు సంధ్య, విజయ్‌లతో పాటు ఆడపడుచు శిరీషాలు కలిసి విన్సీని ఆదనపు కట్నం తేవాలని ఫోన్లో వేధించే వారు. దీంతో మీర్‌పేటలోని తను ఉంటున్న ఇంటిని అమ్మాలని విన్సీ తల్లితండ్రులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే జాన్ విక్టర్ తల్లితండ్రులైన సంద్యా కృపానందంలతో కూతురు అల్లుడిని చెన్నై నుంచి హైదరాబాద్‌కు బుధవారం రప్పించారు. అల్మాస్‌గూడలో మరో ఇల్లు చూసేందుకు వెళ్లారు. ఆ సమయంలో విన్సీ ఇంటిలోనే ఉంది. కట్నం వేధింపులతోపాటు లేనిపోని నిందలు మోపుతుందడంతో తట్టుకోలేని విన్సీ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విన్సీని కట్నంకోసం తన బిడ్డను హింసించి కొట్టి చంపి ఉరివేశారని బాధితురాలి తండ్రి కైజర్ మీర్‌పేట పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టంకై ఉస్మానియాకు తరలించారు. ఇదిలా ఉండగా మృతదేహంపై గాయాలుండటంతో తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. తాము బయటకువెళ్లగానే భర్త విక్టర్ విన్సీపై దాడి చేసి చంపేశారని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. -
పెళ్లి ఇష్టంలేక యువతి ఆత్మహత్య
సాక్షి, పరిగి: తను వద్దంటున్నా పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. శ్రీరంగరాజుపల్లికి చెందిన నాగలూరప్పకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంటర్ వరకు చదువుకున్న పెద్ద కుమార్తె కురుబ అశ్విని (22) హిందూపురం పరిధిలోని తూముకుంట చెక్‌పోస్టు వద్ద గార్మెంట్స్ పరిశ్రమలో పని చేస్తోంది. ఈమెకు తల్లిదండ్రులు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు. తనకు ఇప్పుడే వద్దని, మరికొంతకాలం ఆగాలని అశ్విని తల్లిదండ్రులకు చెప్పింది. అయినప్పటికీ గత ఆదివారం పెళ్లి విషయమై మరోసారి చర్చలు జరిగాయి. దీంతో మనస్తాపం చెందిన అశ్విని సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైకప్పునకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత వచ్చిన చెల్లెలు గమనించి, స్థానికుల సాయంతో మృతదేహాన్ని కిందకు దించారు. ఏఎస్ఐ హబీబుల్లా, కానిస్టేబుల్ రాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
కొడుకుతో కలసి మహిళ ఆత్మహత్య
నవీపేట: ఐదు నెలల కొడుకుతో సహా రైలులోంచి ఓ మహిళ దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శనివారం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ వద్ద గోదావరి బ్రిడ్జికి సమీపంలో జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రి మండల కేంద్రానికి చెందిన హంగిర్గ సునీత(25), భర్త రాజు, కొడుకులు కేశవ్, శివశంభులతో కలసి ఉపాధి నిమిత్తం శనివారం పుణే ప్యాసింజర్‌లో నిజామాబాద్‌కు బయలుదేరారు. రాజు, కేశవ్ నిద్రిస్తున్న సమయంలో సునీత కొడుకు శివశంభుతోపాటు ఒక్కసారిగా రైలులో నుంచి కిందికి దూకింది. దీంతో తోటి ప్రయాణికులు పోలీసులకు సమాచారమందించారు. నవీపేట ఎస్ఐ నరేశ్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదన్నారు. -
కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు
మదనపల్లె క్రైం : ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న డబ్బు చెల్లించాలన్న మేస్త్రీ వేధింపులు తాళలేక భవన నిర్మాణ కార్మికురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బుధవారం పుంగనూరు మండలంలో జరిగింది. మృతురాలి తల్లిదండ్రుల కథనం మేరకు.. మొరవ భీమగానిపల్లెకు చెందిన శ్రీనివాసులు, శేషమ్మ(45) దంపతులు స్థానికంగా భవన నిర్మాణాల ఒప్పందపు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఏడాది క్రితం అదే ఊరికి చెందిన మేస్త్రీ పాపిరెడ్డి వద్ద పుంగనూరులో ఓ భవన నిర్మాణం కోసం కొంత నగదు అడ్వాన్సుగా తీసుకున్నారు. ఆ ఇంటిని సకాలంలో పూర్తి చేయలేకపోయారు. డబ్బు చెల్లించా లని మేస్త్రీ ఒత్తిడి చేశాడు. కర్ణాటకలో కూలి పనులు చేసి డబ్బు చెల్లించాలని శ్రీనివాసులు ఆరు నెలల క్రితం వెళ్లాడు. అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చి వెళుతున్నాడు. దీంతో ఆగ్రహించిన మేస్త్రీ బాకీ తీర్చకుండా బయటకు వెళ్లరాదని పేర్కొంటూ గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. తన భర్తతో సంబంధం లేకుండా తాను డబ్బు చెల్లిస్తానని శేషమ్మ మేస్త్రీ కాళ్లు పట్టుకుని వేడుకుంది. అయినా అతను ప్రతి రోజూ డబ్బు కోసం వేధిస్తుండడంతో మంగళవారం రాత్రి ఆమె పురుగుల మందుతాగింది. స్థానికులు గమనించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం శేషమ్మ మృతిచెందింది. మృతురాలికి మేఘశ్రీ, నాగలక్ష్మి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పుంగనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టీవీ రీచార్జ్ చేయించలేదని మహిళ ఆత్మహత్య
కర్నూలు, ఉయ్యాలవాడ: టీవీకి రీచార్జ్ చేయించలేదని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ నిరంజన్‌రెడ్డి వివరాల మేరకు.. ఇంజేడు గ్రామానికి చెందిన పచ్చర్ల వెంకటలక్ష్మమ్మ(45) టీవీ రీచార్జ్ చేయించాలని తన కుమారుడికి రూ. 300 అందజేసింది. అయితే అతడు రీచార్జ్ చేయించకుండా ఆ డబ్బుతో మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. తీవ్ర మనోవేదనకు గురైన తల్లి క్రిమి సంహారక మందు సేవించి అపస్మారక స్థితికి చేరుకుంది. తెలుసుకున్న భర్త, బంధువులు ఆళ్లగడ్డ వైద్యశాలకు తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలి భర్త అంకాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మహిళ ఆత్మహత్య
కడప అర్బన్ : కడప నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హబీబుల్లా వీధిలో నివసిస్తున్న మంజుదేవి(32) అనే మహిళ గురువారం రాత్రి తాను నివసిస్తున్న ఇంటి పడక గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువుల, పోలీసుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో మధురైలో స్థిరపడ్డ మంజుదేవి తల్లిదండ్రులు అక్కడ స్టేషనరీ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. 12 సంవత్సరాల కిందట కడప నగరం హబీబుల్లావీధికి చెందిన మంగల్‌చంద్ అనే వ్యక్తికి మంజుదేవికి వివాహం జరిగింది. వీరికి సేజల్ (11), అంజలి (9), మనీష్ (7) అనే పిల్లలు ఉన్నారు. మంగల్‌చంద్ ఆర్కేఎం స్ట్రీట్‌లో కాజల్ రెడీమేడ్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. తన తల్లిదండ్రులు, బంధువులతోపాటు ఒకే ఇంటిలో ఉంటున్నాడు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో ఇరువురు కుమార్తెలతో తల్లి మంజుదేవి పడక గదిలో పడుకుంది. కుమారుడు మనీష్‌తోపాటు హాలులో అందరితో కలిసి మంగల్‌చంద్ పడుకున్నాడు. తెల్లవారి చూసేసరికి ఫ్యాన్‌కు మంజుదేవి చీరెతో ఉరేసుకుని వేలాడుతుండడంతో వెంటనే భర్త, బంధువులు రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆమె మృతి చెంది ఉంది. కడప అర్బన్ సీఐ దారెడ్డి భాస్కర్‌రెడ్డి, టుటౌన్ ఎస్ఐ అమర్నాథరెడ్డి తమ సిబ్బందితో కలిసి మృతదేహాన్ని, ఇంటిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. అయితే మృతురాలి తల్లిదండ్రులు మధురై నుంచి కడపకు వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదు చేస్తామని ఎస్ఐ అమర్నాథ్రెడ్డి తెలిపారు. భార్యాభర్త మధ్య ఏర్పడిన మనస్పర్థలే ఈ సంఘటనకు కారణమని భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తెలుస్తాయని భావిస్తున్నారు. -
ప్రియుడు లేని లోకంలో ఉండలేనని..
మంగళూరు (సాక్షి, బెంగళూరు): మనసంతా అతని తలపులే నిండిపోయాయి. కానీ అతను అర్ధంతరంగా తనువు చాలించాడు, అతని తలపుల నుండి బయటికి రాలేక తనూ ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయింది. ఈ ఘటన మంగళూరులోని ఉల్లాళ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు....మంగళూరులోని ఉల్లాళ ప్రాంతానికి చెందిన రుబేనా(17), అఫ్రాజ్(18) స్థానికంగా కాలేజీలో కలిసి చదువుకుంటున్నారు. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే గత ఏడాది నవంబర్ 24న అఫ్రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు, అప్పటి నుంచి ఆమె అతన్ని తలచుకుంటూ మథనపడుతూనే ఉంది. ఈ ఆవేదనతో రుబేనా సోమవారం సాయంత్రం తన ఇంట్లో ఉరి వేసుకొని ప్రాణాలు విడిచింది. -
ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో!
సాక్షి, తాడేపల్లిగూడెం రూరల్: పెళ్లైన నాలుగు నెలలకే ఓ నవవధువు, గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. భర్తంటే ఇష్టంలేకనే చనిపోతున్నట్టు సెల్ఫీ వీడియో తీయడం కలకలం రేగింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆదివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం 30వ వార్డు కొండయ్య చెరువు పరంజ్యోతి స్కూలు సమీపంలోని తిరుమల ఎన్‌క్లేవ్‌లో రైల్వే పార్శిల్ సర్వీస్ ఉద్యోగి ఉద్దండి వీరవెంకటనాగేశ్వరరావు ఉంటున్నారు. ఆయన తన కుమార్తె మౌనిక (24)ను ఆగస్టులో ఒంగోలుకు చెందిన తిరుమలశెట్టి నరేంద్రకు ఇచ్చి పెళ్లిచేశారు. అతను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం మౌనిక మూడవ నెల గర్భిణి. దీంతో నెల క్రితం బెంగళూరు నుంచి పుట్టింటికి వచ్చింది. ఆదివారం ఉదయం తల్లిదండ్రులు రాజమండ్రి వెళ్లిన సమయంలో మౌనిక ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యను ముందుగా సెల్ఫీవీడియో తీసింది. భర్తంటే ఇష్టం లేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో పేర్కొన్నట్టు సమాచారం. దీనిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి చాంబర్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవడం లేదంటూ.. హైదరాబాద్‌కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సాయికుమార్ భార్య, కూకట్పల్లి నివాసి స్వప్న హోంమంత్రికి విన్నవించుకునేందుకు శుక్రవారం సచివాలయానికి వచ్చింది. హోంమంత్రి చాంబర్ ఎదురుగానే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సాయికుమార్‌కు పెళ్లయిన విషయం దాచిపెట్టి మోసం చేయడంతో పాటు, తాజాగా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని స్వప్న ఆరోపించింది. ఈ విషయమై ప్రశ్నించినందుకు తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని వాపోయింది. దీనిపై ఇప్పటికే కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా, విచారించి సాయికుమార్‌ను సస్పెండ్ చేసినట్టు వివరించింది. సస్పెన్షన్ తర్వాత మరింత చిత్రహింసలకు గురిచేస్తున్నాడని వాపోయింది. ఆత్మహత్యకు పాల్పడ్డ స్వప్నను సైఫాబాద్ పోలీసులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్వప్నకు ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
పేగుబంధమే పెను శాపమై..
పాపను పెన్‌గంగలో పడేసి, తనూదూకి.. మహిళ ఆత్మహత్య జైనథ్(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ధోబీ కాలనీకి చెందిన గొంటి ముక్కుల స్వప్న(45) తన కూతురు అతిథి(4)ని అందరూ చూస్తుండగానే భారీ వంతెన నుంచి పెన్‌గంగలోకి పడేసింది. ఆపై తాను కూడా దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయవిదారక ఘటన ఆదివారం జైనథ్ మండలం డొల్లార గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. జైనథ్ మండలం గిమ్మ గ్రామానికి చెందిన స్వప్న, అమరేశ్వర్ వివాహం 15 ఏళ్ల క్రితం జరిగింది. వీరికి ఒక పాప అతిథి జన్మించింది. అమరేశ్వర్ మంచిర్యాల డీఎంహెచ్‌వో కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్నేళ్లుగా స్వప్న మానసిక పరిస్థితి బాగాలేదు. ఆమెకు హైదరాబాద్, మహారాష్ట్రలోని యావత్మాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయంకాలేదు. ఆదివారం భర్త, పాపతో కలసి మంచిర్యాలకు బయలుదేరిన స్వప్న ఇంటినుంచి కొంతదూరం వెళ్లగానే భర్తను మధ్యలో వదిలేసి కనిపించకుండా పోయింది. దివ్యాంగుడైన అమరేశ్వర్ ఆదిలా బాద్‌లోని పోలీస్‌స్టేషన్‌కు వెంటనే వెళ్లి ఫిర్యాదు చేశాడు. భర్త నుంచి తప్పించుకున్న స్వప్న నేరుగా ఆటో ఎక్కి డొల్లార పెన్‌గంగ బ్రిడ్జి వద్ద దిగింది. ఆటో డ్రైవర్ డబ్బులు అడగడంతో.. అతడికి చెవి కమ్మలు తీసి ఇచ్చింది. దీంతో డ్రైవర్, సహ ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలుసుకునేలోగానే తల్లి స్వప్న తన పాప అతిథిని బ్రిడ్జి నుంచి పెన్‌గంగలోకి విసిరేసింది. క్షణాల్లో ఆమె కూడా అందులోనే దూకి ప్రాణాలు విడిచింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు గాలించగా స్వప్న మృతదేహం లభించింది. కాగా, ఎంత గాలించినా పాప ఆచూకీ దొరకలేదు. దీంతో స్వప్న శవాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కి తరలించారు. ఈ మేరకు మృతురాలి మేనమామ దేవ్‌రావ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
ఖమ్మం: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జిల్లాలోని రఘునాథపాలెం మండలంలోని కోయచెలకలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న కె. నవీన(25) అనే వివాహిత మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాయిదాల కోసం కోర్టులో లంచం
న్యాయం చేయాలని ‘ప్రజావాణి’లో మహిళ ఆత్మహత్యాయత్నం దురాజ్‌పల్లి (సూర్యాపేట): కోర్టు వాయిదాలు ఇవ్వకుండా సివిల్ బెంచ్ క్లర్క్ లంచం కోసం వేధిస్తున్నాడని ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో ఇది చోటుచేసుకుంది. మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన కన్నెబోయిన లక్ష్మమ్మ భూ వివాద కేసుకు సంబంధించి హుజూర్నగర్ సివిల్‌కోర్టులో పేచీ నడు స్తోంది. ఈ విషయమై కోర్టులో హాజరుకావాల్సి ఉంది. అయితే సివిల్ బెంచ్ క్లర్క్ గోవర్దన్ వాయిదాలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడు. ఇదేమిటని అడిగితే లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు బాధితురాలు ఆరోపించింది. పైగా తనతో అసభ్య కరంగా ప్రవర్తించాడని పేర్కొంది. రూ.3 వేలు ఇచ్చాక ఒకసారి పేచీ వచ్చిందని, ఆ తర్వాత ఇంకా లంచం ఇవ్వాలని వేధిస్తున్నాడని ఆరోపించింది. జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. కేసులో రాజీకి రావాలని.. లేదంటే చంపుతామని బెదిరిస్తున్నారని వాపోయింది. సోమవారం ప్రజావాణికి లక్ష్మమ్మ వచ్చింది. జేసీ వినతులు స్వీకరిస్తున్న సమయంలో.. ‘నాకు మీరైనా న్యాయం చేయండి’ అంటూ ఆమె వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్ప డింది. తేరుకున్న అధికారులు ఆమెను సముదాయించి పోలీసులకు అప్పగించారు. -
మామతో సంబంధం: కోడలు ఆత్మహత్య
-
మామతో సంబంధం: కోడలు ఆత్మహత్య
ఖమ్మం: కన్నకూతురితో సమానంగా చూసుకోవాల్సిన కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో మామ. ఆ విషయం ఇంట్లో తెలియడంతో ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. బోనకల్లు మండలం ఎర్రవోడుకు చెందిన బానోతు వీరన్న(40) తన కోడలు అనిత(25)తో సంబంధం పెట్టుకున్నాడు. రెండు నెలల క్రితం ఇద్దరూ ఇంట్లో ఉన్న రూ. 2 లక్షల నగదు, బంగారం తీసుకుని ఎవ్వరికి తెలియకుండా చెన్నై వెళ్లిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. అయితే మామకోడలు తిరిగి శుక్రవారం ఖమ్మం వచ్చారు. వారి కోసం పోలీసులు వెతుకుతుండటం, కుటుంబంలో గొడవలతో ఇంటికి వెళితే పట్టుబడతామనే ఆందోళనతో రఘునాథపాలెం మండలం మంచుగొండకు వెళ్లారు. అక్కడ ఇద్దరూ ఎలుకల మందు తాగి చేతులు గాయపరుచుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు గుర్తించి వారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోడలు గుగులోతు అనిత శనివారం మృతిచెందింది. మామ చికిత్స పొందుతున్నాడు. -
బెంగళూరులో ‘అనంత’ యువతి ఆత్మహత్య
భర్తే హత్య చేశాడంటున్న మృతురాలి బంధువులు అనంతపురం: అనంతపురం నగరానికి చెందిన ఓ వివాహిత ఆదివారం బెంగళూరు నగరంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతికి భర్తే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం...అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డు టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగి జి.చంద్రశేఖర్‌రెడ్డి రెండో కుమార్తె రమ్యకృష్ణారెడ్డి (30)ని బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తలుపులకు చెందిన నారాయణరెడ్డికి ఇచ్చి మూడేళ్ల కిందట వివాహం జరిపించారు. రమ్యకృష్ణారెడ్డి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా బెంగళూరులో పనిచేస్తోంది. వివాహం తర్వాత కొద్దికాలం ఆనందంగా గడిచిన వీరి సంసారంలో మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. నారాయణరెడ్డి రోజూ రమ్యకృష్ణారెడ్డిని వేధించేవాడు. ఈ క్రమంలో ఆమె ఏడాదిన్నర క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి పుట్టింటిలోనే ఉంటోంది. నాలుగుల రోజుల క్రితం కుమారుడిని పుట్టింటిలోనే వదిలి భర్త వద్దకు వెళ్లింది. తల్లిదండ్రలు వారించినా తన భర్తతో తానే మాట్లాడుకొని సర్దుబాటు చేసుకుంటామని చెప్పి వెళ్లింది. అయితే ఆదివారం ఉదయం 11.25 గంటల సమయంలో తాను మార్కెట్టు వెళ్తున్నానంటూ.. రమ్యకృష్ణారెడ్డి అనంతపురంలో ఉన్న బంధువులకు మెసేజ్ పంపింది. 12.45 గంటలకు రమ్యకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకుందంటూ.. తల్లిదండ్రులకు సమాచారం అందింది. దీంతో వారు హుటాహుటిన బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. అప్పటికే పోలీస్‌స్టేషన్‌లో ఉన్న అల్లుడు నారాయణరెడ్డిని నిలదీయగా 11.30 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. అయితే 11.25 గంటల సమయంలో మార్కెట్టు వెళ్తున్నట్లు తనకు మేసేజ్ పెట్టిన తమ బిడ్డ ఐదు నిమిషాల్లోనే ఇంట్లో ఎలా ఉరి వేసుకుంటుందని రమకృష్ణారెడ్డి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రమ్యకృష్ణారెడ్డి తండ్రి చంద్రశేఖర్‌రెడ్డి తన కుమార్తె మృతికి అల్లుడే కారణమంటూ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రేమించాలంటూ కానిస్టేబుల్ వేధింపులు
యువతి ఆత్మహత్య యాచారం: ప్రేమించాలంటూ కానిస్టేబుల్ వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధర్మన్నగూడలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ చంద్రకుమార్, కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సోమా నర్సింహ నగరంలోని అంబర్‌పేటలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలున్నారు. అదే గ్రామానికి చెందిన మండల శ్యామల (23)ను ప్రేమించమంటూ నాలుగేళ్ల క్రితం వెంటపడ్డాడు. అతని వేధింపులు భరించలేక అప్పట్లోనే ఆ యువతి తల్లిదండ్రులకు చెప్పడంతో నర్సింహను మందలించి వదిలిపెట్టారు. బుద్ధిమారని ఆ కానిస్టేబుల్ తిరిగి ఫోన్లో శ్యామలను వేధింపులకు గురిచేస్తున్నాడు. సోమవారం ఉదయం శ్యామలకు ఫోన్ చేశాడు. అతను ఏదో మాట్లాడగానే ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్రంగా శరీరం కాలిపోవడంతో గాంధీ అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తన కూతురు శ్యామల ఆత్మహత్యకు సోమా నర్సింహనే కారకుడని మృతురాలి తండ్రి నర్సింహ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రేమికుడి మోసాన్ని తట్టుకోలేక
తిరువొత్తియూరు: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.. కడలూరు జిల్లా చిదంబరం జగన్నాథవీధికి చెందిన జయరాజ్ పెద్ద కుమార్తె జయదేవి (30) ఎంఎస్సీ చదివి చిదంబరంలో ఉన్న వ్యవసాయ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తూ చిదంబరంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు. ఈ సమయంలో ఆ ప్రాంతానికి చెందిన శిఖామణి కుమారుడు కరుణానిధి (34) సివిల్ ఇంజినీర్‌తో జయదేవికి పరిచయం ఏర్పడి ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో కరుణానిధి జయదేవిని వివాహం చేసుకుంటానని చెప్పి పలుమార్లు ఆమెపై లైంగికదాడి చేశాడు. కానీ వివాహం చేసుకోవడానికి తిరస్కరించాడు. దీంతో విరక్తి చెందిన జయదేవి చిదంబరం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈలోపు ప్రేమికుడు మోసం చేయడాన్ని తట్టుకోలేక జయదేవి మంగళవారం ఉదయం ఇంట్లో విషం తాగింది. ఇది చూసిన చెల్లెల్లు, ఇరుగుపొరుగు వారు ఆమెను చిదంబరం రాజాముత్తయ్య ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జయదేవి మృతి చెందింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కరుణానిధిని మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. -
ప్రేమ లేదని..ప్రియుడు రాడని!
ఆత్మహత్య చేసుకున్న యువతి వలేటివారిపాలెం: ప్రేమించినవాడు దక్కడన్న అనుమానంతో యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని శింగమనేని పల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. కసుకుర్తి అనూషా(18) అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమలో ఉన్నారు. అయితే కొంతకాలంగా అతను అనూషాతో సరిగా ఉండక పోవడంతో మనస్తాపానికి గురైంది. తనను వివాహం చేసుకోడనే అనుమానంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న కందుకూరు డీఎస్పీ ప్రకాశరావు మృతదేహాన్ని పరిశీలించి వివరాల సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కందుకూరు రూరల్ ఎస్సై ప్రభాకర్ తెలిపారు. -
మెట్రో స్టేషన్లో ఉరేసుకున్న మహిళ!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో స్టేషన్లో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సుమారు 30 ఏళ్లకుపైగా వయస్సున్న మహిళ కశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్‌లోని స్టోర్‌రూమ్‌లో ఓ పైపుకు ఉరేసుకుంది. ఫ్లాట్‌ఫాం 2లో ఉన్న గదిలో ఉరేసుకున్న ఆమెను గుర్తించిన స్వీపర్ పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ఆమెను వెంటనే ఆస్పత్రికి పోలీసులు తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇంకా మృతురాలి వివరాలు తెలియరాలేదని, సూసైడ్ లేఖ లాంటివి కూడా ఘటనాస్థలంలో దొకరలేదని పోలీసులు తెలిపారు. ఫ్లాట్‌ఫామ్ మీద ఉన్న సీసీటీవీ కెమెరాలలోని దృశ్యాలను సేకరించిన పోలీసులు.. ఈ దృశ్యాల ఆధారంగా ఆ మహిళ స్టోర్‌రూమ్‌లోకి ఎలా వెళ్లింది? అనేది తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో మామూలుగా నిర్మానుష్యంగా ఉండే స్టోర్‌రూమ్ (గోదాం గది)లోకి ఆమె వెళ్లి.. బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని, ఆమె ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
భర్తను జీవచ్ఛవంలా చూడలేక..
ఆ దంపతులది.. రెక్కాడితే డొక్కాడని కుటుంబం..ఫుట్‌పాత్‌పై దుస్తులు విక్రయించుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు..ఒక్కగానొక్క కూతురుతో ఉన్నంతలో హాయిగానే జీవనం సాగిస్తున్నారు..పచ్చని ఆ కుటుంబంపై విధి కన్నెర్రజేసింది..ఉన్నట్టుండి ఇంటిపెద్ద స్పృహతప్పి పడిపోయాడు..తలకు గాయమై కాళ్లు చేతులు చచ్చుబడి పోయాయి. పేద కుటుంబంపై మోయలేని భారం.. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేదు.. భర్త జీవచ్ఛవంలా మారడాన్ని చూసి ఆ ఇల్లాలు తట్టుకోలేకపోయింది. ఆదరించేవారు లేక.. భర్తను అలా చూడలేక.. చావే శరణ్యమనుకుని ఏడాది కూతురుతో సహా అగ్నికి ఆహుతై పోయింది. ఈ విషాదకర ఘటన మోటకొండూరు మండలం నాంచారిపేటలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు(ఎం), మోటకొండూరు:యాదాద్రి భువనగిరి జిల్లాలో మోటకొండూరు మండలం నాంచారిపేట గ్రామానికి చెందిన బచ్చె నవీన్‌కు యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామానికి చెందిన నవ్య(24)తో ఐదేళ్ల క్రితం వివాహం అయింది. వివాహనంతరం హైదరాబాద్‌లోని నాచారంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. పుట్ పాత్ల వద్ద రెడిమేడ్ దుస్తులను అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 18నెలల ఒక పాప మాధురి కలదు. నెల రోజుల క్రితం నవీన్ స్పృహతప్పి పడి పోయాడు. కాళ్లు చెతులు కూడా పడిపోయాయి. తొలుత కూతురుపై పోసి.. ఆపై తానూ.. సమస్యలన్నీ చుట్టుముట్టడంతో నవ్య తట్టుకోలేక పోయింది. కూతురికి పట్టెడన్నం పెట్టలేని దుస్థితి.. భర్తకు చికిత్స చేయించలేక మదనపడిపోయింది. దీంతో చనిపోవాలని నిర్ణయించుకుని తెల్లవారుజామున కూతురుతోటి బాత్రూములోకి వెళ్లింది. తొలుత మాధురిపై కిరోసిన్ పోసి.. ఆపై తానూ పోసుకుని నిప్పంటించుకుంది. మౌన వేదన.. కాసేపటికే మంటలకు తాళలేక భార్య, కుమార్తె కేకలు వినిపిస్తున్నా..అక్కడే ఉండి కాపాడలేని స్థితిలో ఉన్న నవీన్ వేదన కలచివేసింది. వారి కేకలను విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి బాత్ రూము తలుపులు పగులగొట్టేసరికి నవ్య అప్పటికే మృతిచెందింది. కొన ఊపిరితో ఉన్న మాధురిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. సంఘటన స్థలాన్ని ఏసీపీ ఎస్.మోహన్‌రెడ్డి, యాదగిరిగుట్ట సీఐ రఘువీరారెడ్డి, మోటకొండూరు ఎస్ఐ రాజు, ఆర్ఐ సుగుణ, వీఆర్వో పరమేషం సందర్శించారు. శవ పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్ట్‌మార్టమ్ నిమిత్తం మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లికూతురు ఒకే సారి బలవన్మరణానికి పాల్పడటంతో పలువురు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
కొండాపురం : పొదుపు నగదు విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న పాటి వివాదం నేపథ్యంలో మనస్థాపానికి గురై భార్య ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన స్థానిక బీసీ కాలనీలో బుధవారం రాత్రి జరిగింది. ఎస్ఐ రమేష్‌బాబు కథనం మేరకు.. గ్రామానికి చెందిన షేక్ నజీర్‌కు జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాళెంకు చెందిన జరీనా (25)తో 9 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే ఏడాది కాలంగా భార్యాభర్తల మధ్య కలతలు రేగాయి. తరుచూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం జరీనాకు పొదుపు గ్రూపులో రుణం వచ్చింది. ఆ డబ్బుల విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి ఈ గొడవ ఇద్దరి మధ్య తీవ్రస్థాయికి చేరింది. దీంతో మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహన్ని పోస్ట్మాస్టరం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. జరీనా తల్లి మస్తానమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఆరేళ్ల కుమారై సామీర, మూడేళ్ల కుమారుడు బషీర్ ఉన్నారు. -
అత్తింటి వేధింపులు.. మహిళ ఆత్మహత్య
కేతెపల్లి: అత్తింటి వేధింపులు తాళలేక నవవధువు బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేతెపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కళ్యాణి(21)కి ఏడాది కిందట మిర్యాలగూడకు చెందిన యువకుడితో వివాహమైంది. అప్పటి నుంచి అదనపు కట్నం తేవాలని అత్తింటి వారు ఆమెను వేధిస్తుండటంతో.. కొన్ని రోజుల క్రితం తల్లిగారింటికి వచ్చిన కళ్యాణి శనివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ అంశంపై ఇంతకు ముందే పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి లాభం లేకపోయిందని.. తమ కూతురు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అక్క ఒత్తిడితో చెల్లెలు మృతి
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాత నోట్ల రద్దు నిర్ణయంతో పాతబస్తీలో ఓ మహిళ ప్రాణం తీసింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించే విషయంలో అక్క, చెల్లిల్ల మధ్య చెలరేగిన వివాదంతో చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే...టప్పాచబుత్ర ప్రాంతానికి చెందిన కమ్రాన్ జా(20) తన సోదరి అఫ్సాన్జా నుంచి 50 వేల రూపాయలు అప్పుగా తీసుకుంది. ఈ నెల 7వ తేదీన రూ.30 వేల అప్పు తీర్చింది. మిగతా రూ.20 వేల అప్పును 14 వ తేదీన తీర్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కేంద్రం పాత నోట్లను రద్దు చేయడంతో అఫ్సాన్జా పాత నోట్లను తీసుకునేందుకు అంగీకరించలేదు. తనకు కొత్త నోట్లు ఇస్తేనే కుదురుతుందని పట్టుబట్టింది. ఈ మేరకు కమ్రాన్జా గత మూడు రోజులుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతోంది. అవి దొరక్కపోవటంతో తీవ్ర వేదనకు గురైన ఆమె శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత గమనించిన ఆమె కుటుంబసభ్యులు కమ్రాన్ జాను వెంటనే ఆస్పత్రికి తరలించాడు. ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని చెప్పకుండా..గుండెపోటు వచ్చిందని కుటుంబసభ్యులు వైద్యులకు చెప్పారు. దీంతో వైద్యులు ఆమెకు గుండె ఆపరేషన్ చేశారు. వైద్యం చేసిన కాసేపటికే కమ్రాన్ జా మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళనకు దిగారు. ఆమెకు ఏడాదిలోపు వయస్సున్న కుమారుడు ఉన్నాడు. కమ్రాన్ జా మృతితో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. -
అక్క ఒత్తిడితో చెల్లెలు మృతి
-
తమ్ముడు ‘క్యూ’లో.. అక్క ఆత్మహత్య!
ముజఫర్‌నగర్: తను అనారోగ్యంతో ఉంది. ఇంతలోనే పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఉరుములేని పిడుగులా పడింది. నగదు మార్చుకోవడానికి తమ్ముడు బ్యాంకు ముందు క్యూలో నిలుచున్నాడు. అయినా కొత్త కరెన్సీ దొరకలేదు. దీంతో తన చికిత్సకు తగినంత కొత్త కరెన్సీ దొరకదేమోనన్న బెంగతో ఓ యువతి (20) బలవన్మరణానికి పాల్పడింది. ఇంటి పైకప్పుకు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాలోని ముజఫర్‌నగర్‌లో జరిగింది. తమ ఇంట్లో చెల్లుబాటు అయ్యే కరెన్సీ లేదని మనస్తాపం చెందిన షబానా (20) ఆదివారం ఉరేసుకొని చనిపోయింది. ఆమె తమ్ముడు మొబిన్ బ్యాంకు వద్దకు నగదు మార్చుకోవడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. రోజు మాదిరిగానే బ్యాంకు వద్ద క్యూలో నిలబడినా మొబిన్‌కు కొత్త కరెన్సీ దొరకలేదు. ఇంటికి వచ్చి చూస్తే అక్క ఆత్మహత్య చేసుకొని కనిపించింది. గతకొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న షబానా ఇక తనకు చికిత్సకు చెల్లుబాటు అయ్యే కరెన్సీ దొరకదన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నదని కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. -
పెద్దనోట్ల చిచ్చు
• ఉరేసుకొని మహిళ ఆత్మహత్య • పెద్ద నోట్లు చెల్లవని ఆత్మహత్య చేసుకుందన్న కుమారుడు • డబ్బుల కోసం హత్య చేశారంటున్న మృతురాలి కూతుళ్లు • 12 ఎకరాలు అమ్మగా కుటుంబానికి వచ్చిన రూ.54 లక్షలు • ఇంతలోనే బలవన్మరణానికి పాల్పడిన తల్లి • కుటుంబ కలహాల వల్లే..: కలెక్టర్ • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు సాక్షి, మహబూబాబాద్: ఆ కుటుంబం తమకున్న 12 ఎకరాల భూమిని అమ్ముకుంది.. రూ.54 లక్షలు వచ్చాయి.. ఈ డబ్బు ఎవరి ఖాతాలో వేయాలన్నదానిపై తల్లీ, కొడుకుల మధ్య గొడవ మొదలైంది.. ఇంతలో ఆ ఇంట్లో ‘పెద్ద నోట్ల’ రద్దుతో పిడుగు పడింది.. ఏమైందో ఏమోగానీ రాత్రికిరాత్రే తల్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భూమి అమ్మగా వచ్చిన డబ్బులు ఇక చెల్లవన్న ఆందోళనతోనే తన తల్లి చనిపోరుుందని కొడుకు చెబుతుండగా.. సొమ్ము కోసం అతడే చంపేశాడని ఆమె కూతుళ్లు అంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని శనిగపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డబ్బులపై గొడవ శనిగపురానికి చెందిన కందుకూరి ఉపేంద్ర చారి, వినోద(55) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యారుు. వీరికి ముడుపుగల్లు గ్రామంలో 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని ఈ ఏడాది జనవరిలో విక్రరుుంచగా రూ.56 లక్షలు వచ్చారుు. ఆ తర్వాత ఉపేంద్రాచారి అనారోగ్యానికి గురికావడంతో వైద్యం కోసం కొంత డబ్బును ఖర్చు చేశారు. మిగిలిన రూ.45.5 లక్షలతో దగ్గర్లో ఎక్కడైనా భూమి కొనుగోలు చేద్దామని డబ్బులను ఇంట్లోనే దాచుకున్నారు. ఈ డబ్బు విషయంపై కుమారుడు శ్రీనివాస్‌కు, ఉపేంద్రచారి, వినోద మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నారుు. భూమి డబ్బులను తమ పేరిట బ్యాంకులో ఉన్న జారుుంట్ అకౌంట్లో జమచేద్దామని ఉపేంద్రచారి, వినోద అంటుండగా.. తన అకౌంట్లోనే జమ చేసుకుంటానని కొడుకు గొడవ పడుతున్నాడు. ఈ డబ్బుల విషయమై వినోద తన కూతుళ్లతో ఫోన్లో మాట్లాడుతుండేది. పెద్దనోట్ల రద్దుతో ముదిరిన లొల్లి కేంద్రం రూ.1,000, రూ.500 నోట్లు రద్దు చేయడంతో ఉపేంద్రచారి కుటుంబంలో గొడవలు మరింత పెరిగారుు. భూమి అమ్మగానే డబ్బుల్ని బ్యాంక్‌లో జమ చేస్తే బాగుండు కదా అంటూ గొడవపడ్డారు. ఆ డబ్బులో కొంత కూతుళ్లకు కూడా ఇవ్వాలని వినోద పట్టు బట్టింది. వాళ్లకెందుకని శ్రీనివాస్.. తల్లి వినోదను నిలదీశాడు. ఈ గొడవలోనే ఆమెను బుధవారం రాత్రి ఇంట్లోంచి బయటకు నెట్టేశాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె రాత్రి ఉరేసుకొని చనిపోరుుంది. తాము ఒంటిగంట సమయంలో అలికిడికి లేచిచూసే సరికే చనిపోరుు కనిపించిందని శ్రీనివాస్ చెప్పాడు. గురువారం ఉదయం వినోద కూతుళ్లు వచ్చి తల్లిని శ్రీనివాసే హత్య చేశాడని ఆరోపించారు. పోలీసులు వినోద మృతదేహాన్ని మహబూబాబాద్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతురాలు సోదరుడు ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ రూరల్ పోలీసులు అనుమానాస్పదం మృతిగా కేసు నమోదు చేశారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న భర్త వినోద భర్త ఉపేంద్రకు ఏడాదిన్నర క్రితం బ్రెరుున్ స్ట్రోక్ వచ్చింది. ఆరు నెలల క్రితం రెండు కిడ్నీలు ఫెరుుల్ అయ్యారుు. ప్రస్తుతం డయాలసిస్ కొనసాగుతుంది. కుమారుడు శ్రీనివాస్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మధ్యవర్తి వద్దకు డబ్బులు తల్లి మృతిపై కుమారుడు శ్రీనివాస్, కూతుళ్లు శశికళ, మాధవి గొడవడ్డారు. డబ్బుల కోసమే తల్లిని శ్రీనివాస్, ఆయన భార్య హత్య చేశారని శశికళ, మాధవి పోలీసులకు చెప్పారు. దీంతో పెద్దమనుషుల పంచాయతీ తర్వాత బీరువా తాళాన్ని తెరిచి ఓ మధ్యవర్తి వద్ద డబ్బు ఉంచారు. ఇది హత్యా..? ఆత్మహత్యా..? అన్న అంశంపై పోస్ట్‌మార్టం రిపోర్ట్ తర్వాతే తేలుతుందని పోలీసులు అంటున్నారు. డబ్బులపై చర్చించుకున్నాం ఇంట్లో ఉన్న డబ్బులు చెల్లవనే విషయంపై అమ్మ, నేను, నాన్న చర్చించుకున్నాం. ఆ డబ్బులను ఎలా బ్యాంక్‌లో వేయాలని మాట్లాడుకున్నాం. కొద్దికొద్దిగా బ్యాంకులో వేద్దాం అని రాత్రి నిర్ణరుుంచుకున్నం. ఇంతలోనే అర్ధరాత్రి అమ్మ ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. - శ్రీనివాస్, కుమారుడు కుటుంబ కలహాల వల్లే.. వినోద కుటుంబ కలహాలతోనే మృతి చెందింది. కరెన్సీ మార్పిడి గురించి కాదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. - ప్రీతిమీనా, జిల్లా కలెక్టర్, మహబూబాబాద్ -
పెద్ద నోట్లు పనికిరావన్న భయంతో ఆత్మహత్య
-
పెద్ద నోట్లు పనికిరావన్న భయంతో ఆత్మహత్య
హైదరాబాద్: పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సామాన్యుల పాలిట శరాఘాతంగా మారింది. తమ దగ్గరనున్న పెద్ద నోట్లు చెల్లవన్న భయంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు దాచుకున్న సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు మహబూబాబాద్ జిల్లాలో ఓ ఇల్లాలి ప్రాణం తీసింది. తమ దగ్గర ఉన్న రూ. 54 లక్షల రూపాయలు చెల్లవన్న భయంతో కందుకూరి వినోద(55) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శెనగపురంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కందుకూరి వినోద(55) భర్తకు కొంత కాలం క్రితం పక్షవాతం వచ్చింది. దీంతో తమకు ఉన్న పన్నెండెకరాల వ్యవసాయ భూమిని రూ. 56.40 లక్షలకు విక్రయించి వచ్చిన డబ్బుతో భర్తకు వైద్యం చేయించింది. వైద్యానికి రెండు లక్షలు ఖర్చుకాగా మిగిలిన డబ్బుతో మరో ప్రాంతంలో భూమి కొనడానికి యత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్లు చెల్లవని.. అవి చిత్తు కాగితాలతో సమానమని ప్రకటించడంతో.. భయాందోళనలకు గురైన వినోద విషయం భర్తకు, కుమారుడికి చెప్పింది. దీంతో బుధవారం రాత్రి ఇంట్లో గొడవ జరిగింది. చెప్పిన వినకుండా భూమి మొత్తం విక్రయించడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని వారు మందలించారు. దీంతో తన వద్ద ఉన్న 54 లక్షలు చెల్లని నోట్లుగా మిగిలిపోతాయని భావించిన వినోద.. కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇళ్లల్లో కొద్దోగొప్పో పెద్ద నోట్లు దాచుకున్న సామాన్యులు ప్రభుత్వం నిర్ణయంతో భయాందోళన చెందుతున్నారు. శుభకార్యాలు పెట్టుకున్న వారు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ఓ వ్యక్తి తన కొడుకు పెళ్లి కోసం బంగారం మీద ఈ నెల 6న బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. పెద్ద నోట్లను రద్దు చేయడంతో అతడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. బ్యాంకులు రూ. 4 వేలకు మించి ఇవ్వబోమని చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాడు. -
వృద్ధురాలు ఆత్మహత్య
నాయుడుపేటటౌన్ : స్థానికులు చూస్తుండగానే ఓ వృద్ధురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని పొగగొట్టం కాలనీలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. దొరవారిసత్రం మండలం తల్లంపాడు పంచాయతీ ముత్తారాశిపాళెంకు చెందిన చాపల గంగమ్మ (85) పొగగొట్టం కాలనీలో ఉన్న కోడలుకు చెందిన గుడిసెలో కొద్ది రోజులుగా నివాసం ఉంటుంది. రెండు రోజుల క్రితం ముత్తారాశిపాళెంకు వెళ్లి పింఛన్ కూడా తెచ్చుకుంది. ఆమె మానసిక స్థితి సరిగాలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు తెలుస్తోంది. హఠాత్పరిణామానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అప్పటికే వృద్ధురాలు చాలావరకు కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత ఆత్మహత్య
చెరుకూరు(రొద్దం) : కడుపునొప్పి తాళలేక వివాహిత శివమ్మ(30) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మండలంలోని చెరుకూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. శివమ్మ గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడేది. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు రెండేళ్ల క్రితం అనిల్ అనే వ్యక్తితో వివాహం అయింది. వారికి 11 నెలల చిన్నారి ఉన్నాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ మున్నీర్హమ్మద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
వివాహిత బలవన్మరణం
- భర్తపై అనుమానంతో ఉరేసుకుని.. నెల్లూరు (క్రైమ్) : పెళ్లయి మూడేళ్లు కావస్తోంది. పచ్చని వారి సంసారంలో అనుమానం పెనుభూతంగా మారింది. భర్త వేరే మహిళతో చాటింగ్ చేస్తోన్నాడని, ఆమెతో వివాహతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ వివాహిత ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కర్నాలవీధిలో శనివారం చోటు చేసుకుంది. పెద్దబజారుకు చెందిన భవాని (32)కి కర్నాలవీధికి చెందిన మట్టుమడుగు వసంతకుమార్‌తో మూడేళ్ల కిందట వివాహమైంది. వారికి ఓ బాబు ఉన్నాడు. వసంతకుమార్ కృష్ణపట్నం పోర్టులో సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా వసంతకుమార్ ఇంటికి వచ్చిన తర్వాత భార్యను పట్టించుకోకుండా మహిళలతో వాట్సాప్, ఫేస్బుక్ల్ చాటింగ్ చేస్తున్నాడు. ఈ విషయమై పలు దఫాలు దంపతుల నడుమ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో అతను వేరే మహిళలతో వివాహేతర సంబదం ఏర్పరచుకున్నాడని భవాని అనుమానం పెంచుకుంది. శుక్రవారం రాత్రి ఈ విషయమై దంపతుల నడుమ ఘర్షణ జరిగింది. అయినా వసంతకుమార్ పట్టించుకోలేదు. శనివారం వసంతకుమార్ ఉదయం 9 గంటలకు ఉద్యోగానికి బయలుదేరి వెళ్లాడు. ఆమె అత్త పక్కింటికి వెళ్లింది. ఈ సమయంలో భవాని భర్తకు ఫోన్ చేసి పద్ధతి మార్చుకోకపోతే చచ్చిపోతానని బెదిరించింది. అతను పట్టించుకోకుండా ఫోన్ పెట్టేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే భార్య ఏం చేసుకుంటుందోనని భావించిన వసంతకుమార్ పెద్దబజారులోని తన బావమరిది జయకృష్ణకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూడాలని చెప్పాడు. దీంతో జయకృష్ణ ఇంటికి వెళ్లిచూడగా భవాని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంది. వసంతకుమార్ ఇంటికి వచ్చి భార్య మృతదేహం చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. బాధిత కుటుంబ సభ్యులు ఒకటో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ ఎస్కే అబ్దుల్ కరీం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆమె మృతదేహానికి తహశీల్దార్ శవపంచనామా నిర్వహించారు. మృతురాలి అన్న జయకృష్ణ ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డీఎస్ఆర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇన్స్పెక్టర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత ఆత్మహత్య
కావలి అర్బన్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన స్థానిక వైకుంఠపురం పెక్కుల ఫ్యాక్టరీ రోడ్డులో బుధవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పెంకుల ఫ్యాక్టరీ గిరిజనకాలనీ సమీపంలోని పోలేరమ్మ గుడి వద్ద యనమల నరసింహం, అనూష (23) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పిల్లలను ప్రకాశం జిల్లా పెద్దపవనిలో జరుగుతున్న బంధువుల వివాహానికి నరసింహం తల్లిదండ్రులతో పంపించారు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. నరసింహం మార్కెట్‌కు వెళ్లి చేపలు తెచ్చి భార్యకు ఇచ్చి మళ్లీ బజారుకు వెళ్లాడు. ఇంతలో ఆమె ఇంటి తలుపునకు లోపల గడి పెట్టుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఒళ్లు కాలుతున్న సమయంలో ఆమె పెద్ద పెద్దగా కేకలు వేయడంతో స్థానికులందరూ తలుపు పగలగొట్టి తీసి చూడగా తీవ్రంగా కాలిపోయి అక్కడిక్కడే మృతి చెంది. ఈ విషయాన్ని స్థానికులు ఆమె భర్తకు తెలియజేయడంతో ఇంటికి చేరుకున్నాడు. బంధువులు, కుటుంబ సభ్యులు, పిల్లలు ఇంటికి చేరుకుని కన్నీరు మున్నీరుగా రోదించారు. సమాచారం అందుకున్న రెండో పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు కిందపడి వివాహిత ఆత్మహత్య
కావలిఅర్బన్ : కుటుంబ కలహాలతో ఓ వివాహిత రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన స్థానిక ముసునూరు సమీపంలో రైలు పట్టాలపై గురువారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. జలదంకికి చెందిన ప్రభాకర్, పి.శారద (35) దంపతులు కొంతకాలం నుంచి స్థానిక ముసునూరు రామ్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. పిల్లలు లేని కారణంగా ఓ బాలికను పెంచుకుంటున్నారు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్థాపానికి గురైన ఆమె పక్కనే ఉన్న రైలుపట్టాల వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహానికి స్థానిక ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఆస్పత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత ఆత్మహత్య, కావలి -
కిరోసిన్ పోసుకునీ సూపర్‌మార్కెట్‌కు దూసుకెళ్ళిన మహిళ
- తన కూతురి ఆచూకీ తెలపాలనీ ఆందోళన - అడ్డుకున్న పోలీసులు - ఉద్రిక్తత తిరువళ్లూరు : తిరువళ్లూరులోనీ ప్రవేటు సూపర్మార్కెట్లో పని చేస్తూ గత 15న అదృశ్యమైన యువతి ఆచూకీ తెలపాలనీ కోరుతూ బందువులు చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. తన కుమార్తేను సూపర్ మార్కెట్ యజమానీ బందువులే కిడ్నాప్ చేసారనీ ఆరోపించిన మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకునీ సూపర్ మార్కెట్ లోపలికి దూసుకెళ్ళడంతో ఒక్క సారీగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తిరువళ్లూరు జిల్లా వేపంబట్టు ప్రాంతానీకి చెందిన మునస్వామీ కుమార్తే సంధ్య. పట్టణంలోనీ అలీస్ సూపర్మార్కెట్లో సేల్స్ రంగంలో పని చేస్తూవుంది. ఈ నేపద్యంలో గత 15న ఇంటి నుండి పనికి వెళ్ళిన సంధ్య అప్పటి నుండి అదృశ్యమైయింది. ఈ సంగటనపై సంధ్య తల్లి అరసు సెవ్వాపేట పోలీసులకు పిర్యాదు చేసింది. అయితే పిర్యాదు ఇచ్చి దాదాపు వారం రోజులు దాటుతున్న యువతి ఆచూకీనీ పోలీసులు కనిపెట్టకపోవడంతో ఆగ్రహించిన బంధువులు అలీస్ సూపర్ మార్కెట్ వద్ద ఆందోనకు దిగారు. సూపర్ మార్కెట్ నిర్వాహకుడి బందువుల అరుణ్ తన కుమార్తేను అపహరించాడనీ ఆరోపించిన అమే తల్లి అరస్ ఒంటిపై కిరోసిన్ పోసుకునీ లోపలికి పరుగులు పెట్టింది. దీంతో ఒక్క సారీగా అక్కడ అరుపులు కేకలు వినిపించింది. తన కుమార్తే అచూకీ తెలిపే వరకు తాము ఆందోళననూ విరమించేదీ లేదనీ తేల్చిచెప్పడంతో పోలీసులు వారినీ సముదాయించే ప్రయత్నం చేసారు. ఈ దశలో పోలీసులకు యువతి బందువుల మద్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం నెలకొంది. ఇక లాభం లేదనకున్న పోలీసులు సూపర్‌మార్కెట్ నిర్వాహకులను పిలిపించి విచారణ చేపట్టారు. విచారణలో సూపర్మార్కెట్లో పని చేసే అరుణ్ అనే యువకుడితో వెళ్ళిపోయినట్టు నిర్దారించారు. రెండు రోజుల్లో యువతినీ అప్పగిస్తామనీ హమీ ఇవ్వడంతో సూపర్‌మార్కెట్ నిర్వాహులు హమీ ఇవ్వడంతో వారు శాతించారు. ఇది ఇలా వుండగా పరారైన సంధ్యకు గత రెండు నెలల క్రితం వేరే యువకుడితో నిశ్చితార్ధం అయినట్టు తెలిసింది. -
కొబ్బరిపాకలో దారుణం
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొబ్బరిపాకలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. దీంతో భర్తే చంపాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. దాంతో భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం రేగులపల్లెలో గురువారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కోనేటి జయలక్ష్మి(25) అనే మహిళ కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. మొదట కొడుకు పై కిరోసిన్ పోసి నిప్పంటించి.. తర్వాత తను కూడా ఆత్మహత్మకు పాల్పడింది. తీవ్రగాయాలతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్ధిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పచ్చని కాపురంలో మద్యం చిచ్చు
భర్త తాగుడు మానలేదని భార్య ఆత్మహత్య పుట్లూరు : ఓ పచ్చని సంసారంలో మద్యం మహమ్మారి చిచ్చుపెట్టింది. తన భర్త మద్యం తాగడం మానడం లేదన్న బెంగతో ఓ మహిళ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పుట్లూరు మండలం గొల్లపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గొల్లపల్లికి చెందిన గురుప్రసాద్, వెంకటరమణమ్మ(32)కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరి కాపురం సజావుగా సాగుతున్న తరుణంలో రెండేళ్ల క్రితం నుంచి గురుప్రసాద్ మద్యానికి బానిసయ్యాడు. వెంకటరమణమ్మ భర్తకు ఎన్నిసార్లు చెప్పిచూసినా వినలేదు. చివరికి వారి కుటుంబంలో కలతలు రేగాయి. ఇదే విషయమై వారిద్దరి మధ్య ఎన్నోసార్లు గొడవ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి భర్త మద్యం తాగి రావడంతో వెంకటరమణమ్మ అతడ్ని మందలించింది. ఎన్నిసార్లు చెప్పినా మద్యం సేవించడం మానలేదన్న మనస్థాపంతో మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పపత్రికి తరలించినట్లు ఎస్ఐ ప్రదీప్‌కుమార్ తెలిపారు. వెంకటరమణమ్మకు గురుహేమంత్ (4), గురునిషితా (3) అనే కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య
పుంగనూరు: భర్త మద్యానికి బానిసవడంతో మనస్తాపానికి గురైన మహిళ కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో సోమవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న పార్వతమ్మ(26) భర్త చెడు వ్యసనాలకు బానిసై ఇంట్లో ఉన్న వస్తువులను అమ్మేస్తుండటంతో.. మనస్తాపానికి గురై మూడేళ్ల కొడుకు పవన్‌కుమార్‌తో కలిసి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పవన్ కుమార్ మృతదేహం లభించగా, పార్వతమ్మ మృతదేహం కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
మాజీ ప్రియుడు భర్తకు ఫొటోలు పంపడంతో!
థానె (మహారాష్ట్ర): తనతో దిగిన ఫొటోలను ప్రియుడు భర్తకు పంపడంతో ఓ 26 ఏళ్ల నవవధువు అఘాయిత్యానికి ఒడిగట్టింది. విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. థానె జిల్లాలోని ఖినావాలి ప్రాంతంలో ఆదివారం (19న) ఈ ఘటన జరిగింది. 26 ఏళ్ల వృశాలి భాగ్ రావుకు ఇటీవల పెళ్లయింది. ఈ నేపథ్యంలో వృశాలి ప్రియుడు రజాక్ పీర్ మహమ్మద్ తనతో ఆమె దిగిన ఫొటోలను భర్తకు పంపించాడు. ఈ ఫొటోలు చూసి ఆగ్రహించిన భర్త వృశాలితో గొడవపడ్డాడు. వృశాలిని షాహాపూర్ తాలుకాలోని ఆమె తల్లి ఇంటి వద్ద వదిలేశాడు. దీంతో మనస్తాపం చెందిన వృశాలి విషం తాగి తనువు చాలించింది. వృశాలి నిందితుడు రజాక్ తో రెండేళ్లపాటు ప్రేమవ్యవహారాన్ని నడిపింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ 29న ఆమెకు ముర్ బాద్ కు చెందిన చేతన్ తో పెళ్లయింది. వీరి పెళ్లిని కంటగింపుగా భావించిన రజాక్ తాను వృశాలితో సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలను భర్త చేతన్ వాట్సాప్ కు పంపించాడని, ఈ క్రమంలో జరిగిన గొడవలతో కలత చెందిన వృశాలి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసి.. నిందితుడు రజాక్ ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. -
రైలు ఇంజన్ టాప్‌పైకి మహిళ ఎక్కి..
హొషంగాబాద్: మధ్యప్రదేశ్‌లో ఓ గుర్తు తెలియని మహిళ రైలు ఇంజిన్‌పైకి ఎక్కి హై టెన్షన్ వైర్ పట్టుకుని ఆత్మహత్య చేసుకుంది. తీవ్రగాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మరణించింది. సోమవారం హొషంగాబాద్ సమీపంలో ఆ మహిళ రైలు పట్టాలపై నడుచుకుంటూ అటుగా వెళ్తున్న గూడ్సు రైలుకు అడ్డంగా వెళ్లింది. గూడ్సు రైలు డ్రైవర్ ఆమెను గమనించి బ్రేకులు వేసి ఆపేశాడు. రైలు ఆగగానే ఆమె ఇంజిన్ టాప్‌పైకి ఎక్కి చేతులతో కరెంట్ వైరును పట్టుకుంది. మృతురాలి వివరాలు, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అన్న విషయాలను తెలుసుకోవాల్సి ఉందని రైల్వే పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ఆడపిల్లలు పుట్టారని ఆత్మహత్య
కర్నూలు: తనకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని మనస్తానికిగురైన శ్రీదేవి అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండ్లెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, పోలీసుల తెలిపిన వివరాల మేరకు...ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన శ్రీదేవికి మండ్లెం గ్రామానికి చెందిన శ్రీనివాసులుతో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వివాహమైన 11 ఏళ్ల వరకు పిల్లలు కాకపోవటంతో నిత్యం ఆమె మదనపడిపోయేది. అయితే ఐదేళ్ల క్రితం సుమలత అనే ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. తరువాత నాలుగు నెలల క్రితం ఆమె మరో ఆడబిడ్డ పుట్టింది. ఇద్దరూ ఆడపిల్లలు కావటంతో ఆమె మనస్తాపంతో తాను చనిపోతానని, తనకు మనసు బాగోలేదని తీవ్ర మనోవేదన కు గురయ్యేదని భర్త శ్రీనివాసులు తెలిపారు. దీనికితోడు నెలరోజుల క్రితం ఆమె తల్లి మృతి చెందటంతో మరింత మనోవేదన గురయ్యేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారిన తర్వాత ఐదు గంటల ప్రాంతంలో మిద్దెపై నుంచి కిందికి వచ్చి.. బాత్రూంలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పుపెట్టుకుంది. మంటలు రావటంతో మిద్దెపై నిద్రిస్తున్న శ్రీనివాసులు ఇంట్లోకి వచ్చి చూశాడు. మంటల్లో కాలిపోతున్న భార్యను కాపాడుకునేందుకు గట్టిగా కేకలు వేయటంతో చుట్టుపక్కలవాళ్లు వచ్చారు. మంటలు అర్పగా..అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోయిన శ్రీదేవి అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న నందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్సై టి.సుబ్రమణ్యం సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృతురాలి అన్న బాలస్వామి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
హుస్సేన్‌సాగర్‌లోకి దూకి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో శ్వేత అనే మహిళ హుస్సేన్‌సాగర్‌లోకి దూకింది. గమనించిన లేక్ పోలీసులు ఆమెను రక్షించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అత్త సెల్‌ఫోన్ లాక్కొందని..
బలియా: అత్త సెల్‌ఫోన్ లాక్కునందుకు ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లా రెవతి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఆత్మహత్యకు పాల్పడిన యువతి భర్త గుజరాత్లో పనిచేస్తున్నాడు. ఆమె అత్తవారి ఇంట్లో ఉండేది. గత గురువారం ఇల్లు విడిచి వెళ్లిన ఆ మహిళ మరుసటి రోజు తిరిగి వచ్చింది. ఆమెకు అదే గ్రామంలోని ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఉందని అత్త అనుమానించింది. ఆ మహిళ ఇంటికి రాగానే అత్త సెల్‌ఫోన్ లాక్కోని మందలించింది. మనస్తాపం చెందిన ఆ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
కుటుంబకలహాలతో వివాహిత ఆత్మహత్య
వినుకొండ(గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని కీర్తి థియేటర్ సమీపంలో రాజేశ్వరి(18) అనే వివాహిత శనివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాజేశ్వరికి నాలుగు నెలల క్రితమే వివాహమైంది. పెళ్లైనప్పటి నుంచి అత్తింటి వేధింపులు ఎక్కువ కావడంతో మనస్థాపం చెందిన రాజేశ్వరి నాలుగు రోజులక్రితం పుట్టింటికి వచ్చింది. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. -
కుల పెద్దల తీర్పుతో వివాహిత ఆత్మహత్య
భోపాల్: వివాహేతర సంబంధం అంటగట్టారని మనోవేదనకు గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని టికామ్ గఢ్ లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... టికామ్ గఢ్ జిల్లాలోని బజారువా ఖారి గ్రామంలో ఓ వివాహిత(36), భర్త రాకేష్, తన నలుగురు పిల్లలతో కలిసి ఉంటోంది. మూడు రోజుల కిందట భర్త రాకేష్ స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటుండగా అతడి భార్య ఓ దళితవ్యక్తితో సన్నిహితంగా గడిపిందని వారి కులపెద్దలు ఆరోపించారు. ఈ విషయాన్ని కుల పెద్దల పంచాయతీ దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీ పెద్దలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. భర్తతో కలిసి పనిచేసే ఓ దళిత యువకుడితో ఆమె శారీరక సంబంధాలు పెట్టుకుందని కొందరు వ్యక్తులు సాక్ష్యం చెప్పారు. దళితుడితో సంబంధాలు పెట్టుకున్నావని ఆమెను కొందరు పెద్దలు మందలించారు. రూ.5 వేలు జరిమానా కట్టాలని, ఆ వివాహిత గంగా నదిలో స్నానం ఆచరించాలని, 30 మందికి పైగా మందు పార్టీ ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. ఇంతటితో ఆగకుండా సమీపంలోని గ్రామంలో ఉండే శివాలయం వరకు పొర్లుదండాలు పెడుతూ వెళితేనే ఆమె తప్పును క్షమిస్తామని పెద్దలు తీర్పిచ్చారు. గ్రామంలో జరిగిన పెళ్లికి తమను ఎందుకు ఆహ్వానించలేదని అడిగిన నేపథ్యంలో ఆ వివాహిత కుటుంబంపై ఆ కుల పెద్దలు ఇలాంటి దారుణ తీర్పును ఇచ్చారు. -
భర్తను కోర్టుకు లాగారని భార్య ఆత్మహత్య
మైసూరులోని కోర్టు ఆవరణంలో ఘటన మైసూరు : ఓ వ్యక్తి నకిలీ ప్రొనోట్ సృష్టించి తన భర్తపై కేసు బనాయించి కుటుంబాన్ని కోర్టుకు లాగారని ఆరోపిస్తూ ఓ వివాహిత కోర్టు ఆవరణంలోనే డెత్‌నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. మైసూరులో బుధవారం ఈ ఘటన కలకలం సృష్టించింది. మూసూరులోని హణసూరు తాలూకా బూచనహళ్లిలో బలరామేగౌడ, మంగళమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. బలరామేగౌడ తన వద్ద రూ.75 వేలు అప్పుగా తీసుకున్నారని అదే గ్రామానికి చెందిన తిమ్మేగౌడ హణసూరు తాలూకా కోర్టులో కేసు వేశారు. బలరామేగౌడ కేసు విచారణకు గైర్హాజరు కావడంతో అరెస్ట్ వారెంట్ జారీఅయింది. అయితే రెండేళ్లుగా బలరామేగౌడ, భార్య మంగళమ్మ ఊరు వదిలి వెళ్లిపోయారు. కాగా కోర్టు నుంచి వారెంట్ జారీ కావడంతో కోర్టు ఖర్చుల కోసమంటూ రూ.10 వడ్డీతో మరో రూ.30 వేల అప్పు చేయాల్సి వచ్చింది. కోర్టులో కేసు నడుస్తుండడం, ఆ కేసు పరిష్కారం కోసం మళ్లీ అప్పులు చేయాల్సి రావడంతో మనోవేదనకు గురైన మంగళమ్మ బుధవారం కోర్టు విచారణకు హజరయ్యే సమయంలో నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసిపెట్టి విషం తాగింది. స్పృహకోల్పోయిన ఆమెను నగరంలోని కేఆర్.ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. అప్పు చేయకపోయినా తిమ్మేగౌడ నకిలీ ప్రొనోట్ సృష్టించి వేధింపులకు పాల్పడినట్లు మృతురాలు ఆ సూసైడ్ నోట్లో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి తిమ్మేగౌడ కోసం గాలింపు చేపట్టారు. -
వేధింపులతో వివాహిత ఆత్మహత్య
తెనాలి: గుంటూరు జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తెనాలి మండలం పినపాడుకు చెందిన షేక్ నజీనా(32) శనివారం అర్ధరాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో స్థానికులు తలుపులు తెరిచిచూడడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అత్తింటి వారి వేధింపుల వల్లే నజీనా మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
నర్సంపేట: వరంగల్ జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. నర్సంపేటలోని ఫాఖాల్ రోడ్లో సుజాత అనే మహిళ నివాసం ఉంటోంది. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఆమె ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్న క్రమంలో సుజాత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
టెక్కలిలో వివాహిత ఆత్మహత్య
టెక్కలి: శ్రీకాకుళం జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. టెక్కలి పట్టణానికి చెందిన చంద్రమౌళి, నాగమణి దంపతులకు రెండేళ్ల క్రితం వివాహమైంది. వారికి 9 నెలల బాబు ఉన్నాడు. చంద్రమౌళి స్థానికంగా ఓ ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం అతడు విధులకు వెళ్లిన సమయంలో నాగమణి ఇంట్లో ఉరేసుకుంది. భర్త తిరిగి ఇంటికి వచ్చే సరికి ఆమె ఉరికి వేలాడుతోంది. కిందికి దింపి చూడగా ఆమె అప్పటికే చనిపోయింది. చంద్రమౌళి సమాచారం మేరకు నాగమణి కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. కట్నం కోసం చంద్రమౌళి పెట్టే మానసిక వేధింపులు భరించలేకే నాగమణి ఆత్మహత్యకు పాల్పడిందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
కుటుంబ కలహాలకు ముగ్గురు బలి
మైలార్‌దేవ్‌పల్లిలో ఘటన హైదరాబాద్: కుటుంబ కలహాలతో ఓ గృహిణి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను రక్షించే క్రమంలో భర్త, కుమారుడు మృత్యువాత పడ్డారు. ఇద్దరు కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి. మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలను ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. కిరాణా స్టోర్ నడుపుకొనే మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మీగూడకి చెందిన ఎలుక కృష్ణగౌడ్(34), సరిత(27) దంపతులు. వీరికి అక్షిత(5), ఐశ్వర్య(3), అశ్విన్ (ఏడాదిన్నర) సంతానం. కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటున్న వీరి కుటుంబంలో కలహాలు తలెత్తాయి. ఈ క్రమంలో సరిత శుక్రవారం రాత్రి భర్తతో గొడవ పడ్డారు. గొడవ పెరిగి పెద్దదై, చివరకు జీవితంపై విరక్తిచెందిన సరిత అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. రక్షించేందుకు వెళ్లిన భర్తను సరిత గట్టిగా పట్టుకోవడంతో అతడికి, పక్కనే ఉన్న అశ్విన్‌కు మంటలు అంటుకున్నాయి. చిన్నారి కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశాడు. భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అశ్విన్ మరణించాడు. ఘటనా స్థలిలోనే ఉన్న అక్షిత, ఐశ్వర్యలకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రుల మృతితో కుమార్తెలిద్దరూ అనాథలయ్యారు. స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్, కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి సానెం శ్రీనివాస్‌గౌడ్ తదితరులు మృతుల కుటుంబాన్ని పరామర్శించారు. టీడీపీ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. -
వివాహిత సజీవదహనం
కృష్ణాజిల్లా: మతి స్థిమితం లేని మహిళ కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడంతో మృతిచెందిన ఘటన కృష్ణాజిల్లాలో జరిగింది. కంకిపాడు మండలం ఆకునూరు గ్రామానికి చెందిన అర్జున్‌రావు, శ్రీలక్ష్మీ(36) భార్యాభర్తలు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం శ్రీలక్ష్మీ అనారోగ్యానికి గురై మతిస్థిమితం కోల్పోయింది. అప్పటి నుంచి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.